వందే సంస్కృతమాతరం
वन्दे
संस्कृतमातरम्
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
సంస్కృతభాషలో వేదాలు,
పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు,
ఆగమశాస్త్రాలు కావ్యాలు ఇంకా ఎన్నెన్నో ప్రక్రియలున్నాయి.
సంస్కృతసాహిత్యంలో ఉన్న ముద్రితగ్రంథాల పేర్లు చదవి, సారాశం గ్రహించడానికే
ఒక జీవితకాలం సరిపోదు. ఇక అముద్రితగ్రంథాలు మరెన్నో వేలకువేలుగా తాళపత్ర
గ్రంథాలయాల్లో ఉన్నాయి. ఇంతటి సువిశాలమైన, సమగ్రమైన, సమృద్ధవంతమైన సంస్కృతసాహిత్యాన్ని ఒక కవి స్త్రీ మూర్తితో
పోల్చి చాల చక్క గా వర్ణించాడు .
వేదాలకు ఆఱు
అంగాలున్నాయి. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు , నిరుక్తం, జ్యోతిషం, కల్పం. శిక్ష
అంటే ఏ మంత్రాన్ని ఏ స్వరంతో ఉచ్చరించాలో వివరించే శాస్త్రం. దీన్ని Phonetics
అంటారు. వ్యాకరణం పదస్వరూపాన్ని వివరిస్తుంది. దీన్ని Grammar
అని పిలుస్తారు. చందస్సు అంటే శ్రుతి పేయమైన లయబద్ధమైన వృత్తముల స్వరూపస్వభావాలను వివరించే గ్రంథం . దీన్ని Prosody అంటారు.
నిరుక్తం అంటే పదాల వ్యుత్పత్తిని వివరించే శాస్త్రం. దీన్ని Etymology అని
వ్యవహరిస్తారు. ఇక జ్యోతిషం అంటే యజ్ఞయాగాదులు మొదలుపెట్టడానికి, ముగించడానికి
ముహూర్తం నిర్ణయించే శాస్త్రం. దీన్ని Astrology అంటారు. ఇక కల్ప౦ అంటే మంత్రాల
యొక్క క్రమబద్ధమైన వినియోగాన్ని వివరించే
శాస్త్రం. ఇందులో గృహ్యసూత్రాలు, శ్రౌతసూత్రాలు, శుల్భసూత్రాలు మొ|| ఎన్నో
భాగాలున్నాయి. ఇందులో ప్రాచీనభారతీయులు Geometry, Trigonometry మొ|| శాస్త్రాల్లో
సాధించిన ప్రగతి కన్పిస్తుంది.
ఇక సంస్కృతసరస్వతికి
చందస్సు పాదాలు (feet). నిరుక్తం గోళ్ళు (nails). శిక్ష మొదలైన
శాస్త్రాలు పిక్కలు (legs). ఋగ్వేదం, సామవేదం తొడలు (thigh). అథర్వవేదం కటిభాగం (hips and loins). యజుర్వేదం
ఉదరం (belly). తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం ( న్యాయ - వైశేషికాలు)
ఈ రెండు స్తనాలు (breasts). వ్యాకరణం, స్మృతులు ఈ రెండు చేతులు ( hands). కావ్యములు
ఆమెకు ముఖం ( face). వేదా౦తశాస్త్రం ఆమెకు కన్నులు (eyes). అటువంటి సంస్కృతసరస్వతికి
నమస్కారం .
ఛంద: పాదయుతాం
నిరుక్తనఖరాం శిక్షాదిజంఘాన్వితాం
ఋక్సామోరు
యుగామథర్వజఘనామధ్వర్యువేదోదరాం
తర్కన్యాయకుచాం పదస్మృతిభుజాం
కావ్యారవిందాననాం
వేదాంతామృతలోచనాం
భగవతీం వాగ్దేవతామాశ్రయే.
No comments:
Post a Comment