అందఱూ గొప్పవారే
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
ఒక వ్యక్తి ఏదో పనిమీద పొరుగు దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో తనకెవ్వరు
తెలియక పోవడం చేత వసతి కోసం కొంత సమాచారాన్ని సేకరించవలసిన అవసరం ఏర్పడింది.
అంతలోనే ఒక బ్రాహ్మణుడు దారిలో
ఎదురయ్యాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఈ
విధంగా సాగింది.
బాటసారి: ఓ బ్రాహ్మణుడా! ఈ నగరంలో
ఎవరైనా ఉన్నతులున్నారా?
బ్రాహ్మణుడు: ఎందుకులేరండి! తాడిచెట్ల సమూహం ఉంది. అవి చాల ఎత్తుగా ఉంటాయి.
బాటసారి: దాత ఎవరైనా ఉన్నారా?
బ్రాహ్మణుడు: ఎందుకు లేరండి . చాకలి ఉన్నాడు . ప్రొద్దుటే గుడ్డలన్నీ తీసుకెళ్ళి
ఉతికి రాత్రికల్లా తెచ్చి ఇచ్చేస్తాడు.
ఆయనొక్కడే మహాదాత .
బాటసారి: పోనీ ఈ ఊళ్లో పండితులేవరైనా ఉన్నారా?
బ్రాహ్మణుడు: ఎందుకు లేరండి . పరుల భార్యలను, ధనాన్ని కాజేయడంలో అందరు
పండితులేనండి.
బాటసారి : ఓ మిత్రుడా ! ఈ ఊళ్లో ఎలా బ్రతుకుతున్నావయ్యా ?
బ్రాహ్మణుడు : నేనా ! విషక్రిమిన్యాయంగా బ్రతుకుతున్నాను స్వామీ! విషంలో
పుట్టిన క్రిమిని ఆ విషం ఏమీ చెయ్యలేదు . బురదలో పుట్టిన కప్పని ఆ బురదేమీ
చెయ్యలేదు. నేను విషంలో క్రిమిగా
బ్రతికేస్తున్నా .
విప్రాస్మిన్నగరే మహాన్
కథయ క: ? తాళద్రుమాణాo గణ:
కో దాతా? రజకో
దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి
కో విద్వాన్ ? పరదారవిత్తహరణే సర్వేsపి విద్వత్తమా:
కస్మాజ్జీవసి హే సఖే ! విషక్రిమి న్యాయేన జీవామ్యహం
******
No comments:
Post a Comment