మజ్జిగపులుసు తయారు చేసుకునే విధానం
శ్రీమతి. చిలకమర్తి లక్ష్మీకుమారి M.A
ఆంధ్రులు అమితంగా ఇష్టపడే పదార్థాల్లో ‘ మజ్జిగ పులుసు’ ఒకటి . ఇది తయారు చేసే విధానం తెలుసు కుందాం .
ముందుగా కావలసిన పదార్థాలు : ఆనపకాయ, రెండు టమాటాలు, రెండు పచ్చి మిరపకాయలు & కొంచెం కొత్తిమీర.
మూడు కప్పులపెరుగు.
1.
గ్రేవీ (మిశ్రమానికి) కి కావలసినవి.
నాలుగు టీస్పూన్ల పెసరపప్పు లేదా సెనగపప్పు
రెండుteaspoons ధనియాలు
1/2
స్పూను జీలకర్ర
½ స్పూను మిరియాలు
అరచెక్క
పచ్చి కొబ్బరి ముక్కలు
చిన్నఅల్లం
ముక్క
పోపుసామానులు :
1.
స్పూను మినప్పప్పు
¼ మెంతులు, ఆవాలు , కొంచెం ఇంగువ , రెండు ఎండు మిరపకాయలు
తయారు చేయువిధానం :
ఆనపకాయకు తొక్కతీసి మీడియం సైజు ముక్కలు చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని
ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు , పసుపూ , ఒక ½ స్పూను ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి
ఉడికించాలి .ఉడికే వరకు విజిల్స్ రానివ్వాలి .
గ్రేవీకి కావలసిన పదార్థాలను నీళ్ళల్లో వేసి
కడిగి మంచినీళ్ళు పోసి ఒక అరగంట నాన
నివ్వాలి , తరువాత వాటిని మిక్సీ చేసుకోవాలి.
అల్లం ముక్క, పచ్చికొబ్బరి కూడ
వాటితో కలిపి మిక్సీ చేసుకోవాలి . ఆ మిశ్రమాన్ని మనం మజ్జిగ పులుసు తయారు చేసుకునే
మజ్జిగలో కలిపి చిటికెడు పసుపు వేసి స్టౌ మీద పెట్టుకోవాలి . ముందుగా ఉడికించిన
ఆనపకాయముక్కల్ని చల్లార బెట్టు కుని ఈ మజ్జిగలో వెయ్యాలి . టమాటాలు ,
పచ్చిమిరపకాయముక్కలు నూనెలో మగ్గించి కాగుతున్న మజ్జిగపులుసు మిశ్రమంలో వెయ్యాలి.
పులుసు చిక్కబడినతరువాత తగినంత ఉప్పు
జోడించి క్రిందకు దింపెయ్యాలి. మూకుడులో రెండు స్పూన్ల నూనె వేసి అందులో పోపు దినుసులు వేసి ,
కరివేపాకు కూడ చేర్చిదోరగా వేగిన పోపు మజ్జిగపులుసులో వెయ్యాలి . పచ్చి కొత్తిమీరను
సన్నగా తరిగి మజ్జిగపులుసు పైన చల్లాలి.
No comments:
Post a Comment