బాబోయ్
ప్రబంధసుందరి
డాక్టర్.
చిలకమర్తి
దుర్గాప్రసాద రావు.
మహాకావ్యాల్లో
పద్దెనిమిది వర్ణనలుంటయి.
వాటిలో
స్త్రీ వర్ణన ఒకటి.
ముఖ్యంగా
ఆ కావ్యం లోని నాయిక వర్ణన
అందులో చోటు చేసు కుంటుంది.
ప్రాచీనకవులందఱు
స్త్రీని చాల పవిత్రంగాను
సహజంగాను వర్ణించారు.
కాని రానురాను
ప్రబంధకవుల వర్ణనలు వెర్రి
తలలువేశాయి. వాళ్లు
ఏ అవయవాన్నీ విడిచిపెట్టలేదు.
ఎటువంటి
ఔచిత్యం పాటించ లేదు.
నిజంగా ఆ
వర్ణనలు తలచుకున్నా బొమ్మ
గీసి చూసుకున్నా చాల అసహ్యంగా
అనిపిస్తాయి కనిపిస్తాయి .
ముఖ్యంగా
కవులందరికి పద్మాలు చాల
లోకువగా దొరికాయి.
అన్ని అవయవాలను
పద్మాలతోనే పోల్చి వర్ణించడం
మొదలెట్టారు.
ఆమె ముఖం,
కళ్లు ,
కాళ్లు ,
చేతులు అన్నీ
పద్మాలతోనే పోల్చారు.
అ వర్ణనలను
ఆక్షేపిస్తూ ఒక ఆధునిక కవి
చాల చక్కని పద్యం చెప్పేరు.
ఆమె మొగం తామరట
, కన్ను
తామరలో దూరిన మరో తామరట.
కాళ్లు
తామరలట, చేతులుకూడ
తామరలే యట . ఇంతవిడ్డూరం
ఎక్కడైన ఉంటుందా!
మనం మొలతామర
(గోక్కునే
తామర) ఒక్కటే
విన్నాం . ఈ
విధంగా శరీరం అంతా తామరలున్న
ఆ స్త్రీ నిజంగా దూలగొండే
(forget me not) అవుతుంది
. ఆటువంటిది
వద్దు బాబోయ్ అసలొద్దు.
అటు
పయి మోము తామరట అక్షియు తామరలోన
తామరే
యట
చరణంబు తామరయె యంట కరంబును
తామరంట యిం
తటి
విపరీతమున్నె మొలదామరవింటిమి
గాని మేనియం
తటనిటు
తామరల్గలుగు తన్వి నిజంబుగ
దూలగొండియే
No comments:
Post a Comment