గురుపుత్రుని గురుస్తుతి
రచన :-- కీ||శే||
సుబ్రహ్మణ్య శర్మ
మా గురువర్యులు శివశ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్రభాషలలో నిరుపమానమైన పాండిత్యం
గలవారు . ఎన్నో మహాకావ్యాలు రచించిన మహాకవి . ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకులు గాను ,
ప్రిన్సిపాల్ గాను పనిచేయడంతో బాటుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం వంటి అనేక
విద్యాసంస్థలకు సెనేట్ మరియు బోర్డు ఆఫ్ స్టడీస్ మె౦బరుగా భాషాభివృద్ధికి ఎన్నో విశేష సేవలందించిన
మహామనీషి . ఉత్తరనైషధం , ఉత్తమమనుసంభవం, కాంచీ ఖండం వంటి మహాకావ్యాలే గాక ఎన్నో
ఖండకావ్యాలు వెలయించిన కవిసార్వ భౌములు.
వారి పుత్రుడు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ తమ తండ్రి గారిపై రచించిన రెండు పద్యాలు నాకు
లభించాయి . అవి మీకు అందిస్తున్నాను .
జనివిద్యాస్థితులందు( దా గురువుగా
శశ్వత్సమారాధ్యుడై
ఘనశక్తిన్ గలిగించు నీశ్వరుని నుగ్రంపశ్యశీర్ష
స్థలీ
వినివేశ ప్రవిభాసమాన హిమరుగ్వి ద్యోతిత
జ్యోత్స్నికా
కనదుద్యద్యశు గొల్తు మా జనకునిన్ గావ్యజ్ఞు
వీరేశ్వరున్
ప్రతిభావంబును మానసంబు మది జేరన్వచ్చి యా వెంట న
ద్ది తిరోభుతమగున్ వచ: పరిణతి స్తేమంబుగా
దెందునన్
మతి చిత్త్తంబులదేని దోషగుణ సామర్థ్య౦ బొ నాయందు
శ
ర్వ ! తనర్పన్వలె నీ కృపా ప్రసృతి మార్కండేయ!
విశ్వేశ్వరా!
చిలకమర్తి .
దుర్గాప్రసాదరావు
No comments:
Post a Comment