శ్రీరామలింగేశ్వరదశకం
చిలకమర్తి
దుర్గాప్రసాదరావు.
౧.
శ్రీకారంబును
జుట్టినాడను వచశ్శ్రీలన్నుతుల్సేయగా
సాకారుండవొ!
నిర్గుణుండవొ!
వెసన్
సాయుజ్యసంపత్తితో
లోకంబుల్
దయ బ్రోవ వేడెద దయాళూ!
సాంబ!
సర్వేశ!
యో
శ్రీకంఠా!
పరమర్షివంద్యసుగుణా!
శ్రీరామలింగేశ్వరా!
౨.
తలపై జాబిలియుండ
పూజలకు పద్మశ్రేణి నీకేల?
వె
న్నెలవెల్గుండగ
నీకు కప్పురముతో నీరాజనంబేల?
గం
గలన్మౌళితలాననుండ
నభిషేకవ్రాతమేలయ్య ?
నిం
దిలకింపంగనె
చాలు ముక్తి గలుగున్
శ్రీరామలింగేశ్వరా!
౩.
చుట్టుంగైదువు
జోదుపట్టిని వెసన్ సొంపారగా
బూదియౌ
నట్టుల్
సేసిన పోటరంబు తగ మూడౌ
తొల్లిజేజేగమిన్
మట్టిం
గల్పిన నీమగంటిమి తలంపన్నబ్బురంబౌ
జగా
జెట్టీ!
నీకివె
యేటికోల్లు గొనుమా శ్రీరామలింగేశ్వరా!
౪.
వరకైలాస
నగంబొ ! భక్తజనహృత్పద్మంబొ
! శ్రీ
పార్వతీ
కరయుగ్మాంతరదేశమో
! ద్విరదరక్షస్సౌధకూటంబొ!
ఈ
శ్వర!
నీ యున్కి
ప్రశస్తి గాంచిన ప్రదేశంబెద్దియో
గాని నీ
చిరునామానెఱిగింప
రావె కరుణన్ శ్రీరామలింగేశ్వరా
౫.కవితాశక్తి
హుళక్కి వ్యాకరణవాక్యన్యాయవేదాంతశా
స్త్ర
విశేషంబుల ప్రజ్ఞ శూన్యమఘనాశం
బైన నీదివ్య రూ
పవిశేషంబునుగాంచి
ముగ్ధుడయి కైవల్యంబు
గాంక్షించితిన్
శివనామస్మరణన్
భజింతు నిరతిన్ శ్రీరామలింగేశ్వరా
!
౬.
పురముల్
గాల్చి సురాళి కష్టదశలంబోకార్చుటల్
గల్ల సా
గరమంథానభయప్రదోధ్ధృతమహాకాలాగ్ని
కంఠస్థలిన్
ధరియింపందలపోయుటన్నది
యబద్ధంబయ్య నన్నిప్డుమె
చ్చిరయంబుంగరుణింపనవ్వి
నిజముల్ శ్రీరామలింగేశ్వరా!
౭.
హిమశైలాత్మజ
నీకు నెచ్చెలి గణాధీశుండు
నీకెప్డు కూ
రిమి
సేయంగలయట్టి పుత్రుడు
ధరిత్రీజాతనాధుందు ని
త్యము
నిన్గోరి భజించువాడు
దివిజాధ్యక్షుండు నీవంక పొ
చ్చెము
లేకుండు ననూహ్యమిట్టి మహిమల్
శ్రీ రామలింగేశ్వరా!
౮.
ఖల సంసర్గము
దూఱి సాధుజనపుంగవ్రాతముంగోరి
ని
ర్మలవైరాగ్యఫలప్రసిద్ధములుగా
రంజిల్లు నీదైన ని
శ్చల
సన్మంగళ మూర్తి జేరి దినముల్
సాగింతు నాయాత్మ రం
జిల
కైవల్య మొసంగి బ్రోవగదవే
శ్రీ రామలింగేశ్వరా!
౯.
ఆరామంబులకెల్ల
నెన్నదగు క్షీరారామమందుండి
ని
న్నారాధించుట
చేసి నాకు హితవిద్యాసక్తిగల్గెన్నిజం
బౌరా!
నీమహిమల్
నుతించుటన శక్యంబౌనె నెవ్వారికిన్
క్షీరారామపురీ
విహారరసికా శ్రీరామలింగేశ్వరా!
౧౦.
'నిజమే కొంపయు
గోడు లేని యతడా నిన్నేలునా'
యంచు ప
ల్కుజనుల్
అచ్చెరువంది ముక్కుపయి
వ్రేలుంజేర్చు చందాన న
క్కజమౌ
రీతిని నన్ను బ్రోచి
పిదపంగైవల్యముంజూపి య
ర్ధిజనత్రాణపరాయణుండవగుమా
శ్రీరామలింగేశ్వరా!
___
౧౬.
No comments:
Post a Comment