Thursday, January 31, 2013

31 /1 /13


Thought of the day ( 31 / 1 / 13)
(Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425



ఊర్ధ్వబాహు: విరౌమ్యేష:
న కశ్చిత్ శ్రూయతే చ మే
ధర్మాదర్థశ్చ కామశ్చ
స ధర్మ: కిం న సేవ్యతే?

అయ్యా! నేను రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.ఏ ఒక్కడు నామాట వినడం లేదు. ముందు ధర్మం దాన్ని ఆధారం చేసుకుని అర్థం, కామం ఉంటాయి. అటువంటి ఆధారభూతమైన ధర్మం మీరెందుకు సేవించడంలేదు? ఎందుకు విస్మరిస్తున్నారు?

ऊर्ध्वबाहु: विरौम्येष:
न कश्चित् श्रूयते च मे
धर्मादर्थश्च कामश्च
स धर्म: किं न सेव्यतॆ? ( The Mahabharata of Vedavyasa)

My dear people! With folded hands I am crying but no one is listening to me. Dharma` is the basis of Artha and Kama . Why that supreme dharma is being neglected by you?
{ Kindly forward this to at least five of your friends}







30 /1 /13


Thought of the day (30 / 1 / 13)
Gems of our tradition
Dr. Durgaprasada Rao Chilakamarti

కో జానీతే కదా కస్య
మృత్యుకాలో భవిష్యతి ?
అద్యైవ ధర్మశీల: స్యా
దనిత్యం ఖలు జీవితం.

ఏ మనిషి ఎప్పుడు మరణిస్తాడో ఎవరికి తెలుసు? ఎవరికీ తెలీదు . అందువల్ల మానవుడెప్పుడు ధర్మమార్గంలో నడుస్తూ మంచిపనులు చేస్తూనే ఉండాలి . ఎందుకంటే జీవితం అశాశ్వతం. ఏక్షణంలోనైనా రాలిపోవచ్చు.
को जानीते कदा कस्य
मृत्युकालो भविष्यति ?|
अद्यैव धर्मशील: स्या
दनित्यं खलु जीवितम् ||

who knows whose death will occur at what time? . There fore, one should be o f right conduct right now, because , life is uncertain.
{ Kindly forward this to at least five of your friends}

29 /1 /13


Thought of the day ( 29 / 1 / 13)
(Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

అజరామరవత్ప్రాజ్ఞ:
విద్యామర్థం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు
మృత్యునా ధర్మ మాచరేత్

మానవుడు తనకు ముసలి తనం కాని మరణం కాని లేవను భావంతో ధనాన్ని విద్యను సంపాదించాలి. ఇక మృత్యువు తన ను జుట్టుపట్టుకొని లాగుచున్నదను భావంతో ధర్మాన్ని ఆచరించాలి.

अजरामरवत्प्राज्ञ:
विद्यामर्थं च साधयेत्
गहीत इव केशेषु
मृत्युना धर्ममाचरेत्

A wise man should acquire knowledge and wealth as if he has no oldage and death and he should also perform dharma thinking that he is captured by the death.

{ Kindly forward this to at least five of your friends}








Monday, January 28, 2013

28 /1 /13


Thought of the day ( 28 / 1 / 13)
Gems of our tradition

Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

కాక: కృష్ణ : పిక: కృష్ణ:
కో భేద: పికకాకయో:
వసంతకాలే సంప్రాప్తే
కాక: కాక: పిక: పిక:

కాకి నల్లగా ఉంటుంది. కోకిల కూడ నల్లగానే ఉంటుంది. బాహ్యంగా ఆ రెంటికి తేడా లేదు. కానీ వసంతకాలం వస్తే ఆ రెంటికి తేడా తెలుస్తుంది. కాకి కాకే కోకిల కోకిలే. క్లాసులో కూడ విద్యార్ధు లందఱు చూడ్డానికి ఒకలాగే ఉంటారు. పరీక్షా ఫలితాలు వచ్చాక తెలుస్తుంది ఎవరెటువంటివారో.

काक: कृष्ण: पिक : कृष्ण:
को भेद: पिककाकयो :
वसन्तकाले सम्प्राप्ते
काक: काक: पिक: पिक:

A crow is black and cuckoo is also black. Apparently , there is no difference between those two. But, when spring season arises a crow is a crow, a cuckoo is a cuckoo. Similarly , all students look alike. Only examinations decide who is who and what is what.

{ Kindly forward this to at least five of your friends}


27 /1 /13


Thought of the day (27 / 1 / 13)
( Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా:
యత్రైతాస్తు న పూజ్యంతే
సర్వాస్తత్రాఫలా: క్రియా: ( మనుస్మృతి)

ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ సమస్త దేవతలు సంతోషిస్తారు . ఇక ఎక్కడైతే వారు గౌరవింపబడరో / చులకనగా చూడ బడతారో అక్కడ చేసిన పుణ్య కర్మలన్నీ వ్యర్థమై పోతాయి. స్త్రీలను గౌరవిస్తేనే చేసిన పనులన్ని సఫలమౌతాయనీ వారిని అవమానిస్తే ఎన్ని మంచిపనులు చేసినా వ్యర్థమని సారాంశం.

यत्र नार्यस्तु पूज्यन्ते
रमन्ते तत्र देवता:
यत्रैतास्तु न पूज्यन्ते
सर्वास्तत्राफला: क्रिया:

Where women are honoured , the Gods are delighted and where they are not honoured/ humiliated, all sacred rites performed become futile.


{ Kindly forward this to at least five of your friends}




Saturday, January 26, 2013

26 /1 / 13


Thought of the day ( 26 / 1 / 13)
Gems of our tradition
Dr. Durgaprasada Rao Chilakamarti

అపి స్వర్ణమయీ లంకా
నమే లక్ష్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ

ఓ లక్ష్మణ! ఈ లంకా నగరం సిరిసంపదలతో తులతూగే బంగారునగరమే అయినప్పటికి నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడను. ఎందుకంటే కన్నతల్లి ఉన్న ఊరు (జననీ, జన్మభుమి) స్వర్గం కన్న చాల గొప్పవి.

अपि स्वर्णमयी लंका
न मे लक्ष्मण !रोचते
जननी जन्मभूमिश्च
स्वर्गादपि गरीयसी

Oh My dear brother , Lakshmana! Even though this kingdom of Lanka, is a golden one with all prosperity; I, do not want to stay here , because, the mother and the mother land are indeed greater than the heaven

{ Kindly forward this to at least five of your friends}

25 /1 /13


Thought of the day ( 25 / 1 / 13)
(Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425
అద్యాష్టమీతి నవమీతి త్రయోదశీతి
జ్యౌతిష్యవాచోపవసన్తి తత్ర
సాక్షాచ్ఛ్రుతం తత్వమసీతి వాక్యం
న విశ్వసన్త్య ద్భుతమేతదేవ"

ఒక శిష్యుడు " స్వామీ! ఈ లోకంలో వింతల్లోకెల్ల పెద్ద వింత ఏమైన ఉందా అని తన గురువును అడిగాడు. దానికి సమాధానంగా గురువు నాయనా! వింతల్లోకెల్ల చాల గొప్ప వింత ఒకటుంది . చెబుతాను విను. అదేంటంటే పురోహితులు వచ్చి ఈ రోజు అష్టమి, ఈ రోజు నవమి, ఈ రోజు త్రయోదశి అని చెప్పగానే అందఱు భక్తితో ఉపవాసాలు వ్రతాలు చేస్తున్నారు. కాని శ్రుతి అంటే వేదం ఒరేయ్! నువ్వు సాక్షాత్తుగా భగవంతుడివిరా అని పదే పదే నొక్కి చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంత కన్నా గొప్ప వింత ఏముంటుందయ్యా! అన్నాడు గురువు.
"अद्याष्टमीति नवमीति त्रयॊदशीति
ज्यौतिष्यवाचॊपवसन्ति तत्र
साक्षाच्छ्रुतं तत्त्वमसीति वाक्यं
न विश्वसन्त्यद्भुतमॆतदॆव
A student of Vedanta asked his teacher whether there is any amazing thing in the world. As a reply the teacher said like this:
It is really an amazing thing that people who observe so many vratas and fasts with devotion during the auspicious days of 'Ashtami' , ' Navami', ' Trayodashi' and so on, by being instructed by priests; ignore the command “ Tat tvam asi ” ( Thou art That ) given by the Veda, which means that ' ' You are the Ultimate Reality ”.
{ Kindly forward this to at least five of your friends}

Friday, January 25, 2013

24 /1 /13


Thought of the day (24 / 1 / 13)
Gems of our tradition
Dr. Durgaprasada Rao Chilakamarti

రాజవత్ పంచవర్షాణి
దశవర్షాణి దాసవత్
ప్రాప్తే తు షోడశే వర్షే
పుత్రం మిత్రవదాచరేత్

తల్లిదండ్రులు తమ పిల్లలను ఐదు సంవత్సరాల వరకు మహారాజుని చూసినట్లు చూడాలి. తరువాత పది సంవత్సరాల పాటు ప్రేమానురాగాలు చూపిస్తూనే కట్టుదిట్టంగా పెంచాలి. పదహారు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత మిత్రుణ్ణి చూసినట్లు చూడాలి.

राजवत् पंच वर्षाणि
दशवर्षाणि दासवत् |
प्राप्तॆ तु षोडशे वर्षे
पुत्रं मित्रवदाचरेत् ||

children should be treated as kings with affection till they are five year(s) old. They should be subjected to discipline , tendered with love, for ten years. After reaching the age of sixteen they should be treated as one's own friends.

{ Kindly forward this to at least five of your friends}

Wednesday, January 23, 2013

23 /1 /13.


Thought of the day ( 23/1/13)
( Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425
పుత్రేషు రాగో హి నిసర్గజాత:
పిత్రాదిభక్తిస్తు ప్రయత్నసాధ్య:
నీచైర్గతిస్సా సహజా జలస్య
యత్నేన సాధ్యోర్ధ్వగతిస్తు తస్య. ( శ్రీజటావల్లభుల పురుషోత్తం గారి చిత్రశతకం)

తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఉండే ప్రేమ సహజమైనది. ఇక పిల్లలకు తల్లి దండ్రులపై గలప్రేమ మాత్రం ప్రయత్నం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. అది నిజమే. నీటికి పైనుండి క్రిందికి ప్రవహించడం చాల సహజమైన ధర్మం. కాని క్రిందనుండి పైకి ప్రవహించాలంటే అది ప్రయత్నం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.

पुत्रेषु रागॊ हि निसर्गजात:
पित्रादि भक्तिस्तु प्रयत्नसाध्य: |
नीचैर्गतिस्सा सहजा जलस्य
यत्नेन साध्योर्ध्वगतिस्तु तस्य || ( श्री जटावल्लभुल पुरुषोत्तमकवे: चित्रशतकात् )

The love of parents to wards their children is natural where as the love of children towards their parents is to be cultivated by effort. The flow of water from higher place to lower region is natural and from lower to higher is to be achieved through effort.

{ Kindly forward this to at least five of your friends}

Tuesday, January 22, 2013

22 /1 /13


Thought of the day ( 22 / 1/ 13)
(Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవచక్రవాళం
నాsభ్యర్థితో జలధరోsపి జలం దదాతి
సంత: స్వయం పరహితే విహితాభియోగా: ( భర్తృహరి / నీతి శతకం)

సూర్యుడు పద్మములకు నిలయమైన కొలనును వికసింపచేస్తున్నాడు. చంద్రుడు కలువల సముదాయాన్ని వికసించేల చేస్తున్నాడు. తననెవరూ అడగకుండానే మేఘం వర్షాన్ని అందిస్తోంది. సత్పురుషులు తమంతట తామే స్వయంగా ఇతరులకు మేలుచెయ్యడానికి పూనుకుంటారు.

पद्माकरं दिनकरो विकचं करोति
चन्द्रॊ विकासयति कैरवचक्रवालं
नाsभ्यर्थितॊ जलधरोsपि जलं ददाति
सन्त: स्वयं परहिते विहिताभियोगा: || ( नीतिशतकम् / भर्तृहरि:)

The Sun causes the lotus to bloom. The moon on its own makes the lily to bloom. The cloud too with out being requested, gives water. Great people are always taking the initiative to do good to others.

{ Kindly forward this to at least five of your friends}

Monday, January 21, 2013

21 /1 /13.


Thought of the day ( 21 / 1 / 13)
(Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

సరిహిం న సరేహిం, న సరవరే హిం న వి ఉజ్జాణవణేహిం
దేస రవణ్ణా హోంతి వఢ! నివసన్తేహిం సు అణేహిం
( హేమచంద్రుడు రచించిన అపభ్రంశప్రాకృత శ్లోకం)

ఓరి మూర్ఖుడా! ఏ దేశమైన నదుల వలన, సరస్సుల వలన, పెద్ద పెద్ద తటాకముల వలన , ఉద్యానవనాల వలన గొప్పది కాజాలదు అందులో నివసించే సంస్కారవంతులైన ప్రజల వలననే గొప్పదౌతుంది.
( దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారికిది స్ఫూర్తి )

सरिहिं न सरेहिं न सरवरॆहिं न वि उज्जाण वणॆहिं
दॆस रवण्णा होंति वढ! निवसन्तॆहिं सुअणॆहिम्
{ हेमचन्द्रविरचित: अपभ्रंशप्राकृतश्लोक:}
Oh fool ! countries become great neither by rivers, nor by lakes nor by ponds nor by gardens ; but, by the good people live with in.

{ Kindly forward this to at least five of your friends}

20 /1 /13.


Thought of the day ( 20 / 1 / 13)
( Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

న జాతు కామ: కామానా
ముపభోగేన శామ్యతి
హవిషా కృష్ణవర్త్మేవ
భూయ ఏవాభివర్ధతే ( వేదవ్యాసుడు)

కోరికలనేవి అగ్ని లాంటివి. నేయి పోసే కొద్దీ అగ్ని ఇంకా ఇంకా ఎక్కువగా మండుతున్నట్లుగానే అనుభవించే కొద్దీ అవి ఎక్కువౌతూనే ఉంటాయి. అనుభవించడంవల్ల ఎప్పుడూ తరిగి పోవు. అదుపు చేయడమొక్కటే మార్గం. ఉదాహరణకు ఒకరోజు సినిమా చూస్తే రెండో రోజు కూడ చూడాలనిపిస్తుంది. రెండో రోజు చూస్తే మూడో రోజు కూడ చూడాలనిపిస్తుంది. అలా కాకుండ ఒక రోజున మానేసి చూడండి. ఆ రోజున కొంచెం కష్టం అనిపించినా ఆ తరువాత దానిపై అసలు దృష్టే ఉండదు.

न जातु काम: कामाना
मुपभोगेन शाम्यति
हविषा कृष्णवर्त्मॆव
भूय एवाभिवर्धते. (वेदव्यास:)

Desire is never satisfied by the enjoyment of the objects of desire, it grows more and more as does the fire in which fuel is added. So desire is not controlled by entertaining it ; but, it can be controlled by not entertaining it.
{ Kindly forward this to at least five of your friends}








Saturday, January 19, 2013

19 /1 /13


Thought of the day (19 / 1 / 13)
Gems of our tradition
Dr. Durgaprasada Rao Chilakamarti

నమస్తే వైద్యరాజాయ
యమరాజ సహోదర!
యమస్తు హరతి ప్రాణాన్
వైద్య: ప్రాణాన్ ధనాని చ

మృత్యుదేవత (M.D) యగు యమరాజు నకు సోదరుడవైన ఓ వైద్యరాజ ! నీకు నమస్కారం. యముడు ప్రాణం ఒక్కటే అపహరిస్తాడు . వైద్యుడవైన నువ్వు పాణాలు ధనం రెండు అపహరిస్తావు
( ప్రాణమివ్వగానె యమకింకరుడు పోవు
డాక్టరట్లు కాదు డబ్బులడుగు)

नमस्ते वैद्यराजाय !
यमराज सहोदर !
यमस्तु हरति प्राणान्
वैद्य: प्राणान् धनानि च
Oh Doctor! The b rother of Yama dharmaraja! accept my salutation. The difference between Yama and you is this . Yama takes away life alone . But , as doctor you take away life as wel l as money.
( Though, the pill will not kill the patient, the bill will kill the patient ) .
( This verse is applicable to pseudo doctors only)

{ Kindly forward this to at least five of your friends}







Friday, January 18, 2013

18 /1 /13


Thought of the day ( 18/1/13)
( Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

పూర్వజన్మకృతం పుణ్యం
భాగ్యరూపేణ వర్ధతే
పూర్వజన్మకృతం పాపం
వ్యాధి రూపేణ బాధతే

పూర్వజన్మలో చేసిన పుణ్యం, ఈ జన్మలో సంపద రూపంలో వృద్ధి పొందుతుంది. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో‌ వ్యాధి రూపం లో బాధిస్తుంది. కాబట్టి మానవుడెప్పుడు ఇతరులకు మంచి చెయ్యడానికే ప్రయత్నించాలి. చెడు మాత్రం చెయ్య కూడదు

पूर्वजन्मकृतं पुण्यं
भाग्यरूपेण वर्धते
पूर्वजन्मकृतं पापं
व्याधिरूपेण बाधते

Good deeds of previous births bestow affluence on man during this birth. Misdeeds committed, persecute a man in the form of deseases during this life. So , man is expected to do good to others always.


{ Kindly forward this to at least five of your friends}

17 /1 / 13


Thought of the day ( 17 / 1/ 13)
( Gems of our tradition)

Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

పరై: ప్రోక్తా: గుణా: యస్య
నిర్గుణోs పి గుణీ భవేత్
ఇంద్రోsపి లఘుతాం యాతి
స్వయం ప్రఖ్యాపితై: గుణై:

ఇతరులు పొగిడినచో ఎంత అల్పుడైన గొప్పవాడుగా పరిగణింపబడతాడు. దేవతలకు రాజైన ఇంద్రుడు లాంటి గొప్పవాడు కూడ తనను తాను పొగడుకొంటే చాల చులకనైపోతాడు. కాబట్టి ఒక వ్యక్తి గొప్పదనం ఇతరులు చెబితే రాణిస్తుంది గాని తనకు తానే చెప్పుకుంటే రాణించదు.
परै: प्रॊक्ता गुणा : यस्य
निर्गुणोsपि गुणी भवेत्
इन्द्रॊsपि लघुतां याति
स्वयं प्रख्यापितै: गुणै:
A man will become great when his qualities are praised by others even though he is other wise. Even Indra, the leader of Gods , will be rediculed if he boasts himself.

{ Kindly forward this to at least five of your friends}

16 /1 /13


Thought of the day ( 16 / 1 / 13)
Gems of our tradition
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425
ఆయు : కర్మ చ విత్తం చ
విద్యా నిధనమేవ చ
పంచైతాన్యపి సృజ్యంతే
గర్భస్థస్యైవ దేహిన:

మానవుడు తన తల్లి గర్భంలో ఉండగానే ఆయువు, చేసేపని, సంపాదించ గలిగే డబ్బు, చదువు, మరణం ఈ ఐదు నిర్ణయింపబడతాయి.

आयु: कर्म च वित्तं च
विद्या निधनमेव च
पंचैतान्यपि सृज्यन्ते
गर्भस्थस्यैव देहिन:

The span of life , occupation, money , education and death ; there five factors are pre determined. They are decided by the creater when one is in the womb of his or her mother.


{ Kindly forward this to at least five of your friends}












Tuesday, January 15, 2013

15 /1 / 13


Thought of the day ( 15 /1 / 13)
Gems of our tradition

Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425
ఉదయంతు శతాదిత్యా:
ఉదయంత్విందవ: శతం
న వినా కవివాక్యేన
నశ్యంత్యాభ్యంతరం తమ:

వందలకొలదీ సూర్యులుదయించుగాక . వందలకొలదీ చంద్రులుదయించు గాక. మానవుని హృదయాంతరాళాల్లో ఉండే అజ్ఞానమనే చీకటి కవుల మాటల వలన మాత్రమే తొలగిపోతుంది. ఇంకేమీ మానవుని అజ్ఞానాన్ని తొలగించలేవు.

उदयन्तु शतादित्या:
उदयन्त्विन्दव: शतम्
न विना कविवाक्यॆन
नश्यत्याभ्यन्तरं तम:



Let hundreds of Suns shine. Let hundreds of moons shine . But, the ignorance, hidden in the inner chambers of the heart of people, be dispelle d only by the words of a poet only.

But, words are things; and a small drop of ink
Falling, like dew upon a thought, produces
That which makes thousands , perhaps millions think
(Byron,-Don Juan , Canto-III, st. 88

{ Kindly forward this to at least five of your friends}






14 /1 / 13


Thought of the day ( 14 / 1 / 13)
(Gems of our tradition )
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

కాక ఆహ్వయతే కాకం
యాచకో నతు యాచకం
కాక యాచకయోర్మధ్యే
వరం కాకో న యాచక:

ఒక కాకి తనకు ఆహారం దొరికినప్పుడు అన్ని కాకుల్నీ పిలుస్తుంది. కాని ఒక ముష్టివాడు తనకు ఆహారం లభించే చోటు తెలిస్తే‌ ఎవరికి చెప్పడు. అంతా తానే నొల్లుకు పోతాడు. కాబట్టి ముష్టివాడు కాకి ఈ ఇద్దరిలో ఎవరు నయమా అని ఆలోచిస్తే ముష్టివాడి కంటే కాకే నయమనిపిస్తుంది.

काक आह्वयते काकं याचको न तु याचकम् |
काकयाचकयोर्मध्ये वरं काको न याचक: ||

A crow invites another crow . But a beggar does not invite another beggar. So between a crow and a beggar crow is better.


{ Kindly forward this to at least five of your friends}














13 /1 / 13.


Thought of the day ( 13/1/13)
Gems of our tradition

Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

లోకవార్తానుగమనే జిహ్వా నర్తతి సర్వశ:
ఈశవార్తానుగమనే ద్వాత్రింశద్దంత కీలిత:

నీచమైన లౌకిక విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన నాలుక ఎన్నో విధాలుగా నాట్యం చేస్తుంది. దానికి అలసటయే ఉండదు. కాని దేవతాసంబంధమైన విషయాలు మాట్లాడవలసి వచ్చినప్పుడుగాని లేక భగవన్నామం ఉచ్చరించవలసి వచ్చినప్పుడు గాని మన నాలుక ముప్పై రెండు పండ్ల మధ్య బంధింపబడి బిగుసుకు పోతుంది. బయటకు అసలు రానే రాదు.

लॊकवार्तानुगमने जिह्वा नर्तति सर्वश:
ईशवार्तानुगमने द्वात्त्रिंशद्दन्तकीलित:

To speak of worldly matters, our tongue dances like any thing. But to chant the name of God I t is imprisoned with in thirty two teeth.







{ Kindly forward this to at least five of your friends}





12 /1 /13.


Thought of the day ( 12 /1 /13)
(Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

ఏతద్దేశ ప్రసూతస్య
విశేషాదగ్రజన్మన:
స్వం స్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యాం సర్వమానవా:

ఈ ప్రపంచంలో ఉండే మానవులందరు ఎవ్వడైన ఏ దేశానికి సంబంధించిన వాడైన భారతదేశంలో పుట్టిన జ్ఞానులవల్లనే తమ తమ నడవడిక తీర్చిదిద్దుకోవలసి యున్నది.

एतत् दॆशप्रसूतस्य
विशॆषादग्रजन्मन:
स्वं स्वं चरित्रं शिक्षेरन्
पृथिव्यां सर्वमानवा: (Manu)

The people of different countries in the world have learnt, learning and will continue to learn about how to mould their character from the great scholars of our country.


{ Kindly forward this to at least five of your friends}















Friday, January 11, 2013

11 /1 /13.


Thought of the day ( 11 / 1 / 13)
( Gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti


మృత్యో: బిభేషి కిం మూఢ!
భీతం ముంచతి వై యమ:
అజాతం నైవ గృహ్ణాతి
కురు యత్నమజన్మని.


ఓరి మూర్ఖుడా! మృత్యువుకి ఎందుకు భయపడతావ్ ? ఒకవేళ భయపడినా యముడు నిన్ను వదులుతాడను కుంటున్నావా! వదిలే ప్రసక్తి లేదు. ఒక విషయం గుర్తుంచుకో. పుట్టనివాణ్ణి అతనేమీ చేయలేడు. కాబట్టి పుట్టుక లేకుండా చూసుకో . జన్మరాహిత్యం కోసం ప్రయత్నించు.


मृत्यॊ: बिभॆषि किं मूढ!
भीतं मुंचति वै यम: ?
अजातं नैव गृह्णाति
कुरु यत्नमजन्मनि ||

Oh fool! Why are you afraid of death? Do you think that Yama, the God of death will spare you even if you are afraid ? But it is certain that he will not catch hold of an unborn. Therefore , try not to be born again in this world.


{ Kindly forward this to at least five of your friends}

Thursday, January 10, 2013

10 /1 /13.


Thought of the day ( 10 / 1 / 13)
( Gems of our tradition )
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425
ఏకం విషరసో హంతి
శస్త్రేణైకశ్చ హన్యతే
సరాష్ట్రబంధుం రాజానం
హన్త్యేకో భావవిప్లవ:
విషం ఒక్కణ్ణే చంపుతుంది. కత్తి కూడ ఒక్కణ్ణే చంపుతుంది. కాని విప్లవాత్మకమైన చెడు ఆలోచన రాజుని, రాజబంధువుల్ని, సమస్త దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఎన్నడు చెడు ఆలోచనలు వ్యాప్తి చేయరాదు.
एकं विषरसॊ हन्ति शस्त्रॆणैकश्च हन्यते |
सराष्ट्रबन्धुं राजानं हन्त्यैकॊ भावविप्लव: ||
Poison kills one person. sword also kills one person . But, the idea, which is destructive by nature destroys the entire nation. So one is not expected to propagate bad thoughts. ( Food, comes and goes but idea comes and grows )

{ Kindly forward this to at least five of your friends}