Wednesday, May 15, 2019

Spoken Sanskrit- Lesson-29


సంభాషణ సంస్కృతం 29
(Spoken Sanskrit)
Lesson-29
                                      Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.
        
 Unit 1

     युष्मद्  शब्द: --वर्तमाने एकवचनम्
    त्वं - पठसि నీవు చదువు చున్నావు
   
     युष्मद्  शब्द: --वर्तमाने द्विवचनम्  
युवां पठथ: - మీరిద్దరూ చదువుచున్నారు

युष्मद्  शब्द: --वर्तमाने-बहुवचनम्
यूयं - पठथ  మీరందరు చదువుచున్నారు  

युष्मद्  शब्द: --भूते

त्वं =अपठ:  నీవు చదివితివి युवां अपठतम्  మీరిద్దరూ చదివితిరి यूयं अपठत  మీరందరు చదివితిరి

युष्मद्  शब्द: -भविष्यति
त्वं पठिष्यसि  ( నీవు చదివెదవు ) युवां पठिष्यथ: (మీరిద్దరూ చదివెదరు ) यूयं पठिष्यथ మీరందరు చదివెదరు )

  युष्मद् शब्द: --वर्तमाने  प्र .पु

      : पठति అతడు చదువుతున్నాడు तौ-पठत:--వారిద్దరూ చదువుచున్నారు
ते पठन्ति వారందరూ  చదువుచున్నారు

      त्वं पठसि నీవు చదువుచున్నావు युवां पठथ: మీరిద్దరూ  చదువుచున్నారు --यूयं पठथ మీరందరు చదువుచున్నారు  

     अहं पठामि నేను చదువుచున్నాను आवां पठाव:-  మేం ఇద్దరం చదువుచున్న్నాము वयं-पठाम:మేం అందరం చదువు చున్నాము

युष्मद्  शब्द: -- भविष्यति

 (:)    पठिष्यति (तौ ) पठिष्यत: ( ते) पठिष्यन्ति
(त्वं ) पठिष्यसि   (युवां) पठिष्यथ: ( यूयं) पठिष्यथ 
अहं पठिष्यामि आवां पठिष्याव: वयं पठिष्याम:

Unit -2

लङ् लकार:  (భూతకాల౦)

अपठत् अपठताम्-अपठन्
अपठ: -अपठतम् -   अपठत
अपठम्- अपठाव- अपठाम
 
: अपठत् అతడు చదివెను  ---  तौ- अपठताम् వారిద్దరూ చదివిరి ---      ते   - अपठन् వారందరూ చదివిరి
त्वम्- अपठ: నీవు చదివితివి  -- युवाम्- अपठतम् మీరిద్దరూ చదివితిరి -- यूयम् अपठत మీరందరు చదివితిరి
अहम् अपठम् నేను చదివితిని आवाम्अपठाव మేమిద్దరం చదివితిమి वयम् अपठाम మేమందరం చదివితిమి

Unit-3

భూతకాలంలో  past Tense (మధ్యమ పురుష) Second person లో त्वं युवां यूयं అనే పదాలకు బదులుగా भवान् भवन्तौ भवन्त:  అనే పదాలను ఉపయోగిస్తే  अपठत् अपठताम्-अपठन्  అనే క్రియా పదాలకు బదులుగా  पठितवान् पठित वन्तौ पठितवन्त:  అనే పదాలను ప్రయోగిస్తే మనకు భాష కొంత  సులభం అవుతుంది  అవి అన్ని పురుషలలోను సరిపోతాయి .అదెలాగో తెలుసు కుందాం .

: पठितवान् అతడు చదివెను  ---  तौ- पठितवन्तौ  వారిద్దరూ చదివిరి ---      ते   - पठितवन्त:   వారందరూ చదివిరి

भवान् पठितवान्  నీవు చదివితివి  -- -भवन्तौ  पठितवन्तौ మీరిద్దరూ చదివితిరి भवन्त: पठितवन्त:  మీరందరు చదివితిరి

अहम् पठितवान्  నేను చదివితిని आवाम् पठितवन्तौ  మేమిద్దరం చదివితిమి वयम् पठितवन्त:  మేమందరం చదివితిమి

ఈ క్రియా పదాలను మనం చాల సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు

1. పఠితవాన్- పఠితవంతౌ పఠిత వంత:
2. లిఖితవాన్ లిఖితవంతౌ లిఖితవంత:
3. గతవాన్ గతవంతౌ గతవంత:
4. కృతవాన్ కృతవంతౌ కృతవంత:

రామ: వనం అగచ్ఛత్ అనడానికి బదులు మనం రామ: వనం గతవాన్    అనవచ్చు .  

पिक: कूजितवान् पितौ कूजितवन्तौ पिका:कूजितवन्त:

కోకిల కూసెను -రెండు కోకిలలు కూసినవి చాల కోకిలలుకూసినవి

उक्तवान् उक्तवन्तौ उक्तवन्त:
अध्यापक: उपन्यासम् अक्तवान्
అధ్యాపకుడు  ఉపన్యాసం చెప్పెను

मिलितवान्- मिळितवन्तौ मिलितवन्त:
आञ्जनेय: रामं मिलितवान्  
ఆంజనేయుడు రాముని కలుసుకొనెను

रामलक्ष्मणौ सुग्रीवं मिलितवन्तौ
రామలక్ష్మణులు సుగ్రీవుని కలుసుకొనీరి

वानरा: रामं मिलितवन्त:

వానరులు రాముని కలుసుకొనిరి
ఇక స్త్రీ లింగంలో
पठितवती पठितवत्यौ पठितवत्य:  
అనే రూపాలు  ఏర్పడతాయి
బాలికా పఠితవతీ -బాలికే   పఠితవత్యౌ బాలికా: పఠితవత్య: 
लिखितवती लिखितवत्यौ लिखितवत्य:
మహిళా పత్రం  లిఖితవతీ   మహిళే పత్రం  లిఖితవత్యౌ- మహిళా: పత్రం లిఖిత వత్య:  
पीतवती पीतवत्यौ पीतवत्य:
బాలికా  క్షీరం పీతవతీ బాలికే క్షీరం పీతవత్యౌ బాలికా: క్షీరం పీతవత్య:

Sanskrit Sloka
क्व तिष्ठत: ते पितरौ ममेवे
त्यपर्णयोक्ते परिहासपूर्वम् |
क्व वा ममेव श्वशुरौ तवेति
तामीरयन् सस्मितमीश्वरोsव्यात्  ||

క్వ  తిష్ఠత: తే పితరౌ మమేవే
త్యపర్ణయోక్తే పరిహాసపూర్వం
క్వ వా మమేవ శ్వశురౌ తవేతి
తామీరయన్ సస్మితమీశ్వరోsవ్యాత్

పార్వతి వాస్తవానికి అచలపుత్రికే అయినా చలచిత్తం కలది. చాల చిలిపిది. సరదాగా తన   భర్తను ఒక ఆటపట్టిద్దామనుకుంది . కాని ఆయన తనకంటే  తెలివైన వాడని మాత్రం ఊహించలేక పోయింది పాపం.  ఏమండి ! నాకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా మీకు అమ్మానాన్నలెక్కడున్నారో చూపించండి అంది కొంటెగా. శివుడు దానికి సమాధానంగా  ఓహో అదా ! నాకు అత్తా మామ ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా నీకు అత్తా మామలు ఎక్కడున్నారో చూపించు  అన్నాడు నవ్వుతూ. ఏ౦ చూపిస్తుంది ? వెంటనే ఉడుక్కుంటూ బుoగమూతి పెట్టి ఆయన ఒడిలోకి  వంగి వాలిపోయి ఉంటు౦దని ఊహిద్దాం. ఈ విధంగా పార్వతి కొంటె ప్రశ్నకు తగిన సమాధానం చెప్పిన ముక్కంటి మాటలు మనల్ని రక్షించుగాక

One day Goddess Parvati wanted to make fun of her husband Lord Siva. She asked Him “ My dear husband ! I have father and mother. But you don’t have father and mother like me. Then Lord Siva replied “I have father –in- law and mother –in- law. But you don’t have father-in-law and mother-in-law like me. The jovial reply or retaliation of Lord Siva may bring prosperity to all.



No comments: