Monday, October 28, 2024
అనుభవాలు – జ్ఞాపకాలు- 4 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
అనుభవాలు – జ్ఞాపకాలు-4
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
ఇది సుమారు పుష్కరకాలం క్రితం నాటి అనుభవం . నాకు
చిన్నప్పటి నుంచి కాశ్మీరు చూడాలనే కోరిక ఉండేది. బహుశ కుమారసంభవంలో కాళిదాస
మహాకవి చేసిన హిమాలయ వర్ణన కారణం ఐయుండవచ్చు.
కానీ చూస్తాననే ఊహ గాని, చూడగలననే
నమ్మకం గాని నాకు ఎప్పుడు లేవు. నేను All India Oriental Conference(A.I.O.C)కి సభ్యుణ్ణి
. రెండేళ్ల కొకసారి భారతదేశంలో కొన్ని కొన్ని చోట్ల
సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అంతకు ముందే
ఎన్నో ప్రదేశాల్లో నేను సభల్లో
పాల్గొన్నాను. 2012 లో కాబోలు ఆ సభలు
శ్రీనగర్ లో జరుగుతాయని ముందుగానే తెలిసింది. నేను The views of kalidasa on Education అనే అంశంపై ఒక పరిశోధన వ్యాసం వ్రాశాను . నా అదృష్టవశాత్తు
అది select అయ్యింది . నేనెప్పుడైతే ఈ విషయం చెప్పేనో మా కుటుంబ సభ్యులందరూ తాము కూడ వస్తామన్నారు.
అందరు బయలుదేరి ముందుగా జమ్మూ చేరుకొని ఆ తరువాత శ్రీనగర్ చేరాం. కాశ్మీరును ఏమని వర్ణించగలం! ఒక్కమాటలో చెప్పాలంటే అది భూతలస్వర్గం.
దాని శిరోభూషణం శ్రీనగర్ . అది భారత దేశానికే శిరోభూషణం. నిజంగా శ్రీలకు నిలయం, అంటే సకల సంపదలకు నిలయ మన్న మాట. ఇక శ్రీ నగర్
విశ్వవిద్యాలయంలో కాన్ఫరెన్సు మొదలైంది . సమావేశాలు జరుగుతున్నప్పుడు కాక తీరిక సమయాల్లో చాల ప్రదేశాలు చూడడం జరిగింది. అక్కడ పుణ్య స్థలాల్లో
మోసాలు జరిగేవి కావు . నేనొకవ్యక్తిని అడిగితే “ అయ్యా! ఇక్కడ దొంగతనాలు మోసాలు
ఉండవండి. కావాలంటే పది రూపాయలు ఎక్కువ అడిగి తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా మీకు
సేవలు అందిస్తారు” అన్నాడు . ఒకవేళ మేము ప్రయాణీకులను మోసం చేస్తే మాకు ప్రభుత్వం
విధించే జరిమానాలు, శిక్షలు చాల తీవ్రంగా ఉంటాయండి అన్నాడు.
ఇక చిన్నప్పుడు Dal lake is the most beautiful among the lakes in Kashmir అని పదే పదే
చదువుకోవడం వలన అందులో ఉండాలనే తలంపు కూడ కలిగింది. Dal lake లో సుమారు రెండు
రోజులున్నాము. అక్కడ వాళ్ళు అందించిన
సౌకర్యాలు, సదుపాయాలూ అద్భుతంగా ఉన్నాయి. ఆ
నౌకల్లోనే (పడవల్లోనే) పెద్ద పెద్ద భవనాల్లో లాగానే అన్ని సౌకర్యాలు ఉంటాయి. Dal lake లోనే చాల
దుకాణాలు ఉంటాయి. పడవల్లో వెళ్లి కావలసినవి కొనుక్కోవచ్చు . ఒకరోజు ఉదయం గదుల్లోంచి
ప్రభాతపుటెండ కోసం బయటికి వచ్చాము . ఇంకా చాల మంది అక్కడున్నారు. ఆ పడవ యజమాని,
నేను ఏవో మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో
ఎలా ఉన్నాయండీ మా arrangements అన్నారాయన .
చాల బాగున్నాయండి అన్నాను నేను. ఎలా ఉంది కాశ్మీరు అన్నారాయన . చాల బాగుందండీ
excellent అన్నాను. ఆ తరువాత నన్ను provoke చెయ్యడానికో ఏమో తెలియదు గాని paradise అనే మాట అతని నోటినుండి వచ్చింది. నేను paradise of India అన్నాను అప్రయత్నంగా No, Pakistan అన్నాడు . నేను
గతుక్కుమన్నాను . ఆ ప్రక్కనున్న మరొక పడవ యజమాని నా వాలకం కనిపెట్టాడో ఏమో తెలియదు
గాని కొంత నయం, మేం స్వతంత్రులమండి , మా కెవరితోను సంబంధం లేదు అన్నాడు, నన్ను
సమాధాన పరచడానికా అన్నట్లుగా . అంతే! నాకు గాలి తీసేసినంత పనైంది. ప్రక్కనే ఉండి
అంతా వింటున్న మా అబ్బాయి ఏమీ మాట్లాడకు నాన్నా! అని నన్ను సమాధాన పరిచాడు . మా
ఆనందమంతా ఐదు సెకన్లలో మటుమాయమైoది. ఇంతకూ ఇది
ఇప్పటి మాట కాదు సుమండీ . ఎప్పుడో పుష్కర కాలం
పైమాటి మాట. నేను మరల ఎప్పుడు అక్కడకు వెళ్ళలేదు
గాని ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేక పోవడం అన్ని రాష్ట్రాలతో పాటు సర్వాంగ
సుందరంగా అభివృద్ధి చెందుతూ ఉండడం చాల ముదావహం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment