A
sloka from Gathaasaptasathi written by Hala of Satavahana dynasty
Dr. DurgaprasadaRao Chilakamarthi
अउलीनो
दोमुहओ ता महुरो भोअणं मुहे जाव |
मुरवो व्व खलो जिण्णम्मि
भोअणे विरसमारसई ||
(Maharastree
prakrit)
(अकुलीनो द्विमुख: तावन्मधुरो भोजनं मुखे यावत्
मुरज इव खलो जीर्णे भोजने विरसमाचरति )
ఏ విధంగా అకులీనుడు (అ+కు+లీన: కు అంటే భూమి లీన: అంటే ఉండేవాడు ఇక అకులీన: అంటే
నేలమీద నిలబడనివాడు ) కులీనుడు కాని వాడు అంటే నీచుడు తబలా ( తబలా కూడ నేలమీద
నిలబడదు ) వాద్యపరికరం వలె రెండు నోళ్ళు కలవాడు ( తబలాకు కూడ రెండు ముఖాలుంటాయి ) .
తబలాకు ఏవిధంగా లేపనం పూస్తే బాగా మధురంగా శబ్దం చేసి ఆ తరువాత లేపనం ఆరి పోగానే ఇంకో విధంగా ధ్వని చేస్తుందో అదే విధంగా
నీచుడు తనకు మంచిభోజనం లభించినప్పుడు
మధురంగా మాట్లాడతాడు . అది జీర్ణం కాగానే కటువుగా మారిపోతాడు . అంటే తనపని సాగుతున్నంతవరకు
మధురంగా మాట్లాడతాడని తనపని పూర్తికాగానే కటువుగా మారిపోతాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడని
తాత్పర్యం . ఈ శ్లోకం సాతవాహనవంశానికి చెందిన హాలుని
గాథాసప్తశతిలోనిది . ఈ శ్లోకం మహారాష్ట్రీ ప్రాకృతభాషకు సంబంధించినది .
మంచివాడు త్రికరణశుద్దితో ఒకే విధంగా ఉంటాడు . ఏది మనసులో అనుకుంటాడో అదే
చెభుతాడు . ఏది చెబుతాడో అదే ఆచరిస్తాడు . అలాగే ఎప్పుడు ఒకే విధంగా
ప్రవర్తిస్తాడు ముందొక లాగ తరువాత మరో లాగ ప్రవర్తించడు. కాని నీచుడు అలా కాకుండా స్వార్థ పూరితుడై
ప్రవర్తిస్తాడని తాత్పర్యం .
>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
No comments:
Post a Comment