Wednesday, June 18, 2014

ఉపదేశ శిఖామణి

ఉపదేశ శిఖామణి
(త్యాగరాజమఖి) 
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ప్రేమనగర్, దయాల్బాగ్, ఆగ్రా
9897959425. 
త్యాగరాజమఖి గొప్ప సంస్కృత  పండితుడు.   ప్రసిద్ధ అద్వైతవేదాంతి . ఈయన అనంతానందుని శిష్యుడు. కాశ్యపగోత్రజుడు. ఆంధ్రదేశీయుడు. ఈయన 'పంచకోశవిమర్శిని' 'ఉపదేశశిఖామణి' మొదలైన గ్రంథాలు రచించారుపంచకోశవిమర్శినిమన స్వరూపం  అన్న మయప్రాణమయ , మనోమయవిజ్ఞానమయ  ఆనందమయకోశములకన్న అతీతమైన ఆత్మతత్త్వమని సోపపత్తికంగా నిరూపిస్తుందిఉపదేశశిఖామణి  శ్రీ శంకరభగవత్పాదుల భజగోవిందస్తోత్రాన్ని పోలి ఉంటుందిగానయోగ్యంగా ఉండి వైరాగ్యాన్ని బోధిస్తుంది. ప్రపంచం క్షణికమని సుఖభోగాలు దు:ఖాన్ని కల్గిస్తాయని చెబుతూ ముక్తి మార్గం మెళుకువలు చక్కగా వివరిస్తుంది. సాధనోపాయాలు స్పష్టం చేస్తుంది.     
' అమాయకుడా !శివుని సేవించు ముక్తి పొందుఅని పదే పదే   హితం చెబుతుంది.
భజగౌరీశం భజగౌరీశం   
భజగౌరీశం ముగ్ధమతే !
భజగౌరీశం భజగౌరీశం
గౌరీశం భజ ముగ్ధమతే !()
                                                                                                        
నాయనా ! నువ్వు సత్యం మాట్లాడు ధర్మం ఆచరించు. పని చెయ్యాలో పని చెయ్యకూడదో చక్కగా విచారించి తెలుసుకో. కాలుడు నీ శరీరాన్ని క్షణంలోనైనా తీసుకుపోతాడు . అమూల్యమైన మానవ జన్మను వ్యర్థం చేసుకోకు .
సత్యం వద రే ధర్మం చర రే
 కృత్యాకృత్య విచారం కురు రే
కాలో యాతి గృహీత్వా దేహం
వ్యర్థం మా కురు మానుషజన్మ  ()                           భజ గౌరీశం 
  మూఢమానవ ! మృత్యువనే పెద్దపులి నీ వెనుకనే పొంచి ఉంది.
జన్మ అనే ఒక పెద్ద గొయ్యి నీముందు వేచి  ఉంది. రెండు ప్రక్కల ముసలితనం అనే మొసలి వెంబడిస్తో వస్తోందిఇక రోగం అనే  భయంకరమైన సర్పం  నీ శరీరాన్ని పీల్చి పిప్పి చేస్తోంది.
పృష్ఠే తిష్ఠతి మరణవ్యాఘ్ర:
పురత: తిష్ఠతి జన్మ శ్వభ్రం
పార్శ్వే తిష్ఠతి నక్రజరా తే
 వ్యాధి వ్యాళో గిలతి శరీరం ()                                             (భజ గౌరీశం)
అమాయకుడా! నీశరీరం అనే అరణ్యంలో కామం అనే పెద్దపులి ఒకటి తిరుగుతోంది.అది నీ మనస్సు అనే లేడిని హరించి వేస్తుంది. నువ్వు దాన్ని  బంధించకపోతే     అదే నిన్ను బంధించి మట్టుపెట్టే ప్రమాదముంది.
కామవ్యాఘ్రో దేహారణ్యే
తిష్ఠతి మానసహరిణం హర్తుం
తం జయ శత్రుం నో చేత్త్వామపి                                                                                                                    బద్ధ్వా నేతుం శక్తో భవతి ()                                           ( భజ గౌరీశం
మూఢమానవుడ ! చెడ్డవారితో స్నేహం ఎన్నడూ చేయకు. అది విషవృక్షం వంటిది . దానివల్ల మంచి ఫలితం లేకపోవడం అలా ఉంచి చెడుఫలం లభిస్తుంది
 నువ్వు  ఘోరమైన  నరకంలో కూరుకుపోతావుఅదెంతకష్టమో నువ్వు పదే పదే ఆలోచించుకో. అభయంకరుడు భక్తజనవశం కరుడైన  శంకరుని సేవించు తరించు.
దుర్జన సంగం మాకురు మాకురు
దారదపాదపమివ దుష్ఫలదం
కష్టం  కష్టం చింతయ చింతయ
కలిమలనరకే మగ్నో భవసి. ()                                        ( భజ గౌరీశం )
                                                                                                    









No comments: