సంభాషణ సంస్కృతం –23
(Spoken Sanskrit)
Lesson-23
Dr.
Ch. Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.
तृतीया विभक्ति:
(Instrumental case)
ఇంతకు ముందు మనం ప్రథమా, ద్వితీయా
విభక్తులు ఏ సందర్భంలో ప్రయోగించాలో తెలుసుకున్నాం . ఇప్పుడు తృతీయా విభక్తి ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాం . మనం కొన్ని కొన్ని పనులు చేయడానికి కొన్ని కొన్ని సాధనాలు ఉపయోగ
పడతాయి . ఉదాహరణకు తినడానికి చేయి కనడానికి కన్ను , వినడానికి
చెవి , అనడానికి నోరు మొ|| సాధనాలుగా పనిచేస్తాయి ..ఇక్కడ ఆయా పనులు చేయడానికి ఏవి సాధనాలుగా ఉపయోగిస్తున్నాయో
అవన్నీ తృతీయా విభక్తితో చెప్పాలి. साधकतमं करणम् అని నిర్వచనం . ఒకపని జరగడంలో ఏది ముఖ్యమైన పాత్ర వహిస్తుందో అది కరణం (సాధనం )
అవుతుంది. తృతీయావిభక్తిని ఆంగ్లంలో instrumental case . అంటారు instrument అంటే సాధనం. ఇదే కాకుండా ఇంకా ఏ ఏ సందర్భాల్లో తృతీయావిభక్తి వస్తుందో కూడ తెలుసుకుందాం .
I.
साधनार्थे तृतीया :
Example:-
1.
सा मुखेन वदति
ఆమె నోటితో మాట్లాడుచున్నది
She is speaking with her mouth.
2.
स: श्रोत्रेण शृणोति
అతడు చెవితో వినుచున్నాడు
He is listening with his ear
3. बालक: हस्तेन लिखति
బాలుడు చేతితో వ్రాయుచున్నాడు
He is
writing with his hand.
4.
बालिका पादाभ्यां चलति
బాలిక ( రెండు)
కాళ్ళతో నడచుచున్నది
The girl
is walking with her (two) legs
5.
अहं हस्तेन चित्रं
लिखामि
I am drawing a picture with my hand.
నేను చేతితో బొమ్మ గీయుచున్నాను .
6.
अहं हस्तेन
स्पृशामि
I am
touching with my hand,
నేను చేతితో ముట్టుకుంటున్నాను.
7.
अहं लेखिन्या लिखामि ||
I am writing with pen
నేను పెన్నుతో వ్రాయుచున్నాను.
8.
बालक: दन्तकूर्चेन दन्तधावनं
करोति |
బాలుడు బ్రెష్ తో పళ్ళు తోముకుంటున్నాడు
Boy is
cleaning his teeth with brush.
9. अहं चमसेन पायसं खादामि
నేను చంచాతో
పాయసం తింటున్నాను
I am
eating Payasam with a spoon.
10 . बालिका कन्दुकेन क्रीडति
బాలిక బంతితో ఆడుచున్నది
A girl is playing with ball
ఈ పైన చెప్పిన అన్ని పనులయందు కొన్నికొన్ని సాధనాలుగా
చెప్పబడ్డాయి . అవన్నీ తృతీయా విభక్తులు పొందాయి .
Note: మహాభారతంలో ఎవరు ఏ ఆయుధంతో యుద్ధం
చేశారో వివరిస్తూ కొన్ని వాక్యాలు వ్రాయండి.
II. तृतीया विभक्ति: (सह योगे)
సహ అనే పదం వాడినప్పుడు ఆ పదం దేనితో వాడుతున్నామో ఆ
పదానికి తృతీయా విభక్తి వస్తుంది
1.
सीता रामेण सह वनं
गतवती
సీత
రామునితో కూడ అరణ్యమునకు వెళ్లినది.
Sita went to forest with Rama.
2. कृष्ण: अक्रूरेण सह द्वारकां गतवान्
కృష్ణుడు అక్రూరునితో కలసి ద్వారక వెళ్ళెను
3. बालका: अध्यापकेन सह ग्रन्थालयं गतवन्त:
బాలురు అధ్యాపకునితో కలసి గ్రంథాలయమునకు వెళ్లీరి.
Boys went to library along with the teacher.
Note:- మీ
స్కూలులో ఎవరు ఎవరితో కలిసి చదువుతారో వివరిస్తూ కొన్ని వాక్యాలు తయారు చెయ్యండి .
III.
विना योगे
వినా (without) అనే పదం ఉపయోగించినప్పుడు కూడ తృతీయా
విభక్తి వచ్చును .
1.
रामेण विना सीता न जीवति
రాముడు లేనిచో సీత బ్రతుక లేదు.
Sita can
not live with out Rama.
2. दीपेन विना कान्ति: न भवति
దీపము లేనిచో కాంతి లేదు
There is no lighting with out lamp
3. जलेन विना जीवनं नास्ति
నీరు లేనిచో బ్రతుకు లేదు
There is no life
without water.
4. शीलेन विना जीवनं व्यर्थं भवति .
శీలం లేనిచో జీవితం వ్యర్థం
Life is meaning less with out character.
Note: ఈ ప్రపంచంలో ఏది లేకపోతె ఏది ఉండదో ఊహిస్తూ కొన్ని వాక్యాలు తయారు
చెయ్యండి .
IV.
अलम् ( చాలు ) (Enough) అనే పదం ఉపయోగించినప్పుడు తృతీయా విభక్తి వచ్చును.
Example: - 1. अलं
विवादेन = వాదన చాలు =Enogh of your arguement
2. अलं वचनेन =మాటలు చాలు = Enogh of your talking
3. अलं कोपेन = కోపం చాలు (కట్టిపెట్టు )= Enough of your anger
Note:- అలం అనే పదం ఉపయోగించి మరికొన్ని
వాక్యాలు రచి౦చ౦డి.
V. भाववाचकयोगे
మనం ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు అనేక భావాలు ప్రకటిస్తాం . ఆ భావవాచక
పదాలన్ని తృతీయా విభక్తిలో ఉంటాయి .
Examples:-
1. बालिका आनन्देन नृत्यति
బాలిక ఆనందంతో నాట్యం చేయుచున్నది.
The girl is dancing with joy.
2. आतिथेय: आदरेण अतिथिम् आह्वयति
గృహస్థుడుఅతిథిని ఆదరంగా ఆహ్వానించుచున్నాడు
The host is inviting the guest with respect.
3. निर्धन: कष्टेन जीवनं यापयति
నిర్ధనుడు కష్టంతో జీవిస్తున్నాడు .
The poor
man is spending his life with a great difficulty.
Note :- సంతోషం , దు:ఖం , దైన్యం , కోపం మొదలైన భావవాచక పదాల్ని ఉపయోగించి
కొన్ని వాక్యాలు తయారు చెయ్యండి.
Note:- ఇంకా ఎన్నో సందర్భాల్లో తృతీయా విభక్తి వస్తుంది . అవన్నే ముందు ముందు
తెలుసుకుందాం .
A sloka for recitation:
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन
दानेन पाणि: न तु कङ्कणेन
विभाति काय: करुणापराणां
परोपकारेण न चन्दनेन {भर्तृहरि:}
ఈ లోకంలో మహాత్ములకు సద్గుణములే సహజమైన అలంకారములు . వారి చెవులు శాస్త్రములను
వినడం వల్లనే ప్రకాశిస్తాయిగాని , కుండలాల వలన కాదు ; దానం చెయ్యడం వల్లనే చేయి
ప్రకాశిస్తుంది గాని కంకణములు పెట్టుకోవడం వల్ల కాదు ; అలాగే పరోపకారం చెయ్యడం
వల్లనే శరీరం ప్రకాశిస్తుంది గాని మంచిగంధం పుసుకోవడం వలన కాదు.
For those who are magnanimous, the ear shines with the listening of
good words of all sastras but not by wearing earring; the hand shines with
charity but not by wearing bracelet and body shines with doing good to others
but not by smearing sandal paste to the body.
No comments:
Post a Comment