Monday, September 16, 2024

శ్రీ నేమాని కోదండ రామారావు గారి కిరాతార్జునీయ- అనువాదం – ఒక సమీక్ష

 శ్రీ నేమాని కోదండ రామారావు గారి కిరాతార్జునీయ- అనువాదం

ఒక సమీక్ష

 

  డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

ఒకనాడు శ్రీ నేమాని సోమయాజులుగారు అమెరికా నుంచి నాకు ఫోను చేసి మా నాన్నగారు కిరాతార్జునీయకావ్యాన్ని తెనిగించారు, దానికి మీరు సమీక్ష వ్రాయాలని అడిగినప్పుడు నాకు కలిగిన  ఆనందాశ్చర్యాలకవధులు లేవు. ఆనందానికి కారణం, వారి తండ్రి గారితో నాకు చాల సంవత్సరాలుగా పరిచయమున్నా వారు గణిత అధ్యాపకులు, గొప్ప పండితులు, సాహితీవేత్తలు గానే నాకు తెలుసు గానీ కవిగా తెలియదు. వారు కూడ  నాకెప్పుడు చెప్పలేదు . అందుకని అది తెలుసుకోగానే ఆనందం కలిగింది . ఇక ఆశ్చర్యం ఎందుకంటే కిరాతార్జునీయాన్ని తెనిగించినందుకు. అదొక ప్రౌఢకావ్యం . రచన నారికేళపాకం. ఒక పట్టాన అర్థం కాదు.

ఇక కిరాతార్జునీయం పదునెనిమిది సర్గలతో కూడిన మహాప్రబంధం . ప్రతిసర్గలోని చివరి శ్లోకంలోను లక్ష్మీఅనే పదం ఉండడం చేత దీనికి లక్ష్మీపదలాంఛనం అనే మరొక పేరుంది.

కావ్యం ఇతివృత్తం అనుసరించి మూడు రకాలుగా ఉంటుంది. కేవల కల్పిత కథ ఒకరకం. అది  కృత్రిమ రత్నం. రామాయణ, మహాభారతాల్లో ఉన్న కథ అప్పటికప్పుడు గనుల నుండి తీసిన రత్నం  వంటిది.  ఇక రామాయణ, మహాభారత కథలకు కవి తన ప్రతిభను జోడించి రచించే కావ్యాలు సానపెట్టిన జాతిరత్నాల వంటివి. కిరాతార్జునీయం అటువంటి సానలదీరిన జాతిరత్నం. భారవి  భారతంలో ఉన్న చిన్నఘట్టాన్ని ఆధారంగా తీసుకుని తన ప్రతిభతో వర్ణనలు జోడించి ఈ కావ్యం రచించాడు.

జూదంలో ఓడిపోయి   అరణ్యవాసం చేస్తున్న పాండవులకు వ్యాసమహర్షి రాబోయే యుద్ధానికి కావలసిన అస్త్రశస్త్రాలను సమకూర్చుకోమని చెపుతాడు . అర్జునుడు  పాశుపతాస్త్రం పొందడానికి హిమాలయాలకు వెళ్లి  శివుని గురించి తపస్సు చెయ్యడం, అతని భక్తిని పరీక్షించడానికి శివుడు కిరాతరూపంలో అక్కడకు చేరుకోవడం, ఒక్క వరాహం విషయంలో  వారి ఇద్దరి మధ్య వివాదం చెలరేగడం, అది యుద్ధంగా పరిణమించడం, శివుడు అర్జునుని పరాక్రమానికి మెచ్చి అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించడంతో కథ ముగుస్తుంది. భారవి ఈ చిన్న కథకు వర్ణనలను జోడించి 18సర్గల మహాకావ్యంగా రూపొందించాడు.

1.                 మొదటి సర్గలో 46 శ్లోకాలు , వ్యాసాగమనమనే రెండవ సర్గలో 59 శ్లోకాలు, మూడవ సర్గలో 60 శ్లోకాలు, శరద్వర్ణనమనే నాల్గవ సర్గలో 38 శ్లోకాలు, హిమవద్వర్ణనమనే ఐదవ సర్గలో   52 శ్లోకాలు, యువతీప్రస్థానమనే ఆరవ సర్గలో -47 శ్లోకాలు, ఏడవ సర్గలో 40 శ్లోకాలు, సురాంగనావిరహమనే ఎనిమిదో సర్గలో 57శ్లోకాలు, సురసుందరీ సంభోగ వర్ణనమనే తొమ్మిదో సర్గలో  78 శ్లోకాలు, అర్జున విలోభన ప్రత్యాఖ్యానమనే పదో సర్గలో  63 శ్లోకాలు , ఇంద్ర సమాగమమనే పదకొండవ సర్గలో 81శ్లోకాలు, ఈశ్వరాభిగమనమనే పన్నెండవ  సర్గలో 54శ్లోకాలు, దూతవాక్యమనే పదమూడవ సర్గలో  71 శ్లోకాలు , పదునాల్గవ సర్గలో 65 శ్లోకాలు , అర్జునాభిగమనమనే పదునైదవ సర్గలో 53 శ్లోకాలు , యుద్ధవర్ణనమనే పదహారవ సర్గలో 64శ్లోకాలు, కిరాతార్జునయుద్ధమనే పదునేడవ సర్గలో  64 శ్లోకాలు, చివరిదైన ధనంజయాస్త్రలాభమనే పదునెనిమిదవ సర్గలో 48 శ్లోకాలు ఉన్నాయి చొప్పున మొత్తం 1051శ్లోకాలున్నాయి.

ఇక కవి గారు అవసరాన్ని బట్టి ఒక్కొక్క శ్లోకానికి రెండేసి, మూడేసి  తేటగీతులు, కందపద్యాలు, వృత్తాలు,  అలాగే ఐదు, ఆఱు పాదాల వృత్తాలను, కూడ  ఉపయోగించారు. వ్రాసినవి ఎన్ని పద్యాలైన వాటిని ఒకే పద్యంగా  పరిగణించారు. మొత్తం మీద మూలంలో ఉన్న శ్లోకాల కన్న అనువాద పద్యాల సంఖ్య చాల ఎక్కువ .

                      ఇక సాహిత్య క్షేత్రంలో అనువాద ప్రక్రియ  చాల కష్టమైన పని . ఎందుకంటే మనం స్వేచ్ఛగా ఎంత దూరమైనా సునాయాసంగా నడచిపోగలం. కాని మన ముందు ఒకరు నడిచి వెళ్ళిన  అడుగుల్లో  క్రమం తప్పకుండా అడుగులు వేసుకుంటూ నడవమంటే నడవడం చాల కష్టమైన పని.

అలాగే ఏ కవైనా స్వతంత్రంగా ఒక కావ్యం వ్రాయాలనుకుంటే  సులభంగా వ్రాయగలడు. భావ ప్రకటనకు  అతనికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. కాని ఇతరులు వ్రాసిన కావ్యాన్ని అనువదించడం చాల కష్టం. అనువాదంలో కర్తకు ఎటువంటి స్వాతంత్ర్యం ఉండదు. మూలంలోని భావం  ఏమాత్రం అనువాదంలో రాకపోయినా, స్పష్టత లేక పోయినా, విమర్శకులు సతాయిస్తారు . కాబట్టి అనువాదం ఒక కత్తి మీద సాము వంటిది. అందులోనూ  సంస్కృత కావ్యాన్ని తెనుగులోనికి అనువదించడం సాహసంతో కూడిన పని. తెనుగు పద్యంలో యతి, ప్రాసల బెడద ఉంటుంది. అనివార్యంగా కొన్ని పదాలు వాడవలసిన అగత్యం ఏర్పడుతుంది.  నైషధాన్ని అనువదించిన శ్రీనాథ మహాకవికే విమర్శలు తప్ప లేదు.  ఇక భారవి కూడ హర్షునితో ఇంచుమించు సమానుడే. అతని  కావ్యాన్ని అనువదించడం  సులభం కాదు. ఇక కవిత్రయం అనువదించిన భారతం సంగతి వేరు. రాజరాజనరేంద్రుడు నన్నయ్య గారిని భారతం అనువదించమని అడగలేదు . భారతబద్ధనిరూపితార్థము తెనుగునరచియింపుమధిధీయుక్తి మెయిన్  అని సారాంశం మాత్రమే వ్రాయమని కోరడం జరిగింది.         ఇక నైషధ కావ్యాన్ని శ్రీనాథ మహాకవి అనువదించి మెప్పిస్తే  వీరు భారవి  కిరాతార్జునీయాన్ని అనువదించి మూల కర్త ఉద్దేశ్యాన్ని నిర్దిష్టంగా, నిర్దుష్టంగా తెలుగులోకి రప్పించి, మెప్పించి కృతకృత్యులయ్యారు. మూలగ్రంథం  చదువుతోoటే ఎటువంటి అనుభూతి కలుగుతుందో, అనువాదంలో  కూడ అటువంటి రసానుభూతినే అందించ గలగడం ఒక విశేషం . కొన్ని అనువాద విశేషాలను పరిశీలిద్దాం . నాకు తెలిసినంత వరకు కిరాతార్జునీయాన్ని తెలుగుపద్యాల్లో పూర్తిగా  అనువదించినవారు లేరు. వీరే ప్రథములు .

                   ఇక ప్రతికవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.

ఉపమా కాళిదాసస్య, భారవే రర్థగౌరవమ్ |

దండినః పదలాలిత్యం, మాఘే సన్తి త్రయోగుణాః ||

అని పెద్దల మాట. దీన్ని బట్టి భారవి కవిత అర్థగౌరవానికి ప్రసిద్ధి .

అర్థగౌరవం అంటే   అల్పమైన అక్షరాల్లో అనల్పమైన అర్థాన్ని ఇమడ్చడం.

అతివీర్యవతీవ భేషజే, బహురల్పీయసి దృశ్యతే గుణః అని కవి స్వయంగా చెప్పుకున్నాడు.

అల్ప వచనాలలోన ననల్పమైన

అర్థబాహుళ్య మొప్పె “ (2-27) ఇది అనువాదం .

 

ఔషధపు గుళిక చాల చిన్నది గానే ఉంటుంది , కాని దాని శక్తి చాల ఎక్కువ. హోమియోపతి మాత్ర కండచీమ తలకాయ కన్న చిన్నదిగా ఉన్నా కొండంత రోగాన్ని పోగొట్టగల గుణం దానిలో ఉంది. అలాగే భారవి పలుగులు చిన్నవిగా ఉన్నా ఎంతో గంభీరమైన భావాన్ని కలిగి ఉంటాయి.

 

ఇక రచయిత  ఈ కావ్యానువాదానికి పూనుకోవడమే సాహసాల్లో కెల్ల  గొప్ప సాహసం. కొన్ని అనువాదాలు పరిశీలిద్దాం . స్థాలీపులాకన్యాయంగా భారవి కావ్యం లోని ఒక ముఖ్యమైన శ్లోకం చూద్దాం.  

సహసా విదధీత న క్రియా

మవివేకః పరమాపదాం పదమ్ |
   
వృణతే హి విమృశ్యకారిణం

గుణలుబ్ధాః స్వయమేవ సమ్పదః ॥ ౨.30

అనే శ్లోకభావాన్ని

విను మాలోచనలేక కార్యముల నావేశమ్ముతోఁ జేయుచో

ఘనమౌ నష్టము దుఃఖమున్‌ గలుఁగు లోకంబందు యోచించు కార్యనిరూఢాత్ముఁడు సౌఖ్యమొందు నని చాల సరసంగా అనువాదం చెయ్యడం వీరి ప్రతిభకు నిదర్శనం .

 

భారవి వర్ణనలు చాల గొప్పవి.    హిమాలయపర్వత వర్ణనలో యమకం, , ముక్తపదగ్రస్తం లాంటి శబ్దాలంకారాలు విరివిగా ప్రయోగించాడు .

అనువాదంలో కవి మూలంలోని భావాన్ని చాల సరసంగా, స్పష్టంగా చెప్పడం కోసం శబ్దాలంకారాల జోలికి పోకుండా భావాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు  (5-8) ఇది ఆయన రసజ్ఞాతకు ఒక నిదర్శనం .

పృథుకదమ్బ-కదమ్బకరాజితం

గ్రథితమాల-తమాలవనాకులమ్ |

లఘుతుషారతుషారజలచ్యుతం

ధృతసదాన-సదాననదన్తినమ్ (5-9)

అలాగే సకలహంసగణం, శుచిమానసం , సకలహం, సగణం, శుచిమానసం (5-13)

దివ్యస్త్రీణాం {5-23} , సనాకవనితం నితంబరుచిరం (5-27) వంటి ముక్తపదగ్రస్తాలు ఎన్నో ఉన్నాయి. వీరు రసహీనమైన శబ్దాలంకారాల కోసం ప్రాకులాడకుండా భావసౌందర్యానికే  చోటివ్వడం ముదావహం .

 

ఇక కాళిదాసు దీపశిఖను , భారవి గొడుగును , మాఘుడు గంటను చాల బాగా వర్ణించారని ప్రతీతి . అందుకే ఈయనను చత్రభారవి అని పిలుస్తారు.

ఉత్ఫుల్లస్థలనలినీ-వనాదముష్మా

దుద్ధూతః సరసిజసమ్భవః పరాగః |

వాత్యాభిర్వియతి వివర్తితః సమన్తా

దాధత్తే కనకమయాతపత్రలక్ష్మీమ్ || 5-39 ||

శ్లోకానికి అందమైన చిన్న కందపద్యం రచించారు. ఇది ఈ కవిగారి అర్థగౌరవానికి కూడ ఒక ఉదాహరణ.

కన సుడిగాలికి వెసనెగి

రిన కమలరజంబు పెద్దవృత్తమురీతిన్

జని గగనమండలమ్మునఁ

గనకమయంబైన గొడుగు కరణిన్ దోచెన్ || కందము || 5-39

 

భారవి అర్ధాంతరన్యాసాలంకాన్ని ప్రయోగించడంలో నిపుణుడు.

రాత్రిరాగమలినాని వికాసం

పఙ్కజాని రహయన్తి విహాయ |

స్పష్టతారకమియాయ నభః శ్రీ

ర్వస్తుమిచ్ఛతి నిరాపది సర్వః ॥ 9-16 ||

అనువాదం చూడండి.

పద్మములు వికాసంబు కోల్పడియె కాంతి

వాని విడి తారకావళి పైనఁబడియె

సహజమిదిలోకమందున సర్వజనులు

నాపదలు లేనిచోటకే యరిగెదరుగ || తేటగీతి ||

 

జీవహింస చేసి ధనం సంపాదించే వాడు సకలపాపాలకు నిలయుడు అనే భావాన్ని ఎంత చక్కగా వివరించారో చూడండి .

అభిద్రోహేణ భూతానా

మార్జయన్ గత్వరీః శ్రియః |

ఉదన్వానివ సిన్ధూనా

మాపదామేతి పాత్రతామ్ ॥ 11-21  

ఈ శ్లోకానికి

జీవహింసను జేయుచుఁ చెలఁగి చంచ

లమగు సిరుల నార్జించు నథముడు బరగ

నన్ని నదులకు సాగరమాశ్రయముగ

నైనగతి నన్నిపాపాల కాశ్రయమగు || తేటగీతి ||

 

అలాగే హితం మనోహారి చ దుర్లభం వచ:

అనే భారవి మాటల్లో గల సారాంశాన్ని క్రన్నన విడి యప్రియంబని మనమ్మున  దాచగ రాదు వార్తలన్ అని మనోహరంగా తెనిగించారు .

అలాగే అనార్యసంగమాద్వరం విరోధోsపి సమం మహాత్మభి:   అనే వాక్యాన్ని అలాగే శమీతరుం శుష్కమివాగ్ని రుచ్ఛిఖ:  అనే

వాక్యాన్ని మేదినిని శుష్క మార్ద్ర శమీ తరువును  నగ్ని దహియించు విధమున (1-౩౨) అలాగే

 

పరాభవోsప్యుత్సవ ఏవ మానినామ్ (2-41)

న మహానిచ్ఛతి భూతి మన్యత:

అనే శ్లోకాల భావాన్ని రాబట్టడానికి రెండు చంపకమాలల్ని వ్రాయడం బట్టి ఆయన ములకర్త భావాన్ని రాబట్టడంలో ఎక్కడ రాజీ పడలేదని తెలుస్తోంది (2-18)

 

న తితిక్షా సమమస్తి సాధనమ్ (2-43) అనే మూలానికి

శాంతశీలత మరి భవిష్యత్తునందు

గూడ నుపకారి శాంత యుతుని

శత్రువు తనంతతానే నాశనము నొందు-(2-43) అనే అనువాదం ప్రశంసనీయం .

 

మోహం విధత్తే విషయాభిలాష: అనే భారవి పలుగులకు

కాంక్ష మిక్కిలి భ్రమలకు కారణంబు అనే అనువాదం అమృతోపమం .(3-13)

నాల్గవ సర్గలో

పశ్చిమరాత్రి గోచరాత్ అనే పదాన్ని రాత్రి ముప్పావు గతింప (4-౧౬) అనడం చాల బాగుంది.

                 సరస్వతి ఎలా ఉండాలో భారవి మాటల్లో తెలుసుకుందాం.

వివిక్తవర్ణాభరణా సుఖశ్రుతిః

ప్రసాదయన్తి హృదయాన్యపి ద్విషామ్ |

ప్రవర్తతే నాకృతపుణ్యకర్మణాం

ప్రసన్న గమ్భీరపదా సరస్వతీ 14-3 అనువాదం

పరగ సుస్పష్ట వర్ణరూపంబు కలది

యెలమి వినువేళ  సౌఖ్యము నీయగలది

శత్రుహృదయమ్మునైనఁ బ్రసన్నరీతి

తోడ నాకట్టుకొనునట్టి వాడి కలది

యర్థగౌరవపదయుక్తి నలర రమ్య

మైన వాగ్ధాటి లోకంబులోన మిగుల

పుణ్య మొనరించు వారికి గణ్యరీతి

లభ్యమగుచుండు స్వచ్ఛజలంబు రీతి

 

ఇక 15 వ సర్గలో:

నోననున్నో నున్నోనో నానా నానాననా నను |

నున్నోనున్నో ననున్నేనో నానేనా నున్ననున్ననుత్ 15-14 అనే శ్లోకాన్ని

పలురకమ్ములుగానున్న ప్రమథులార

చెలఁగి నీచునిచేఁ బరాజితుఁడు దలప

నరుఁడు గాదిఁక నీచుల నరసి వారి

బలిమిచేత నొగి పరాజితులను జేయు

వాడుగూడ మనుష్యుఁడుకాడు మీరు

చెలఁగి నీచులచేఁ బరాజితులు మరియు

భీతితోడను బరుగులు వెట్టుచున్న

వారు మిమ్మేమి బిరుదాన పలుక వలయు || తేటగీతి ||

ఎవరి స్వామి తలప నిల పరాజితుఁడుకా

డరయ వారిఁ జూచి సరయరీతి

వడి పరాజితులుగ భావింపఁగా రాదు

గొప్పబాధలో రగులు నరునికి

బాధ కల్గఁజేయువాని నిర్దోషిగాఁ

దలఁపరా దతండు దులువ తలఁప || ఆటవెలది || అనువదించారు.

 

అలాగే ఒక అనులోమవిలోమ శ్లోకానికి వారి అనువాదం పరిశీలించండి

 

దేవాకానిని కావాదే వాహికాస్వస్వకాహి వా |

కాకారేభభరే కాకా నిస్వభవ్యవ్యభస్వని 15-25

శ్లోకానికి

మదధారల్ కురిపించునట్టి గజసంపన్నుండు గర్వోన్నతా

స్పదుఁడై శత్రులనెల్ల వాయసగతిన్ భావించి నిత్యమ్ము నె

మ్మది కాకాయని పిల్చుచుండు నికర మ్మౌత్సాహులన్ ధీరులన్

మది నుత్సాహములేని భీరుల నొకేమాటన్ దగన్ బిల్చుచున్ || మత్తేభము ||  ఇది అనువాదం.

 

యత్ర  వేదా: అవేదా: అన్నారు తత్త్వవేత్తలు . వేదాలు కూడ భగవంతుని చెప్పలేక పోయాయట .

అర్జునుడు శివునిపై ప్రయోగించిన బాణాలు అతనికి తగలకుండానే వ్యర్థమయ్యాయట

అది వివరిస్తూ భారవి

అగోచరే వాగివ చోపరేమే, శక్తిః శరాణాం శితికణ్ఠకాయే17-11 

వాఙ్మానసా గోచరమగు బ్రహ్మ

విషయమందున చక్కని వేదవాక్కు

వ్యర్థమైనట్లు పార్థుని బాణచయము

వడి త్రిలోచనుఁ బైనను వ్యర్థమయ్యె ---

నని ఆయన అనువదించడం .

జగతి పుణ్యాత్ములకుఁ దపస్సమృతమయము 12-4 అనే మాటలు ఆయన అనువాద పటిమకు మచ్చు తునకలు .

 

ఇక మహాకవి, పండితప్రకాండులు , గణితశాస్త్రజ్ఞులు నైన  శ్రీ నేమాని కోదండ రామారావు గారు   అనువదించిన కిరాతార్జునీయకావ్యాన్ని ఆసక్తితో ఆమూలాగ్రం పరిశీలించాను. చదవడం సంపూర్ణంగా చదివినా గ్రంథ విస్తర భీతిచేత అన్ని పద్యాల సోయగాలను ప్రస్తావించలేక  పోతున్నందుకు మన్నించమని కోరుతూ, వారు ఇంకా ఎన్నో కావ్యాలు రచించే శక్తి యుక్తులు ఆ పరాత్పరుడు ప్రసాదించాలని కోరుకుంటూ, తెలుగుసాహిత్యం ఉన్నంతకాలం ఈ కావ్యం నిలవాలని నిలుస్తుందని విశ్వసిస్తూ, ఇటువంటి మహత్తరమైన కావ్యాన్ని సమీక్షించే అదృష్టం నాకు కలుగజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కావ్యాన్ని చవినందు వల్ల నాకు కలిగిన రాసోద్రేకాన్ని అణచుకోలేక నేను సమర్పించే ఈ పద్యసుమాన్ని సహృదయంతో స్వీకరించమని కోరుతూ...

.

నీ కవితాస్రవంతిని మునింగి తరించితి గాంగనిర్ఝరీ

సేకము,  హైమవారిపరిషిక్తధునీకము, నవ్యమంజు మా

ధ్వీకము, శారదాభగవతీ వినివేదితమైనవాఙ్నమో

వాకము, గాదె నీ కవనవైఖరి మత్ప్రియమిత్ర రత్నమా!  

 

విధేయుడు,

చిలకమర్తి దుర్గాప్రసాద రావు,

భాషాప్రవీణ , వేదాంతవిద్యాప్రవీణ,

ఎం . ఏ (సంస్కృతం ); ఎం .ఏ ( తెలుగు);

ఎం.ఏ ( తత్త్వశాస్త్రం ) & పిహెచ్. డి ( సంస్కృతం).

విశ్రాంత ఆచార్యుడు

Cell. 9897959425

dr.cdprao@gmail.com

 

<><><>

Monday, September 9, 2024

ఆత్మాధిక్య౦ -ఆత్మన్యూనత Superiority vs Inferiority) డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

  ఆత్మాధిక్య౦ -ఆత్మన్యూనత       

(Superiority vs Inferiority)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

ఈ సృష్టిలో భిన్నత్వం ఉంటే ఉందేమో గాని ఎక్కువ తక్కువ అనే తారతమ్యం మాత్రం లేదు. ఎందుకంటే ఏ జీవికి ఆ జీవే ప్రత్యేకమైనది . దానికంటే ఎదీ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు .   oతువులు చేసుకున్న అదృష్టమేమిటంటే వాటిలో ఈ Superiority, Inferiority భేదం లేదు.  అన్నీ కలిసే ఉంటాయి . ఏదైనా ఆహారం దొరికినప్పుడే తమ వంతుకోసం పోట్లాడుకుంటాయి, తరువాత అన్ని  కలిసి మెలిసి జీవిస్తాయి. మనిషికే ఈ మాయరోగం . ఒకడు అందరికంటే నేనే గొప్పవాణ్ణి అని గర్వంతో పొంగిపొతూ ఉంటే మరొకడు నేను ఎందుకు పనికి రాని వాణ్ణి అని వేదనతో క్రుంగిపోతూ ఉంటాడు . అటు పొంగిపోవడం ఎంత తప్పో క్రుంగి పోవడం కూడ అంటే తప్పు. Superiority, inferiority ఈ రెండు ప్రమాదకరమే. కాని ఈ ఇద్దరిలో Superiority complex ఉన్నవాడు కొంతనయం , తన గొప్పదనం నిరూపి౦చుకోడానికి  అప్పుడప్పుడు కొన్ని మంచిపనులు చేస్తూ ఉంటాడు . ఇక    inferiority complex ఉన్న వాడు రోజు రోజుకీ క్రుంగి కృశి౦చి, నశించి  పోవడం కన్న ఏదీ సాధించలేడు . అందువల్ల తల్లి దండ్రులు ఈ రెండు దుర్గుణాలు పిల్లలకంట కుండ  పెంచాలి . అందుకే అన్నారేమో శ్రీ జాషువా గారు

తలిదండ్రులెపుడు బిడ్డలకు( దెల్పగ రాదు

కులగోత్రములు వాని గొప్పదనము

చదివి౦పగా రాదు చాదువులయ్యలు పాఠ

శాలలలోన కులాల గొడవ” అని .

ఇక ఈ సృష్టిలో పనికి రానిదంటు ఏదీ లేదు పనికిరానివాడంటు ఎవరూ లేరు .

అమంత్రమక్షరో నాస్తి నాస్తి మూలమనౌషధం

అయోగ్య: పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ:

అన్నారు పెద్దలు .

అమంత్రమక్షరో నాస్తి

ఒక గురువుదగ్గర ఇద్దరు శిష్యులు న్నారు . గురువు ఒకడికి ‘శం’ ఒక అక్షరం మంత్రం గా ఉపదేశించాడు మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అంటే మననం చేయడం వల్ల రక్షిస్తుంది అని అర్థం . వాడు  ఆ మంత్రాన్ని  జపిస్తూ కొన్ని శక్తులు సాధించాడు.  తత్ఫలితంగా ఆకాశంలో ప్రయాణం చేసే శక్తి సంపాదించాడు . అలాగే గురువు మరోశిష్యుడికిఠ౦’ అని  మరొక అక్షరం మంత్రోపదేశం చేశాడు.  వాడు   ‘‘ఠ౦’’ ఠ౦’ అని జపిస్తూ ముందు వాడిలాగానే  కొన్ని శక్తులు సాధించి ఆకాశంలో తేలిపోయే మహిమ సంపాదించాడు . ఒక రోజు ఇద్దరు ఆకాశంలో కలుసుకున్నారు . వాళ్లకు ఒకరి గురించి మరొకరికి తెలుసుకోవాలనే కోరిక పుట్టింది .  ఒరేయ్ ! గురువు గారు నీకేం చెప్పేర్రా? అన్నాడొకడు , నీకేం చెప్పేరో ముందు చెప్పరా!  అన్నాడు మరొక్కడు

నాకు ‘శం’ అని చెప్పార్రా అన్నాడొకడు . నాకుఠ౦’ అని చెప్పెర్రా అన్నాడు రెండోవాడు . రెండు కలిపితే ‘శంఠ౦’ ఐంది. ఓసి మనిద్దరికీ చెప్పింది ఇదిట్రా అన్నారు ఇద్దరు ఒకేసారి. వాళ్ళు అనడం ఆకాశం నుంచి పడిపోడం ముడ్డి పగలడం క్షణాల్లో జరిగిపోయింది . అంతవరకు వాళ్లకి ఆ మంత్రం పైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల తాము  సాధించిన శక్తితో వారు ఆకాశంలో సంచరించే స్థాయికెదిగారు విశ్వాసం కోల్పోయిన వెంటనే నేలపై చతికిలపడ్డారు . 

నాస్తి మూలమనౌషధం :

పూర్వం ఒక రాజాస్థానంలో వైద్యనియామకం చేయ వలసిన అవసరం ఏర్పడింది . మంత్రి ఒక ప్రకటన చేస్తూ ఫలానా రోజున వైద్యనియామకం జరుగుతుంది, అభ్యర్థులు తమకు తెలిసిన పనికి రాని మొక్కలు తీసుకురమ్మని కోరాడు . రాజాస్థానంలో వైద్యుడు కావడమంటే ఎంతో పెట్టి పుట్టాలి అభ్యర్థులు కొంతమంది వందలాది మొక్కల్ని సేకరించి తెచ్చారు . కొంత మంది ఏభై , నలభై , ముప్పై , ఇరవై , పది ఇలా తెచ్చారు. ఇకడు మాత్ర౦ చేతులూపుకు౦టు వచ్చాడు. వాణ్ణి చూసి అందరు నవ్వేరు . మాంత్రికూడ ఆశ్చర్య పోయాడు . అక్కడున్న ఆస్థానవైద్యుడు వట్టి చేతులతో వచ్చిన వాడితో “ ఏమయ్యా ! ఇంత మంది ఎన్నో పనికి రాని  మొక్కలు తెస్తే, నువ్వు ఒక్కటి కూడ తేలేదు. నీకీమీ కనిపి౦చలేదా! లేక సోమరితనమా ! అని అడిగాడు . దానికి సమాధానంగా ఆవ్యక్తి రెండు చేతులు జోడిస్తూ “అయ్యా ! ఔషధంగా పనికిరాని  మొక్కంటు నాకేం కనిపించ లేదు, నన్ను మన్నించండి” అన్నాడు . ఆ వైద్యుడు    నిన్ను మన్ని౦చడం కాదయ్యా! ఆస్థానంలో ప్రధానవైద్యునిగా నియమిస్తున్నాం అని చెప్పి మిగిలిన వారిని వెనక్కి పంపించేశాడు . కాబట్టి మనం తెలుసుకోవడంలో లోపం గాని వైద్యానికి పనికి రాని  మొక్కంటు ఏదీ లేదు . మొక్కలలో ఉండే ఔషధ గుణాలు పిల్లలకు పరిచయం చెయ్యడానికే వినాయకచవితి మొదలైన వ్రతాల్లో ఏకవింశతిపత్రపూజ (21మొక్కలు) మొదలైనవి ప్రవేశపెట్టారు . ఆ మొక్కలు మనిషికి నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో వ్యాధులకు మందులుగా పని చేస్తాయి  కాని భక్తుల దృష్టి మనుషులకొచ్చే ఇడుముల మీద కన్నా  నైవేద్యం పెట్టె కుడుముల  మీదే ఉండడం శోచనీయం .  సరే !   ఆ విషయం అలా ఉంచుదాం .

అయోగ్య:  పురుషో నాస్తి :

ఈ సృష్టిలో ఎందుకు పనికిరాని వాడంటు ఎవరు లేరు . మనీషా ( బుద్ధి బలం)   ఉన్నవాడే మనీషి . తరువాత మనిషి అయ్యాడు. ఇప్పుడు మనీ money  , షి she ఈ రెండు  ఉన్నవాణ్ణే మనిషిగా చూస్తున్నారు. ఇది శోచనీయం . కాబట్టి ప్రతి వ్యక్తీ గొప్పవాడే . కాని వాడెందుకు పనికొస్తాడో తెలుసుకోగలిగిన వాడు ఎవడు లేడు . ఈ సమాజంలో చాల గొప్పవారుగా పేరుపొందిన కొంతమంది మహనీయుల జీవితాలు పరిశీలిస్తే  బాల్యంలో చాల మంది అంతంత మాత్రంగా ఉన్న వారే. కాబట్టి ప్రతివ్యక్తిలో ఉండే అభిరుచులను జాగ్రత్తగా     గుర్తించి తదను గుణ౦గా వారిని తీర్చి దిద్దితే అందరు మహనీయులౌతారు . మనిషిని మనిషిలా పెంచండి . ఎవరి అభిప్రాయాలు  ఎవరి మీద రుద్దకండి . స్వయంగా ఆలోచించుకో నివ్వండి . తానె స్వశక్తితో ,  స్వయంగా మహనీయు డౌతాడు .                <>><><>

 

 

 

 

Monday, September 2, 2024

తెలుసుకుందాం-2 Let us know-2 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

తెలుసుకుందాం-2 Let us know-2 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు. సాధారణంగా మన ఇళ్ళల్లో జరిపే ఉపనయనకార్యక్రమంలో ఒక వింత ఆచారాన్ని మనం గమనిస్తూ ఉంటాం . అదేంటంటే బ్రహ్మచారులను భోక్తలుగా పిలుస్తాం. ఆ సమయంలో వారి సరసన బ్రహ్మోపదేశం జరుప బోయే వటునికి కూడ అన్నం వడ్డిస్తాం కానీ ఆ వ్యక్తి పూర్తిగా తినేవరకు ఉండనివ్వం . చాల కంగారు పెట్టి కడుపునిండా పూర్తిగా తినకుండానే విస్తరి ముందు నుంచి లేపేస్తాం. పప్పు అన్నం తింటుండగానే వెంటనే పెరుగు వడ్డించి కంగారు పెడతాం. బాహ్యంగా చూస్తే అది తప్పు అనిపిస్తుంది. చాల వింతగా కూడ కనిపిస్తుంది. పూర్తిగా అన్నం తినకుండానే లేపేయడం వింతే కదా మరి! కానీ ఆచారంలో ఉండేటటు వంటి ఆంతర్యాన్ని గమనిస్తే అది సబబే అనిపిస్తుంది. “ స్థితస్య గతి: చింతనీయా” అనేది మన సనాతనధర్మం. అంటే ఒక ఆచారం ఉంటే దాని ఆశయం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఇందులో ఉండే అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. ఇక ఉపనయనం తరువాత బ్రహ్మచారిగా ఉన్న ఆ వ్యక్తి గురుకులానికి విద్య కోసం వెళ్తాడు. వాడికి తిండి మీద ఎక్కువ దృష్టి ఉండకూడదు. అంటే తినకూడదని కాదు ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి, బ్రతకడం కోసమే తినాలి, కాని రుచులపై ధ్యాస నిలుపకూడదు . ఇది అలవాటు చేయడం కోసం అతన్ని ముందుగానే విస్తరి నుంచి లేపెస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే విద్య ఒక తపస్సు లాంటిది . “తద్ధి తపస్తద్ధి తప:” అని వేదవాక్యం. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో ఆహార నియంత్రణ ఒకటి. అందుకే వశిష్ట మహర్షి దిలీపునితో నందినీ ధేనువును సేవించే విధానాన్ని తెలుపుతూ ఇలా అంటాడు . వన్యవృ త్తి రిమాం శశ్వదాత్మాను గమనేన గాం విద్యామభ్యసనేనైవ ప్రసాదయితుమర్హసి ఓ రాజా ! నువ్వు కందమూల ఫలాలు మాత్రమే తింటూ అభ్యాసం చేత విద్యను వశపరచుకున్నట్లుగా ఈ గోవును వెంటపడి అనుసరిస్తూ ప్రసన్నం చేసుకో. దిలీపుడు చక్రవర్తి . ఏదైనా తినగలడు. ఏదైనా తనదగ్గరకు తెప్పించుకోగల శక్తి గలవాడు. ఐనప్పటికీ కందమూలఫలాలే సేవించమని గురువు నిర్దేశించడం మనం గమనిస్తాం. చదువు తపస్సులాంటిది కాబట్టి విద్యార్థి రుచులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎంత అవసరమో అంతే తినాలి. ఈ సందర్భంగా పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఒక కథను కూడ మనం గమనిద్దాం . ఒక గురుకులంలో గురువు పాఠాలు చెప్పేవారు . ఆ ఊరిలో ఉన్న కొంతమంది పెద్దలు చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి రొజూ భోజనం పెట్టేవారు . ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక ఇంటిలో భోజనం చేస్తూ ఉండేవాడు . అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒక రోజున ఆ కుర్రవాడు భోజనం చేస్తూ అమ్మగారు ! ఈ రోజు వట్టి గోంగూరముద్ద వడ్డించారు . రుచీ పచీ లేదు . ఏమీ బాగా లేదoడి అన్నాడు . అప్పుడామె నాయనా! నువ్వు రేపటి నుంచి మా ఇంటికి రావక్కర్లేదని చెప్పింది. అదేంటమ్మా అనడిగాడు . నాయనా! నేను రొజూ నీకిదే వడ్డిస్తున్నాను . నువ్వు కలుపుకుని తినేసి వెళ్లి పోయేవాడివి. ఏనాడు ఇదేంటని అడగలేదు . ఇప్పుడు నీ దృష్టి రుచుల పైకి పోయింది . చదువు మీద లేదు . మా ఇంటిలో భోజనం చదువు కోసం వచ్చేవాళ్ళకే గాని రుచుల కోసం వచ్చేవాళ్ళకు కాదని చెప్పి పంపేసింది . ఇందులో ఉండే తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. ఇక మేం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు హాస్టల్స్ లో అన్ని పదార్థాలు చాల అద్భుతంగా ఉండేవి . మేము కొంతమంది పరీక్ష రోజుల్లో ఒకే item తో సరిపెట్టుకోవాలని నియమం పెట్టుకునే వాళ్ళం. దానివల్ల ఆహారం కొంత నియంత్రిoచడంద్వారా ఎక్కువసేపు చదివే అవకాశం దక్కేది . ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన వైదిక సంస్కృతీసాంప్రదాయాలు బ్రహ్మచారి కాబోయే ఆ వ్యక్తిని భోజనం దగ్గర కంగారు పెట్టే ఆచారాన్ని అమలు చేసింది . ఇదీ అంతర్యం . ఆహా! వైదికసంస్కృతీ సాంప్రదాయాలు ఎంత గొప్పవి! ఒక్క విషయం గమనించాలి . ఆహారం తినొద్దని కాదు. కేవలం రుచులపైకి దృష్టి సారించకూడదని మాత్రమే అని గ్రహించాలి. <><><>

Saturday, August 3, 2024

తెలుసుకుందాం . డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

1. తెలుసుకుందాం డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు సాధారణంగా మన ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా రెండు సందర్భాల్లోనూ కొన్ని గింజల్ని (నవధాన్యాలపేరిట) పెంచుతారు. ఇది ప్రాచీనకాలం నుంచి మనకు వస్తున్నటువంటి వైదికపరమైన ఆచారం. ఈ ఆచారం కొంతమంది చాదస్తమని కొట్టి పరేస్తున్నారు . మరి కొంతమంది విధిగా పాటిస్తున్నారు. పాటిస్తున్న్నవాళ్ళకి ఎందుకు పాటిస్తున్నామో తెలీదు, కొట్టి పారేసేవాళ్లకి కూడ దాని ఆంతర్యం తెలియదు . “ స్థితస్య గతి: చింతనీయా” అనేది మన సనాతనధర్మం. అంటే ఒక ఆచారం ఉంటే దాని ఆశయం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఇందులో ఉండే అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. విశ్వశ్రేయస్సు కోరే వేదం ఎట్టి పరిస్థితిలోను ఒక్క మొక్క కూడ నాశనం కావడానికి అంగీకరించలేదు . పైగా “వృక్షేభ్యో హరికేశేభ్యశ్చ నమో నమ:” అంటు పచ్చని చెట్లను దైవ స్వరూపంగా పేర్కొన్నది. కానీ శుభకార్యాలు జరిగినప్పుడు అగ్నిహోత్రం పేరుతోనూ అలాగే అశుభ కార్యాలు అనగా దహన ఖననాదిసంస్కారాలు జరిగినప్పుడు కొన్ని మొక్కలు విధిగా అనివార్యంగా చచ్చిపోతాయి. అందువల్ల వాటిని (ఆ నష్టాన్ని) భర్తీచేయడం కోసం వేదం ఈ కార్యకలాపం విధించింది. అందువల్ల మనం ప్రతికార్యక్రమానికి నవధాన్యాలు పెంచడం రివాజు . అందువల్ల ఒక మొక్క పొతే వందమొక్కలు పెంచాలనేదే ఇందులో ఆంతర్యంగా గ్రహించాలి . ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచి రక్షించాలి . <><><>

Wednesday, June 12, 2024

A Study of Ratnaprabha-Part-11 रत्नप्रभाविमर्श: (ख्यातिवादविमर्श: ) Dr. Ch. Durgaprasada Rao

A Study of Ratnaprabha-Part-11 रत्नप्रभाविमर्शे तृतीयोsध्याय: {Ratnaprabhaa vimarsha} ख्यातिवादविमर्श: Dr. Ch. DurgaprasadaRao गताङ्कादग्रे... अध्यासस्वरुपनिरुपणे भगवत्पादै: अनिर्वचनीयख्याति: अङ्गीकृता || अनिर्वचनीयत्वं नाम सत्त्वाsसत्वाभ्यां वक्तुमशक्यत्वम् || प्रपञ्च: सद्रूप: चेत् ब्रह्म वदबाध्येत नित्य एव स्यात् इत्यर्थ; || असद्रूप: चेत् वन्ध्यापुत्रादिवदनुपलभ्येत || सदसदत्मकत्वन्तु विरुद्धम् || अतोsनिर्वचनीय: इत्युच्यते || शुक्तिरजतस्थले भ्रान्तिदृष्ट्या दृश्यमानं शुक्तिरजतं शुक्तिज्ञानेन बाध्यं भवति, शुक्तिज्ञानाभावदशायां भासते च || अत: सद्रूपं न भवति , असद्रूपं न भवति , सदसद्रूपञ्च न भवतीत्यनिर्वचनीयमेव || अत्र प्रधानतया ख्यातिपञ्चकं तान्त्रिकैरभ्युपगम्यते || 1. आत्मख्याति: 2. असत्ख्याति: 3. अख्याति: 4 अन्यथाख्याति: 5. अनिर्वचनीयख्याति: इति ख्यातय: || 1. योगाचारा: 2. माध्यमिका: 3. मीमांसका: 4. नैयायिका: 5. अद्वैतिन: - इति तत्प्रवक्तारश्च || अत्र प्रथमत: “अत्र केचिदन्यत्राsन्यधर्माध्यास:” इति अन्यथा ख्यातिवादिनामात्मख्यातिवादिनाञ्च मतं भगवत्पादै: प्रदर्शितम् || ख्याति: नाम प्रतीति: || अन्यथाख्याति: नाम अन्यस्य अन्यरूपेण प्रतीति: || अत्र केचित् = अन्यथाख्यातिवादिन: अन्यत्र = शुक्त्यादौ अन्यधर्मस्य = स्वावयवधर्मस्य देशान्तरस्थराजतादे: अध्यास: इति वदन्तीति रत्नप्रभाविवरणम् {14}|| अन्यथाख्यातिवादिनां तार्किकाणां , भाट्टमीमांसकानां च अयमाशय: यत् शुक्त्यादे: नैगनिग्येन कारणेन देशान्तर स्थरजतस्य शुक्तौ रजताकारेण प्रतीयमानत्वादन्यथाख्याति: || ततो भगवत्पादै: तं केचिदन्यत्रान्यधर्माध्यास: इत्यनेनैव वाक्येन आत्मख्यातिवादिनामपि मतं प्रदर्शितम् || अत्र रत्नप्रभा || अन्यत्र = बाह्ये शुक्त्यादौ अन्यधर्मस्य = बुद्धिरुपात्मन: धर्मस्य (रजतस्य) अध्यास: = अवभास: (इति) || बौद्धैकदेशिन: योगाचारा: आलयविज्ञानस्यात्मन: एव ख्याति: रजतादिरूपेण प्रतीतिरिति वदन्ति || तथा च बाह्ये शुक्तिशकले बुद्धिरुपात्मन: धर्मस्य रजताध्यास: अर्थात् आन्तरस्य रजतस्य बहिर्वदवभास: इति वदन्ति || अत्र आत्मन: बुद्धे: ख्याति: विषयरूपेण प्रतिभास: ते आत्मख्यातिवादिन: || प्राभाकरगुरुमतावलम्बिन: मीमांसका: विभ्रमज्ञानमनङ्गीकृत्याsख्यातिवादमातिष्ठन्ते || तेषाञ्च मतं “ केचत् यत्र यदध्यास: तद्विवेकाग्रहनिबन्ध्नो भ्रम:” इति भगवत्पादैरनूदितम् || अत्र रत्नप्रभाकारा: || यत्र = यदध्यासो लोकसिद्ध: तयो: = तद्धियोश्च भेदाsग्रहे सति तन्मूलो भ्रम: इदं रुप्यमिति विशिष्टव्यवहार: इति (16) || प्राभाकराणामयमाशय: यत् कुत्राsपि भ्रान्ति: नास्त्येव || सर्वविज्ञानं यथार्थमेव || एवमेव शुक्ताविदं रजतमित्यत्राsपि भ्रान्तिर्नास्त्येव || तत्र ज्ञानद्वयमङ्गीक्रियते || इदमित्याकारकम् अनुभवात्मक ज्ञानमेकं, रजतमित्याकारकं स्मरणात्मकज्ञानमपरम् || किन्तु तत्र इदमाकाररजताकारज्ञानयो: भेदज्ञानाभावेन राजतार्थी तत्र प्रवर्तते इति तेषां मतं प्रदर्शितं भगवत्पादै: || शून्यवादिनो बौद्धा: असत्ख्यातिवादमभ्युपगच्छन्ति || असत: शून्यतातत्त्वस्यैव ख्याति: राजतात्मना प्रतीति: असत्ख्यातिरित्यर्थ: || भाष्ये तु “ यत्र यदध्यास: तस्यैव विपरीत धर्मत्व कल्पनामाचक्षन्ते ” इति तेषां मतं प्रदर्शितं भगवत्पादै: || अत्र रत्नप्रभाकारा: || अन्ये = शून्यवादिनो बौद्धा: तस्यैव = अधिष्ठानस्य शुक्त्यादे: विपरीत = विरुद्ध: धर्मो यस्य तद्भाव: तस्य धर्मत्वकल्पनां = रजतादे: अत्यन्तासत: कल्पनामाचक्षन्ते इति || बुद्धशिष्यास्तु चत्वार: वैभाषिका: , योगाचारा: , सौत्रान्तिका:, माध्यमिकाश्च || तेषु वैभाषिकाणां मते बाह्यं वस्तु सत् तत्प्रत्यक्षम् || सौत्रान्तिकानां मते बाह्यं वस्तु सदपि न प्रत्यक्षम् || योगाचाराणां मते विज्ञानस्यैव सत्त्वं तदतिरिक्तस्य सर्वस्याsसत्वम् || तथा च त्रयाणामपि मते विज्ञानधर्मस्य रजतस्य शुक्तिकायां समारोप: इति त्रयस्ते आत्मख्यातिवादिन: एव || शून्यवादी माध्यमिकस्तु शून्यतातत्वमेव सर्वं शून्यतातत्त्वमेव सदिवावभासते इत्यभ्युपगच्छति || अत्र शून्यतातत्त्वमेव राजताकारेण प्रतीयमान त्वादियमसत्ख्याति: || .... अनुवर्तते ....(To be continued)

Sunday, June 9, 2024

A Study of Ratnaprabha-Part-10 रत्नप्रभाविमर्शे तृतीयोsध्याय: अध्यास:(superimposition) Dr. Ch. DurgaprasadaRao

A Study of Ratnaprabha-Part-10 रत्नप्रभाविमर्शे तृतीयोsध्याय: {Ratnaprabhaa vimarsha} अध्यास:(superimposition) Dr. Ch. DurgaprasadaRao गताङ्कादग्रे... अत्रायमभिप्राय: || यत्र यद्वस्त्वस्तीति भासते तत्रैव तद्वस्तु नाsस्तीत्युच्यते || लोके हि “घटवद्भूतलम्” इत्यत्र यस्मिन् भूतले घटोsस्तीति प्रतीयते तस्मिन्नेव घटाधिकरणे घटो नास्तीति प्रतीति: न भवति, अनुभवविरुद्धत्वात् || अत्राध्यासस्थले तु “इदं रजतम्” इति रजतत्वेन प्रतीयमाने शुक्तिशकले सहस्रजनानुभवविषयत्वेsपि परमार्थत: तत्र रजतस्याsभावात् स्वाsत्यन्ताभाववत्यव भास्यत्वमस्त्येव || एवञ्च एकावच्छेदेन = आत्मत्वावच्छेदेन ; स्वाsत्यन्ताभाववति = जीवत्वेश्वरत्व जगदात्मक – दृश्यात्यन्ताभाववति; आत्मनि (ब्रह्मणि ) वस्तुत: स्वात्यन्ताभाववति = पारमार्थिकत्वावच्छिन्नप्रतियोगिताक दृश्यात्यन्ताभाववति, अवभास्यत्वं = जीवत्वेश्वरत्वजगदात्मकदृश्ये लक्ष्यमाणत्वाल्लक्षणसमन्वय: || एवं ‘स्वयमहम्’ इत्यत्र स्वयन्त्वावच्छेदेन प्रत्यगात्मनि कूटस्थेsहङ्कारादे: संसर्गकाले तदत्यन्ताभावस्य सत्वात् कूटस्थकल्पिताहङ्कारार्थरुपाध्यासे लक्ष्ये लक्षणसमन्वय: || नैयायिकास्तु कपिसंयोगी वृक्ष: मूले न इति प्रतीत्या अग्रदेशे कपिसंयोग: वर्तते मूलदेशे नास्तीति कपिसंयोगाधिकारणाभावे वृक्षे कपिसंयोगस्य सत्त्वमङ्गीकुर्वन्ति || किञ्च घटापसरणानन्तरं घटो नास्तीति घटाधिकरणे एव प्रतीतिमभ्युपगच्छन्ति || वेदान्तिनस्तु न तथा || यस्मिन् काले यदवच्छेदेन यद्यस्मिन् प्रतीयते तस्मिन् काले तदवच्छेदेन तत्तत्र नास्तीत्येवेति सर्वथा तत्र परमार्थत: असत्वमेवाभ्युपगच्छन्ति || अत्र भावाभावयोरेकत्र सत्वाङ्गीकारे अनुभव विरोध: इति पूर्वपक्षे प्राप्ते मिथ्यात्ववादिनामेतादृशविरोधस्त्वलंकार एवेति समाधनमुक्तम् (10) || तथा च सर्वलक्षणविलक्षणमेव एतदध्यास लक्षणमित्यवश्यमभ्युपगन्तव्यम् || एतदध्यासनिष्कृष्टलक्षणम व्याप्त्यतिव्याप्त्यसंभवदोषनिवृत्तिपूर्वकं पुर्णानन्दीये विस्तरेण निरुपितम् || भगवत्पादै: अध्यासनिरुपणे “अहमिदम्”, “ममेदम्” इति उदाहरणद्वयं प्रदर्शितम् || अध्यात्मिककार्याध्यासेषु अहमिति प्रथमोsध्यास: || अत्र अहमित्यनेन मनुष्योsहम् इति तादात्म्याध्यासो दर्शित: || ममेदम् इत्यत्र ममेदं शरीरमिति संसर्गाध्यास: इति रत्नप्रभाकारा: (11) || अत्र तादात्म्यसंसर्गयो: को भेद: इत्याशंकायां सतैक्ये सति मिथो भेद: तादात्म्यम् इति तादात्म्यस्वरुप: प्रदर्शित: रत्नप्रभायाम् || तथा चाद्वैतेsवश्यं ज्ञातव्यमेतद्यत्तादात्म्याध्यास इत्युक्तौ द्वयोर्वस्तुनो: सतो: एकस्मिन् वस्तुनि अपरवस्त्वात्मना ग्रहणम् इति न वक्तव्यम् || तथा चेत् अद्वैतव्याघात:|| शुक्तिरजताध्यासे शुक्तिरजतयो: सतो: शुक्तिशकले रजताध्यास: इति न वक्तव्यम् || परन्तु शुक्तिशकलमेव तूलाsज्ञानेनावृतं सत् राजतात्मना भासते इति वक्तव्यम् || तथा भानमेव तादात्म्याध्यास: इत्युच्यते || अत एव भगवत्पादै: ‘शुक्तिका हि रजतवदवभासते, एकश्चन्द्र: सद्वितीयवत् ’ इति अध्यास द्वयं दृष्टान्तत्वेनाsभिहितम् (12)|| तत्र शुक्तिशकलं राजतात्मना भासते इति अन्यस्य वस्तुन: अन्यवस्त्वात्मना भाने दृष्टान्त: || एकस्य वस्तुन: अनेक वस्त्वात्मना भाने तु ‘एकश्चन्द्र: सद्वितीयवत्’ इति दृष्टान्त: || प्रकृते अत्माधिष्ठानभ्रमाध्यासे दृ ष्टान्तद्वयमनुकूलमेव || मूलाज्ञानेनावृतं परमात्मतत्त्वं जीवेश्वरजगदात्मना भासते , अन्यवस्त्वात्मना भासते , अनेकवस्त्वात्मना भासते || तथा च सर्वैरपि ज्ञानिभि: अज्ञानिभिश्च ब्रह्मतत्त्वमेव दृश्यते || ज्ञानिभिस्तु सर्वं ब्रह्मात्मना दृश्यते, अज्ञानिभिस्तु जीवेश्वरजगदात्मना दृश्यते || अत्र नित्यजीवने अनुभवसिद्धा: केचन अध्यासा: प्रदर्श्यन्ते || 1. शुक्तौ रजताध्यास: 2. रज्ज्व्यां सर्पाध्यास: 3. स्थाणौ पुरुषाध्यास: 4. सर्पे रज्ज्वध्यास: 5. पुरुषे स्थाण्वध्यास: 6. समुद्रतरङ्गे नीलशिलात्वाध्यास: 7. गुञ्जापुञ्जे मर्कटादीनामग्नित्वाध्यास: 8. नीरूपे आकाशे नीलत्वाध्यास: , कटाहाकाराध्यासश्च 9. नयनारश्मिषु केशोण्ड्रकाध्यास: 10. काविलादिदोषेण शुक्ले शंखे पीतत्वाध्यास: 11. मण्डूकवसाञ्जनादिदोषेण वेणुदण्डेषु सर्पत्वाध्यास: 12. जपाकुसुमसन्निधौ शुद्धे स्फटिके लोहितत्वाध्यास: 13. कर्तरिसंस्कारसंस्कृते पटे पुण्डरीक मुकुलत्वाध्यास: 14. जले नीलत्वाध्यास: || इत्येवमादय: दृष्टान्ता: प्रदर्शनीया: भवन्ति || <><><> ....अनुवर्तते....

Friday, June 7, 2024

A Study of Ratnaprabha-Part-9 . अध्यास: (superimposition) Dr. Ch. DurgaprasadaRao.

A Study of Ratnaprabha-Part-9 रत्नप्रभाविमर्शे तृतीयोsध्याय: {Ratnaprabhaa vimarsha} अध्यास:(superimposition) Dr. Ch. DurgaprasadaRao. अत्र लक्षणपरभाष्यं, संभावनापरभाष्यं, प्रमाणपरभाष्यं चेत्यध्यासभाष्यं त्रिधा विभक्तम् || तथा हि:- आह कोsयमध्यासो नाम एत्यारभ्य “एवमविरुद्ध: प्रत्यगात्मन्यनात्माध्यास:” इत्यन्तं संभावनापरभाष्यं , तमेतमविद्याख्यम् इत्यारभ्य सर्वलोकप्रत्यक्ष: इत्यन्तं प्रमाणपरभाष्यं चेति विज्ञेयम् || तत्रादौ पूर्वपक्षी “कोsयमध्यासो नाम?” इति वाक्येनाध्यासलक्षणं किमिति पृच्छति || अस्य शास्त्रस्य तत्त्वनिर्णयप्रधानत्वेन वादकथात्वद्योतनार्थमाहेति परोक्ति: इति रत्नप्रभाकारा: ( रत्नप्रभा- page- 40) सिद्धान्ते तु भगवत्पादै: “ स्मृतिरूप: परत्र पूर्वदृष्टावभास:” इत्यध्यासलक्षणं प्रदर्शितम् (ब्र.सू.शां.भा-p. 45) || एतद्व्याख्यानावसरे रत्नप्रभाकारै: “ अत्र परत्र अवभास:” इत्येव लक्षणम्, शिष्टं पदद्वयं ददुपपादनार्थमित्युक्तम् (7) तत्र परत्र = शुक्तिशकलादौ, अवभास: = परस्य रजतस्यावभास: || एकस्मिन् वस्तुनि अन्यवस्त्वात्मकवृत्तिरेवाध्यास: इत्युक्तं भवति || दृष्टं = दर्शनं , पूर्वानुभव:, पूर्वानुभवजन्य: संस्कारजन्य: इत्युक्तं भवति || तथा च पूर्वदर्शनादवभास्यते इति पूर्वदृष्टावभास: || स्मृतिरुप: इत्यत्र स्मर्यते इति स्मृति: (सत्यरजतादि) स्मृते: रुपमिव रूपं यस्य स: स्मृतिरूप: इत्यर्थस्वीकारेण स्मर्यमाणसदृश: इत्यर्थ; फलति || सिद्धान्ते तु भगवत्पादै: स्मृतिरूप: परत्र पूर्व दृष्टावभास: इत्यध्यासलक्षणं प्रदर्शितम् || (ब्रह्मसूत्रशांकरभाष्यम्-page-45) एतद्व्याख्यानावसरे रत्नप्रभाकारै: अत्र परत्र अवभास: इत्येव लक्षणं शिष्टं पदद्वयं तदुपपादनर्थमित्युक्तम् ( रत्नप्रभा-page – 41)|| तत्र परत्र = शुक्तिशकलादौ अवभास: = परस्य रजतस्यावभास:|| एकस्मिन् वस्तुनि अन्यवस्त्वात्मकवृत्तिरेवाध्यास: इत्युक्तं भवति || दृष्टं दर्शनं पूर्वानुभव: , पूर्वानुभवजन्य: संस्कारजन्य: इत्युक्त: भवति || तथा च पूर्वदर्शनादवभास्यते इति पूर्व दृष्टावभास: || स्मृतिरूप: इत्यत्र स्मर्यते इति स्मृति: (सत्यरजतादि:) || स्मृते: रुपमिव रूपं यस्य स: इत्यर्थस्वीकारेण स्मर्यमाणसदृश: इत्यर्थ: फलति || एवञ्च प्रपञ्चभ्रमोsपि पूर्वप्रपाञ्चानुभव जन्यसंस्काराधीन: पूर्वप्रपञ्चसदृश: सततं प्रवाहरुपेणानुवर्तते इति विवृतम् || अयमध्यास: साद्यनादिभेदेन द्विविध: || अत्र सादित्वं जन्यत्वमनादित्वमजन्यत्वाम् || अहङ्काराध्यास: सादि: , अविद्याचितो रध्यासोsनादि: || अत्र द्वितीयस्यानादित्वे “जीव ईशो विशुद्धा चित्तथा जीवेशयोर्भिदा अविद्या तच्चितोर्योग: षडस्माकमनादय:” इत्यभियुक्तोक्ति: प्रमाणम् || अत्र साद्यनाद्यध्याससाधारणलक्षणन्त्वेवमुक्तं रत्नप्रभाकारै: || “एकावच्छेदेन स्वसंसृज्यमाने स्वात्यन्ता भाववत्यवभास्यत्वमध्यस्तत्वम्” इति (8)|| अस्य लक्षणस्य समन्वयप्रकारश्चेत्थमुक्तम् || तथा हि :- राजताध्यासे एकावच्छेदेन = इदन्त्वावच्छेदेन , स्वसंसृज्यमाने = अत्र स्वपदम् अध्यासर्वेनाभिहितवस्तुपरं, तच्च रजतं, आरोपरजतेन स्वसंसृज्यमाने शुक्ति शकले , वस्तुत: स्वाsत्यन्ताभाववति = पारमार्थिकावच्छिन्नप्रतियोगिताकराजताs भाववति अवभास्यत्वम् इदं रजतम् इति भासमानत्वं राजतेsस्तीति लक्षण समन्वय: || .....अनुवर्तते......