Sunday, August 30, 2015

బ్రాహ్మణుల ఇంట లక్ష్మి ఎందుకు నిలువదు? (Why the Goddess Lakshmi does not favor Brahmins?)

బ్రాహ్మణుల ఇంట లక్ష్మి ఎందుకు నిలువదు?
(Why the Goddess Lakshmi does not favor Brahmins?)

డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

సాధారణంగా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని అ౦టూ ఉంటారు. కారణం ఏదైనా వాస్తవం ఇదే. ఇక్కడ లక్ష్మియే తాను విద్యాధికులైన బ్రాహ్మణుల ఇంట ఉండకపోవడానికి గల కొన్ని కారణాలు తన భర్తవిష్ణుమూర్తికి స్వయంగా   వివరించి  చెప్పింది.  ఆసక్తిని రేకెత్తించే ఆకారణాలేంటో తెలుసుకుందాం.  
లక్ష్మి సాగరతనయ. ఆమె  పుట్టిల్లు సముద్రం. ఆ సముద్రాన్ని అగస్త్యుడు త్రాగేయడం వల్ల ఆమెకు పుట్టింటి సౌఖ్యం కరువైంది. ఇక భర్త దగ్గరే ఉ౦టోoది. కాని ఆమె భర్తను   
ఒక మహర్షి ( Bhruguvu) కోపంతో తన్ని నిత్యం పాదసేవలు చేయించుకోవడం వలన ఆమె అక్కడ ఉ౦డలేక పోయి౦ది. భర్తృసన్నిధికి దూరమైంది. కొంతకాలం ఎవరి౦ ట్లోనైనా గౌరవంగా తలదాల్చుకు౦దామనుకుoటే,  బ్రాహ్మణులందరు చిన్ననాటి నుంచే వేదసరస్వతిని తమ నోళ్లల్లో బంధించడం వల్ల, సరస్వతి ఆమెకు స్వతహాగా శత్రువు కావడ౦ వల్ల వాళ్ళ దగ్గరకూ చేరలేక పోయింది. ఇక వార౦దరు ప్రతిరోజూ తన నిలయమైన కమలపుష్పాలను కోసి శివునకు సమర్పించడం వల్ల స్వంత ఇంటికి కూడ దూరమైంది. ఈ విధంగా అన్నివిధాల తనకు అసౌకర్యం కల్గించిన బ్రాహ్మణుల ఇండ్ల ఎప్పుడు ఉ౦డకూడదని నిశ్చయించుకుంది. విడిచిపెట్టేసి౦ది. మరి ఆమె మాటల్లోనే వినండి.  

పీతోsగస్త్యేన తాత: చరణతలగతో వల్లభోs న్యేన రోషా
దాబాల్యాద్విప్రవర్యై: స్వవదనవివరే ధారితా వైరిణీ మే
గేహం మే ఛేదయంతి ప్రతిదివసముమాకాంతపూజానిమిత్తం
తస్మాత్ ఖిన్నా సదాsహం ద్విజకులసదనం నాథ! నిత్యం త్యజామి
  (Subhashitaratnabhandagaram Page - 64, Verse-  43)


Goddess Lakshmi, explained her firm conviction to her husband Lord Vishnu for having kept herself away from the houses of Brahmins in the following manner:
Oh my lord! My father is the ocean who was drunk by sage Agastya and I had no shelter in my father’s abode since then. My second resting place is you. Since the sage Bhrigu kicked you and made you his slave, I was  deprived of the privilege of staying with you.  As Goddess Saraswati is my enemy and she always lives in the mouths of Brahmins in the form of Veda, I avoided staying in their houses.  My own abode is lotus flower and all the flowers are also plucked by Brahmin priests for offering them to Lord Siva. I even lost that facility also. I got vexed with their misdeeds, and finally decided not to stay in their houses.

पीतोsगस्त्येन तात: चरणतलगतो वल्लभोsन्येन रोषा
दाबाल्याद्विप्रवर्यै: स्ववदनविवरे धारिता वैरिणी मे
गेहं मे छेदयन्ति प्रतिदिवसमुमाकान्तपूजानिमित्तं
तस्मात्खिन्ना सदाsहं द्विजकुलसदनं नाथ ! नित्यं त्यजामि
(Subhashitaratnabhandagaram Page - 64, Verse-  43)


Saturday, August 29, 2015

తలలు పది - సమాధానం ఒక్కటే (Heads are ten – Answer is one)

తలలు పది - సమాధానం ఒక్కటే
(Heads are ten Answer is one)
Dr.Ch. Durgaprasada Rao
 కసారి రావణుని భార్య మండోదరి తన భర్తతో ఏమండి! ఇంద్రాది లోకపాలకులు, విష్ణువు, చంద్రుడు, సూర్యుడు, సర్పరాజులు, విద్యాధరులు మొదలైన మహానుభావులందరు  మీకు శత్రువులే. మీకు ఎవరితోను  పడదు. ఈ సృష్టిలో, మీదృష్టిలో, మీకు ఇష్టుడని చెప్పదగిన గొప్పవ్యక్తి   ఒక్కరైనా  ఉన్నారా? ఒక వేళ ఉంటే ఆయనెవరో వివరించండి  అని వినయంతో అడిగింది. రావణుడు ఆ ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వు చిందిస్తూ పదితలలతో   ఇలా అన్నాడట.  ఒక తల శూలి యని , రెండో తల శంభుడని, మూడోతల  పినాకి యని, నాల్గోతల శివుడని, ఐదో తల భవుడని, ఆరో తల  పశుపతి యని, ఏడో తల శర్వుడని, ఎనిమిదో తల ఈశ్వరుడని, తొమ్మిదోతల  భర్గుడని పదో తల పేరుచెప్పకుండ అనే పదంతో ఈశ్వరుణ్ణే సూచి౦చాయట. ఈవిధంగా పది తలలు వరుసగా ఈశ్వరునే   పేర్కొని అతని శివభక్తి పారమ్యాన్ని వ్యక్తం చేశాయి.  

ఇంద్రాద్యా: లోకపాలా: హరివిధు తపనా: నాగవిద్యాధరాద్యా:
ద్వేష్యా: సర్వేsపి దేవా: ప్రియ తవ వరద: కోsపి వంద్యో గరీయాన్?
శ్రుత్వా వాచం ప్రియాయా: ఇతి దశముఖత: ప్రాహ వాక్యం దశాస్య:
శూలీ శంభు: పినాకీ శివ భవ పశుప: శర్వ ఈశశ్చ భర్గ:

Once Mandodari, the wife of Ravana asked her husband. “Dear Sir, all the Gods like Indra, Vishnu, the Moon, the Sun, the kings of serpents, and vidyadharas are treated by you as enemies. No one is liked by you. Is there any person in these three worlds who is great, giver of boons and dearest to you? Having been asked by his wife, Ravana, the ten headed demon, replied cheerfully with his ten heads. The first head mentioned the name  suli ( Lord Siva), the second one Sambhu ( Lord Siva) , the third one Pinaki ( Lord Siva), the fourth one Siva ( Lord Siva), the fifth one Bhava ( Lord Siva), the sixth one Pasupa ( Lord Siva), the seventh one Sharva ( Lord Siva), the eighth one Isa ( Lord Siva) the ninth one  Bharga ( Lord Siva) and the tenth one suggested the same Deity ( Lord Siva) with the word ‘cha’ with out mentioning His name directly.     

 इन्द्राद्या: लोकपाला: हरिविधुतपना: नागविद्याधराद्या:
द्वेष्या: सर्वेऽपि देवा: प्रिय ! तव वरद: कोsपि वन्द्यो गरीयान्
श्रुत्वा वाचं प्रियाया: इति दशमुखत: प्राह वाक्यं दशास्य:
शूली शंभु: पिनाकी शिव भव पशुप: शर्व ईशश्च भर्ग: 

 (SubhashitaRatnaBhandagaram-p-184/v-77)

Thursday, August 27, 2015

వివేకానందుడు - విద్య


వివేకానందుడు - విద్య
(The views of Vivekananda on Education)

Dr. Chilakamarthi DurgaprasadaRao
  
యదాయదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత:
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహ౦ (4/7)
అని గీతాకారులవచనం.
లోకంలోఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కల్గుతుందో, అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు ధర్మస్థాపనకై నన్ను నేను సృష్టించుకొoదునని ఆ మాటల సారాంశ౦. ఆ విధ౦గా అవతరించిన వారిలో వివేకానoదస్వామి ఒకరు. పరస్పరవిరుద్ధమైన భారతీయ-పాశ్చాత్య నాగరికతల మధ్య నలిగి యువత దిక్కుతోచక యవస్థపతున్నప్పుడు  వారికి మార్గదర్శకునిగా ఆయన అవతరించారు. వివేకానందస్వామి 1863జనవరి 12వతేదీన విశ్వనాధదత్త-భువనేశ్వరీదేవి దంపతులకు జన్మించారు. ఈయనకు తల్లి రామాయణ, మహాభారత కథల్ని ఉగ్గుపాలతో  రంగరించి పోయడంతో భారతీయసంస్కృతిపై చిన్న వయస్సులోనే ఒక అవగాహన కల్గింది.  ఇవే ఆయన మనోవికాసానికి, బుద్ధివికాసానికి బాటలు వేశాయి. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నవిధంగా ఈయన చిన్నతనం నుండే మేధాశక్తి, శారీరకబలం, ధైర్యసాహసాలు కలిగియుండేవారు. విద్యారంగంలోనే కాక మిగిలిన రంగాల్లో కూడ ప్రప్రథముడు గానే ఉండేవారు. ఆయన విశ్వవిద్యాలయజీవితం, రామకృష్ణుని సాన్నిధ్యం, విశ్వమతమహాసమ్మేళనసభలో పాల్గొనడం మొ|| విశేషాలన్నీ పాఠకులందరికి విదితమే. ఆయన భారతదేశoలోను, విదేశాలలోను, అనేక అంశాలపై అమూల్యమైన ఉపన్యాసాలిచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచారు. ఆనాటి సమకాలీనసమాజంలో ఆయన ప్రభావానికి లోనుగానివాడు ఒక్కడు కూడ లేడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో ఆయన స్పృసి౦చని అంశమేదీ లేదు. ఆయా రంగాల్లో ఆయన చెప్పిన  విషయాలు సార్వదేశికాలు, సార్వకాలికాలున్నూ.
విద్య-నిర్వచనం
విద్య అనగా మానవునిలో అంతర్గతంగా దాగియున్న శక్తుల సంపూర్ణ వికాసం మాత్రమేనని వివేకానందుని అభిప్రాయం .
Education is the manifestation of the perfection already in man అన్నారాయన. కాబట్టి శిష్యులలోని అంతర్గతశక్తులను ఉద్దీపింపజేసేవాడే గురువు. దానికి కావలసిన సామగ్రియే బోధన. ప్రతివ్యక్తి తనకు తానే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. గురువులు దానికి ప్రేరకులు ఔతున్నారు.
గురువు శిష్యులకెప్పుడు అనుకూలమైన ఆలోచనల్నే(positive thoughts) రేకెత్తించాలిగాని ప్రతికూలమైన ఆలోచనలను (negative thoughts) రేకెత్తించరాడు. ఎ౦దుకంటే  ప్రతికూలమైన ఆలోచనలు మనిషిని బలహీనపరుస్తాయి. మానవునకు సరియైన స్వేచ్ఛను ప్రసాదించేది విద్య మాత్రమే. స్వేచ్ఛయే మానవవికాసానికి పునాది. ఇక్కడ స్వేచ్ఛ అంటే బాధ్యతాయుతమైన  స్వయం నిర్ణయశక్తియే గాని విచ్చలవిడితనం కాదు .
పుస్తకాల్లోని విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం బట్టీపట్టడం విద్యయొక్క పరమావధి కాదని వివేకానందుని అభిప్రాయం. . విషయపరిజ్ఞానం లేని గ్రంథపఠన౦ చిలుకపలుకుల వలె (parrot like repetetion) నిష్ప్రయోజనమని వివేకానందుని అభిప్రాయం.
విద్య మానవుని మనోవికాసానికి, బుద్ధి వికాసానికి  తోట్పడి ప్రతివ్యక్తిని తనకాళ్లపై తాను నిలబడేటట్లు చెయ్యాలి. విద్యకు మతమెంతో అవసరం .ఇక్కడ మతమంటే విశ్వజనీనమైన మానవతాధర్మమేగాని సంకుచితమైన నియమావళి కాదు.
చిత్తైకాగ్రత
జ్ఞానసముపార్జనకు ఏకాగ్రతయే ముఖ్యసాధనమంటారు స్వామి. సామాన్యమానవుని మొదలుకొని మహాయోగి వరకు జ్ఞానార్జనలో చిత్తైకాగ్రతయే ప్రథానసాధనంగా ఉపయోగపడుతో౦దని వివేకానందుని అభిప్రాయం. ఏకాగ్రత ఎంత ఎక్కువ అలవరచుకుంటే ఆ వ్యక్తి అంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తాడు. ఒక రంగంలో ప్రసిద్ధి పొందిన ఏ వ్యక్తినైనా మనం పరిశీలిస్తే ఆ రంగంలో అతనికిగల ఏకాగ్రతయే ప్రథానకారణమని మనం గుర్తించవచ్చు. ఈ ఏకాగ్రత ధ్యానం వల్ల సాధించవచ్చని స్వామి బోధించారు (The practice of meditation leads to mental concenration). కాబట్టి విద్య అంటే మానసిక ఏకాగ్రతయే గాని కేవల విషయసేకరణ కాదు. బ్రహ్మచర్యం , శ్రద్ధ మొ|| నియమాలు ఏకాగ్రతను పెంచి జ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తాయని స్వామి తెలియజేశారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం  అన్నారు గీతాకారులు.
శీలస౦పద  
విద్య మానవుని సౌశీల్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఇచట ముఖ్యంగా తత్త్వచింతనను, పాశ్చాత్యుల శాస్త్రీయదృక్పథంతో సమన్వయం చేయగల  విద్య ఈ కాలానికి చాల  అవసరమని స్వామి అభిప్రాయపడ్దారు. అనాదిగా భారతీయులు శాస్త్రీయదృక్పథం కలవారే అయినప్పటికీ వారి దృష్టి  ఎక్కువగా ఆధ్యాత్మికవిషయాల మీదే కేంద్రీ కరి౦పబడిందని, అలాగే పాశ్చాత్యులు కూడ కొంతవఱకు ఆధ్యాత్మికదృక్పథం కలవారై నప్పటికీ వారి దృష్టి ఎక్కువగా భౌతికవిష యాల మీదే కేoద్రీకరిoపబడిoదని ఈ రెంటిలోని మంచిచెడ్డలను సమన్వయం చేయగలిగిందే ఉత్తమమైన విద్య అని స్వామి అభిప్రాయ పడ్డారు  .
           విద్య మంచి అలవాట్లను పెంపొందించాలి. చెడ్డ అలవాట్లను నివారించాలి. చెడ్డ అలవాట్లను మానివేయుటకు వానికి విరుద్ధమగు మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకొనుటయే మార్గమని స్వామి సూచించారు. మనం మనకుగల దౌర్బల్యాన్ని దైవం పైకి నెట్టరాదు. అన్ని తప్పులకు హృదయదౌర్బల్యమే కారణం కాబట్టి విద్య ద్వారా  ప్రతివాడు హృదయదౌర్బల్యాన్ని పోగొట్టుకోవాలి.

    వ్యక్తిత్వవికాసం
వ్యక్తిత్వవికాసమే విద్య యొక్క పరమ ధ్యేయ౦. అట్టి వ్యక్తిత్వ వికాసానికై గొప్పగొప్పనాయకులు, తత్వవేత్తలు మొదలగువారి ఆత్మకథలను, చరిత్రలను, బోధలను వినాలని వివేకానందస్వామి పేర్కొన్నారు. మహాపురుషుల  స్వీయచరిత్రలను చదవడం  వల్ల మానవజీవితంలో ఎదురయ్యే ధర్మసంకటపరిస్థితులకు సరియైన  దారి దొరుకుతుందని, ఆ  మార్గంలో ప్రయాణం చేసి జీవితాన్ని సుగమం చేసుకోవచ్చునని స్వామి యువతకు తెలియజేసారు. మహాత్ముల ఆశయాలను కేవలం చదవడమేకాక, వాటిని ఆచరణలో పెట్టడానికి  ప్రతి యువకుడు ప్రయత్నించాలి. విద్యాసముపార్జనలో సహాయపడే మనస్సును, ఇంద్రియాలను పటిష్టంగా ఉంచుకోవడానికి యోగాభ్యాసం చాల అవసరమని ఆయన భావించారు.
గురుకులవిద్యా విధానం
 విద్యాసముపార్జనకు గురుగృహవాసమే ఉత్తమోత్తమo. ఇప్పటి ఈ విద్యావిధానం కన్నా ప్రాచీనవిద్యావిధానమే మిన్నయని వివేకానందస్వామి పేర్కొన్నారు. ఇంచుమించు ఈ అభిప్రాయాన్నే శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు ఈ క్రింది పద్యం ద్వారా వ్యక్తంచేశారు.

బెంచీలక్కఱలేదు, గేమ్సు మొదలౌ ఫీజుల్వినన్రావు, పొ
మ్మంచు న్నిర్ధను ద్రోసిపుచ్చరు గురుల్, ప్యాసైననే లాభమిం
దంచున్నేమము లేదు, మీ చదునoదాలోక మీ లోకమున్  
గాంచన్వచ్చెడునార్యులార! మిము మ్రొక్కం జెల్లు నెక్కాలమున్

జ్ఞానతృష్ణ
విద్యార్థి అర్హతలను గుఱి౦చి మాట్లాడుతూ వివేకానందస్వామి, విద్యార్థికి జ్ఞానతృష్ణ కావాలని, మనోవాక్కాయకర్మలసాక్షిగా అతడు పవిత్రుడై యుండాలని విద్యార్థికి పుస్తకాల్లోని వాక్యాలకంటే గురువు అనుభవంతో చెప్పిన మాటలే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయని పలికారు. విద్యార్థి అనువాడు విద్యార్ధిదశలో విద్య తప్ప మరే ఇతర ప్రయోజనాన్ని ఆశిoచకూడదన్నారు. విద్యార్థికి ఇంద్రియనిగ్రహం , సహనం ముఖ్యమైన గుణాలు. శిష్యుడు గురువును దేవునివలె భావించాలని చెబుతూనే ,గురువుల బోధను కేవలం గ్రుడ్డిగా అనుసరించరాదనియ, హేతుబద్ధ౦గా ఆలోచించి అనుసరించాలని విద్యార్థి లోకానికి ఆయన సలహా యిచ్చారు. గురువు విద్యార్థికి మానవ జీవితoలోని ఉత్తమ ఆదర్శాలను బోధించాలి. ప్రపంచచరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులను గురువు విద్యార్థికి పరిచయ౦ చెయ్యాలి. రాముడు, కృష్ణుడు, హనుమంతుడుమొ|| పురాణపురుషులను గురించి చెప్పేటప్పుడు రాముని ధర్మప్రవర్తన, హనుమంతుని సేవాతత్పరత, శ్రీకృష్ణుని కార్యదక్షత మొ|| ఆదర్శగుణాలనే స్వీకరిoచాలి. గురువు ఎన్నడు విద్యార్థిని నిరుత్సాహపరచకూడదు. అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని రేకెత్తించాలి. ఆత్మ విశ్వాస౦ గురించి  మాట్లాడుతూ The history of the whole world is nothing but the history of few men who had faith in themselves” అన్నారు వివేకానందస్వామి.
అంతేగాక నేడు దీశానికి కావలసింది ఇనుపకండరాలు, ఉక్కునరాలు కలిగిన యువత మాత్రమేనని  పేర్కొన్నారు. బలహీనతకు మిoచిన పాపం మరొక్కటి లేదని చెబుతూ, యువత నిర్భయంగా అన్యాయాలను ఎదుర్కోవాలే గాని ఉదాసీనత వహి౦చరాదని, అచంచలమైన ధైర్యవిశ్వాసాలే యువత పురోగమనానికి ముఖ్య కారణమని స్పష్టం చేశారు.
స్త్రీ విద్య
ప్రపంచంలో అన్నిటికన్న మిక్కిలి ఆదర్శవంతమైన అద్వైతవేదాంతాన్ని బోధించిన ఈ పుణ్యభూమిలో స్త్రీలకు సమానమైన  విద్యావకాశాలు కలుగాజేయక పోవడం చాల ఆశ్చర్యకరమైన విషయమని పేర్కొంటూ ,
వేదయుగంలో గార్గి, మైత్రేయి మొ||నారీమణులు అన్నివిద్యల్లోను ఆరితేరినట్లుగా కన్పించడం వల్ల ఈ మార్పు మధ్యయుగ౦లోనే వచ్చినట్లుగా శ్రీ స్వామి భావించారు .
యత్ర నార్యస్తు పూజ్యoతే
రమంతే తత్ర దేవతాః
(ఎచ్చట స్త్రీలుపూజిoపబడతారో  అచ్చట దేవతలు సంతోషిస్తారు ) అన్న మనువు మాటలను ఆయన మనకు గుర్తు చేశారు. ప్రస్తుతం స్త్రీలకు గల సమస్యలు వారికి విద్య లేకపోవడంవల్లే కలుగుచున్నాయని, వారు విద్యావంతులైతే అసలు సమస్యలే ఉండవని స్వామి భావించారు. స్త్రీలకు బోధించే విద్య ముఖ్యంగా వారిని సీతమొ||ఆదర్శనారీమణులుగా తీర్చిదిద్దే విధంగా ఉండాలన్నారు. సీతను గురించి మాట్లాడుతూ She the ever chaste and ever pure wife, she the ideal of the people, the ideal of the Gods, the great Sita must always remain”-----“Ramas there may be several but Sitas can never be” అన్నారాయన. దీనిని బట్టి సీతపట్ల ఆయనకు గల పూజ్యభావమెట్టిదో వెల్లడౌతోంది. ఒక్క స్త్రీ విద్యావంతురాలైతే సమాజమంతా విద్యావంతమౌతుంది.
స్త్రీలకు ముఖ్యంగా పురాణాలు, చరిత్ర,   గృహావిద్య, లలితకళలు  మొ|| అంశాలను బోధించాలి. అన్నిరంగాల్లోను స్త్రీలు పురుషులతో బాటుగా సమానస్థాయికి ఎదగగలిగిననాడే సంఘంలో సమానత్వం సాధించగలం. సంఘమిత్ర, మీరాబాయి, అహల్యాబాయి మొ|| నారీమణుల చరిత్రలను మిగిలిన పాఠ్యాంశాలతో బాటుగా స్త్రీలకు పరిచయం చెయ్యాలి.      
 తన అభివృద్ధికి తనతల్లే ముఖ్యకారణమని ఆయన సగర్వంగా చాటుకున్నారు.
మన భారతదేశంలో నిరుపేదల పరిస్థితి చూస్తోంటే నా హృదయం ద్రవిస్తో౦ది అంటారు స్వామి . వారి పేదరికానికి కారణం విద్యాహీనతే గాని ధనహీనత కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతివ్యక్తి విద్య నేర్చుకోవాలని విద్య అతిసామాన్యపౌరునికి కూడ అందుబాటులో ఉండాలని స్వామి ఉద్బోధించారు .
మాతృభాషాప్రాశస్త్యం
ఇక బోధన విషయానికొస్తే విద్యాబోధన మాతృభాషలోనే ఉ౦డాలి గాని వేరొక భాషలో ఉండరాదని ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయంలో మరో అడుగు ముందుకెళ్ళి  విద్యార్థికి అతిచేరువలో ఉన్న ప్రాంతీయ భాషలోనే (vernacular) లోనే విద్యాబోధన జరగాలని ప్రతిపాదించారు.  ప్రతి భారతీయుడు సంస్కృత భాషను తప్పక నేర్చుకొవాలని ఆ భాష మనజాతికి ఆత్మగౌరవాన్ని, బలాన్ని చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.(At the same time Sanskrit education must go along with it, because the very sound of Sanskrit words, gives a Prestige, a power and strength to the race).
కర్తవ్య నిర్వహణ
విద్య జాతీయతాభావాన్ని పెంపొందించి ప్రతి పౌరుని ఒక్కొక్క దేశభక్తునిగా తీర్చిదిద్దాలి. Work is worship” శ్రమయే భగవదారాధన అనే భావం అందరిలోను పెంపొందాలి. ప్రతివ్యక్తి తన కర్తవ్యాన్నివిధిగా నెరవేర్చాలి. ఆ చేసేపని ప్రతిఫలాన్ని ఆశించకుండ చేయాలి. కర్తవ్యాన్నివిస్మరింపరాదు. ఈ మాటల ద్వారా వికానందస్వామి

కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన
మాకర్మఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వకర్మణి(2/47)

అని చెప్పిన గీతాకారుని  నిష్కామకర్మసిద్ధాంతాన్ని తిరిగి ప్రతిపాదించారు. ప్రతి వ్యక్తి సేవకుని వలె కాక యజమానివలె పని చేయాలని వివేకానందస్వామి యువతను ఆదేశించారు.
Work like a master but not like a slave .అన్నారు. అనగా
సేవకుడు అయ్యో!  నాకీ పని చేయక తప్పదే! అని బానిసభావంతో చేస్తాడే గాని కర్తవ్య నిష్ఠతో చెయ్యడు. కర్తవ్యనిష్ఠయే కార్యసాఫల్యానికి  సోపానం. ఇక కర్తవ్య౦ అనే పదాన్ని నిర్వచిస్తూ--
“Any action that makes us go God ward is good action and is our duty; any action that makes us go downward is evil; and is not our duty” అన్నారు.
ఏ పని మానవునకు ఉత్తమగతి కల్గిస్తుందో అది సత్కర్మ, అది చేయవలసినది. ఏ పని మానవునకధమగతులు కల్గిస్తుందో అది దుష్కర్మ అది చేయకూడనిది. విద్యయే మానవునకు కర్తవ్యాకర్తవ్యములను బోధించును.
ఇక పరమపురుషార్థమైన మోక్ష౦ ఆనందరూపమే అని, మానవుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తి౦చిననాడే అట్టి యానoదాన్ని  పొందగలడని శ్రీ వివేకానందస్వామి జాతికి సందేశమిచ్చారు.


Tuesday, August 25, 2015

కొంటె ప్రశ్న-ముక్కంటి సమాధానం

కొంటె ప్రశ్న-ముక్కంటి సమాధానం
Dr. Ch. Durgaprasadarao

పార్వతి వాస్తవానికి అచలపుత్రికే అయినా చలచిత్తం కలది. చాల చిలిపిది. సరదాగా తన   భర్తను ఒక ఆటపట్టిద్దామనుకుంది . కాని ఆయన తనకంటే  తెలివైన వాడని మాత్రం ఊహించలేక పోయింది పాపం.  ఏమండి ! నాకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా మీకు అమ్మానాన్నలెక్కడున్నారో చూపించండి అంది కొంటెగా. శివుడు దానికి సమాధానంగా  ఓహో అదా ! నాకు అత్తా మామ ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా నీకు అత్తా మామలు ఎక్కడున్నారో చూపించు  అన్నాడు నవ్వుతూ. ఏ౦ చూపిస్తుంది ? వెంటనే ఉడుక్కుంటూ బుoగమూతి పెట్టి ఆయన ఒడిలోకి  వంగి వాలిపోయి ఉంటు౦దని ఊహిద్దాం. ఈ విధంగా పార్వతి కొంటె ప్రశ్నకు తగిన సమాధానం చెప్పిన ముక్కంటి మాటలు మనల్ని రక్షించుగాక  
క్వ  తిష్ఠత: తే పితరౌ మమేవే
త్యపర్ణయోక్తే పరిహాసపూర్వం
క్వ వా మమేవ శ్వశురౌ తవేతి
తామీరయన్ సస్మితమీశ్వరోsవ్యాత్
One day Goddess Parvati wanted to make fun of her husband Lord Siva. She asked Him “ My dear husband ! I have father and mother. But you don’t have father and mother like me. Then Lord Siva replied “I have father –in- law and mother –in- law. But you don’t have father-in-law and mother-in-law like me. The jovial reply or retaliation of Lord Siva may bring prosperity to all.
क्व तिष्ठत: ते पितरौ ममेवे
त्यपर्णयोक्ते परिहासपूर्वम् |
क्व वा ममेव श्वशुरौ तवेति

तामीरयन् सस्मितमीश्वरोsव्यात्  ||

Saturday, August 15, 2015

రాజు+యోగి=రాజయోగి

రాజు+యోగి=రాజయోగి
                                            చిలకమర్తి దుర్గాప్రసాదరావు

వులు చాల ప్రతిబావంతులు ఏదైనా ఒక వస్తువును మరో ఏవస్తువుతోనైనా పోల్చగల నేర్పరులు. ఇక్కడ ఒక రాజును యోగితో పోల్చడం జరిగింది. పోలికలో వైవిధ్యం పెద్దగా లేదుగాని, పోల్చడంలోనే ఉంది.  సాధారణంగా యోగి లక్షణాలుగల రాజును రాజయోగి అని, యోగులలో గొప్పవానిని యోగీశ్వరుడని పిలవడం పరిపాటి. కాళిదాసు అంటాడు పప్ర చ్ఛ కుశలం రాజ్ఞే రాజ్యాశ్రమమునిం  ముని: .   ఆశ్రమానికి మునియైన వసిష్ఠుడు రాజ్యమనే ఆశ్రమానికి మునియైన దిలిపునికుశలమడిగాడట. ఈయన ఇక్కడ మునైతే ఆయన అక్కడముని . కాని ఇది అలా కాకుండా కొంత విలక్షణ0గా కన్పిస్తోంది. అదెలాగో చూడండి.
యోగాభ్యాసానికి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులని ఎనిమిది మెట్లు ఉన్నాయి.
1.       యమ:  అహింస ( శారీరకంగాగాని మానసికంగా గాని 
  దేన్నీ హింసించకుండా ఉండడం ), సత్యం (సత్యం మాట్లాడడం), అస్తేయం ( దొంగతనం చేయకుండుట), బ్రహ్మచర్యం ( బ్రహ్మచర్యదీక్ష), అపరిగ్రహం (ఉచితంగా ఏ వస్తువును ఇతరులనుండి తీసుకొనకుండుట) అనే ఐదిటిని యమాలు అంటారు. ఇవి యోగాభ్యాసానికి కావలసినవి. ఇది బహిరంగ (external) సాధనం .
ఇక్కడ రాజు పక్షంలో త్వద్బాణేషు యమ: అని చెప్పడం చేత  నీ బాణాల్లో యముడు ఉంటాడు, అంటే అవి శత్రువులను సంహరిస్తాయని చీల్చి చెండాడతాయని అర్థం.
2. నియమ:     యోగిపరంగా నియమాలు:  శౌచం ( బాహ్యంగా, ఆభ్యంతరంగా శుచిగా ఉండడం), సంతోషం ( ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం), తపస్సు, స్వాధ్యాయ౦ (వేదాలు చదవడం), ఈశ్వరప్రణిధానం ( అంతా భగవంతునికి సమర్పించడం) ఇవి నియమాలు . ఇది బహిరంగ (external) సాధనం.  
ఇక రాజు పరంగా చూస్తే జయేషు నియమ:  నీ విజయాలు నియమంతో ఉంటాయి, ధర్మవిరుద్ధంగా ఉండవని అర్థం
3. ఆసనం: ఇక ఆసనం అంటే యోగి పరంగా స్థిరసుఖం ఆసనం అంటారు స్థిరసుఖమాసనంఅని పతంజలి. అంటే స్థిరంగా కూర్చుని ధ్యాన౦ చేసుకోవడానికి  సుఖంగా ఉండే భంగిమ. ఇది కూడ బహిరంగ ( external)సాధనమే. 
ఇక రాజుపరంగా ప్రాప్తే స్థిరం చాసనం నీకు సింహాసనం దక్కితే అది స్థిరంగా ఉ౦టు౦దని  అర్థం.
 4. ఇక నాల్గోది ప్రాణాయామం. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయో: గతి విచ్ఛేద: ప్రాణాయామ: . ఆసనం లభించిన తరువాత
ఉచ్ఛ్వానిశ్వాసల నడకని నిలుపుచెయ్యడమే ప్రాణాయామం .
ఇది పూరకం, కుంభకం, రేచకం అని  మూడు విధాలు. పూరకం అంటే గాలిని పీల్చడం, కుంభకం అంటే పీల్చిన గాలిని కొంతసేపు బంధించడం, రేచకం అంటే ఆ గాలిని బయటకు విడిచిపెట్టడం.    ఇది సగం అంతరంగం సగం  బహిరంగం ( both external and internal) కాబట్టి రెండూను.  ఇక రాజు పక్షంలో భ్రా౦తౌ శ్వాస వినిగ్రహ: అంటే నువ్వెప్పుడైన దిగ్భ్రాంతి చెందినప్పుడు ఊపిరి బిగబెడతావు అని అర్థం.
5. ఇక ఐదవది ప్రత్యాహారం . అంటే ఇంద్రియాలను వాటియొక్క ప్రవృత్తి నుంచి మళ్లింప జేయడం. అందమైన వస్తువును చూసే కన్నును అది చూడకుండా అరికట్టడం. మంచిసంగీతాన్ని వినే చెవిని అది వినకుండ అరికట్టడం. రుచికరమైన పదార్థాలను ఆస్వాదించే నాలుకను తినకుండా నిలిపివేయడం . సౌరభంకోసం పరితపించే ముక్కును అటు నుంచి మళ్ళించడం . అలాగే చల్లని వాతావరణాన్ని కోరుకునే చర్మాన్ని అటువంటి వాతావరణ౦ నుంచి  మళ్ళించడం. withdrawl of senses from their respective objects. ఇది internal. ఇక్కడ రాజుపక్షంలో గుణగణే ప్రత్యాహృతి: శ్రీమత: అంటే సంపదలయొక్క , సంపన్నుల యొక్క గుణాల స్తుతి నుంచి మనసును మళ్ళించడం. అనగా వాటిపట్ల నిస్పృహ కలిగి ఉ౦డడ౦. అంటే ఆసక్తి లేకపోవడం.
6. ఇక ఆరవది ధారణ. ధారణ అంటే ఆయా విషయాలనుంచి మళ్లించిన ఇంద్రియాలను ఒక స్థానంలో నిల్పు చెయ్యడం. దీన్నే పతంజలి దేశబంధ: చిత్తస్య ధారణా అన్నారు. ఇక రాజు పరంగా చూస్తే భూమిని ధరిస్తున్నాడు( పరిపాలిస్తున్నాడు) అని అర్థం . ఇది కూడ internal.    
7.  ధ్యానం: ఇది ఏడవ అంగము . తత్ర  ప్రత్యయైకతానతా ధ్యానం అని పతంజలి.  ఏ విషయము మనకు ధ్యేయమో ఆ విషయము అవిచ్ఛిన్నప్రవాహరూప౦గా చిత్తమందుంచుట ధ్యానం . ఇది internal.  ఇక రాజుపరంగా చూస్తే అతని మనస్సు ఎల్లప్పుడూ శివుని యందే లగ్నమై ఉంటుంది.   
8. సమాధి: ఇది ఎనిమిదవది , ఆఖరిదిన్ని. ధ్యానమే ధ్యేయ వస్తువుతోనేకమైనచో అది సమాధి. అక్కడ ధ్యానం , ధ్యేయం అనే భేదం కనిపించదు.ఇది కూడా internal. ఇక  రాజుపక్షంలో  ఆయన ధర్మం పట్ల లగ్నమై ఉన్నాడని అర్థం. మొత్తం మీద శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా ఉంటుంది .

ఒరాజా! నీబాణాల్లో యముడున్నాడు. నీ విజయాల్లో నియమముంది . నువ్వు జయిస్తే ఆసనం స్థిరం . నువ్వు భ్రాంతి పొందినప్పుడు  ఊపిరి బిగబెడతావు. ధనవంతులపట్లనీకు వైమనస్యం . నువ్వుదీనజనపక్షపాతివి. నీ ధారణ౦తా ప్రజాపాలనం మీదే ఉంటుంది.  నువ్వుఎల్లప్పుడు ప్రజాపాలనమే కర్తవ్యంగా భావిస్తావు. నీ ఏకాగ్రతంతా ధర్మం మీదే  నీ హృదయం కామనా రహితం . ఒక రాజును యోగీశ్వరుడడానికి ఇంతకంటే మరే౦కావాలి.

త్వద్బాణేషు యమ:, జయేషు నియమ:, ప్రాప్తే స్థిరం చాసనం
భ్రాంతౌ శ్వాస వినిగ్రహో, గుణగణే  ప్రత్యాహృతి : శ్రీమత:,
ధ్యానం శూలిని, ధారణా చ ధరణే:, ధర్మే   సమాధి,ర్యత:
తన్నిర్విణ్ణహృద: కిమీశ్వరపరే వాంఛంతి పాతంజలే

( సుభాషితరత్నభాండాగారం -౧౦౯/౨౧౮.  

Friday, August 7, 2015

అందుకే కాబోలు భయపడింది


అందుకే కాబోలు భయపడింది

చిలకమర్తి దుర్గాప్రసాదరావు   

సీతారాముల వివాహం చాల దివ్యంగా, భవ్యంగా జరిగింది. వివాహం తరువాత, భార్య భర్త పాదాలకు నమస్కరించడం ఒక రివాజు . కాని సీత ఆపని చెయ్యలేదు. సఖులు ఆమె దగ్గరకెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత హెచ్చరించినా ఆమె వినలేదు. సరే కార్యక్రమం అంతా సజావుగా జరిగిపోయింది. ఆమె రాముని పాదాలకు నమస్కరించకపోవడం మాత్రం అందరికి ఆశ్చర్యాన్నే కల్గించింది.

 

ఆ తరువాత కొన్నాళ్ళకు చెలులందరు ఆమెను కలసి ఏమమ్మా! మేమెంత బ్రతిమలాడినా నువ్వు ఆయనపాదాలకు ఎందుకు నమస్కారం పెట్టలేదు. కారణం ఇప్పటికైనా చెబుతావా చెప్పవా అని నిలదీశారు .  అపుడు ఆమె చెప్పిన సమాధానం చూడండి.

 

రామచంద్రప్రభువు పాదరజం సోకి రాతిగా పడిఉన్న మునిపత్ని నాతిగా మారిపోయిన సంగతి  ఆమె వివాహానికి కొన్నిరోజులు ముందే కొంతమంది మునులద్వారా ఆమె  విన్నదట. ఒకవేళ అదే  నిజమైతే తాను రామచంద్రమూర్తి  పాదాలకు నమస్కరిస్తే ఆతని పాదధూళి ఆమెకు తగులక పోదు. ఒక వేళ తగిలితే ఏ౦ జరుగుతుందో అనే భయంతో ఆమె ఆ ప్రయత్నం నుంచే విరమించుకుందట! ఎ౦త గడుసై౦ది సీత. ఎంత రమణీయమైనదీ  భావన.

 

శిక్షితాపి సఖిభి: నను సీతా

రామచంద్రచరణౌ న ననామ

కిం భవిష్యతి మునీశవధూవ

ద్బాలరత్నమిహ తద్రజసేతి.

(శుభాషిత రత్నభాండాగారం-page- 364/38)
           *****