Tuesday, January 8, 2013

7 /1 /13


Thought of the day { 7/1/13}
( Gems of our tradition)

Dr. DurgaprasadaRao Chilakamarti

ఆలస్యం స్త్రీసేవా సరోగితా జన్మభూమివాత్సల్యం
సంతోషో భీరుత్వం షడ్వ్యాఘాతా: మహత్త్వస్య

మానవుని ప్రగతికి ఆఱు ఆటంకాలు. మొదటిది సోమరితనం అంటే బద్ధకం . బద్ధకస్థుడు దేనికి ముందడుగు వెయ్యలేడు. రెండోది స్త్రీ వ్యామోహం అంటే స్త్రీల పట్ల బలహీనత. పరస్త్రీ వ్యామోహం కలవాడు పైకి ఎదగలేడు. అలాగే భార్యకి బానిసగా ఉండేవాడు అంటే భార్య '' అంటే ' ' 'కి' అంటే 'కి' అనేవాడు కూడ ముందు కెదగలేడు. భార్య మాట వినడం ఆమెను గౌరవించడం తప్పేమీ కాదు. అయితే బానిసగా ఉండడం మాత్రం తప్పు. మూడోది రోగం . రోగం ఎవర్ని వేగంగా ముందుకు సాగనివ్వదు. నాలుగోది పుట్టిన ప్రదేశం పట్ల మితిమీరిన వ్యామోహం. అంటే ' నేను మాఊళ్లో ఉద్యోగం వస్తేనే చేస్తాను ఊరు విడిచి వెళ్లను' అనేవాడు ఎటువంటి ప్రగతి సాధించలేడు. ఐదోది ఉన్న దానితో ఏదోవిధంగా సరిపెట్టుకుపోయే స్వభావం. ఇదుంటే ఎక్కడికి వెళ్లడు ఏ పని చెయ్యడు. ఇక ఆరోది చివరిది పిరికితనం . పిరికివాడు ఏ సాహసం చేయలేడు. ముందడుగు వెయ్యలేడు.
आलस्यं स्त्रीसॆवा सरॊगिता जन्मभूमिवात्सल्यं
सन्तॊषॊ भीरुत्वं षड्व्याघाता: महत्त्वस्य

Laziness, toomuch affection t owards one's wife , illhealth, too much attachment to one's native place , cowardness , all these constitute the contributing factor s to supress one from becoming great.

{ Kindly forward this to atleast five of your friends}

No comments: