Tuesday, April 22, 2014

“ద”

డా|| చిలకమర్తి. దుర్గాప్రసాదరావు.
కసారి ఒక టీచరు క్లాసులో  పిల్లల్ని రైట్ అనే పదానికి వ్యతిరేకపదం చెప్పమని అడిగాడట. ఒకడు రాంగ్ అన్నాడు . రెండో వాడు  లెఫ్ట్ అన్నాడు. ఇక మూడోవాడు   హోల్డాన్ అన్నాడు. టీచరు  చాల తికమక పడ్డాడు. ఎoదుకంటే ఆయన ఏ ఉద్దేశ్యంతో ప్రశ్న వేసినా వాళ్లు చెప్పిన సమాధానాలన్నీ కరక్టే .  రాంగ్ అన్నవాడు టీచరుకొడుకని , లెఫ్ట్ అన్నవాడు డ్రైవర్ కొడుకని , హోల్డాన్ అన్న వాడు కండక్టర్ కొడుకని  ఆ తర్వాత ఆయనకు అర్థమైoది.      
ఇక ఉపాధ్యాయుడు అందరకు చెప్పే విషయం ఒక్కటే అయినా    విద్యార్థుల అవగాహన  వాళ్ళ  వాళ్ళ సంస్కారాన్ని, పరిసరాల వాతావరణాన్ని   అనుసరించి భిన్నంగా  ఉంటుంది. బృహదారణ్యకఉపనిషత్తులో  దీనికి సంబంధింఛిన ఒక ఆసక్తి కరమైన  చక్కని కథ ఉంది.        
ఒకసారి దేవతలు, రాక్షసులు , మానవులు తమ తండ్రియైన ప్రజాపతి దగ్గరకు వెళ్ళారు.   తమకు జ్ఞానాన్ని బోధించమని ప్రార్థించారు. ముందుగా దేవతలు వెళ్ళారు. కొంతకాలం ఆయనకు సేవలు చేయగా ఆయన చాల
 సంతోషించి వారికి అని బోధించాడు.  అర్థమయింది స్వామి ! అని అన్నారు వారు. మీకు ఏమి తెలిసిందో చెప్పండి అనడిగాడు ప్రజాపతి. అయ్యా! మా నివాసమైన  స్వర్గం భోగాలకు నిలయం . అందువల్ల ఇంద్రియాలను మిoపచెయ్యమని (అదుపులో పెట్టుకొమ్మని)  మీ మాటలోని తాత్పర్యంగ మేము గ్రహించాము అన్నారు. ఆయన వారితో మీరు నా  అభిప్రాయం బాగా    అర్థం చేసుకున్నారు. నేను చెప్పినట్లు చెయ్యండి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోoడి మీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వందిoచి  పంపించాడు.      
ఆ తరువాత కొంతకాలానికి మానవులు ప్రజాపతి వద్దకు వెళ్ళారు. ఆయనకు సేవలు చేసి జ్ఞానం ప్రసాదించమని కోరారు. ఆయన వారికి అనే అక్షరాన్ని బోధించాడు. వాళ్ళనుకున్నారు మనది కర్మభూమి స్వార్థంతో అనేకకర్మలు చేస్తూ ధనం సంపాదిస్తున్నాము. దానధర్మాలు చెయ్యకుండ  లోభంతో ప్రవర్తిస్తున్నాం . అoదువల్ల లోభాన్ని  విడనాడి దానం చెయ్యమని వారు ఉపదేశించినట్లుగా అర్థం చేసుకున్నారు. అర్థమైoది  స్వామి! అన్నారు . ఏమర్థమైoదో చెప్పమన్నాడు ప్రజాపతి. వాళ్లు అర్థం చేసుకున్నది చెప్పారు. మీరు బాగా అర్థం తెలుసుకున్నారు. మీకు కలిగిందానిలో కొంత ఇతరులకు   దానం చేస్తూ ఉండండి. మీకు సకలశుభాలు కలుగుతాయని దీవించి పంపించాడు.
ఆ తరువాత కొంత కాలానికి రాక్షసులు ప్రజాపతి వద్దకు వెళ్ళారు. ఆయనకు భక్తితో కొంతకాలం సపర్యలు  చేసి సంతృప్తి పరచి జ్ఞానం బోధించమని  వినయంతో ప్రార్థన చేశారు. ఆయన వారికి కూడ అని బోధించాడు. వాళ్లకు వెంటనే అర్థమయింది. కృతజ్ఞతలు స్వామి! అని చెప్పి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆయన ఆశ్చర్యంతో మికేమర్థమైoదో చెప్పమన్నాడు. వాళ్లు చేతులు జోడిస్తూ తండ్రీ! మేము సహజంగా హిoసాప్రవృత్తి కలవాళ్ళం. క్రోధం , హింస మాకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. అందువల్ల వాటిని విడిచిపెట్టి సకలప్రాణులపట్ల  దయకలిగి ఉండమని మీరు మాకు అనే అక్షరo ద్వారా  బోధించినట్లుగా అర్థం చేసుకున్నామని వారు వివరించారు. ప్రజాపతి వారితో మీరు నా అభిప్రాయాన్ని చాల బాగా గ్రహించారు. అందరి యెడ దయకల్గి ప్రవర్తిం చండి . మీకు లాభం చేకూరుతుంది అని దీవించి పంపించాడు.
వాస్తవానికి మనిషిలో దైవప్రవృత్తి, రాక్షసప్రవృత్తి రెండు ఉన్నాయి. అందువల్ల మానవుడు మహనీయుడు కావాలంటే పై మూడు లక్షణాలు అంటే ఇంద్రియనిగ్రహం , దానం, దయ అలవరచుకోవాలి.        

సాధన చేస్తే సాధ్యం కానిదేది లేదు.

Thursday, April 10, 2014

ప్రమాదో ధీమతామపి

ప్రమాదో ధీమతామపి
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
సోక్రటీసు (469 B.C) శిష్యుడు ప్లేటో. ప్లేటో(427 B.C) శిష్యుడు అరిష్టాటిల్. అరిష్టాటిల్ ( 384 B.C) శిష్యుడు అలగ్జాండర్ ది గ్రేట్. అరిష్టాటిల్ మహా మేధావి. తర్క (Logic), అలంకార( Rhetoric) , భౌతిక ( physics) , వృక్షBotany), జంతు( Zoology) , మనోవిజ్ఞాన ( Psychology), నైతిక( Ethics) , ఆర్ధిక ( Economics), రాజనీతి( Politics), తత్త్వ( Philosophy) శాస్త్రాల్లో ఆయన స్పృశించని అoశమేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన అనేక గ్రంథాలు రచిoచారు.  ఆయన తండ్రి              నికోమచుస్( (Nicomachus) మేసిడన్ రాజు ఫిలిప్ యొక్క  ఆస్థాన వైద్యుడు. అరిష్టాటిల్   తన పదునేడవ ఏట ప్లేటో అకాడమీ లో శిష్యుడుగా చేరాడు. సుమారు 20 సo|| పాటు విద్యార్ధి గాను, అధ్యాపకుని గాను పని చేశాడు ప్లేటో (క్రి.పూ .347) లో మరణించగా ఎథెన్స్ విడిచి ఎక్కడెక్కడో సoచరించి తిరిగి కొంతకాలానికి ఏథెన్స్ చేరుకొని విద్యాసంస్థను స్థాపించాడు. ఫిలిప్ రాజు తనకుమారుడైన అలగ్జాండరును అరిష్టాటిల్ దగ్గర చేర్పిoచి    చదివించాడు. ఈయన నడుస్తూనే విద్యార్థులoదరికి పాఠాలు చెబుతూ ఉండేవాడు. అలగ్జాండర్ 323 లో ఆకస్మికంగా మరణిoచడంతో  అతని విరోధులైన కొంతమంది అరిష్టాటిల్ పై దైవదూషణగా నేరం మోపి ఎథెన్స్ నుంచి బహిష్కరించారు. ఆయన యుబోయియ  నగరo  చేరుకుని అక్కడే క్రి. పూ. 322లో తుది శ్వాస విడిచారు.
           ఈయన జీవశాస్త్రంలో కూడ గొప్ప పండితుడే ఐనప్పటికీ ఆనాటి మతాచారాలకు కట్టుబడియుoడవలసిన కారణంగా శరీర భాగాలను కోసి, సమగ్రంగా చూసి నిర్ధారణ చేయకుండానే కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవి నేడు వాస్తవానికి విరుద్ధంగా కన్పిస్తున్నాయి. అవేమిటో చూద్డాం.  
.               1.  ఆయన జ్ఞానానికి  స్థానం గుండె అని అభిప్రాయ పడ్డారు
   2. మెదడు (మస్తిష్కం) కేవలం గుండెను చల్లబరచడానికి సాధనంగ ఉపయోగ          పడుతుoదని భావించారు.
3 . మనిషికి రెండుప్రక్కల ఎనిమిదేసి ఎముకలుoటాయని    అబిప్రాయపడ్డారు.
4. ఆడవాళ్ళకు  మగవారికoటే తక్కువ దంతాలు  ఉంటాయని వాదించారు.
5. వృక్షాల్లో పునరుత్పత్తి లైంగికసంపర్కం ద్వారా సాధ్యపడదని దానికి వేరొక మార్గం ఉంటుoదని అనుకున్నారు .
6. గ్రుడ్డులో జివపదార్థం ముందుగానే ఏర్పడదని  అభిప్రాయపడ్డారు.
7. స్త్రీ సమగ్రమైనది కాదని, అసమగ్రమైన పురుషరూపమే స్త్రీ అని వాదించారు.
8. గుండెకు ధమనులు మంచిరక్తం , సిరలు చెడురక్తం అందింస్తాయి.
కాని ఈ వాస్తవవాన్ని గ్రహించని అరిష్టాటిల్ ధమనులకు    సిరలకు పెద్ద తేడ ఏమిలేదన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి ముఖ్యమైనవి. అందుకే ప్రమాదో ధీమతామపి అన్నారు మన పెద్దలు.
( ఆధారం హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- డాక్టర్ . ఆర్ . వెంకట్రామన్ )
.


Monday, April 7, 2014

తెలుసుకుందాం

                                    తెలుసుకుందాం  
                           డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
గాడిద గుడ్డు కంకరపాసు :
సాధారణంగా మనకు తెలియని విషయాన్ని అదేదో గాడిదగుడ్డు కంకరపాసు అంటాం . ముఖ్యంగా గోదావరిజిల్లాల్లో ఇది వాడుకలో ఉంది . అసలు ఇది ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుందాం.
పూర్వం బ్రిటిషువారు మనదేశాన్ని పరిపాలించే రోజుల్లో కొంతమంది ఆంగ్లేయులు క్రైస్తవమతం ప్రచారం చెయ్యడానికి ఇల్లిల్లు   తిరుగుతూ ఉండేవారు. ఆరోజుల్లో మతప్రచారo ఆంగ్లభాషలో జరుగుతూ ఉండేది. ఎందుకంటే   వాళ్లకు తెలుగు రాదు. ఇక ఆ రోజుల్లో మన వారికి వాళ్ళ ఇoగ్లీషు తెలిసేది కాదు. మహిళలకు సహనం ఎక్కువ వాళ్లు విసుక్కోకుండ చెప్పిందంతా విoటారనే ఉద్దేశoతో  ముఖ్యంగా మగవారు ఇంటిలో లేని సమయాల్లో ఆడవాళ్ళకు మత౦ పరిచయం చెయ్యడానికి వచ్చేవారు. ఆడవారికి వాళ్ళ మాటలు అసలు అర్థమయ్యేవి కావు. మతప్రచారకులు ఇంగ్లీషులో God is good. Conquer peace అని ఏవేవో చెబుతూ ఉండేవారు .ఆడవాళ్ళకు అందులోనూ ముఖ్యంగా ఇంట్లో ఉoడే బామ్మలకు ఏమి తెలిసేదికాదు. అందువల్ల ప్రక్కన ఎవరైనా చిన్న పిల్లలుంటే ఏరా! అయనేo చెబుతున్నారు ? అని ఆడిగేవారు. పాపం వాళ్ళకీ ఏమీ అర్థమయ్యేది కాదు . అందువల్ల ఓహో అదా ! గాడిద గుడ్డు కంకరపాసు అనేవారు.      
మిరపకాయ :
భారతీయులు అనాది  కాలం నుంచి మిరియాన్ని వాడేవారు.  మిరపకాయ మనదేశానికి సంబంధించింది కాదు . విదేశాలనుండి దిగుమతైన వస్తువు. దానికి ఏo  పేరు పెడదామా అని ఆలోచించారు. మిరియానికి బదులుగా ఉపయోగించే కాయ  కాబట్టి  మిరియపుకాయ  అన్నారు . అదే క్రమంగా మిరపకాయగా మారిపోయింది . మిరియాన్ని సంస్కృతoలో మరీచము అంటారు. అది మిర్చిగా మారిపోయింది. అదే క్రమంగా  పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయి పోయాయి .
అగ్రహారం:
సాధారణంగా బ్రాహ్మణులు నివసించే ప్రదేశాన్ని అగ్రహారం అంటాం . ఆ పదం ఎలా తయారయిందో చూద్దాం. హరునకు సంబంధించింది హారం ఔతుంది. హరుడంటే శివుడు . అలాగే హరికి సంబంధించింది కూడా హారం ఔతుంది. హరి అంటే విష్ణువు . అగ్రే అంటే ముందుగా ( ఇరువైపులా ) హారములు కలది అనగా శివాలయము విష్ణ్వాలయము కలది అగ్రహారము     
అధ్వాన్నం:
ఏ వస్తువైన బాగా లేకపోతే అది చాల అధ్వాన్నంగా ఉంది అంటాం. అధ్వని అన్నం అంటే మార్గంలో లభించే అన్నం అని అర్థం . ఈ రోజుల్లో  కొంత మంది ఫాస్ట్ ఫుడ్ పేరుతో రోడ్డు మీద దొరికే  ప్రతి అడ్డమైన పదార్థాల్ని  తినేస్తున్నారు. కాని పూర్వం అలాగ బయట లభించే పదార్థాల్ని  ఎవరూ తినేవారు కాదు. చాల హీనంగా చూసేవారు.   అందుకే హీనమైనవస్తువును చాల అధ్వాన్నoగా ఉంది అనడం క్రమంగా వాడుకలోకి వచ్చేసింది.          
 హృదయం:
హృదయం అనే పదానికి గుండె అని అర్థం .  హరతి దదాతి యాపయతి ఇతి హృదయం అని మన ప్రాచీనులు ఆ పదానికి నిర్వచనం  చెప్పారు. హరతి అనగా హరించేది ( తీసుకునేది), దదాతి అంటే  ఇచ్చేది, యాపయతి అంటే అన్నిటికి ఇప్పిoచేది (సరఫరా చేసేది) కాబట్టి హృదయం అయ్యింది. హరతి లోoచి హృ దదాతి లోంచి యాపయతి లోoచి   తీసుకుని దీన్ని తయారు చేశారు.  గుండె శరీరoలోని అన్ని  భాగాల్లోoఛి రక్తం తీసుకుని, ఊపిరితిత్తులకందిoచి వాటి ద్వారా అన్ని శరీరభాగాలకు అందేలా చేస్తుంది. దీన్ని బట్టి రక్తప్రసారణసిద్ధాoతo భారతీయులకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలుసన డానికి ఇదొక ఉదాహరణ.

ఈ సిద్ధాoతం పాశ్చాత్యులకు 16 వ శతాబ్దంలో గాని తెలియలేదు. విలియం హార్వే (1578-1657) దీన్ని కనుగొన్నారు. మన భారత దేశం    వైజ్ఞానికరంగంలో చాల ముందంజలో ఉoదనడానికి ఈ ఒక్క  విషయం చాలు.   

Sunday, April 6, 2014

Thought of the day (31st March)

Thought of   the   day (31st March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
वने चराम: वसु चाहराम:
नदीस्तराम: भयं स्मराम:
इतीरयन्तोsपि वने किराता:
मुक्तिं गता: रामपदानुषङ्गात्

  Some tribal robbers in a jungle, boast of their adventures in the following manner.   We roam in forests. We rob the wealth of others. We cross the rivers. We don’t have fear of any body”. Despite the impolite talk and unlawful behavior, they attained salvation as they repeatedly uttered the holy name, ‘Rama’ unknowingly.   

 వనే చరామ: వాసు చాహరామ:
నదీ స్తరామ:  న భయం స్మరామ:
ఇతీరయంతోSపి వనే కిరాతా:
ముక్తిం గతా: రామపదానుషంగాత్

అడవిలో కిరాతకులైన  కొంతమంది బందిపోటు దొంగలు ఇలా అనుకుంటున్నారు. మేము అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తాం. ధనం, సంపదలు కొల్లగొడతాం. నదులన్నీ ఈదుకుoటూ దాటేస్తాం. మేమెవరినీ లెక్కచెయ్యం, ఎవరికీ భయపడం ఈ విధంగా వారు చెడ్డబుద్ధితో అసభ్యంగా మాట్లాడినప్పటికి తెలిసో తెలీకో రామ’’రామఅoటూ  ఆ పరమపవిత్రమైన నామాన్ని ఉచ్చరించడం వలన వారికి ముక్తి లభిoచిందట.     


Please share this view with at least five of your friends

Thought of the day (30th March)

Thought of  the  day (30th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
दशकूपसमा वापी
दशवापीसमो ह्रद:
दशह्रदसमो पुत्र:
दशपुत्रसमो द्रुम:   

One large well or tank especially one having steps down to the water is equal to ten wells. One pond or lake is equal to ten large wells. One son is equal to ten ponds or lakes and one tree is equal to ten sons. 

దశకూపసమా వాపీ
దశవాపీసమో హ్రద:
దశహ్రదసమో పుత్ర:
దశపుత్రసమో ద్రుమ:  

ఒక దిగుడుబావి పది నూతులతో సమానం. ఒక మడుగు పది దిగుడుబావులతో సమానం . ఒక పుత్రుడు పది మడుగులతో సమానం . ఇక ఒక చెట్టు పదిమంది పుత్రులతో సమానం . 
Please share this view with at least five of your friends


Thought of the day (29th March)

Thought of the day (29th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
कविता वनिता चैव
स्वयमेवागता वरा
बलादाकृष्यमाणा सा
सरसा विरसा भवेत्

Both poetry and woman, it would be good if they come on their own. And if they are forced, they instead of becoming sarasa (charming) become virasa (insipid).  

కవితా వనితా చైవ
స్వయమేవాగతా వరా
బలాదాకృష్యమాణా సా
సరసా విరసా భవేత్
కవిత , వనిత ఈ  రెండు తమంతట తామే మనల్ని వరిస్తే బాగుంటుంది. అలా కాకుండా బలవoతంగా వశపరచుకోవాలనుకుoటే సరసం విరసంగా మారుతుంది     


Please share this view with at least five of you friends.






Thought of the day (28th March)

Thought of the day (28th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
दुर्लभो विषयत्याग:
दुर्लभं तत्त्वदर्शनम्
दुर्लभा सहजावस्था
सद्गुरो: करुणां विना

It is very difficult to give up sensual pleasures. It is very difficult to get the realization of Atman. It is very difficult for one to be in one’s own state.
All these are not possible without the grace of the Sadguru (Spiritual leader).

దుర్లభో విషయత్యాగ:
దుర్లభo  తత్త్వదర్శనం
దుర్లభా సహజావస్థా
.సద్గురో: కరుణాo వినా

ఇంద్రియసుఖాలను త్యజిoచడం చాల కష్టమైన పని. ఆత్మజ్ఞానం పొందడం చాల కష్టమైన పని. మానవుడు తన సహజస్థితిలో ఉoడగలగడం చాలకష్టమైన పని. ఇవి సద్గురువు అనుగ్రహం లేకుండా సాధ్యపడవు.    
                 Please share this view with at least five of your friends

Saturday, April 5, 2014

Thought of the day ( 27th March)

Thought of the day ( 27th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
नाsमुत्र सहायार्थं
पिता माता त्तिष्ठत:
पुत्रदारं ज्ञाति:
धर्मस्तिष्ठति केवल: ( Manu )

 In the other world, neither father nor mother nor children nor wife nor brothers stand there to help us. Dharma alone follows us to protect.

నాsముత్ర చ సహాయార్థం
పితా మాతా చ తిష్ఠత:
న పుత్రదారం న జ్ఞాతి:
ధర్మ: తిష్ఠతి కేవల:  ( మనుధర్మశాస్త్రం )

 మనకు పరలోకoలో సాహాయ్యం చెయ్యడానికి తల్లి గాని , తoడ్రి గాని, పుత్రులు గాని , భార్యగాని అన్నదమ్ములు గాని ఎవ్వరు రారు. మనం చేసిన ధర్మమే మన వెంట వచ్చి మనల్ని కాపాడుతుంది.

Please share this view with at least five of your friends




Friday, April 4, 2014

Thought of the day (26th March)

 Thought of the day (26th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425


एक एव खगो मानी
 वने वसति चातक:
पिपासितो वा म्रियते
 याचते वा पुरन्दरम्

Among the birds that live in forest, the chataka, the pied cuckoo, Cuculus melanoleucus (supposed to live only on the rain drops, esp. those falling in the autumn asterism Svati) alone is self -esteemed. It either prefers to die of thirst or beg Indra, the God of rain for water. A man of self respect even prefers to die rather than begging an ordinary person.

ఏక ఏవ ఖగో మానీ
వనే వసతి చాతక:
పిపాసితో వా మ్రియతే
యాచతే వా పురందరం
                                
పక్షులన్నిటిలో చాతక పక్షి ఒక్కటే ఆత్మాభిమానం కలది. అది దాహంతో చావడానికైనా సిద్ధమౌతుంది. లేదా ఇoద్రుణ్ణైనా యాచిస్తుoది. అంతే  గాని నీచమైన వ్యక్తిని ఎటువంటి పరిస్థితిలోను యాచిoచదు.



Share this view with at least five of your friends

Thought of the day (25th March)

Thought of the day (25th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425



सहायसाध्यं राजत्वं
चक्रमेकं न वर्तते
कुर्वीत सचिवान् तस्मा
त्तेषां च श्रुणुयान्मतम्  ( कौटिल्यस्य अर्थशास्त्रम् (3.7.6)

Sovereignty is possible only with assistance. Single wheel can neither stand firmly nor move further. There fore, the king (leader) shall employ assistants and listen to their advices.

సహాయసాధ్యం రాజత్వo
చక్రమేకం  న వర్తతే
కుర్వీత సచివాన్ తస్మాత్
తేషాం చ శ్రుణుయాన్మతం

ఎంతటి రాజుకైనా ఇతరుల సాహాయ్యం వల్లనే పనులు నెరవేరతాయి. ఒక్క చక్రం వేగంగా కదల లేదు. బట్టి రాజు మంత్రులను నియమిoచుకొని వారి సలహాలను వినవలసి యుoటుoది. ఒంటరిగా ఏది సాధించలేడు. 


Please share this view with at least five of your friends



Thought of the day (24th March)

Thought of the day (24th March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
मृद्घट इव सुखभेद्यो
दुस्सन्धानश्च दुर्जनो भवति
सुजनस्तु कनकघट इव
दुर्भेद्य: सुकरसन्धिश्च

The association of the wicked   is like an earthen pot. It can easily be broken and once it is broken it is very difficult to be re attached. The association of the good on the contrary is like a golden pot. It is very difficult to be broken and if at all it is broken it can easily be reattached.
  
మృద్ఘట ఇవ సుఖభేద్య:
దుస్సంధానశ్చ దుర్జనో భవతి
సుజనస్తు కనకఘట  ఇవ
దుర్భేద్య:  సుకరసంధిశ్చ

దుర్జనులతో స్నేహం మట్టికుండ లాంటిది. సులభంగా విరిగిపోతుంది. ఒకవేళ విరిగి పోతే మరల అతికించడం చాల కష్టం . ఇక మంచివారి స్నేహం బంగారు కుoడ లాoటిది అసలు విరగనే విరగదు. ఒకవేళ ఏ కారణం చేతనైన విరిగినా అతికించడం చాల తేలిక.
             
                 Please share this view with at least five of your friends 


Thursday, April 3, 2014

Thought of the day (23 rd March)

Thought of   the   day (2rd March)
                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425


असारे खलु संसारे
सारं श्वशुरमन्दिरम् |
हिमालये हर: शेते
हरि: शेते सुधाम्बुधौ ||

In the entire Samsara which is worthless, only the abode of the father-in-law - is considered to be worthy. That might be the reason for the stay of Siva in the Himalaya and Vishnu in the milky ocean.    

అసారే ఖలు సంసారే
సారం శ్వశురమందిరం
హిమాలయే హర: శేతే
హరి: శేతే సుధాంబుధౌ

ఈ సంసారమంతా నిస్సారమే . అందులో ఒక్క మామగారి ఇల్లు మాత్రమే సారవంతమైనది. అందుకే కాబోలు శివుడు   హిమాలయoలోను, విష్ణుమూర్తి పాలసముద్రంలోను శాశ్వతంగా తిష్ఠ వేశారు.