ప్రశ్నోత్తర రత్నమాలికా Part-10
రచన:- శ్రీ శంకరాచార్యులు
సంక్షిప్త వివరణ :- డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం .
ఇందులో కొంతమంది శిష్యుల ప్రశ్నలకు శ్రీ శంకరభగవత్పాదుల వారి
సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి
కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే
వారు ఉత్తమ పౌరులుగా తయారౌతారు అనడంలో
ఎటువంటి సందేహం లేదు. ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ
ప్రార్థన.
122.
ప్రశ్న
:- కిం సుఖం ?
సుఖం
అంటే ఏది?
సమాధానం
:-తుష్టి:
సంతృప్తియే సుఖం .
123.
ప్రశ్న
:- కో రాజా ?
రాజు
అంటే ఎవరు ?
సమాధానం
:-రంజన కృత్
లోకాలను (ప్రజలను) సంతోషపెట్టే వాడే రాజు
(రంజయతి ఇతి రాజా)
124.
ప్రశ్న
:- కశ్చ శ్వా?
ఎవడు కుక్క వంటి వాడు ?
సమాధానం
:- నీచ సేవకో య: స్యాత్
ఎవడు నీచమైన
జనులను సేవిస్తాడో వాడు కుక్కతో సమానం .
125.
ప్రశ్న
:- కో మాయీ ?
ఎవడు (ఐంద్రజాలికుడు)
మాయకు అతీతుడు?
సమాధానం
:-పరమేశ:
పరమేశ్వరుడు
మాయకు అతీతుడు. (మాయాం తు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరమ్) భగవద్గీత
126.
ప్రశ్న
:- క: ఇంద్రజాలాయతే?
ఏది
ఇంద్రజాలం వంటిది ?
సమాధానం
:-ప్రపంచోsయం
ఈ
ప్రపంచమే ఇంద్రజాలం వంటిది .
127.
ప్రశ్న
:- క: స్వప్ననిభ: ?
ఏది
స్వప్నంతో సమానం ?
సమాధానం
:-జాగ్రద్వ్యవహార:
ఈ
ప్రపంచంలోని జాగ్రదవస్థలో జరిగే వ్యవహారం
అంతా స్వప్నంతో సమానం.
128.
ప్రశ్న
:- సత్యమపి చ కిం ?
ఏది
సత్యం ?
సమాధానం
:-బ్రహ్మ
బ్రహ్మమే
సత్యం .
129.
ప్రశ్న
:- కిం మిథ్యా ?
ఏది
మిథ్య ?
సమాధానం :-యద్విద్యానాశ్యమ్
ఏది యథార్థ
జ్ఞానం కలిగిన వెంటనే నశిస్తుందో అదే మిథ్య .
130.
ప్రశ్న
:- తుచ్చం తు?
ఏది తుచ్ఛం
(అసలే లేనిది)
సమాధానం
:-శశ విషాణాది.
కుందేటి కొమ్ము
, ఆకాశ కుసుమం, గొడ్రాలి బిడ్డ. ఇవి చెవికి వినిపించేవే గాని కంటికి కనిపించేవి కావు.
131.
ప్రశ్న
:- కా చానిర్వచనీయా ?
ఏది
అనిర్వచనీయము.
సమాధానం
:-మాయా (యా మా సా మా యా ) ఏదైతే లేదో, ఉన్నట్లుగా మాత్రమె కనిపిస్తోందో అదే మాయ . స్థూలంగా చెప్పాలంటే
Maya is an entity which does not exist and only appears to be existing.
మాయ అనిర్వచనీయము అనగా ఉండడం లేకపోవడం అనే రెంటికీ అతీతమైనది మాయ
.ఉదా:- మనం చీకటిలో నడుస్తూ ఒక త్రాడు మీద కాలు వేస్తాం . ఆ తరువాత దాన్ని చూసి పాము అనుకుంటాం . వెంటనే చెమటలు
పడతాయి . నోట్లోంచి నురగలు కూడ వస్తాయి . ఇంతలో ఎవరో లైటు వేసి ఇది పాము కాదు త్రాడే
అని తెలియజేయగానే భయం అంతా పోతుంది . దాన్ని ఇంకో సారి తొక్కేసి ముందుకు పోతాం .
ఇక్కడ అది పాముగా కన్పించడానికి ముందూ త్రాడే , లైటు వేసి చుసుకున్న తరువాత కూడ
త్రాడే మధ్యలోనే పాము . మొదటిలో లేనిది , చివరిలో లేనిదీ మధ్యలో కూడ ఉండదు. అది (పాము) మన బుర్ర లోనే ఉంది.
132.
ప్రశ్న
:- కిం కల్పితం ?
ఏది
కల్పితం ?
సమాధానం
:-ద్వైతం
ద్వైత భావన
కల్పితమైనది. ద్వైత రూపం తు యద్వస్తు తదజ్ఞానప్రకల్పితమ్. ద్వైత భావన
అజ్ఞానం వల్లనే కలుగుతోంది .
133.
ప్రశ్న
:- కిం పారమార్థికం స్యాత్ ?
ఏది
పారమార్థికమైన సత్యము ?
సమాధానం
:-అద్వైతం
ఆద్వైతమే
పారమార్థిక సత్యం.
అద్వైతం అంటే
రెండు వస్తువులు ఉన్నప్పుడు ఒక వస్తువులో మరొక వస్తువు కనిపించడం కాదు . పాము,
త్రాడు అనే రెండు వస్తువులు ఉన్నప్పుడు త్రాటిలో పాము కనిపించడం కాదు. వాస్తవానికి
అక్కడ పాము, త్రాడు అనే రెండు వస్తువులు
లేవు. త్రాడే పాముగా కనిపిస్తోంది. కాబట్టి ఒకే వస్తువు మరొక వస్తువుగా గాని అనేక
వస్తువులుగా గాని కనిపించడమే అద్వైతం
No comments:
Post a Comment