Thought
of the day (8 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
అహన్యహని
భూతాని
గచ్ఛంతి
యమమందిరం
అన్యే
శాశ్వతమిచ్ఛంతి
ఆశ్చర్యం
కిమత:
పరం?
మహాభారతంలో
యక్షుడు ధర్మరాజుని "
ఈ
ప్రపంచంలో అన్నిటికన్న
ఆశ్చర్యకరమైన విషయ మేదైన
ఉందా?
" అని
ప్రశ్నించాడు.
దానికి
సమాధానంగా ధర్మరాజు "
ఈ
లోకంలో ప్రతిరోజు కోట్లాది
ప్రాణులు మరణిస్తున్నాయి.
ఇదంతా
గమనిస్తున్నా మిగిలినవారు
'మేము
శాశ్వతంగా ఉంటాం మాకు చావు
లేదు'
అనుకుంటూ
ఉంటారు.
ఇంతకంటే
ఆశ్చర్యకరమైన విషయం మరేముంటుంది
అన్నాడు.
अहन्यहनि
भूतानि
गच्छन्ति
यममन्दिरम् |
अन्यॆ
शाश्वतमिच्छन्ति
आश्चर्यं
किमत:
परम्?
In
the Mahabharata Yaksha asked Dharmaraja " what is the
most wonderful thing in the world?. As a reply Dharmaraja
said in the following words.
" Day after day, there are
count less of creatures entering in to the abode of Yama.
Looking al l this , the rest of the creatures , those who
remain , believe themselves to be permanent and immortal. Can
any thing be more wonderful than this"?
(
Kindly forward this to at least five of your friends)
ఇదే అర్ధము వచ్చే రామదాసు పద్యము.
ReplyDeleteఉ. దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁ దమతోడివారు ముం
దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
(దాశరథి శతకము ९౯౨)
తాత్పర్యము :
గోడలు ఉప్పు ఊరి పెచ్చులు ఊడిపోయి అందవికారముగా తయారైనట్లే శరీరము లోని ముసలితనము బయటపడుట చూచి;
రాచఱికము, అధికారము, సంపదలు ప్రకాశముగా భావించి; మరి భూమిమీద తమ తోటివారు తమ కళ్ళ ముందు పరమపదించుట పలుమార్లు చూచి కూడా; తరుగు చున్న ఆయువును గమనింపక మోహము, బంధముల నుండి విముక్తులు కాకుండా వున్నవారి కేమి గతి? దాశరథీ! కరుణాపయోనిధీ!