శ్రీ జాషువ గారి రచనలలో
కృష్ణ తత్త్వం
డాక్టర్
. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ఆధునిక కాలానికి
సంబంధించిన సుప్రసిద్ధ కవులలో శ్రీ గుఱ్ఱ౦ జాషువ గారొకరు . ]ఆయన కరుణరసాన్ని
ఆలంబనగా చేసుకొని కవిత్వాన్ని సృష్టించిన మహనీయులలో ఒకరు. వారెన్నో కావ్యాలు,
ఖండకావ్యాలు, నాటకాలు, కావ్య ఖండికలు, కథలు కూడ రచించారు . కావ్య ఖండికలలో
ఎంతోమంది పురాణ పురుషులను విశ్లేషించారు .
వారు విశ్లేషించని పౌరాణిక పాత్ర ఇంచుమించు లేదనే చెప్పవచ్చు . కృష్ణ తత్త్వాన్ని
చాల చక్కగా వర్ణించిన కవులలో ఆయన ఒకరు . ఇక వారు రచించిన రుక్మిణీ కళ్యాణ నాటకం
ఎంతో ప్రసిద్ధి పొ౦దింది .
వారి పద్య రచన
ఎంతోమంది ప్రాచీన కవుల ధోరణులను పోకడలను ఎత్తుగడలను తలపింప చేస్తాయి . వారు
రుక్మిణీ కళ్యాణ నాటకంలోను , శల్యసారధ్యం
అనే కావ్య ఖండికలోను కృష్ణ తత్వాన్ని, అలాగే శ్రీ కృష్ణుని దివ్యత్వాన్ని చాల చక్కగా
వర్ణి౦చారు . రుక్మిణీ కల్యాణంలోని పద్యాలు పోతనగారి పద్యాలను, తిక్కన గారి
ఎత్తుగడలను మనకు గుర్తుకు తెస్తాయి.
రుక్మిణీ కల్యాణంలో కృష్ణుని కోరికపై
రుక్మిణిని చేరుకున్న అగ్నిద్యోతనుడు ఆమెకు శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని ఎంత చక్కగా
వివరించాడో చూడండి.
ఈరేడు లోకాలు ఆయన కుక్షిలోనే ఇమిడి ఉన్నాయట.
ఈ భువనభాండంలో మొత్తం పదునాలుగు
లోకాలున్నాయి . క్రింద అతల, వితల,
సుతల,
తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అనే ఏడు లోకాలు ;
పైన
భూలోక , భువర్లోక ,
స్వర్లోక
,మహర్లోక ,
జనోలోక,
తపోలోక , సత్యలోకములనే
ఏడూ మొత్తం పదునాలుగు ఆయన కుక్షిలోనే
ఉన్నాయట .
పరమపావని గంగాభవాని ఆయన పాదాల నుంచి
పుట్టిందట .
సాటిలేని మేటి జ్ఞాని ,
సకలవిద్యాస౦పన్నుడైన
బ్రహ్మ ఆయ న బొడ్డు నుండి జన్మిం చాడట. సర్పములకు శత్రువైన గరుత్మ౦ తుడు ఆయనకు
ఎక్కిరి౦త అంటే వాహనమట. ఆయ న దశావతారములను ఎత్తి ఈ లోకాలను రక్షిం చచున్న మహాను
భావుడట .
“ ఎవ్వాని కుక్షిలో నిమిడి యేపారుచు
నుండు నీ బ్రహ్మాండ భాండ మెల్ల,
నెవ్వాని పదముల నింపు
జనించెనా
గగన సంభూత గంగా భవాని,
ఎవని పొక్కిట జని యించి పెంపు వహించె
నిరుపమజ్ఞాని వాణీధవుండు,
నెవడద్భుత స్థితి నెక్కిరింతగ
దాల్చె
దళితోరగున్వినతాకుమారు
నెవ్వడవతార దశకంబునెత్తి భువన
సప్తకము నేలుచుండె ప్రశస్త
కీర్తి
నట్టి నారాయణునకర్ధాంగి వగుచు,
నేలెదవు గాత మమ్ము శుండాలయాన.
అలాగే ఆయన మరొక రచన శల్య సారథ్యం. మన ఇతిహాసాల్లో ఇద్దరు సారథులు కనిపిస్తారు . ఒకడు ఉత్తరుడు రెండోవాడు శల్యుడు . ఇద్దరు
గొప్పవాళ్లే
. కాని ఒకటే తేడా . ఒకడు
యజమానిని ఉత్సాహపరచడంలో గోప్పవాడైతే రెండోవాడు నిరుత్సాహపరచడంలో గొప్పవాడు . ఉత్తరుడు
అర్జునుని ఉత్సాహ పరచడంలో గొప్పవాడైతే ఉత్తరుడు కర్ణుని నిరుత్సాహపరచడంలో చాల
నేర్పరి .
పద్యం చూడండి :
అహిమస్తకముల కొయ్యారంబునేర్పించు
వలపు పిల్లనగ్రోవి పాటగాడు
పసితనంబునయందె పాము
పడగల మీద
చి౦దులాడెడు గొల్ల చిన్నవాడు
పదియారువేల గోపస్త్రీలతో గూడి
యపవాదు నెఱుగని య౦దగాడు
లోకా౦తమున మఱ్ఱియాకు తెప్పందేలి
తలదాల్చుకున్న చిత్రస్వరూపి
భాసురములైన తన చారెడేసి కనుల
మత్తు జల్లెడు వేలుపుమా౦త్రికుండు
తొడరి యర్జును నరదంబు దోలుచుండె
కాంచి విల్లందు
కొనుము భాస్కరకుమార!
No comments:
Post a Comment