Always beware
of wicked people
డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
సమాజంలో
రకరకాల స్వభావం కలిగిన వ్యక్తులు౦టారు . కొంతమంది మంచివారు, మరి కొంతమంది నీచులు, ఇంకా
కొంతమంది నీచాతినీచులు. వీళ్ళల్లో నీచాతినీచులకు ఇతరులయొక్క మంచి గుణాలతో పనిలేదు.
వాళ్ళు ఎవరికైనా అపకారం , హాని చెయ్యడానికి వెనుకాడరు . కాబట్టి ‘మనం మంచిగానే ఉన్నాం మనకి ఇతరుల వలన ప్రమాదమేమీ
ఉండదని ఎవరు ఎన్నడు భావించకూడదు . నీచాతినీచులు ఉంటారని చెప్పుకున్నాం . వాళ్ళు ఎప్పుడు అజ్ఞానా౦ధకారంలోనే
ఉంటారు . కోపంతో మిడిసి పడుతూనే ఉంటారు . అటువంటి వారికి ఇతరుల మంచిగుణాలతో పని
లేదు . వాళ్ళకు ఇతరులు ఎంత గొప్పవాళ్లైనా వాళ్ళకు వారి గొప్పదనంతోను,
గుణగణాలతోను పనిలేదు . ఉదాహరణకి కొన్ని
సంఘటనలు మనం పరిశీలిద్దాం . వేదానికి ఆరు అంగాలుంటాయి . అవి శిక్షా , వ్యాకరణం , ఛందస్సు
, నిరుక్తం , జ్యోతిషం , కల్పం అనేవి .
వాటిలో వ్యాకరణశాస్త్రం పాణినిమహార్షి మనకందించారు. ఆయన మహామేధావి , గొప్పవ్యక్తి . అటువంటి ఆయన్ని ఒక సింహం చాల
క్రూరంగా చంపేసింది .
అలాగే
ఛందశ్శాస్త్రాన్ని రచించిన మహనీయుడు
పింగళనాగుడు. ఆయన వేలానదిలో స్నానం చేస్తుంటే ఒక మొసలి ఆయన్ని లోపలి ఈడ్చుకు పొయి,
చంపి తినేసింది. ఇక ఆస్తికదర్శనాలలో పూర్వమీమాంస అనే శాస్త్రం ఒకటుంది. అది వైదికకార్యకలాపాలను
గురించి చర్చించిన గొప్పశాస్త్రం . ఆ శాస్త్రానికి ఆదిప్రవక్త జైమిని . ఆయన్ని ఒక
ఏనుగు త్రొక్కి చంపేసింది . దీన్ని బట్టి మనం గమనించ వలసిందేమిటంటే అజ్ఞానంతో కళ్ళు
మూసుకుపోయిన వారికి , అతిగా కోపి౦చే వారికి ఇతరుల మంచి గుణాలతో పనిలేదంటాడు
పంచతంత్రకర్త విష్ణుశర్మ. ఈ సంఘటనలను బట్టి మనం గ్రహించవలసిం దేంటంటే మనం ఇతరులకు కీడు చెయ్యనివారమే అయినప్పటికీ
ఇతరులవలన మనకు కీడు జరగదు అని అను కోరాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ
కవి పేర్కొన్న సంఘటనలు జంతువులకు సంబంధించినవి
అయినప్పటికీ మనం అందులో ఉండే తాత్పర్యాన్ని గ్రహించాలి .
सिंहो व्याकरणस्य कर्तुरहरत् प्राणान् प्रियान् पाणिनेः
मीमांसाकृतमुन्ममाथ सहसा हस्ती मुनिं जैमिनिम्।
छन्दोज्ञाननिधिं जघान मकरो वेलातटे पिङ्गलम्
अज्ञानावृतचेतसामतिरुषां कोऽर्थ: परेषां गुणैः॥
मीमांसाकृतमुन्ममाथ सहसा हस्ती मुनिं जैमिनिम्।
छन्दोज्ञाननिधिं जघान मकरो वेलातटे पिङ्गलम्
अज्ञानावृतचेतसामतिरुषां कोऽर्थ: परेषां गुणैः॥
సింహో
వ్యాకరణస్య కర్తురహరత్ ప్రాణాన్ ప్రియాన్
పాణినే:
మీమాం
సా కృతమున్మమాథ సహసా హస్తీ మునిం జైమినిం
ఛందో
జ్ఞాననిధిం జఘాన మకరో వేలాతటే పింగళ౦
అజ్ఞానావృత
చేతసా మతిరుషాం కోsర్థ: పరేషాం గుణై:
>>>>>>><<<<<<<<
2 comments:
నమస్కారం శ్రీ చిలకమర్తి గారు !!
सिंहो व्याकरणस्य कर्तुरहरत् प्राणान् प्रियान् पाणिनेः
मीमांसाकृतमुन्ममाथ सहसा हस्ती मुनिं जैमिनिम्।
छन्दोज्ञाननिधिं जघान मकरो वेलातटे पिङ्गलम्
अज्ञानावृतचेतसामतिरुषां कोऽर्थ: परेषां गुणैः॥
ఈ శ్లోకములో చివరి పాదం చివర कोऽर्थस्तिरश्चां गुणैः అనే మరొక విధమైన రచన కూడా ఉందాండి!! తెలుపగలరు !! ఇది పఞ్చతంత్రం - మిత్రసంప్రాప్తిః - 35వ శ్లోకము అని తెలిసిందండి.
అయ్యా! నమస్కారం . నేను ఇదివరలో చదువుకున్నది. మీరు చెప్పిన పాఠం కూడా ఉండే అవకాశం ఉంది . నేను ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాను . నావద్ద పుస్తకం లేదు . నాకు పాఠాంతరం తెలియ జేసినందుకు ధన్యవాదాలు. దుర్గాప్రసాద్
Post a Comment