రమాకుమార
డాక్టర్
.
చిలకమర్తి
దుర్గాప్రసాదరావు.
౩/౧౦౬,
ప్రేమ
నగర్,
దయాల్బాగ్
,
ఆగ్రా
౨౮౨౦౦౫.
సంస్కృతభాష
చాల విస్తృతమైనది.
ఏ భావాన్నైనా
వ్యక్తం చెయ్యగల చక్కని
చిక్కని పదజాలం ఉంది.
అపారమైన
భావసంపద ఉంది.
చిత్రవిచిత్రమైన
కవితారీతులున్నాయి.
కవితారీతులలో
'అనులోమవిలోమం'
అనే ప్రక్రియ
ఒకటి . అనులోమవిలోమమంటే
ఎటు చదివినా ఒకే విధంగా ఉండడం
. దీన్ని
ఆంగ్లంలో palindrome
అంటారు.
ఉదాహరణకి
'did' , 'noon', ' Madam , 'kayak' , '
Malayalam ' వంటి
పదాలు ' was
it a car or a cat I saw' ,
'Madam I'm
Adam', 'Able was I ere I saw elba' మొదలైన
వాక్యాలు పరిశీలిస్తే అవి
ఎటు చదివినా ఒకలాగే ఉంటాయి.
ఒకే
అర్థాన్నిస్తాయి.
భాషలో ఇటువంటి
పదాలు సహజంగా ఉన్నా వాక్యాల
కూర్పు మాత్రం చాల కష్టమైన
పని. ఇటువంటి
పదాలు వాక్యాలు వివిధభాషల్లో
తరచుగా కన్పిస్తాయి.
ఇక సంస్కృతసాహిత్యం
మాటకొస్తే ఇటువంటివి ఎన్నో
కావ్యాలే మనకు దర్శనమిస్తాయి.
ఉదాహరణకు
వేంకటాధ్వరి రచించిన రాఘవయాదవీయం
కావ్యమంతా అనులోమవిలోమంగానే
నడుస్తుంది. రామాయణ
భాగవతకథలను అందిస్తుంది.
మచ్చుకు
ఒకశ్లోకం :
"
రామధామ
సమానేన మాగోరోధన మాస తాం
నా
మహా మక్షరరసం తారాభాస్తు
న వేద యా "
అనే
శ్లోకం రాముణ్ణి వర్ణిస్తే
, ఇదే
తిరగబడి
"యాదవేన
స్తు భారాతా సంరరక్ష మహామనా:
తాంసమానధరో
గోమా ననే మాస మధామరా:”
అని
కృష్ణుణ్ణి వర్ణిస్తుంది.
అలాగే
దైవజ్ఞసూర్య కవి
రచించిన రామకృష్ణఅనులోమవిలోమకావ్యం
కూడ ఎటు చదివినా ఒకలాగే ఉండి
రాముని కథను కృష్ణుని కథను
వర్ణిస్తుంది.
తం
భూసుతా ముక్తిముదారహాసం
వందే
యతో లవ్యభవం దయాశ్రీ:
శ్రీయా
దవం భవ్య లతో య దేవం
సంహారదా
ముక్తి ముతా సుభూతం
ఇక
తెలుగుకవుల్లో సంస్కృతపదాల
వేడిని వాడిని రుచిచూపించిన
మహామనీషి రామరాజభూషణుడు
(భట్టుమూర్తి).
ఏ
పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా
శక్తివంతంగా ప్రయోగించాలో
ఆయనకు తెలిసినట్లు మరొకరికి
తెలియదని చెప్పవచ్చు.
సమస్తపదాలు
ఆయన కనుసన్నల్లో సంచరిస్తూ
ఉంటాయి.
అందుకే
"పలుకులబేహారి
భట్టుమూర్తి"
అనే
వారు మా గురుదేవులు కీ॥శే॥
మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు..
భట్టుమూర్తి
తన వసుచరిత్రలో ఒకచోట
రమాకుమార
అనే ఒక అద్భుతమైన అనులోమ
విలోమ పదాన్ని ప్రయోగించారు.
అది
మిగిలిన పదాల్లాంటి సామాన్యమైనది
కాదు.
దానికో
ప్రత్యేకత ఉంది.
అదేమిటో
పరిశీలిద్దాం.
వసుచరిత్రలో
నాయకుడు వసురాజు.
నాయిక
గిరిక .
వాళ్లిద్దఱూ
పరస్పరం ఆకర్షితులౌతారు.
ఆమె
విరహావస్థలో ఉంటుంది.
ఆమెకు
ఎటుచూసినా మన్మథుడు
దర్శనమిస్తున్నాడు.
మన్మథునికి
ఎన్నో పదాలున్నాయి.
కాని
ఆ సందర్భంలో కవి "రమాకుమార"
అనే
పదం ఉపయోగించారు.
ఆ
పదం ఎటు చూసినా ఒకలాగే ఉండి
మన్మథుడనే అర్థాన్నే ఇస్తుంది.
రమాయా:
కుమార:
రమాకుమార:
. రమా
అంటే లక్ష్మి కుమార:
అంటే
కొడుకు (మన్మథుడు).
ఇక
ఎలా చూసినా మన్మథుడు అనే
అర్థం రావడం ఈ పదం విశిష్టత.
ముందున్న
అక్షరం 'ర"
తీసేసి
చూస్తే '
మాకుమార'
అవుతుంది.
మాయా:
కుమార:
మాకుమార:
. మా
అంటే లక్ష్మి .మాయా:
(లక్ష్మి
యొక్క)
కుమార:
మాకుమార:
(మన్మథుడు)
. ఇపుడు
'మా'
అనే
అక్షరం తీసేసి చూద్దాం.
కుమార
అంటే మన్మథుడు.
'కు
అనే అక్షరం కూడ తేసేసి చూద్దాం
.
మార
అంటే మన్మథుడు.
చివరికి
మా అనే అక్షరం కూడ తీసేద్దాం
.
"ర"
అంటే
కూడ మన్మథుడే.
రస్య
(
మన్మథుని
యొక్క)
ఆజీవ:
(వృత్తి
/
జీవనాధారము)
రాజీవ:
( పద్మం).
రమాకుమార
పదంలో ఇంత సొగసు ఉందని
సూచించడానికా అన్నట్లు కవి
అఱిముఱి అనే పదం ఉపయోగించారు.
అఱిముఱి
అంటే తాఱుమాఱుగా అనే అర్థం
కూడ ఉంది.
బహుశ
ఇటువంటి పదం ప్రపంచసాహిత్యంలో
మఱెక్కడా కన్పించదు .
అఱమి
రమాకుమారుడపుడగ్రతలంబున
వచ్చినిల్చిన
ట్లఱిముఱి
దోచినం గువలయాక్షి వడంకి
కడంకదూలి
మైమఱచి
సుగంధ గంధగిరిమారుతపాతితవల్లికాభయై
యొఱగిన,
సంభ్రమించి
చెలులుద్గత బాష్పతరంగితాక్షులై
(౩/౧౭౯)
***
No comments:
Post a Comment