అత్త మెచ్చిన ఉత్తమ ఇల్లాలు ద్రౌపది
సాధారణంగా సమాజంలో
అత్తాకోడళ్ల మధ్య ప్రేమానురాగాలు చాల తక్కువగా
కన్పిస్తూ ఉంటాయి. ఇతర కారణాలేమైన విశాలహృదయం లేకపోవడం ప్రధానకారణం. ఇది వాస్తవం. ఇక
కోడలు మెత్తనైతే అత్త విర్రవీగిపోతు౦ది. అత్త మెత్తనైతే కోడలు నెత్తెక్కెస్తు౦ది. చిత్తశుద్ధితో
ఒకరి నొకరు గౌరవించుకోవడం చాల అరుదుగా కనిపిస్తుంది. ప్రాచీనమహిళలలో అత్త మెప్పుపొందిన
ఉత్తమ ఇల్లాలిగా ద్రౌపది మనకు దర్శనమిస్తుంది.
కుంతీదేవికి తన బిడ్డలందఱిలో సహదేవుడంటే ఎక్కువ ఇష్టం .
సహదేవుడు తన సవతియైన మాద్రి బిడ్డ ఐనప్పటికీ స్వంతబిడ్డకంటే ఎక్కువగా ప్రేమతో పెంచడం
ఆమె ఔదార్యానికి ఒక నిదర్శనం. కుంతి తనబిడ్డలు వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు
అందరికంటే సహదేవుని విషయంలో చాల బాధపడింది.
“ వాడు కడపటి బిడ్డ కావడం వల్ల కడు పసిబిడ్డ. ఏమి తెలియని అమాయకుడు. ఇంతకు ముందెన్నడు ఎటువంటి
కష్టం తెలియనివాడు. మనస్సు చాల కోమలమై౦ది. ఎప్పుడైనా అన్నానికి నేను పిలిస్తే వస్తాడు గాని తన ఆకలి తనకు తెలియదు. అటువంటి
ఈ పసివాడు అడవికి పోవడం నామనస్సుకు తీరని సంతాపాన్ని కల్గిస్తోంది . నువ్వు వెంట వెల్లడం
నాకు కొంత ఊరట కల్గిస్తో౦ది ” అంటుంది కుంతి
కోడలితో –
కడు పసిబిడ్డ
వీడొకటి కాదవునా యెఱుగండు ముంద రె
య్యెడనొకపాటెఱు౦గ(డెద
యె౦తయు కోమలమెప్పుడైన నే
కుడువగబిల్తు గాని
తనకుం గల యాకటి ప్రొద్దెఱు౦గడీ
కొడుకిటు పోకకున్
మనము గు౦దెడు నిన్గని యూరడిల్లెడున్ ( మహాభారతం,
విరాటపర్వం, ద్వితీయాశ్వాస౦,209).
అంతే కాకుండా
భోరున ఏడుస్తూ అమ్మా! నిన్ను నమ్మి
వీరందఱితో బాటు ఈ సహదేవుణ్ణి
వవాసానికనుమతిస్తున్నాను అంటుంది .
ఏనును మీరు కానలకు నేగు నెడన్ నను జేరి యె౦తయున్
దీనత దోప కుంతి
సహదేవుని నిల్లడ నెట్టి నాకు న
మ్మా! నిను నమ్మి
చాల విషమం బగునివ్వనవాస మీతడుం
బూనగ నియ్యకొంటి నని
బోరన నశ్రులు గ్రమ్ము చుండగన్
( మహాభారతం,
విరాటపర్వం, ద్వితీయాశ్వాస౦,211)
నిజానికిదంతా ఒక
flask back . ద్రౌపది అజ్ఞాతవాససమయంలో ఒక సందర్భంలో ఈ విషయాన్ని భీమునికి వివరించి
చెబుతుంది. అత్త మెచ్చిన కోడలే ఉత్తమురాలు. కోడలు మెచ్చిన అత్తయే గుణవంతురాలు
No comments:
Post a Comment