Why Post Box is normally red in colour?
పోస్టు బాక్స్ ఎర్రగా ఎందుకు ఉంటుంది?
రచన: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఒకసారి
నా మిత్రుడు పోస్టు బాక్స్ ఎర్రగా ఎందుకు ఉంటుంది?
అని అడిగాడు. నేనన్నాను, మన భారత దేశం వైదిక
సాంప్రదాయాలు విశ్వసించే దేశం కావడం వల్ల మన వ్యవహారం అంతా వైదికమతానికి, వైదిక సంప్రదాయాలకు
అనుగుణంగా ఉంటుంది. “సత్యమేవ జయతే” అంటే సత్యమే జయించును అని భారత
ప్రభుత్వం , అలాగే “శం నో మిత్ర: శం వరుణ: ” అంటే, ‘సూర్యుడు , వరుణుడు మాకు శుభములు
చేకూర్చుగాక’ అనే ఇండియన్ నేవీ సంస్థ , ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ అంటే జనులందరకు
హితము, సుఖము కలుగు గాక అని ఆకాశవాణి ; ‘అహర్నిశం
సేవామహే’ అంటే ‘రాత్రిం బవళ్ళు సేవలు
చేస్తాం’ అని తంతి తపాలాశాఖ; ‘సత్యం శివం
సుందరం’ అని దూరదర్శన్ సంస్థ; ‘వృక్షో రక్షతి రక్షిత:’ అని అటవీశాఖ ఇవే గాక ఇంకా ఎన్నెన్నో సంస్థలు వేదాలనుండే తమ ఆదర్శాలను తీసుకున్నాయి, సమర్థవంతంగా పని
చేస్తున్నాయి కూడ . ఇక ఎల్.ఐ.సి. విషయం తీసుకుందాం. దాని motto ‘యోగక్షేమం వహామ్యహం’ అనే వాక్యం . అది భగవద్గీత నుంచి తీసుకున్నారు.
అప్రాప్త
ప్రాప్తి: యోగ: ప్రాప్తస్య రక్షణం క్షేమ: అని ఆ
వాక్యానికి అర్థం. అంటే రాకూడనిది రావడం, రావలసినది కూడ రావడం అని మొత్తం మీద అర్థం
. ఉదాహరణకు నేను ఒక సంస్థలో ఒక లక్ష రూపాయలకు చీటీ వేసి నెలకు వెయ్యి రూపాయల
చొప్పున కడుతూ నాలుగు వాయిదాలు చెల్లించాక చచ్చిపోయాననుకుందాం . ఏ సంస్థ అయినా మా
వాళ్లకు నేను కట్టిన నాలుగు వేలే ఇస్తారు . ఇక ఎల్.ఐ.సి. అలా కాదు. ఈ నాలుగు వేలు, నాలుగు వేలతో బాటు మిగిలిన తొంబై యారు వేలు కూడ చెల్లిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పొతే
అదొక మహా గ్రంథం ఔతుంది . ఇక పోస్టు బాక్సు విషయానికి వస్తే అగ్నిదేవుడు దేవతలందరికీ postman లాంటి వాడు . అందుకే “అగ్ని ముఖా వై దేవా:” అని వేదం అంది. ఇక మనం ఎవరికైనా ఉత్తరం వ్రాస్తే
అతని దగ్గరకు పట్టు కెళ్ళి అతని చేతులో పెట్టం , పోస్టు బాక్స్ లో పడేస్తాం .
తపాలా శాఖ అధికారులు మనం వ్రాసిన అడ్రస్సును ఆ ఉత్తరాన్ని ఎక్కడికి పంపించాలో
అక్కడికి పోస్టు మేన్ ద్వారా బట్వాడా చేస్తారు . అలాగే మనం ‘ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ ఇదం న మమ’
అని ఇంద్ర దేవతాక మైన మంత్రాన్ని చదివి అగ్నిలో వేస్తే అది ఎవరికి చేరాలో వారికి అగ్ని చేరుస్తాడని మన
విశ్వాసం . చేరుతుందో చేరదో ఖచ్చితంగా మనకు
తెలియదు గాని తప్పకుండా అది మనం జపించిన మంత్రాన్ని బట్టి ఇంద్రుడు మొదలైన దేవతలకు తప్పకుండ
చేరి ఉంటుందని మనం నమ్ముతాం . పోస్టు బాక్స్ అగ్నికి ప్రతీక . అగ్ని ఎర్రగా
ఉంటాడు కాబట్టి పోస్టు బాక్స్ కూడ ఎర్రగా కన్పించేలా చేసి ఉంటారు అన్నాను . వాడు
సరేలే! అని తల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు.
<><><>
No comments:
Post a Comment