నా లండన్ పర్యటన-2
(My
trip to London)
A day at Oxford University:
ఒకరోజు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయానికి బయలు
దేరాం . అది ఇంగ్లండు లోని విద్యాలయాల్లో చాల
ప్రాచీన మైనది . అక్కడ 1060 ప్రాoతాల్లోనే ఉన్నతవిద్య బోధిస్తూ ఉండే వారనటానికి ఎన్నో ఆధారాలున్నాయి. అన్ని శాస్త్రాలకు అక్కడ విశేషమైన ఆదరం ఉంది,
సంస్కృతానికి కూడ. ఇక నేను, నా భార్య, కొడుకు, కోడలు , మనుమరాలు ఇంచుమించు విశ్వవిద్యాలయం అంతా చూశా౦. ముఖ్యంగా botanical
gardens, cavernous Bodleian library, archeological museum మొదలైనవన్నీ
చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా Archeological museumఅన్ని అద్భుతాల్లో మరో అద్భుతం . ఆ మ్యూజియం చూడడానికి , పూర్తిగా
అధ్యయనం చెయ్యడానికి కొన్ని నెలలు సరిపోవు. కొన్ని వేల సంవత్సరాలనాటి ప్రాచీన ప్రపంచసంస్కృతిని వారు భద్రపరిచారు. అతి
ప్రాచీన నాగరికతల చిత్రాలు, ఆనాటి ప్రజలు ఉపయోగించిన వస్తువులు అక్కడ సజీవంగా కాకపోయినా,
ఉన్నవి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 25వేలసంవత్సరాలకు పూర్వం నాటి భారతీయ
సంస్కృతీ సాంప్రదాయ విశేషాలు చక్కగా పొందుపరిచారు. ఆనాటి
రాజుల మరియు గ్రీకు వీరుల మృత దేహాలు
యథాతథంగా ఉన్నాయి. వాళ్ళ జోళ్ళు , వారి కాలి గోళ్ళు చాల స్పష్టంగా కనిపిస్తునాయి.
ఆ మ్యూజియం చూడ్డానికైనా ప్రతివ్యక్తి
లండన్ రావాలని పించింది . కొన్ని
వేల సంవత్సరాల నాటి ప్రాచీనదేశాలను, నాగరికతలను , సాంస్కృతిక చిహ్నాలను
చూసి , ఎన్నో అంశాలను camara పొందుపరచడం జరిగింది . ఇక ఇంగ్లాoడులో కొన్ని వందల నాటక శాలలున్నాయి .
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా దేశాలన్నీ కుప్పకూలిపోయాయి. అప్పుడు వారు
ముందుగా పునరుద్ధ రి౦చు కున్నవి నాటక శాలలు ఆ తరువాతే చర్చిలు. దీన్ని బట్టి నాటక కళ
పట్ల వారికున్న ప్రేమాభిమానాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ
షేక్స్పియర్ మహాశయుని నాటకాలు ప్రదర్శిస్తూనే ఉంటారు . కిక్కిరిసిన ప్రేక్షకులతో
నాటకాలు నడుస్తూనే ఉంటాయి. కాని ఏ నాటకం చూడాలన్నా కనీసం ఆరు నెలలు ముందుగా
టిక్కెట్లు రిజర్వు చేయించు కోవాలి. అందువల్ల నాటకం చూసే అవకాశం లేక, అప్పటికే అలసిపోవడం వల్ల మరేదీ చూసే ఉత్సాహం లేక
ఇంటి మొగం పట్టాం.
ఇంకా ఉంది
A day at
Cambridge University :
మేము 17-11-2019 న లండన్ లోని
Cambridge
విశ్వవిద్యాలయం సందర్శించడానికి వెళ్ళా౦ . అది ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పది
యూనివర్శిటీలలో ఒకటి . అంతే గాక Cambridge is the second oldest university in
the English-speaking world గా కూడ చెపుతారు. ప్రపంచవిఖ్యాతి గడించిన ఎందరో మహనీయులు ఈ
విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో వివిధ శాఖలున్నాయి . ఇక John C.
Taylor తయారు చేసిన corpus
clockను 2008లో సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త Stephan Hawking ప్రారంభిoచారు. ఇది ఈ విశ్వవిద్యాలయానికికొక ప్రత్యేక
ఆకర్షణ ( special attraction). విశ్వవిద్యాలయ సందర్శకులకు, పర్యాటకులకు ఇది ఎంతో ఉత్తేజాన్ని కలిగించే అంశం.
ఈ విశ్వవిద్యాలయం ఎన్నో శాఖోపశాఖలతో విస్తరించి
ఉంది . ఈ విశ్వ విద్యాలయానికి సంబంధించిన ఎన్నో అనుబంధ కళాశాలలు , అనుబంధ పరిశోధనా
సంస్థలు దేశమంతట విస్తరించి ఉన్నాయి.
కొన్ని వేలమంది శాస్త్రజ్ఞులు , న్యాయవాదులు , చలనచిత్రనటులు , తత్త్వవేత్తలు ,
దేశప్రధానమంత్రులు , క్రీడాకారులు ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారే . ఒలింపిక్
క్రీడల్లో వందలాది స్వర్ణపతకాలను సాధించిన వారిలో ఈ విశ్వవిద్యాలపూర్వవిద్యార్థులే అధికశాతంలో ఉన్నారనేది
ఒక ఉత్తేజ కరమైన అంశం . మేము ఈ విశ్వవిద్యాలయం ప్రధాన భావనాలన్నీ సందర్శించ
గలిగాము .
No comments:
Post a Comment