Sunday, April 12, 2015

కొంటెకృష్ణుని తుంటరిచేష్టలు

కొంటెకృష్ణుని  తుంటరిచేష్టలు

మొదటి చేష్ట:
కృష్ణుడు అందరి ఇళ్ళల్లో దూరి వెన్న దొoగిలిస్తున్నాడు. ఒకసారి అందరికి  దొరికిపోయాడు. యశోదను పిలిచారు . పoచాయితీ పెట్టారు. జనం చాల మంది  పోగయ్యారు. అక్కడ పెద్దవాళ్ళు కూడ ఉన్నారు. కృష్ణుని ప్రియురాలు రాధ కూడ అనుకోకుండా అక్కడకు వచ్చింది .  యశోద కృష్ణునితో ఎరా!  ఎంత వెన్న దొంగిలింఛి తెచ్చావో చెప్పరా! అని నిలదీసి అడగ్గానే అందరి ఎదుట ఏమి తడుముకోకుoడ ఇoతేనమ్మా! అంటూ రాధ దగ్గరికి పరిగెత్తి ఆమె  స్తనాన్ని పట్టుకుని చూపిoచాడట. అందరు ఆశ్చర్య చకితులయ్యారు.  ఈ విధoగా పెద్దలందరి సమక్షంలో రాధ స్తనాన్ని పట్టుకున్న ఆ కొంటెకృష్ణుని  చెయ్యి అందరిని రక్షించుగాక .
 శ్లోకం చూడండి.
నీతం నవనీతం కియదితి
 పృష్టో యశోదయా కృష్ణ:
ఇయదితి  గురుజనసంసది
 కరధృతరాధాపయోధర: పాతు
 ( సుభాషిత రత్నభాoడాగారం,page-22,stanza-104).
రెండవ చేష్ట :
కృష్ణుడు  ఒకసారి  మిత్రులందరితో కలిసి బంతి ఆట ఆడుతున్నాడు. ఎవడో బంతిని చాల గట్టిగా విసిరాడు. అది కనబడనంత దూరంగా వెళ్ళిపోయింది . బంతికోసం అందరు వెదుకుతున్నారు . ఎక్కడ కనిపించడం లేదు. ఆట చూడ్డానికి రాధ కూడ అక్కడకు వచ్చింది . బహుశ ఆమెయే బంతి దాచేసి ఉoటుoదనుకున్నాడు కృష్ణుడు. ఆమె పైటకొంగు వెనుకనున్న స్తనాలు అతని అనుమానాన్ని బలపరుస్తున్నాయి. అందువల్ల  ఓ రాధా! నాబంతి నాకిచ్చెయ్ అని  ఆమె పైటకొంగుముడిని లాగుతున్న కొంటెకృష్ణుని చెయ్యి మనకు ఆనందం చేకూర్చుగాక అని కవి ఒక అందమైన శ్లోకాన్ని రచించాడు.   
దేహి మత్కందుకం  రాధే!
పరిధాననిగూహితం
ఇతి విస్రoసయన్నీవీo
తస్యా: కృష్ణో ముదేs స్తు న: 
( సుభాషిత రత్నభాoడాగారం , page-22,stanza-111)
గమనిక :

రాధాకృష్ణుల ప్రేమ దివ్యమైoది . అది పైకి శృంగారoగా కనిపిoచినా అది చవకబారుది కాదు సందేశాత్మకమైoది . రాధ జీవాత్మకు, కృష్ణుడు పరమాత్మకు ప్రతీక కావడం చేత అది భగవద్భక్తులకు విగళితవేద్యాoతరమైన దివ్యానుభూతినే చేకూరుస్తుoది గాని కామోద్రేకాలను కలిగించదు.   

No comments: