కలియుగదైవాలు “కాఫి-టీ”లు
(వ్యంగ్య రచన)
చిలకమర్తి
వేంకటసూర్యనారాయణ,
ఎర్రమిల్లి
వారివీధి,గంటలమ్మ గుడివద్ద ,
నరసాపురం -534275
1.
సీసపద్యం:
సూర్యోదయానికి షోకెంతజేసినా
‘కాఫి’ లేనిదె ఘటము
కదలబోదు
కార్యాలలోడబ్బు
ఖర్చెంత పెట్టినా
‘కాఫి’ లేనిదె రాదు
గౌరవంబు
ప్రేయసిపై నీవు
ప్రేమెంత చూపినా
‘కాఫి’ లేనిదె రాదు
కౌగలింప
దైవపూజలందు దాని
సేవిoపమి
కార్యమసలే పూర్తి కాదు సుమ్ము
తే|| గీ|| పితృశ్రాద్ధాలలో
నైన ప్రీతితోడ
‘కాఫి’ మున్ముందె సేవింప
కలుగు ఫలము
సత్యమీయది లేదిందు సందియంబు
‘కాఫి’ లేకున్న శాంతి
లోకాన సున్న
2.
కందము:
ఇలలో కాఫీ టీలను
సలలితముగ గొల్వ సకల సౌఖ్యములబ్బున్
కలదిoదు
నిజము గనుమా!
కలియుగ
దైవంబులరయ కాఫీ టీలే
౩. ఆటవెలది:
‘కాఫి’ యందు గల్గు
గమ్మత్తదేమియో
కొద్దొ గొప్పొ దాని గ్రోలకున్న
ప్రాణములకు చలనభాగ్యంబు సున్నయౌ
కల్ల గాదు నిజము
కలియుగాన
4.
కందము:
ఘనమగు రోగము
లెల్లను
ననుమానంబేమి లేక ఆశ్చర్యముగా
కనుమూసి గాoచులోపల
కనపడ రానీయవమ్మ కాఫీమాతా !
5.
సీసం :
కాఫీని గొలిచిన
కారణంబునగదా
ఘనకవీoద్రుల కలము కదలె వేగ
కాఫీని
గొలిచిన కారణంబునగదా
గాంధితాతకు దక్కె ఘనవిజయము
కాఫీని గొలిచిన కారణంబునగదా
గాయకకంఠాలు కమ్మనయ్యె
కాఫీని గొలిచిన కారణంబున గదా
అయ్యర్ల పాలయ్యె నాదిలక్ష్మి
ఆ||వె|| దీర్ఘవ్యాధి తోడ దిగులొంది వ్యథ చెంది
మూల్గుచున్న ముసలిమూక కైన
కాఫి! కాఫి! యంచు కంఠమారగ ( బిల్చి
కొలువకున్న ముక్తి కలుగ బోదు
6.
సీసం:
మురళీధరుడు మున్ను మోహినీరూపాన
సురలకు సుధ విందు పరపు నాడు
వినతాసుతుడు శౌర్యవిస్ఫూర్తి మీరగ
అమృతంపు కలశతో నరుగునాడు
అంజనీతనయుండు నధికరయంబున
సంజీవిగిరి దెచ్చు సమయమందు
దశకంఠునుదరాన
దాచిన భాoడమ్ము
శ్రీరాముడస్త్రాన చెండునాడు
ఆ|| వె|| పట్టు
సడలి పుడమి పడ్డ బిందువులన్ని
దివ్యమైన యట్టి దీప్తి తోడ
తమ్ము గొలచువారి దయతోడ బ్రోవంగ
కలియుగాన నిల్చె ‘కాఫి-టీ’ ల్గ
******
No comments:
Post a Comment