శ్రీమతి
సూర్యకాంతమ్మకు అభివందనలు, అభినందనలు నివాళులు .
చలన చిత్రరంగంలో
సూర్యచద్రులవంటి
శూరులున్నా (ANR& NTR)
గుండమ్మకథ అనే నీపేరే
చెలామణి కావడం నీ గయ్యాలితనానికి తిరుగులేని
ఉదాహరణ .
చరిత్రలో కొన్ని పాత్రలు చెరగని ముద్రలు వేస్తాయి .
ఉదాహరణకు సీత . ఆమె ఒక నిప్పు.
పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే తెగుతుంది చెప్పు .
ఇక నీ పేరు సూర్యకాంతం. నెగ్గించుకుంటావు
పంతం .
నీతో పెట్టుకుంటే ఎవరి
జీవితమైనా ఔతుంది అంతం .
నువ్వు చెప్పినట్లు చేస్తే ఔతావు సొంతం.
కంచుకాగడాతో వెతికినా కానరాదు
నీలో శాంతం.
నువ్వు న్న ప్రతిసినిమా అవుతుంది విషాదాంతం .
నీకు నచ్చితే వింటావు
గాని ఎవరు చెప్పినా వినని పంతం నీ సొంతం
నిన్ను కాదంటే ఔతుంది
కలియుగాంతం.
నీ పాత్రలు ఎలా ఉన్నా,
ఎటువంటివైనా
ప్రేక్షకులందరి హృదయాల్లో
నిలుస్తావు జీవితాంతం .
మరువలేని మహానటివి ఓ
సూర్య కాంతం !
నువ్వేలోకంలో ఉన్నా మా
హృదయాలే నీ లోకం
స్వీకరించు మా వందనాలు,
అవే నీకౌతాయి
అభినందనచందనాలు .
<><><>