Try to find out the verb చెప్పుకో౦డి చూద్దాం
विराट नगरे रम्ये
कीचकादुपकीचकम्
योsत्र क्रियापदं वक्ति
दास्यामि हैमकङ्कणम्
‘విరాటనగరే రమ్యే కీచకాదుపకీచకం’ అన్నాడు.
అందరు విన్నారు . క్రియాపదం ఎవరికీ దొరకలేదు. రమ్యే = అందమైన , విరాట నగరే= విరాట నగరంలో , కీచకాత్= కీచకుని నుండి , ఉపకీచకం = ఉపకీచకుని వరకు అనే అర్థమే వస్తోంది . ఎంత ఆలో చించినా క్రియా పదం ఆ వాక్యంలో కనిపించడం లేదు. కాని అధ్యక్షుని మాటల్లో క్రియాపదం చెప్పిన వారికి హైమకంకణం ( హేమం అంటే బంగారం , హైమం అంటే బంగారంతో చేసిన ) కంకణం కడియం బహుమతిగా ఉంది . కాబట్టి ఆ వాక్యంలో తప్పకుండా క్రియాపదం ఉండి తీరుతుంది అనుకున్నాడొకాయన. బుర్రకు పదును పెట్టాడు. కొంత సేపటికి తట్టింది . ఇలా వివరించాడు .
రమ్యే = అందమైన; నగరే – నగర౦లో; కీచకాత్= కీచకం అంటే వెదురు ( bamboo) ఒక వెదురు పొదను౦డి ; ఉపకీచకం = సమీపంలోనున్న మరొక వెదురు పొదవరకు; వి: = పక్షి; ఆట = తిరిగెను .అందరు ఆనందంతో తప్పట్లు కొట్టారు. ఇక సభాధ్యక్షుడు బహుమతి ఇవ్వవలసిన సమయం ఆసన్నమై౦ది. ఆ పండితుణ్ణి దగ్గరకు రమ్మన్నాడు . చల్లటి (మంచు) నీరు తెప్పించి నాలుగు చుక్కలు ఆ పండితునిపై చల్లేడు. ఆయన హతాశుడయ్యాడు . ఇదేంటి? అన్నాడు పండితుడు . అదే ఇదన్నాడు సభాధ్యక్షుడు. ఎలాగని ప్రశ్నించాడు పండితుడు . ఇలాగన్నాడు సభాధ్యక్షుడు. నేను హైమకంకణం ఇస్తానన్నాను. హిమం నుంచి వచ్చింది హైమం అంటే మంచు. క౦కణ౦ విషయానికొస్తే ‘కం’ అంటే నీరు. కణం అంటే బొట్టు లేక చుక్క. నేనన్నది ఒక్క చుక్కే కానీ నీపై చాల చిలకరి౦చానన్నాడు . సభాలోనున్న వారందరూ ఆయన తెలివికి ఆశ్చర్య చకితులై తప్పట్లు కొట్టారు . పండితుడికి లోపల కొంచెం బాధగానే ఉన్నా తప్పట్లు కొట్టక తప్పలేదు.
विराट नगरे रम्ये कीचकादुपकीचकम्
रम्ये= In a beautiful नगरे town कीचकात् from a bamboo उपकीचकं to another bamboo वि: bird आट flew In a beautiful town a bird flew from one bamboo to another bamboo .
No comments:
Post a Comment