Thought
of the day (17/ 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
న
సత్యం కేవలం సత్య
మనృతం
న తథాsనృతం
హితం
యత్సర్వలోకస్య
తత్సత్యం
శేషమన్యథా
కేవలం
సత్యం సత్యమనిపించుకోదు.
దాని
వల్ల లొకానికి ప్రయోజనం ఉంటేనే
అది సత్యమౌతుంది.
అలాగే
కేవలం అసత్యం అసత్యమవ్వదు
. అది
లోకానికి నష్టం కలిగిస్తేనే
అసత్యమౌతుంది.
ఉదాహరణకు
ఒక విషయాన్ని పరిశీలిద్దాం.
ధర్మరాజు
రథం భూమికి తగలకుండ నడుస్తుందని
ఒక ప్రతీతి ఉంది.
భారతయుద్ధంలో
ద్రోణాచార్యులవారిని చంపవలసిన
సమయం వచ్చింది.
'అయ్యా!
మిమ్మల్ని
చంపగలిగే మార్గం చెప్పండి
' అని
స్వయంగా ఆయన్నే అడిగారు.
నన్నెవరూ
చంపలేరు.
చాల
విషాదకరమైన వార్త తెలిస్తే
నా అంతట నేనే మరణిస్తాను
అన్నారాయన.
భారతయుద్ధం
జరుగుతోంది.
భీష్ముని
మరణానంతరం ద్రోణాచార్యులవారు
సర్వసైన్యాధ్యక్షులయ్యారు.
ఆయన
పరాక్రమానికి పాండవపక్షం
చెల్లాచెదరైపోయింది.
అశ్వత్థామ
మరణవార్త వింటే ఆయనమరణిస్తాడని
అలా చెప్పమని కృష్ణుడు
ధర్మరాజును కోరాడు.
ధర్మరాజు
అబద్ధం చెప్పడానికి నిరాకరించాడు.
అప్పుడు
భీముడు అశ్వత్థామ అనే పేరుగల
ఒక ఏనుగును చంపాడు.
అపుడు
ఆవిషయం ఆయనకు తెలియజెయ్యమన్నాడు.
ధర్మరాజు
అశ్వత్థామ హత:
(కుంజర:)'
అన్నాడు.
కుంజర:
అనే
శబ్దం ఆయనకు వినపడకుండ
జాగ్రత్తపడ్డారు.
ద్రోణాచార్యులు
తనకుమారుడు చనిపోయాడని
భావించి ధనుర్బాణాలను
విడిచిపెట్టేశారు.
ధృష్టద్యుమ్నుడు
ఆయన్ని అవలీలగ చంపేశాడు.
ఇక్కడ
అశ్వత్థామ అనే ఏనుగు చనిపోవడం
వాస్తవమే.
ధర్మరాజు
అబద్ధమేమీ ఆడలేదు.
కాని
ఆయన రథం నేలకు ఆనుకు పోయింది.
దానికి
కారణం అయనమాట్లాడింది సత్యమే
అయినా ద్రోణాచార్యులను చంపాలనే
దురుద్దేశం మనస్సులో ఉండడమే.
మరో
ఉదాహరణ.
ఒకరోగి
నయంకాని వ్యాధితో బాధపడుతూ
ఉంటాడు.
కాని
డాక్టరు రోగికి ధైర్యం
చేకూర్చడానికి అబ్బే మీకేమీ
పరవా లేదండి తప్పకుండ నయమౌతుంది
అంటాడు.
దీనికి
కారణం బ్రతికిన నాలుగు రోజులైన
ఆ రోగి హాయిగా ఉండాలని.
ఇక్కడ
ఆయన అబద్ధమాడినా అది ధర్మంగానే
పరిగణింపబడుతుంది .
ఎందుకంటే
ఉద్దేశం మంచిది కాబట్టి .
అందువల్ల
సత్యాసత్యాలు,
ధర్మాధర్మాలు
పనులబట్టి కాదని ఉద్దేశాన్ని
బట్టే ఉంటాయని తెలుసుకోవాలి.
न
सत्यं केवलं सत्यमनृतं न
तथानृतम् |
हितं
यत्सर्वलोकस्य तत्सत्यं
शेषमन्यथा ||
A
mere Truth is not a Truth. A mere lie is not a lie. A truth is that
which is good for the world and it is the lie which ruins the
world.
(
Kindly forward this to atleast five of your friends)
No comments:
Post a Comment