నిజంగా కాదు
ఉత్తుత్తిగానే
ఒక ఊళ్లో ఓ భార్య భర్త ఉన్నారు . వాళ్ళు నిరుపేదలు
. అవి ఇవి తినాలనే కోరికైతే ఉందిగాని కొనుక్కునే స్థోమత మాత్రం లేదు . భర్త ఒకరోజు భార్యతో ‘ఏమే ! గారెలు
తినాలని ఉంది . అవి తయారు చెయ్యడానికి మనింట్లో ఏమున్నాయి ? అనడిగాడు . గారికి
చిల్లు పెట్టడానికి నా వేలు తప్ప ఇంకేమి
మనింట్లో లేవండి అంది. నెలాగో కష్టపడి కావలసిన సరుకులు తెస్తా! నువ్వు వండుదువు
గానిలే ! అన్నాడు . ఆమె సరే లెండి చూద్దాం అంది . రోజులు గడిచిపోతున్నాయి . ఒకనాడు
ఆయనికి ఎక్కువ పని దొరికింది. దాంతో కొంత అదనంగా డబ్బు చేతిలో పడింది. గారెలకు
కావలసిన సరుకులన్నీ సమకూర్చాడు. ఆమె తయారు చేసింది. సరిగ్గా పది గారెలయ్యాయి. ఇద్దరు తిందామని చాల ఆతృతగా తలో
ఐదు ఆకులో పెట్టుకుని కూర్చున్నారు.
తినబోతూ ఉండగా తలుపు చప్పుడు వినిపించింది. ఎందుకో ఇల్లాలు తలుపు తియ్యకుండానే
చిన్న చిల్లు లోంచి చూసింది . ఆయన బాగా దగ్గరచుట్టం . తలుపు తీస్తే ఆయనకు కూడ
కొన్ని పెట్టవలసొస్తుoది. తలుపు తియ్యకపోతే బాగుండదు. మెల్లగా భర్తకు సంజ్ఞ చేసి
చెప్పింది . ఆయన ఇరుకులో పడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు . కొంచెంసేపు ఆలోచించాడు .
ఒక ఉపాయం తట్టిoది. ఆమెకేదో సైగ చేసి
చెప్పాడు . ఆమె తలూపింది. వెంటనే ఆమెను తిట్టడం మొదలెట్టాడు . ఆమె ఏడుపు
లంకించుకుంది. ఈయన తిట్టే కొద్దీ ఆమె ఏడ్పు ఎక్కువౌతోంది . ఆమె ఏడ్చే కొద్దీ ఈయన
తిట్లు ఎక్కువౌ తున్నాయి. ఈ రభసంతా గమనించి వచ్చిన అతిథి అక్కడ నుంచి వెంటనే తప్పుకున్నాడు . అతిథి వెళ్లి పోయాడని పసిగట్టిన
భర్త భార్యతో ఏమీ అనుకోకే నేను నిన్ను నిజంగా తిట్టలేదు ఉత్తుత్తిగానే తిట్టాను అన్నాడు
. నాకంతా తెలుసండి . అందుకే నేను నిజంగా ఏడవలేదు, ఉత్తుత్తి గానే ఏడ్చాను అంది.
ఇద్దరూ మరలా గారెలు ముందు పెట్టుకుని తినడానికి కూర్చున్నారు. మరో నిముషoలో అతిథి
తిరిగొచ్చి ‘నేను మాత్రం
నిజంగా వెళ్ళా ననుకుంటున్నారా. నేనూ ఉత్తుత్తిగానే అలా బయటికెళ్ళి మళ్ళా
తిరిగొచ్చా’ అన్నాడు. అంతే ఆమె చిల్లు పెట్టి చేసిన గారెల సంఖ్యకు మరో
చిల్లు పడక తప్పలేదు.
*** *** ***
No comments:
Post a Comment