Tuesday, February 10, 2015

వ్రాత ఒక కళ

వ్రాత ఒక కళ
వ్రాత ఒక కళ. చక్కగా అందరికి అర్థమయ్యేలా వ్రాయగలగడం ఒక అదృష్టం.  అది కొంతమందికే సాధ్యం . కొoతమంది వ్రాత వాళ్ళతో బాగా పరిచయం ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమౌతుంది. మిగిలిన వాళ్లకు చచ్చినా అర్థంకాదు.  
ఒక డాక్టరు చాల కష్టపడి మొదటిసారిగా  పుట్టింటికి వెళ్ళిన వాళ్ళ ఆవిడికి ప్రేమలేఖ వ్రాశాడట. అది అర్థం కాక చదివిoచుకోడానికి ఆమె వెంటనే మెడికల్ షాపు దగ్గరికి పరుగెత్తిందట.
ఒక ఊరిలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు . వాళ్ళకు పెళ్లిళ్ళు అయి అత్తవారిoటికి వెళ్లి పోయారు. కొన్నేళ్ళ తరువాత మళ్ళా ఒకసారి కలుసుకున్నారు .
ఒకావిడ మిగిలినవాళ్ళతో “మా ఆయన ఏదైనా  వ్రాస్తే ఎవ్వరికి అర్థం కాదే” అంది . రెండో ఆవిడ “మీ ఆయన కొoత నయం . కనీసం ఆయన వ్రాత ఆయనకైన అర్థం అవుతుంది. మా ఆయన వ్రాస్తే ఆయనకే అర్థం కాదు” అంది . ఇక  మూడో  ఆవిడ  “ మీ వాళ్ళిద్దరూ కొంత నయమేనే మా ఆయన వ్రాత ఆయన్ని పుట్టించిన బ్రహ్మకు కూడ అర్థం కాదు” అంది.
ఒక డాక్టర్ రోగికి నాలుగు మందులు వ్రాశాడు . వెంటనే కొని తెమ్మన్నాడు. ఎన్ని షాపులు తిరిగినా మూడు మందులే దొరికాయి . నాల్గోది దొరకలేదు. అందరు తమదగ్గర లేదంటున్నారు.  తిరిగి తిరిగి విసిగి వేసారి రోగి చివరికి  డాక్టర్ దగ్గరకొచ్చి అయ్యా! మూడు మందులే దోరికాయి ఎంత ప్రయత్నిoచినా నాల్గోది దొరకలేదు అన్నాడు. అది మందు కాదయ్యా నా సంతకం అన్నాడు డాక్టర్ తాపీగా.
ఇక వ్రాత గురించి ఒక చక్కని సంస్కృత పద్యం ఉంది. అదేమిటంటే –
వాచయతి నాన్య లిఖితం
లిఖితమనేనాపి వాచయతి నాన్య:
ఆయమపరోsస్య విశేష:
స్వయమపి లిఖితం స్వయం న వాచయతి 

ఒకడున్నాడు  ఇతరులు  వ్రాసింది తాను చదవలేడు. ఇక తాను వ్రాసింది ఇతరులెవరు చదవలేరు. ఇ౦కొక విశేషమేంటంటే తాను స్వయంగా  వ్రాసింది తానే చదవలేడు.      ***

Monday, February 9, 2015

Let poets be glorious and victorious

Let poets be glorious and victorious                                              

Dr. Durgaprasada Rao Chilakamarthi

Once, some friends of a poet,   gave a couple of  Telugu words of which every word means an edible item (used in meals) and asked him to compose a Sanskrit sloka in praise of Lord Krishna by using those words. Here there are two difficulties. One is all the words are of Telugu Language and the other is that they are all edible items. One can some how compose a poem in Telugu out of these words, but composing Sanskrit Verse using Telugu words is very difficult. More over, the poem should be in praise of Lord Krishna which is also another point of difficulty. But poets are above all these things. Nothing is impossible to them.   They can create any kind of poem by using any kind of words according to the will and wish of the literary people.

Here, the words given are ‘kuragaaya కూరగాయ ( vegitable)‘  paalu పాలు ( milk) ‘ neyyi’ నెయ్యి ( ghee)  ambali అంబలి ( boiled rice in the form of liquid) , and ‘chintakaaya’ చింతకాయ ( Tamarind nut) . The poet with out any difficulty composed a verse in the following way.
       
కూరగాయ కృతం త్రాసం
పాలనేsతి గవాం ప్రియం
అంబలిద్వేషిణం వందే
చింతకాయ శివప్రదం

కుత్సిత: ఉరగ: కూరగ: ( తస్మై) కూరగాయ= దుష్ట పర్పమునకు ( కాళియునకు)
కృతం త్రాసం = భయమును కలుగజేసినవాడు
గవాం పాలనే = గోవులను పాలిoచుటయందు
అతిప్రియం =  చాల ఇష్టము కలవాడు
చింతాం కరోతి ఇతి చింతక: ( తస్మై) చింతకాయ =ధ్యానము చేసిన వానికి
శివ ప్రదం = మంగళములను చేకూర్చునట్టి
బలిద్వేషిణo= బలిచక్రవర్తికి శత్రువైన
అం =విష్ణువును ( అక్షరాణాo- అకారోsస్మి)
వందే = నమస్కరించుచున్నాను.   

కాళియునకు భయం కలుగజేసిన వాడు ; గోవులను పోషిoచుటయందు ఆసక్తి కలవాడు , ధ్యానిoచినవారికి శుభములు చేకూర్చువాడు, బలిచక్రవర్తికి శత్రువు అయిన విష్ణువునకు నమస్కారము

कूरगाय कृतं त्रासं
पालनेति गवां प्रियं
अंबलिद्वेषिणं वन्दे
चिन्तकाय शिवप्रदं

कूरगाय कृतं त्रासं = कुत्सित: उरग: कूरग: ( तस्मै ) कूरगाय = one who has frightened the bad serpent कालिय   
पालनेsति गवां प्रियं = गवां पालने  अति प्रियं = one who is fond of raring cattle
चिन्तकाय ( चिन्तां करोति इति चिन्तक : (तस्मै) चिन्तकाय = to those who always meditates him
शिवप्रदं = giver of prosperity
बलिद्वेषिणम् = the enemy of the king Bali
अं = to Lord Krishna  ( Of letters I am the letter अ, The Bhagavadgita,  X-33 sloka )
वन्दे = I salute.

I salute Lord Krishna, who frightened the bad serpent Kaliya; who is fond of raring cattle; who gives prosperity to Bhaktas , those who meditate him always and who is a foe of the king Bali.  


                                                                     *****

Sunday, February 8, 2015

అందఱూ గొప్పవారే

అందఱూ గొప్పవారే
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఒక వ్యక్తి ఏదో పనిమీద పొరుగు దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో తనకెవ్వరు తెలియక పోవడం చేత వసతి కోసం కొంత సమాచారాన్ని సేకరించవలసిన అవసరం ఏర్పడింది. అంతలోనే  ఒక బ్రాహ్మణుడు దారిలో ఎదురయ్యాడు.  వారిద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా సాగింది.
బాటసారి: ఓ బ్రాహ్మణుడా! ఈ నగరంలో   ఎవరైనా ఉన్నతులున్నారా?
బ్రాహ్మణుడు: ఎందుకులేరండి! తాడిచెట్ల సమూహం ఉంది. అవి చాల ఎత్తుగా ఉంటాయి.
 బాటసారి:    దాత ఎవరైనా ఉన్నారా?
బ్రాహ్మణుడు: ఎందుకు లేరండి . చాకలి ఉన్నాడు . ప్రొద్దుటే గుడ్డలన్నీ తీసుకెళ్ళి ఉతికి  రాత్రికల్లా తెచ్చి ఇచ్చేస్తాడు. ఆయనొక్కడే మహాదాత .
బాటసారి: పోనీ ఈ ఊళ్లో పండితులేవరైనా ఉన్నారా?
బ్రాహ్మణుడు: ఎందుకు లేరండి . పరుల భార్యలను, ధనాన్ని కాజేయడంలో అందరు పండితులేనండి.
బాటసారి : ఓ మిత్రుడా ! ఈ ఊళ్లో ఎలా బ్రతుకుతున్నావయ్యా ?
బ్రాహ్మణుడు : నేనా ! విషక్రిమిన్యాయంగా బ్రతుకుతున్నాను స్వామీ! విషంలో పుట్టిన క్రిమిని ఆ విషం ఏమీ చెయ్యలేదు . బురదలో పుట్టిన కప్పని ఆ బురదేమీ చెయ్యలేదు. నేను విషంలో క్రిమిగా  బ్రతికేస్తున్నా .

 విప్రాస్మిన్నగరే మహాన్  కథయ క: ? తాళద్రుమాణాo గణ:
 కో దాతా? రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి
కో విద్వాన్ ? పరదారవిత్తహరణే సర్వేsపి విద్వత్తమా:
కస్మాజ్జీవసి హే సఖే ! విషక్రిమి న్యాయేన జీవామ్యహం    

                                                ******

Monday, February 2, 2015

A joke in Sanskrit

                           A joke in Sanskrit

एकदा कश्चन बालक: दन्तवैद्यस्य (dentist) समीपं गतवान् | वौद्यमहोदय ! मम मुखस्थ: एक: दन्त: मां तीव्रं बाधते (aching) | अहं बाधां सोढुं न शक्नोमि | अत: तं निष्कासयितुम् इच्छामि | तदर्थं कियद्धनं स्वीकरोति भवान् ?
वैद्य: :  केवलं द्विशतं (Rs 200) रुप्यकाणि |

बालक: : तावद्वा ! किन्तु मम समीपे तावत् धनं नास्ति केवलं 
पञ्चाशद् (Rs.50) रुप्यकाण्येव सन्ति |  अत: भवान्  मम दन्तं किञ्चित् शिथिली( (loose) करोतु | तदनन्तरम् अहं यथावकाशम् उन्मूलयितुं प्रयत्नं करिष्यामि |   

Monday, January 19, 2015

Indian Riddles-3

Indian Riddles-3

3.    जाता शुद्धकुले जघान पितरं हत्वापि शुद्धा पुन:
          स्त्री चैषा वनिता पितैव सततं विश्वस्य या जीवनम्
          सङ्गं प्राप्य पितामहेन जनकं प्रासूत  या कन्यका
          सा सर्वैरपि वन्दिता क्षितितले सा नाम का नायिका ?

She was born in a holy family. She killed her father, and still remained pious. She is a woman and is honored by the entire world like her father as she is the source of the existence of the world.  She married her grand father and begot her father. Despite all these demerits, she is respected by all.   Who is she?

Answer: Rain water / varshadharaa ( the word Varshadhara is feminine in gender).
It is born out of pure water. It kills her father which is a cloud. After raining, the cloud disappears. Even though she is a patricide, she is honored by every body. She is a woman and she is always honored like her father. She merges in to water (sea) and gives birth to her father (cloud).

జాతా శుద్ధకులే జఘాన పితరం  హత్వాపి శుద్ధా పున:
స్త్రీ చైషా వనితా  పితేవ సతతం విశ్వస్య సా జీవనం   
సంగం ప్రాప్య పితామహేన జనకం ప్రాసూత  యా కన్యకా
సా సర్వైరపి వందితా క్షితితలే సా నామ కా నాయికా ? 

పవిత్రమైన వంశంలో పుట్టింది . పుట్టిన వెంటనే తండ్రి చావుకు కారకురాలైoది. అయినా ఆమెను పవిత్రంగానే భావిస్తారు. తండ్రివలె ఆమె కూడా లోకం చేత  గౌరవింపబడుతూ ఉంటుంది. ఆమె తాతతో కలిసి తండ్రి పుట్టుకకు కారకురాలౌ తోంది . అయినా ఆమెను అందరు పవిత్రురాలు గానే భావించి గౌరవిస్తూనే ఉంటారు. ఆమె ఎవరు?
జవాబు : వాననీరు.
పవిత్రమైన మేఘం ద్వారా పుడుతుంది . పుట్టగానే మేఘాన్ని పొట్టన పెట్టుకుంటుంది ( చంపుతుంది). తాత యైన సముద్రంలో కలసి మరల తండ్రి (మేఘం ) పుట్టుకకు  కారకురాలౌతుoది. 










     

Saturday, January 17, 2015

Indian Riddles—2

Indian Riddles—2

1. वृक्षाग्रवासी न च पक्षिराज:
   त्रिनेत्रधारी न च शूलपाणि:
   त्वग्वस्त्रधारी न च सिद्धयोगी
   जलं च बिभ्रन्न घटो न मेघ:

It lives at the top of the tree, but it is not a bird. It has three eyes but it is not Siva. It always wears bark but it is not a saint. It bears water but it is neither a pot nor a cloud. What is it?
Answer: Coconut

వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజ:
త్రినేత్రధారీ న చ శూలపాణి:                    
త్వగ్వస్త్రధారీ న చ సిద్ధయోగీ
జలం చ బిభ్రన్న ఘటో న మేఘ:

చెట్టు పైన   ఉంటుంది గాని  పక్షి కాదు. మూడు కళ్ళుoటాయి గాని  శివుడు కాదు. చర్మం ( బెరడు) ధరిస్తుంది గాని యోగి కాదు . పొట్టనిండ నీళ్లుంటాయి గాని  కుండ కాదు , మేఘం కూడా కాదు .
జవాబు : కొబ్బరికాయ               

*******

Friday, January 16, 2015

Indian Riddles

Indian Riddles—1


कृष्णमुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी
पञ्चभर्त्री न  पाञ्चाली यो जानाति स पण्डित:

It is black faced, but it is not a cat. It is double tongued, but not a serpent. It has five husbands, but it is not Draupadi (the wife of five pandavas)..A person who knows what it is can be considered as scholar

Answer:- pen.

కృష్ణముఖీ న మార్జారీ ద్విజిహ్వా న చ సర్పిణీ
పంచభర్త్రీ  న పాంచాలీ యో జానాతి స పండిత:

ముఖం నల్లగా ఉంటుంది . కాని అది పిల్లి కాదు. రెండు నాలుకలుంటాయి. కాని అది పాము కాదు. ఐదుగురు భర్తలుoటారు. కాని అది ద్రౌపది  కాదు. అదేమిటో తెలిసిన వాడు పండితుడు
జవాబు : కలం
                                 Indian Riddles-2
अपदो दूरगामी च साक्षरो न च पण्डित:
अमुख: स्फुटवक्ता च यो जानाति स पण्डित:

It has no feet but it can go far of places. It is lettered but it is not a pundit.
It has no mouth but it speaks a lot. A man who knows of it is a pundit
(Scholar) .

Answer: letter.

అపదో దూరగామీ చ సాక్షరో న చ పందిత:
ఆముఖ: స్ఫుటవక్తా చ యో జానాతి స పండిత:

కాళ్ళు లేవుగాని ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. పొట్టనిండ అక్షరాలే గాని పండితుడు కాదు. నోరు లేదు గాని స్పష్టంగా మాట్లాడుతుంది . అదేమిటో తెలిసిన వాడు పండితుడు
జవాబు: ఉత్తరం   
>>><<<