Wednesday, January 2, 2013

1/1/13


-->
Thought of th e day (1/1/13)
(The gems of our tradition)
Dr. DurgaPrasada Rao Chilakamarti

స్వగృహే పూజ్యతే మూర్ఖ:
స్వగ్రామే పూజ్యతే ధనీ
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే
(మూర్ఖుడు తన ఇంటిలో మాత్రమే గౌరవింపబడుతున్నాడు. ఎందుకంటే తాము గౌరవించకపోతే మిగిలిన వాళ్ళు గౌరవించరని లోకువగా చూస్తారని ఇంట్లో గౌరవిస్తూ ఉంటారు. ధనవంతుడు తన ఊరిలో మాత్రమే గౌరవింపబడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడయిన అడిగినప్పుడు డబ్బు అప్పుగా ఇస్తాడని గౌరవిస్తారు. ఆయన మీద ప్రేమతో కాదు. రాజు తన దేశంలో మాత్రమే గౌరవింపబడుతున్నాడు. ఒక దేశానికి రాజు దేశం దాటితే సామాన్యపౌరుడే అవుతాడు. కాని విద్యావంతుడు అంతట గౌరవింపబడుతున్నాడు. అంటే ఇంటిలోను, ఊరిలోను , దేశంలోను విదేశాలలోను కూడ గౌరవింపబడుతున్నాడు).
स्वगृहे पूज्यते मूर्ख: स्वग्रामे पूज्यते धनी
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते
A foolish man is respected only in his house . A wealthy man is respected only in his home town . A king is respected only in his kingdom . But a scholar is respected every where.
(Kindly forward this to at least five of your friends).



No comments: