తలలు పది - సమాధానం ఒక్కటే
(Heads are ten – Answer is one)
Dr.Ch. Durgaprasada Rao
ఒకసారి రావణుని భార్య మండోదరి తన భర్తతో “ ఏమండి! ఇంద్రాది లోకపాలకులు, విష్ణువు, చంద్రుడు, సూర్యుడు,
సర్పరాజులు, విద్యాధరులు మొదలైన మహానుభావులందరు మీకు శత్రువులే. మీకు ఎవరితోను పడదు. ఈ సృష్టిలో, మీదృష్టిలో, మీకు ఇష్టుడని
చెప్పదగిన గొప్పవ్యక్తి ఒక్కరైనా ఉన్నారా? ఒక వేళ ఉంటే ఆయనెవరో వివరించండి” అని వినయంతో
అడిగింది. రావణుడు ఆ ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వు చిందిస్తూ పదితలలతో ఇలా అన్నాడట. ఒక తల శూలి యని ,
రెండో తల శంభుడని, మూడోతల పినాకి యని, నాల్గోతల శివుడని,
ఐదో తల భవుడని, ఆరో తల పశుపతి యని, ఏడో తల శర్వుడని,
ఎనిమిదో తల ఈశ్వరుడని, తొమ్మిదోతల భర్గుడని
పదో తల పేరుచెప్పకుండ
‘చ’ అనే పదంతో
ఈశ్వరుణ్ణే సూచి౦చాయట. ఈవిధంగా పది తలలు వరుసగా ఈశ్వరునే పేర్కొని
అతని శివభక్తి పారమ్యాన్ని వ్యక్తం చేశాయి.
ఇంద్రాద్యా: లోకపాలా: హరివిధు తపనా: నాగవిద్యాధరాద్యా:
ద్వేష్యా: సర్వేsపి దేవా: ప్రియ తవ వరద: కోsపి వంద్యో
గరీయాన్?
శ్రుత్వా వాచం ప్రియాయా: ఇతి దశముఖత: ప్రాహ వాక్యం దశాస్య:
శూలీ శంభు: పినాకీ శివ భవ పశుప: శర్వ ఈశశ్చ భర్గ:
Once
Mandodari, the wife of Ravana asked her husband. “Dear Sir, all the Gods like
Indra, Vishnu, the Moon, the Sun, the kings of serpents, and vidyadharas are
treated by you as enemies. No one is liked by you. Is there any person in these
three worlds who is great, giver of boons and dearest to you? Having been asked
by his wife, Ravana, the ten headed demon, replied cheerfully with his ten heads. The first head
mentioned the name suli ( Lord Siva), the
second one Sambhu ( Lord Siva) , the third one Pinaki ( Lord Siva), the fourth
one Siva ( Lord Siva), the fifth one Bhava ( Lord Siva), the sixth one Pasupa (
Lord Siva), the seventh one Sharva ( Lord Siva), the eighth one Isa ( Lord
Siva) the ninth one Bharga ( Lord Siva)
and the tenth one suggested the same Deity ( Lord Siva) with the word ‘cha’
with out mentioning His name directly.
इन्द्राद्या: लोकपाला: हरिविधुतपना: नागविद्याधराद्या:
द्वेष्या: सर्वेऽपि देवा: प्रिय ! तव वरद: कोsपि वन्द्यो गरीयान्
श्रुत्वा वाचं प्रियाया: इति दशमुखत: प्राह वाक्यं दशास्य:
शूली शंभु: पिनाकी शिव भव पशुप: शर्व ईशश्च भर्ग:
(SubhashitaRatnaBhandagaram-p-184/v-77)
No comments:
Post a Comment