ఉపనిషత్తులు – మృత్యు తత్త్వ విశ్లేషణ
మొదటి భాగం
డా. సిహెచ్. దుర్గా ప్రసాద రావు
dr.cdprao@gmail.com
మృత్యుతత్త్వాన్ని విశ్లేషించడంలో ఉపనిషత్తుల
పాత్ర ఎంతో సమున్నతం గాను, ప్రత్యేకమైనది
గాను, మరియు ఆకర్షణీయం గాను ఉంది .
వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పరిశీలిద్దాము
. ఇది మరణించిన వ్యక్తి ఆత్మకు,
వారి బంధువులకు ఎంతో ఓదార్పునిస్తుంది. వేదాంతము అని మరో పేరుతో కూడ పిలువబడే ఉపనిషత్తులు
వేదాలలోని ముగింపు భాగాలు. అంతము అంటే సారాంశ రూపము అని అర్థం . అవి వేదతత్త్వసారాంశరూపాలు
. అవి నిగూఢమైన స్వభావం కలిగి
ఉండటం వలన వ్యక్తిగత
ఆత్మ మరియు పరమాత్మ మధ్య గల వాస్తవిక
సంబంధం, వాటి యొక్క స్వభావం, ప్రపంచ
స్వరూపం , జీవిత లక్ష్యం మొదలైన వాటితో వ్యవహరిస్తాయి. ‘ఉపనిషత్’ అనే పదం 'షద్' అనే
ధాతువు మరియు ‘ఉప’ మరియు ‘ని’ అనే రెండు ఉప సర్గల నుండి ఉద్భవించింది. ఇవి అన్నీ
కలిసి గురువు యొక్క సమీపంలో అధ్యయనం చేయ దగినవి; బ్రహ్మజ్ఞానాన్ని అందించేవి, పుట్టుక, వృద్ధాప్యం,
మరియు మరణం వలన కలిగే భయానికి సంబంధించిన మనిషి యొక్క సహజమైన అజ్ఞానాన్ని నాశనం చేసి అతనికి
జ్ఞానోదయం కలిగించి తద్ద్వారా మోక్షానికి నడిపించేవి అని అర్థం . ఉపనిషత్తులు
వేదజ్ఞానం యొక్క సారాంశం. తత్వశాస్త్రం, అనుభవంతో మేళవించి
గత అనేక శతాబ్దాలుగా మానవ మనస్సును
ప్రభావితం చేస్తున్నాయి, మానవత్వం నుండి దైవత్వానికి బంగారు బాటలు వేస్తున్నాయి, మార్గం సుగమం చేస్తున్నాయి.
వాటి ప్రకారం, మరణంతొ ఒకరి ఉనికి పూర్తిగా నశించదు .
మన శాస్త్రాలు, ఒక
తాత్విక మార్గాన్ని సూచిస్తూ, మరణానికి భయ పడవద్దని హెచ్చరిస్తున్నాయి. ఓ మూర్ఖుడా! నువ్వు
మరణానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడి నంత మాత్రాన యముడు నిన్ను వదిలివేస్తాడని నువ్వు
అనుకుంటున్నావా? వదిలే ప్రసక్తి లేదు. కానీ అతను పుట్టని వానిని ఏమీ చెయ్య లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి, ఈ
లోకంలో మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ప్రయత్నించు అంటాయి .
మృత్యో: బిభేషి కిం మూఢ! భీతం ముంచతి వై యమ:
అజాతం నైవ గృహ్ణాతి కురు యత్నమజన్మని ||
ఇక్కడ ‘అజన్మని’ అంటే జన్మ రాహిత్యం అనే
పదం మూడు అంశాలను కలిగి ఉంటుంది.
2. మరణం యొక్క స్వభావాన్ని సరిగ్గా అర్థం
చేసుకోవడం.
3. ఆత్మ యొక్క శాశ్వతమైన ఉనికిపై నమ్మకం.
To be continued.........
No comments:
Post a Comment