Saturday, December 1, 2018

Spoken Sanskrit -- Lesson-24


సంభాషణ సంస్కృతం 24
(Spoken Sanskrit)
Lesson-24
Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.

चतुर्थी विभक्ति:
ఇంతవరకు మనం ప్రథమ, ద్వితీయా  , తృతీయా విభక్తులు ఏ ఏ  సందర్భాల్లో వస్తాయో తెలుసుకున్నాం . ఇప్పుడు చతుర్థీవిభక్తి ఏ ఏ సందర్బాల్లో వస్తుందో కొన్నిటిని తెలుసుకుందాం .
Unit -1 
सम्प्रदाने चतुर्थी (సంప్రదానే చతుర్థీ)  
సంప్రదానం అంటే ఒక వ్యక్తి ఒక వస్తు                                                                                                                                                                                                                                                                                   వును గాని, వ్యక్తిని గాని  ఎవరికైనా ఇవ్వాలనుకు౦టే ఎవరికివ్వాలనుకున్నాడో అతనికి(పుచ్చుకునే వ్యక్తికి ) సంప్రదానసంజ్ఞ కలుగుతుంది . సంప్రదానసంజ్ఞ కలిగిన పదానికి చతుర్థీ విభక్తి వస్తుంది .   
Example:- जनक: रामाय सीतां दत्तवान्  (జనక: రామాయ సీతాం దత్తవాన్)
 Janaka gave Sita to Rama 
चतुर्थीविभक्तिः (दानार्थे)
ఉదా :- राजा विप्राय गां ददाति అనే వాక్యం ఉంది .
A king donates a cow to a Brahmin
ఇక్కడ రాజు గోవును విప్రునకు దానంగా ఇస్తున్నాడు . దానం పుచ్చుకునే విప్రునకు సంప్రదాన సంజ్ఞ  కలిగి చతుర్థీ విభక్తి వచ్చి విప్రాయ ఔతుంది .   అలాగే पिता पुत्राय धनं दत्तवान् అన్నచోట డబ్బు  పుచ్చుకున్న వాడు పుత్రుడు.  పుత్రునకు చతుర్థీ విభక్తి వస్తుంది . అలాగే माता पुत्रिकायै शाटिकां दत्तवती ( తల్లి కుమార్తెకు చీర ఇచ్చినది ) Mother gave a saree to her daughter.    
Note:- ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదే౦టంటే షష్ఠీ విభక్త్యంతశబ్దానికి కృతే అనే పదం చేరిస్తే చతుర్థీ అర్థం వస్తుంది .   
षष्ठी + कृते = चतुर्थी
( షష్ఠీ+కృతే = చతుర్థి ). దీనివల్ల ప్రత్యేకంగా చతుర్థీవిభక్తి గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేదు .
रामस्य + कृते = रामाय  (రామస్య + కృతే = రామాయ)  
पुत्रस्य + कृते = पुत्राय -- (పుత్రస్య + కృతే = పుత్రాయ )
सीताया: +कृते = सीतायै ( సీతాయా: + కృతే = సీతాయై )
पुत्रिकाया: +कृते =पुत्रिकायै (పుత్రికాయా: + కృతే = పుత్రికాయై)  
तव + कृते =तुभ्यम्  ( తవ +కృతే = తుభ్యం )  
मम + कृते = मह्यम्  (మమ + కృతే = మహ్యం ) 
Unit – 2
रुच्यर्थे
ఒకరు ఒక వస్తువును ఇష్టపడుతున్నప్పుడు ఎవరు ఇష్ట పడుతున్నారో వారికి చతుర్థీ విభక్తి వస్తుంది
गणेशाय रोचते मोदक: (వినాయకునకు ఉ౦ డ్రాళ్ళు చాల ఇష్టం )
Lord Vinayaka is fond of eating laddus
 : कृष्णाय रोचते  नवनीतम् (కృష్ణునికి వెన్న అంటే ఇష్టం)
Lord Krishna is fond of eating butter
शिवाय रोचते बिल्वपत्रम्  (శివునకు బిల్వ దళం అంటే ఇష్టం ) Lord Siva favours the Bilva leaf.
बालकेभ्यो रोचते क्रीडा ( పిల్లలకు ఆటలంటే చాల ఇష్టం ) children are fond of playing sports .
छात्राय रोचते विराम: ( విద్యార్థికి సెలవు అంటే చాల ఇష్టం )
पुत्राय रोचते माता  (పిల్లవాడికి  తల్లి అంటే చాల ఇష్టం )
Unit – 3
नम: योगे నమ: అనే పదం ఉపయోగించినప్పుడు  ఆ నమస్కారం ఎవరికి ఉద్దేశి౦పబడిందో వారికి చతుర్థీ విభక్తి  వస్తుంది .
शिवाय  नम: శివాయ నమ:  -- हरये नम: హరయే నమ:-- गुरवे  नम: గురవే నమ: :-- सीतायै नम:  సీతాయై నమ: , सरस्वत्यै  नम: సరస్వత్యై నమ:  -- मात्रे नम: మాత్రే నమ: -- पित्रे नम: -- పిత్రే నమ:  
Note:-- నమ: అనే మాట వాడినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది . ఒకవేళ నమామి అనే క్రియా పదం వాడినప్పుడు ఈ నియమం వర్తించదు , చతుర్థి రాదు . ద్వితీయా విభక్తి వస్తుంది .  అప్పుడు
शिवं नमामि శివం నమామి हरिं   नमामि హరిం నమామి गुरुं नमामि గురుం నమామి सीतां नमामि సీతా౦ నమామి गौरीं नमामि గౌరీం నమామి मातरं नमामि  మాతరం నమామి , पितरं नमामि పితరం నమామి అని ద్వితీయావిభక్తియే వస్తుంది .
Unit-4 కోపం, ద్రోహం, అసూయ మొదలైన భావాలను చెప్పే క్రియా పదాలు ఉపయోగించినప్పుడు వాటికి ఎవరు గురి అవుతారో వారికి చతుర్థీ విభక్తి వస్తుంది .
Example: कपय: कुप्यंति पवनतनयाय
వానరులు ఆంజనేయ స్వామిని నిందించారు
राघवविरहज्वालानलसंतापितसह्यशैलशिखरेषु सुखं शयाना: कपय: कुप्यंति पवन तनयाय 
రాఘవవిరహజ్వాలానలసంతాపితసహ్యశైలశిఖరేషు సుఖం శయానా: కపయ: కుప్యంతి పవన తనయాయ .
వానరులు ఆంజనేయ స్వామిపై కోపం ప్రదర్శించారట .
ఆంజనేయస్వామి  సీతను వెదకడానికి వెళ్ళాడు . ఆ సమయంలో  రాముడు మిగిలిన వానరులతో సహ్యపర్వతంపై ఉన్నాడు. రాముడు సీతావియోగంతో ఉండటంవల్ల అతనిలో విరహాగ్ని ఉంది . ఆ అగ్నికి అక్కడున్న వానరులు చలికాచుకు౦టున్నారు. ఎప్పుడైతే ఆంజనేయస్వామి లంకలో సీత కనిపి౦చిందని తెలియ జేశాడో వెంటనే అతనికి విరహం పోయింది , అగ్ని చల్లారిపోయింది . అంతవరకు హాయిగా చలికాచుకు౦టున్న  వానరులు ఆ అవకాశం కోల్పోయారు. చలికి తట్టుకోలేక దానికి కారకుడైన ఆంజనేయ స్వామిని తిట్టిపోశారు . 
राक्षसा: देवेभ्य: द्रुह्यन्ति
రాక్షసులు దేవతలకు ద్రోహం తలపెడుతున్నారు .
दुर्योधन: भीमाय असूयति
(దుర్యోధన : భీమాయ అసూయతి)
దుర్యోధనుడు భీమునిపై అసూయపడుచున్నాడు .
ఒక వస్తువును ఒక ప్రయోజనం కోసం ఉపయోగించేటప్పుడు ఆ ప్రయోజనం చతుర్థీ విభక్తిలో ఉంటుంది
यूपाय दारु          यूपदारु  (యూపాయ దారు యూపదారు)  
ఈ కర్ర యూపస్తంభం కోసం (యజ్ఞాలలో చంపబోయే జంతువును ఒక స్తంభానికి కడతారు . దాన్ని యూపస్తంభం అంటారు )  
भूतेभ्यो बलि: भूतबलि:
ప్రాణుల కోసం ఉంచిన ఆహారం
మన భారతీయ సంప్రదాయంలో మనం  అన్నం తినే ముందు ఇతర ప్రాణులకు లేదా జంతువులకు కొంత ఆహారాన్ని సమకూర్చడం ఉంది . దాన్ని భుతబలి అంటారు . ప్రాణులకు ఉంచిన ఆహారం అని అర్థం .
कुण्डलाय अष्टापदम्  
ఈ బంగారం కుండలాలు కోసం  మొ||

ఇంకా ఎన్నో అనేక  సందర్భాల్లో చతుర్థీ విభక్తి వస్తుంది . అవన్నీ ముందు ముందు తెలుసుకోవచ్చు .  

సంస్కృత శ్లోకం (Sanskrit Sloka) ఇది ఎంత సరళంగా సంభాషణాత్మకంగా  ఉందో గమనించండి .
पितुर्मे को व्याधि:? हृदयपरिताप: खलु महान्
किमाहुस्तं वैद्या:? लु  भिषजस्तत्र निपुणा : |
किमाहारं भुङ्क्ते ? शयनमपि भूमौ निरशन:
किमाशा स्यात् ? दैवं स्फुरति हृदयं वाहय रथम् ||
भासस्य प्रतिमानाटकम्/III act-I sloka.
At the time of Dasaratha’s departure, Bharata was not there in Ayodhya . He was in his maternal uncle’s house. A chariot was sent to Bharata to bring him back to Ayodhya . The charioteer with out disclosing the demise of Dasaratha requested him to come back to Ayodhya. But the sudden visit of the charioteer put Bharata in tension. The conversation that took place between Bharata and the charioteer is worth mentioning.  

 Bharata: - पितुर्मे को व्याधि:? = What is the ailment of my father?
Charioteer: - हृदयपरिताप: खलु महान् = It is an unbearable mental agony
Bharata :-  किमाहुस्तं वैद्या:? = What did the doctors say?
 Charioteer: - लु  भिषजस्तत्र निपुणा : = Doctors are not skilful to treat him properly
 किमाहारं भुङ्क्ते ? = Is he taking any food?
शयनमपि भूमौ निरशन: = lying on the ground with no food
किमाशा स्यात् ? = Is there any hope of survival?
दैवं = none else except God
स्फुरति हृदयं वाहय  रथम् = My heart palpitates (with tension) drive the chariot



Tuesday, November 13, 2018

మహాత్ములకు ఆత్మబలమే అసలైన బలం ఆయుధాలు కావు


మహాత్ములకు ఆత్మబలమే అసలైన బలం ఆయుధాలు కావు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
3/106. ప్రేమనగర్, దయాల్బాగ్,
ఆగ్రా -5
08279469419.

తెలుగు చిత్రపరిశ్రమలో విజయాసంస్థ వారు  ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు . దానికి కారణాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే వారు తీసిన సినిమాలే . అవి ఆ నాటికి ఈ నాటికి ఏనాటికి చెక్కు చెదరని మొక్కవోని నిక్కమైన కళాఖండాలు .సంగీతానికి , సాహిత్యానికి ,సత్సా౦ ప్రదాయాలకు, అందమైన సందేశానికి సరసమైన వినోదానికి విజయావారి సినిమాలు ఉదాహరణలు . అసభ్యతకు ఏ మాత్రం తావులేని అచ్చమైన కుటుంబకథాచిత్రాలు వారివి . నిజంగా ఆ సంస్థ యాజమాన్యం , వారిదగ్గర పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు చాల అద్రుష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు .  వారి అకుంఠితదీక్షాదక్షతలు నేటి సినీపరిశ్రమకు ఆదర్శప్రాయం .     ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వారి బ్యానర్ పై ఉండే సూక్తి వారి గొప్పదనాన్ని సూచిస్తు౦ది. సినిమా మొదలు కాగానే మనకు  క్రియా సిద్ధి: సత్వే భవతి  మహతాం నోపకరణే  అనే సూక్తి కనిపిస్తుంది. ఒక సంస్థ గొప్పదనం వారు ఏర్పరచుకున్న motto పైన ఆధారపడి ఉంటుంది . మహాత్ములకు కార్యసిద్ధి వారి బలం మీదనే ఆధారపడి ఉంటుంది గాని సాధనాలపైన కాదు . ఈ సూక్తి వారి గొప్పదనానికి స్ఫూర్తి . దీన్ని పరిశీలించిన నాకు దీనికి సంబంధించిన   ఎన్నో విషయాలు తెలిశాయి. అవన్నీ ఈ వ్యాసంలో సంగ్రహంగా పొందుపరుస్తున్నాను .

మహాత్ములు ఏ కార్యాన్నైనా  స్వశక్తితో సాధిస్తారు గాని సాధనాలపై ఆధారపడరు . ఒకవేళ సాధనాలు స్వీకరించినా అవి నామ మాత్రంగానే ఉపయోగపడతాయిగాని కార్యసిద్ధిమాత్రం వారి బలం వల్లనే కలుగుతుంది . ఈ విషయాన్ని బలపరచడానికి మన పురాణాల్లో ఉదాహరణలు కోకొల్లలుగా లభిస్తున్నాయి . మనం కొన్నిటిని పరిశీలిద్దాం.   

ముందుగా మొదటి ఉదాహరణగా రాముణ్ణి తీసుకుందా౦ .  ఆయన జయి౦చ వలసింది లంకారాజ్యం.  అది సమీపంలో ఉందా అంటే లేదు , సముద్రమధ్యంలో ఉంది. సముద్రాన్ని దాటి వెళ్ళాలి . కాలి నడకతోనే గమ్యం చేరాలి . ఇక ప్రత్యర్థి సామాన్యుడు కాదు . ముల్లోకాలను జయించిన రావణుడు అతడు ఒక రాక్షసుడు . ఇక రాముని సహాయకులు యుద్ధంలో నిపుణులా అంటే కాదు , నిరాయుధులైన వానరులు . ఐనప్పటికీ రాముడు రావణుని జయించగలిగాడు . అందువల్ల మహాత్ములు తమ పరాక్రమం చేతనే  కార్యాన్ని సాధిస్తారు గాని సాధన సామగ్రి వలన కాదు .

1. విజేతవ్యా లంకా చరణ తరణీయో జలనిధి:
విపక్ష: పౌలస్త్య: రణభువి సహాయాశ్చ కపయ:
తథాప్యేకో రామ: సకలమవధీద్రాక్షాస కులం    
క్రియాసి ద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि:                 
विपक्ष: पौलस्त्य: रणभुवि सहायाश्च कपय:                           
   तथाप्येको राम: सकलमवधीद्रावणकुलम्
   क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |

ఇపుడు నిండైన రెండో  ఉదాహరణ తీసుకుందాం. ఆయనెవరోకాదు,  సూర్యుడు . ఆయన రథానికి ఒకే చక్రం . ఏడు గుర్రాలు అవి పాములచేత కట్టబడినవి . ఇక్కడ ఏడు గుర్రాలంటే సూర్యకిరణం లోని ఏడు రంగులని అర్థం .  అవి  Violet, Indigo, Brown, Green, Yellow, Orange and Red (VIBGYOR). ఇక  ఆమార్గం ఎటువంటి ఆలంబన లేనిది . పోనీ సారథి గొప్పవాడా అంటే కాదు . ఆయన సారథి అనూరుడు. దివ్యా౦గుడు, ఊరువులు కూడ లేని అవిటివాడు . ఐనప్పటికీ ఆ సూర్యుడు ప్రతిరోజూ ఆకాశం ఈ వైపునుంచి ఆ వైపు వరకు అలసటలేకుండా సంచారం చేస్తూ ప్రపంచానికి వెలుగు పంచుతున్నాడు . అందువల్ల మహాత్ముల కార్యసాధనకు  స్వశక్తియే ఆధారం గాని ఆయుధాలు , అనుచరులు కాదు .

2. రథస్యైకం చక్రం భుజగయమితా: సప్త తురగా:
నిరాలంబో మార్గ: చరణరహిత: సారథిరపి
రవిర్గచ్ఛత్యంతం ప్రతిదిన మపారస్య నభస:      
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

रथस्यैकं चक्रं भुजगयमिता: सप्ततुरगा:             
 निरालम्बो मार्ग:  चरणरहित: सारथिरपि                   
 रविर्गच्छत्यन्तं   प्रतिदिनमपारस्य नभस                                
क्रियासिद्धि : सत्त्वे भवति महतां नोपकरणे |

ముచ్చటగా మూడో  ఉదాహరణ  చూద్దాం .        ఆయన ఎవరో కాదు  మన్మథుడు. మన్మథునకు పువ్వే విల్లు . తుమ్మెదలే అల్లె త్రాడు . ఇక చపలచిత్తలైన స్త్రీల చంచలమైన చూపులే బాణాలు . ఇక సహాయ సహకారాలేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేనట్లే . ఎందుకంటే చైతన్యం లేని చంద్రుడే సహాయకుడు . ఐనప్పటికీ మన్మథుడు తన స్వశక్తితో ఈ మూడు లోకాలను  సంమోహపరుస్తున్నాడు . త్రిభువన విజేతగా నిలిచాడు . కాబట్టి మహాత్ములకు స్వశక్తియే కార్యసిద్ధికి కారణం ఔతుంది గాని ఆయుధాలు, బలగం ఏమాత్రం కావు .
3. ధను: పౌష్పం  మౌర్వీ మధుకరమయీ  చంచలదృశాం
దృశాం కోణో బాణ: సుహృదపి జడాత్మా హిమకర: 
తథా ప్యేకోsనంగ: త్రిభువనమపి వ్యాకులయతి
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

धनु: पौष्पं  मौर्वी मधुकर मयी चञ्चलदृशां                
 दृशां कोणो बाण: सुहृदपि जडात्मा हिमकर:                              
तथाप्येकोsनङ्ग: त्रिभुवमपि व्याकुलयति
क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |
నాణ్యమైన నాలుగో ఉదాహరణ చూద్దాం . ఆయన ఎవరో కాదు  మన్మథుడే. మన్మథుడు స్వయంగా శరీరం లేనివాడు .ఇక  ప్రత్యర్థి సామాన్యుడు కాడు . ముల్లోకాలకు ప్రభువైన ఈశ్వరుడు.   ఇక మన్మథుని  సహాయకుడైన వసంతుడు ప్రాణంలేని ఒక జడ పదార్థం . మంచి ఆయుధాలేమైన ఉన్నాయా అనుకుంటే అవి పువ్వులు . అందులోనూ ఐదు పువ్వులే.  అవి అరవిందం , అశోకం , మామిడి , నవమల్లిక , నీలోత్పలం . అవన్నీ చాల మృదువైనవి ముట్టుకుంటే విరిగిపోయేవే . ఇక ఆయన సైన్యం అబలాజనం . ఐనప్పటికీ మన్మథుడు ముల్లోకాలను జయిస్తున్నాడు . కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి వారి స్వశక్తి వల్లనే కలుగుతుంది గాని సాధనాలతో పనిలేదు .
4. విపక్ష: శ్రీకంఠ: జడతనురమాత్య: శశి ధర:
వసంతో సామంత: కుసుమమిషవ: సైన్యమబలా:
తథాపి త్రైలోక్యం జయతి మదనో దేహరహిత:
క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

विपक्ष: श्रीकण्ठ: जडतनुरमात्य: शशिधर:                  
 वसन्तो सामन्त: कुसुममिषव: सैन्यमबला:                                  
  तथापि त्रैलोक्यं जयति मदनो देह रहित:                                                क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |    
ఇపుడు అందమైన ఐదవ  ఉదాహరణ పరిశీలిద్దాం . ఈయన అగస్త్యుడు .ఆయన  మట్టికుండలో పుట్టాడు . ఆయన ఇరుగు పొరుగు పరివారం అంతా మృగాలే . భూర్జ పత్రాలె బట్టలు . నివాసం అడవి. కంద, మూల ఫలాలే ఆహారం.  బక్క చిక్కిన  శరీర౦ . ఇన్ని లోపాలున్నప్పటికి ఆయన స్వశక్తితో సముద్రాన్ని పూర్తిగా త్రాగివేసి తమకు అపకారం చేసి సముద్రంలో దాక్కుంటున్న  కాలకేయులను బయటపెట్టి వారిని నిర్మూలనకు ఎంతో సహకారం చేశాడు . కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి వారి స్వశక్తి వలననే కలుగుతుంది గాని వేరొకరి సహాయం వలన కాదు. కాలకేయులనే కొంతమంది రాక్షసులు మునులకు ఎంతో అసౌకర్యం కలిగించేవారు . వారిని హింసించి తరువాత సముద్రంలో దాక్కునేవారు . ఎంతకాలమైనా సముద్రంలో దాక్కునే నైపుణ్యం వారికుంది . ఇక వారి జాడ ఎవరికీ తెలిసేది కాదు . వారి బాధలు పడలేక మునులందరూ దేవతలను ప్రార్థించగా వారందరూ విష్ణువును చేరి ఆ కాలకేయులను మట్టుబెట్టే మార్గాన్ని సూచించమని వేడుకున్నారు . అపుడు విష్ణువు దేవతలతో మీరు అగస్త్యుని ప్రార్థి౦చండి  ఆయన సముద్రాన్ని త్రాగివేయ గల ఏకైక సమర్థుడు అని చెప్పగా దేవతలు అతని చేరి జరిగిన సంగతి వివరించగా అగస్త్యుడు తనశక్తినంతా కూడ గట్టుకుని సముద్రాన్ని త్రాగివేయగా అప్పుడు దేవతలు కాలకేయులజాడ కనుగొని వారిని తరిమి తరిమి చంపారు .
5. ఘటో జన్మస్థానం మృగపరిజన: భూర్జవసన:
వనే వాస: కందాశనపి చ దుస్థం  వపురిదం
తథాప్యేకోsగస్త్య: సకలమపిబద్వారిధి జలం
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే
     
घटो जन्मस्थानं मृगपरिजन: भूर्जवसन:           
वने वास: कन्दाशनमपि च दु:स्थं वपुरिदं                       
 तथाप्येकोsगस्त्य: सकलमपिबद्वारिधिजलम्                                   
 क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |
కాబట్టి మానవుడు ఈ పై విషయాలను స్ఫూర్తిగా తీసుకుని ఇతరులపై ఆధారపడకుండ స్వశక్తితో ఆత్మవిశ్వాసంతో కార్యసాధనకు పూనుకోవాలి. ఆత్మవిశ్వా సం గలవాడు సాధించలేనిదంటు ఏది ఉండదు .
                                               *****