Sunday, November 24, 2013

పాఱిన ఎత్తుగడ


పాఱిన ఎత్తుగడ
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.
/౧౦౬, ప్రేమనగర్, దయాల్ బాగ్, ఆగ్రా
అది శివపార్వతుల తొలికలయిక . ఆమె సిగ్గుతో తల ఎత్తడం లేదు. శివుడు ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడు. కాని ఆమె సిగ్గు వల్ల ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. తల వంచుకునే ఉంది. కాలం గడిచిపోతోంది. ఏదో ఉపాయంతో తాననుకున్నది సాధించాలి. చాల సేపు ఆలోచించాడు. చివఱకు ఒక ఉపాయం తట్టింది.
ఆమెతో అంటున్నాడు.
ఓ ఇందుముఖి ! అదుగో చూడు . రాహువు చంద్రుణ్ణి మ్రింగెయ్యడానికి ఆకాశమార్గంలో అతని వెంటబడి తరుముకొస్తున్నాడు. వాడు ఒకవేళ నీముఖాన్ని చూడ్డం గనక జరిగితే నీముఖాన్నే చంద్రబింబమనుకుని మింగేసే ప్రమాదముంది జాగ్రత్త అన్నాడు. ఆ మాటలకు పార్వతి భయపడి తలెత్తి ఆకాశం వైపు చూసింది. అంతే శివుడు ఒక్క ఉదుటున ఆమె ముఖాన్ని కబళించి ముద్దుపెట్టేసుకున్నాడు. అమ్మ దొంగా! అనుకుంది. అంతకంటే ఏమి చేస్తుంది.  ఈ విధంగా కార్య సాధకుడైన ఆ పరమేశ్వరుడు అందఱి కోరికలు నెరవేర్చుగాక.

స్వర్భాను: సురవర్త్మనానుసరతి గ్రాసాభిలాషాదసా
విందోరిందుముఖి! గ్రసేత కిముత భ్రాంత్యా భవత్యా: ముఖం
ఇత్థం నాథగిరా మనోSర్పితదృశో వక్త్రే భవాన్యా: భృశం
మానిన్యా: కృతచుంబనస్త్రినయనస్తాదిష్టసిద్ధ్యై సతాం
(సుభాషితరత్నభాండాగారం/ /౫౮)



No comments: