Sunday, February 17, 2013

15 /02 /13


Thought of the day (15/ 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
०९८९७९५९४२५


ప్రథమా ప్రతిమా పూజా
జపస్తోత్రాణి మధ్యమా
ఉత్తమా మానసీ పూజా
సొsహం పూజోత్తమోత్తమా

ఆధ్యాత్మిక వికాసానికి విగ్రహారాధన మొదటి మెట్టు. జపం చెయ్యడం స్తోత్రాలు వల్లించడం రెండో మెట్టు. మానసికంగా ధ్యానం చెయ్యడం మూడో మెట్టు. ఇక తానే భగవంతుడని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం చివరిదైన నాలుగోమెట్టు. ఇదే లక్ష్యం . ఇదే పరమావధి.

प्रथमा प्रतिमा पूजा
जपस्तोत्राणि मध्यमा
उत्तमा मानसी पूजा
सोsहं पूजोत्तमोत्तमा

Idol worship is said to be the first step of spirituality; praising God by chanting hymns is the second; meditation is the third and realization of identity of individual soul with the Ultimate Reality is the highest and the ultimate.

14 /02 /13


Thought of the day (14/ 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

న చోరహార్యం న చ రాజహార్యం
న భ్రాతృభాజ్యం న చ భారకారి
వ్యయీకృతే వర్ధత ఏవ నిత్యం
విద్యాధనం సర్వధనప్రధానం

ధనాన్ని దొంగలు అపహరిస్తారు. కాని విద్య అనే ధనాన్ని దొంగలు అపహరించలేరు. ధనాన్ని రాజు వశ పరచుకుంటాడు. కాని విద్య అనే ధనాన్ని రాజు వశపరచుకోలేడు. ధనాన్ని అన్న దమ్ములు పంచుకుంటారు. కాని విద్యాధనాన్ని ఎవరూ పంచుకోలేరు. ధనం ఉండే కొద్ది భారం పెరుగుతుంది. కాని విద్య అనే ధనం పెరిగే కొద్ది భారం తగ్గుతుంది. ధనం ఖర్చు చేస్తే తరుగుతుంది. కాని విద్యాధనం ఖర్చుచేసే కొద్ది పెరుగుతుంది. అందువల్ల ఈ విద్యాధనం అన్ని ధనాల్లో కెల్ల ఉత్తమ ధనంగా పరిగణింపబడుతోంది.

न चोरहार्यं न च राजहार्यं
न भ्रातृभाज्यं न च भारकारि |
व्ययीकृते वर्धत एव नित्यं
विद्याधनं सर्वधनप्रधानम् ||

The wealth in the form of education is unique. No thief can steal it. No king can grab it by force . It can not be divided among brothers. It does not creat any kind of burden. When spent, it increases day by day. Education indeed is the best of all treasures. It remains secure with oneself for ever.
( kindly forward this to at least five of your friends)

13 /02 /13


Thought of the day (13 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

వృధా వృష్టి: సముద్రేషు
వృధా తృప్తస్య భోజనం
వృధా దానం సమర్థస్య
వృధా దీపం దివాపి చ

వర్షం పంటపొలంలోనో మరో చోటనో కురిస్తే ప్రయోజనం ఉంటుంది గాని సముద్రంలో కురిస్తే వ్యర్ధమే. ఆకలితో ఉన్న వాడికి భోజనం పెడితే ఉపయోగం గాని కడుపు నిండిన వాడికి పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. బలహీనుడికో లేక వికలాంగుడికో దానం చేస్తే ప్రయోజనం ఉంటుంది గాని బలవంతుడికి, సమర్థుడికి దానం చేస్తే వ్యర్థమే. దీపం చీకట్లో వెలిగిస్తే ప్రయోజనం గాని పట్టపగలు వెలిగిస్తే వ్యర్థమే.

वृधा वृष्टि: समुद्रेषु
वृधा तृप्तस्य भोजनम् |
वृधा दानं समर्थस्य
वृधा दीपं दिवापि च ||

It is futile to rain in the ocean. It is futile to serve food to a man who has already taken food. It is futile to give money to a healthy person. It is also futile to light a lamp in day time.

( kindly forward this to at least five of your friends)

12 /02 /13


Thought of the day (12/ 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti



గతే పితరి పంచత్వం
మాతా పుత్రస్య నిర్వృతి:
న చ మాతృవిహీనస్య
మమత్వం కురుతే పితా.

తండ్రి మరణించినచో తల్లి పిల్లల్ని ప్రేమతో పెంచుతూ తండ్రి లేనిలోటు కనబడకుండా చేస్తుంది. కాని తల్లే ముందుగా మరణిస్తే తండ్రి అటువంటి ప్రేమను పిల్లలకివ్వ లేడు .

गते पितरि पंचत्वं
माता पुत्रस्य निर्वृति: |
न च मातृविहीनस्य
ममत्वं कुरुते पिता ||

when the father is dead , the mother is the source of joy ( affection). But the father does not feel affection towards the son whose mother is dead.

( kindly forward this to at least five of your friends)

11 /02 /13


Thought of the day (11/ 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

ఏకో దేవ: సర్వభూతేషు గూఢ:
సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా
కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస:
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ
( శ్వేతాశ్వతర ఉపనిషద్//)
అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడొక్కడే. అతడే సర్వవ్యాపి. సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్తకర్మలకు ఫలప్రదాత. సమస్త ప్రాణులకు అంతర్యామి. అన్నికర్మలకు సాక్షి. జ్ఞాన స్వరూపుడు. సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు. అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు. అతని కంటే ఇతరుడు మరొకడు లేడు. అతనిలో ఎటువంటి విభాగము లేదు. అతడు గుణాతీతుడు. శుద్ధచైతన్య స్వరూపుడు.
एकॊ देव: सर्वभूतेषु गूढ:
सर्वव्यापी सर्वभूतान्तरात्मा
कर्माध्यक्ष: सर्वभूताधिवास:
साक्षी चेता केवलो निर्गुणश्च |
( श्वॆताश्वतर उपनिषद् ७/)
One God is hidden in all beings. He is the inmost Self of all beings. He spervises all actions. He is the resting place of all beings. He is the witness. He is the Pure Consciousness. He is one without a second. He is beyond all attributes.
( kindly forward this to at least five of your friends)

10 /02 /13




Thought of the day (10 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti


దుర్జనో మాతృగర్భస్థ:
మాతృమాంసం న ఖాదతి
నతత్ర కరుణా హేతు:
తత్ర హేతురదంతతా

దుర్జనుడు తనతల్లి గర్భంలో ఉంటున్నప్పుడు ఎందుకోగాని తల్లి మాంసం తినడు. అందుకు కారణం అతడు దయగలవాడనుకోకండి. కేవలం పళ్లు లేకపో వడం వల్లనే తినడంలేదు. పళ్లుంటే తినేసే వాడే .

दुर्जनो मातृगर्भस्थ:
मातृमांसं न खादति|
न तत्र करुणा हेतु:
तत्र हेतुरदन्तता ||

The wicked man, while living in the womb of her mother , does not eat the flesh of her mother. The cause , for not eating fles h of his mother is not grace, but tooth less ness.


( kindly forward this to at least five of your friends)

09/02/13




Thought of the day (9/ 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
న త్వహం కామయే రాజ్యం న స్వర్గం నాsపునర్భవం
కామయే దు:ఖతప్తానాం ప్రాణినామార్తి నాశనమ్ ( భాగవతం)
రంతిదేవుడు గొప్ప రాజే కాక పరమభాగవతుడు. తనసంపదను నిరుపేదలకు పంచి చివరకు తినడానికి తిండి కూడ లేని స్థితికి చేరుకున్నాడు. ఎన్నో వారాల పాటు ఆకలితో అలమటించాడు. ఒక రోజున కొంత ఆహారం దొరికింది. భార్యాపిల్లలకు పంచి తనవాటా తినడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఆకలితో నకనక లాడుతున్న ఒక అతిథి వచ్చాడు. రంతిదేవుడు తనవద్దనున్న ఆహారం అంతా ఇచ్చేశాడు. ఇక త్రాగడానికి కొంతనీరు మాత్రమే ఉంది. అతడు వెళ్లి పోయాక నీరుత్రాగడానికి సన్నద్ధమయ్యాడు. అంతలో ఆకలిదప్పికలతో బాధపడుతున్న మరొక వ్యక్తి వచ్చి 'ఆకలితో అలమటిస్తున్నాను తినడానికేమైనా ఉంటే పెట్టండి' అన్నాడు. రంతిదేవుని దగ్గర అన్నం లేదు. అందువల్ల తనవద్దనున్న నీటితో అతని దప్పిక తీర్చుతూ ఈ మాటలంటాడు.
నేను రాజ్యసుఖాలను కోరను. స్వర్గం కోరను. జన్మరాహిత్య రూపమైన ముక్తిని కోరను . దు:ఖంతో అలమటి స్తున్న సమస్త ప్రాణుల యొక్క దు:ఖ నివృత్తి నే కోరుతున్నాను

नत्वहं कामये राज्यं न स्वर्गं नाsपुनर्भवम्
कामये दु: खतप्तानां प्राणिनामार्ति नाशनम् ( shrimadbhagavatam of vedavyasa)
Rantideva was a great king and also a devotee of Lord Vishnu.He had donated his entire wealth to the poor and the needy and ultimately had no means even to take food. After the starvation of several weeks, one day, he casually got some food. When he was about to eat after distributing the share to his family members, a guest came and Rantideva offered all his food stuffs to him. There was only some water left . When he was about to drink, another guest came and asked him something to eat. Having had nothing to give, he offered a little bit of water to quench the thirst of that person. Rantideva was over come by pity and spoke these words.
I donot aspire for a kingdom nor for the heaven nor for even emancipation. I desire only the removal of sorrow of all creatures.
( kindly forward this to at least five of your friends)

08/02/13


Thought of the day (8 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

అహన్యహని భూతాని
గచ్ఛంతి యమమందిరం
అన్యే శాశ్వతమిచ్ఛంతి
ఆశ్చర్యం కిమత: పరం?

మహాభారతంలో యక్షుడు ధర్మరాజుని " ఈ ప్రపంచంలో అన్నిటికన్న ఆశ్చర్యకరమైన విషయ మేదైన ఉందా? " అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ధర్మరాజు " ఈ లోకంలో ప్రతిరోజు కోట్లాది ప్రాణులు మరణిస్తున్నాయి. ఇదంతా గమనిస్తున్నా మిగిలినవారు 'మేము శాశ్వతంగా ఉంటాం మాకు చావు లేదు' అనుకుంటూ ఉంటారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరేముంటుంది అన్నాడు.

अहन्यहनि भूतानि
गच्छन्ति यममन्दिरम् |
अन्यॆ शाश्वतमिच्छन्ति
आश्चर्यं किमत: परम्?

In the Mahabharata Yaksha asked Dharmaraja " what is the most wonderful thing in the world?. As a reply Dharmaraja said in the following words.
" Day after day, there are count less of creatures entering in to the abode of Yama. Looking al l this , the rest of the creatures , those who remain , believe themselves to be permanent and immortal. Can any thing be more wonderful than this"?
( Kindly forward this to at least five of your friends)

Friday, February 8, 2013

o7 /02 /13


Thought of the day (7 / 2 / 13)
(The gems of our tradition)

Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

జానాతు వివిధా: విద్యా:
జానాతు వివిధా: కళా:
ఆత్మానం న విజానాతి
యో న జానాతి సంస్కృతం

ఒక వ్యక్తి ఎన్నెన్నో విద్యలు నేర్చుకోవచ్చు. ఎన్నెన్నో కళలలో నిష్ణాతుడు కావచ్చును. కాని సంస్కృతం
నేర్చుకొననిచో తనను తాను తెలుసుకోలేడు. అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందలేడు.

जानातु विविधा: विद्या:
जानातु विविधा: कला: |
आत्मानं न विजानाति
यो न जानाति संस्कृतम् ||

One may know many branches of learning and one may know various fine arts. If he doesn't know Sanskrit he can not know himself. He can not attain the knowledge of Self.

06 /02 /13


Thought of the day (06 /0 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
                                                                                                    09897959425
శబ్దాదిభి: పంచభిరేవ పంచ
పంచత్వ మాపు: స్వగుణేన బద్ధా:
కురంగమాతంగపతంగమీన
భృంగా: నర: పంచభిరంచిత: కిం?

మానవుడు సుఖంగాని దు:ఖంగాని పొందడానికి ఇంద్రియాలే సాధనాలు. ఇంద్రియాల వల్ల పొందే సుఖం ప్రారంభంలో బాగానే ఉన్నట్లనిపించినా పరిణామం చాల భయంకరంగ ఉంటుంది. ద్వేషించే శత్రువు చేతికి మనం చిక్కితే వాడు మనల్ని చంపెయ్యొచ్చు లేదా ఒకవేళ దయతో విడిచిపెట్టినా విడిచిపెట్టొచ్చు. కాని ఇంద్రియాలకు వశమైతే తప్పించుకు బయటపడే ప్రసక్తే లేదంటారు బుద్ధ భగవానుడు ( see సౌందరనందం of Aswaghosha)
శ్రీ శంకరాచార్యుల వారు, ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవో వివరిస్తూ లేడి, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద అనే ఐదు ప్రాణులు వాటి యొక్క ఇంద్రియ చాపల్యాన్ని అణచుకోలేక నశిస్తున్నాయి. లేడి చెవికి ఇంపైనట్టి (వేటగాడి) సంగీతానికి ఆకర్షింపబడి, ఏనుగు చర్మం మీద వ్యామోహంతో వేటగాడు ఎరవేసే ఆడ ఏనుగు ప్రలోభానికి చిక్కి , మిడతని కళ్లు మోసగించగా అగ్ని లోపడి, చేప జిహ్వా చాపల్యాన్ని అణచులోలేక గాలానికి తగుల్కొని, తుమ్మెద ముక్కువల్ల మోసపోయి సంపెంగపై వ్రాలి తమ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఓ మానవుడా! నీకు ఐదింద్రియాలూ ఉన్నాయి. నిన్నెవడు కాపాడగలడు? అని ప్రశ్నిస్తారు.

शब्दादिभि: पंचभिरेव पंच
पंचत्वमापु: स्वगुणॆन बद्धा:
कुरंग मातंग पतंग मीन
भृंगा: नर: पंचभिरंचित: किम् || ( श्री शंकराचार्यस्य विवेकचूडामणि: ७६)

The deer, the elephent, the moth, the fish, and the black bee -these five have died , being tied to one or the other of the five senses, namely sound, etc., through their own attachment. What then is in store for man who is attached to all these five? ( translated by swami Madhavananda)

05 /02 /13.


Thought of the day (5 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425


గతే శోకో న కర్తవ్య:
భవిష్యం నైవ చింతయేత్
వర్తమానేన కాలేన
వర్తయంతి విచక్షణా:

ఏ వ్యక్తి, జరిగిన దాని గుఱించి చింతించకూడదు. దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే ఎప్పుడో జరగబోయేదాని గురించి కూడ ఆలోచించ కూడదు. దాని వల్ల కూడ ఏమీ ప్రయోజనం ఉండదు. అందువల్ల తెలివైన వారు ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. వర్తమానం గురించి ఆలోచించడమే తెలివైన వారి లక్షణం.

गतॆ शॊकॊ न कर्तव्य:
भविष्यं नैव चिन्तयॆत् |
वर्तमानेन कालेन
वर्तयन्ति विचक्षणा:
( चाणक्यनीतिसार: 13/2.edited by Haberlin)

one should not grieve for the past, nor should one think of the things to come; for the wise men live in accordance with the present time.

(Kindly forward this to atleast five of your friends )

Monday, February 4, 2013

o4 /02 /13


Thought of the day (4 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

కాలకూటం చ దైత్యానాం పీయూషం చ దివౌకసాం
ఉభౌ మిళిత్వా మర్త్యానాం కాఫీ భూలోకవాసినాం

దేవతలు, రాక్షసులు కలసి పాలసముద్రాన్ని చిలికారు. ముందుగా కాలకూట విషం వచ్చింది. రాక్షసులకు అంటగట్టారు. ఆ తరువాత అమృతం వచ్చింది. దాన్ని దేవతలు దక్కించుకున్నారు. ఇది తెలిసిన మనుషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. బ్రహ్మతో ' ఏ మయ్యా! వాళ్లకది దక్కింది. వీళ్లకిది దక్కింది . మరి మాకేంటి? అని నిలదీసి అడిగారు. బ్రహ్మకు కూడ మానవులకన్యాయం జరిగిందనే భావన కలిగింది. కానీ ఇవ్వడానికేమీ లేదు. అందువల్ల కాలకూటం లోంచి 'కా' , పీయూషం ( అమృతం) లోంచి ' పీ" తీసి తాజాగా ' కాఫీ' తయారు చేసి తీసుకోండి అన్నాడు. అంతే మనవాళ్లు లొట్టలేసుకుంటూ వెనక్కొచ్చారు.
कालकूटं च दैत्यानां पीयूषं च दिवौकसाम् |
उभौ मिलित्वा मर्त्यानां काफी भूलॊकवासिनाम्

Brahma , the creator of the world , on the request made by human beings , extracted 'ka' from , Kalakuta, ( poison) ; and ' pi' from 'piyusha' ( ambrosia) , generated coffee and bestowed it to them .
( kindly forward this to at least five of your friends)

Sunday, February 3, 2013

03 /02 /13


Thought of the day (3 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తి: ( శ్రీ ఆదిశంకరాచార్యులు)

మానవుడు మంచివారితో స్నేహం చెయ్యడం వల్ల సంగరహితుడౌతాడు. సంగరహితుడవ్వడంవల్ల మోహం నశిస్తుంది. మోహం నశిస్తే మనస్సు స్థిరం అవుతుంది. మనస్సు నిలకడగా ఉన్న వాడికి జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. కాబట్టి మంచివారితో స్నేహమే అన్ని లాభాలకు మూలకారణం.

सत्संगत्वॆ निस्संगत्वं
निस्संगत्वे निर्मॊहत्वम्
निर्मॊहत्वॆ निश्चलतत्त्वं
निश्चलतत्त्वे जीवन्मुक्ति: ( श्री आदिशंकराचार्य:)


Company of good people leads to detachment , detachment leads to non- delusion; and non delusion leads to steadfastness of mind which ultimately leads to liberation while living.
( Sri Adi Sankaracharya)
(kindly forward this to atleast five of your friends)