Hats
off to the talent of Dr. Kadimilla
Dr. DurgaprasadaRao
Chilakamarthi
తెలుగుసాహిత్యలోకంలో డాక్టర్ శ్రీ
కడిమిళ్ళ వరప్రసాదరావు గారి గురించి
తెలియని వారు ఎవరు ఉండరు . ఆయన ఆంధ్ర, సంస్కృతాంగ్ల భాషల్లో నిపుణులుగా , ఆంధ్రభాషాధ్యాపకులుగా , సహస్రావధానిగా సాటిలేనిమేటి
కీర్తినార్జిస్తున్నారు ఒకసారి వారు
అవధానం చేస్తున్నప్పుడు వర్ణన అనే అంశంలో
ఒక పృచ్ఛకుడు అయ్యా ! అవధానిగారూ! సంజీవని పర్వతం తెస్తున్న శ్రీఆంజనేయస్వామివారి తోకను వర్ణిస్తూ రసవత్తరమైన ఒక పద్యం చెప్పండి
అని అడిగారు . ఆడిగే వారికి చెప్పేవారు లోకువ అన్నట్లుగా అడిగేవారు ఏదైనా
అడుగుతారు . చెప్పేవారికే కష్టం . కాని సహజప్రతిభావంతులైన ఆయన అడిగిన వెనువెంటనే ఆశువుగా ఒక పద్యాన్ని ఇలా అందించారు . అవధానసాహిత్యంతో నాకు పరిచయం
చాల తక్కువే ఐనప్పటికీ ఇంత రసవత్తరమైన
పద్యం నాకు మరొక్కటి కనిపించలేదు . ఇది ఒక
అద్భుతం , అనన్యం , అసదృశం. అవధాన పద్యాలలోనే తలమానికం. పద్యం పరిశీలించండి .
వాలంబో! ప్రణవాకృతింబొలుచు దివ్యత్వ౦బొ! శేషాహియో!
ఫాలస్థానికవహ్నియో! యినకులవ్యాసక్త కోదండమో!
లీలాకల్పితవీరభద్రజటయో! ఋక్షప్రకంపంబొ! యీ
గోలాంగూలము లక్ష్మణావనకళాకుంఠంబు తోరంబుగన్
ఆలోచించేకొద్దీ ఆనందాన్ని ఇనుమడింప చేసే ఇటువంటి పద్యాలు అవధానసాహిత్య
వినీలాకాశంలో ధ్రువతారలుగా వెలుగొందుతాయనడంలో ఎటువంటి సందేహంలేదు . ఇంత మంచి పద్యాన్ని మనకం దించిన ఆయనకు, వారిప్రతిభకు అనేక వందనాలు.
<*><*><*><*><*>
No comments:
Post a Comment