ఎంత విడ్డూరం
(A good joke on a sad event)
Dr. Durgaprasada Rao
Chilakamarthi
ఒక వేశ్య యొక్క తండ్రి అప్పుడే మరణించాడు. ఆమె పిత! పిత! అని పిలవ కుండా తాత!
తాత! అని పిలుస్తూ చాల హృదయవిదారకంగా ఏడుస్తోoదట. ఆమె పిత! అనకుండా తాత! అని
ఎందుకంటోoదో ఎవరికీ అర్థం కాలేదు. ఆతరువాత బాగా ఆలోచిస్తే అందరికి తెలిసిందట .
అదేoటంటే ఆమె అంతకు ముందే తాంబూలం వేసుకుంది. పెదవులు చాల ఎర్రగా పండాయి . ఒకవేళ
పితా! పితా! అని పిలిస్తే పెదవులకoటిన రంగు చెరిగిపోతుoదేమోనని తాత! తాత! అని పిలుస్తూ
ఏడుస్తోందట.
ఉపభుక్త ఖదిరవీటక
జనితాధర రాగ భంగ భయాత్
పితరి మృతేsపి హి వేశ్యా
రోదితి హా తాత తాతేతి
అప్పుడే వేసుకున్న మంచి వక్కలతో కూడిన తాంబూలం వల్ల పెదవులు ఎర్రబడగా పిత!
పిత! అని పిలిస్తే తన పెదవులకoటిన రంగు ఎక్కడ చెరిగి పోతుందో అన్న భయంతో ఒక వేశ్య మరణించిన
తండ్రిని తాత! తాత! అనే సంబోధిస్తూ ఏడుస్తోoదట.
उपभुक्तखदिरवीटक
जनिताधररागभङ्गभयात् |
पितरि मृतेऽपि हि वेश्या
रोदिति हा तात तातेति ||
The father of an unchaste
woman passed away. She was miserably
grieving over the event. Normally, she used to call her father as Pita. But,
now instead of using the word pita, she used the word tata. Of course both are of the same meaning. The
reason for addressing him as tata avoiding the word pita was not immediately
known. But after some time the secret was unearthed. If she calls her father as
pita the reddish tinge of her lips on chewing betel leaf, lime and nut would be
erased by their mutual touch. To avoid that, she called her father as tata
avoiding the word pita.
No comments:
Post a Comment