शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
Dr. Ch. DurgaPrasada Rao
If you meditate one, they bless
together.
Have the benefit of two by getting one.
Let Siva and Vishnu bless you all together.
गवीशपत्र: नगजर्तिहारी कुमारतात: शशिखण्डमौलि:
लंकेशसंपूजितपादपद्म:
पायादनादि: परमेश्वरो व:
గవీశపత్ర: నగజార్తిహారీ
కుమారతాత: శశిఖండమౌళి:
లంకేశసంపూజితపాదపద్మ:
పాయాదనాది: పరమేశ్వరో వ:
1.
गवीशपत्र: गवीश: = वृष: वाहन: यस्य स: (शिव;) = గవీశ: అంటే నంది పత్ర: వాహనంగా
గలవాడు శివుడు.
(ग)वीश:= गरुडो पत्र: वाहनं यस्य स:
(विष्णु:) మొదటి అక్షరం తొలగించండి . వీశపత్ర: వి అంటే పక్షి ఈశ: అంటే రాజు, గరుత్మంతుడు వాహనంగా గలవాడు, విష్ణువు
2.
नगजर्तिहारी నగజ+ ఆర్తిహారీ= పార్వతి డు:ఖాన్ని పోగిట్టిన వాడు శివుడు
(न) गजर्तिहारी మొదటి అక్షరం తొలగించండి
. గజార్తిహారీ = గజేంద్రుని
దు:ఖాన్ని తొలగించిన వాడు, విష్ణువు
3.
कुमारतात: కుమారస్వామికి తండ్రి, శివుడు
(कु)मारतात:= మొదటి అక్షరం
తొలగించండి . మారతాత: అంటే
మన్మథునికి తండ్రి, విష్ణువు
4.
शशिखण्डमौलि: శశి అంటే చంద్రుడు, అతని ఖండాన్ని అంటే నెల వంకను తలపై ధరించినవాడు,
శివుడు
(श)शिखण्डमौलि: మొదటి అక్షరం
తొలగించండి. శిఖండం అంటే పింఛం . అది తలపై ధరించిన వాడు. విష్ణువు
5.
लंकेशसंपूजितपादपद्म: లంకేశ అంటే రావణుని చేత, సంపూజిత = పూజింపబడిన, పాదపద్మ:
= పాదపద్మములు కలవాడు, శివుడు.
(लं)केशसंपूजितपादपद्म: మొదటి అక్షరం
తొలగించండి. క అంటే బ్రహ్మ , ఈశ అంటే ఈశ్వరుడు వారిద్దరిచే సంపూజిత = పూజిం పబడిన,
పాదపద్మ: పద్మముల వంటి పాదాలు గలవాడు, విష్ణువు.
6.
अनादि: = न विद्यते आदि: यस्य स:= ఆది లేనివాడు శివుడు.
(अ)नादि:= आद्यक्षरशून्य: = మొదటి అక్షరము
లేనివాడు మొదటి అక్షరం తొలిస్తే వచ్చేవాడు.
7.
परमेश्वरो = పరమేశ్వరుడు (శివుడు )
8.
(प)रमेश्वरो మొదటి అక్షరం
తొలగించండి. రమేశ్వర: రామాయా: ఈశ్వర: లచ్చిమగడు, విష్ణువు.
9.व:= మీ అందరిని
10. पायात् =రక్షించుగాక
భావం :- నంది వాహనంగా
గలవాడు, పార్వతి డు:ఖాన్ని పోగిట్టిన వాడు, కుమారస్వామికి తండ్రి, నెలవంకను తలపై ధరించినవాడు, రావణుని
చేత పూజింపబడిన పాదపద్మములు కలవాడు, ఆది
లేనివాడు నగు శివుడు మీ అందరిని రక్షించు గాక ఇది శివ పరమైన అర్థం.
భావం :- గరుత్మంతుడు
వాహనంగా గలవాడు, గజేంద్రుని దు:ఖాన్ని తొలగించిన వాడు, మన్మథుని తండ్రి, పింఛం తలపై ధరించిన
వాడు, బ్రహ్మ , ఈశ్వరుడు వారిద్దరిచే పూజింపబడిన పద్మముల వంటి పాదాలు గలవాడు నగు లచ్చిమగడు,
విష్ణువు మీ అందరిని రక్షించు గాక ఇది విష్ణుపరమైన అర్థ్హం.
<><><>
No comments:
Post a Comment