చిలకమర్తి వారి శివస్తుతి
రచన :- చిలకమర్తి వెంకట సూర్యనారాయణ
కైలాశవాస! ఈశ! శరణు గౌరి ప్రాణేశ!
కరుణించి నన్ను బ్రోవుమయ్య కాశివిశ్వేశ! ||కై ||
ఎంత వేడుకున్న గాని ఇటుల గాంచవు సంతసించి పంతముడిగి సాకగ రావు||కై||
మకరి కోరలందు చిక్కి
మరి మరి కరి మొరలిడగన్
సరగున దరిచేరి బ్రోచె
మున్ను శౌరి మురియుచున్||కై||
కాలుని పాశంబు గాంచి
కలవరపడి కావుమనుచు
నిన్ను వేగ కౌగలించు
మౌని సుతునకభయమొసగి
మరల జన్మ ముడిపియున్ చిరంజీవు గావించిన శేషభూషణ ||కై||
నీదు కనులరుధిరమరసి నిశ్చేష్టితుడై
తన నేత్రయుగము నర్పించిన దాసకన్నప్పన్ మెచ్చి మెచ్చి మోక్షమిచ్చు మేటి ముక్కంటి దేవర||కై||
కలియుగ మానవులకు కైవల్యమీయగన్ కల్పతరువై వెలసితివా కాశికాపురిన్ ||కై||
మరణమొందు వరకు నిన్ను మరువకుండగన్ వరమొక్కటే దయచేయుము హర హర శంభో||కై||
అవసానపు
ఘడియలందు నాదుకొనంగన్ అభ్యర్ధనతో ముందె అందించు మనసు అందుకో శివ||కై||
నీదు వాహనంబు నంది నిదురమునిగెన కదలవద్దటంచు గంగ కట్టివేసెన||కై||
రానియట్టి హేతువేదొ రయము తెలుపుమ చేతనూతనొసగి
ఇష్టసిద్ధినీయుమ||కై||
చిత్తమందు నిలిపి సదా సేవ చేయునీ చిలకమర్తి సూరద్విజుని చేర్చుకోదరిన్||కై||
No comments:
Post a Comment