Wednesday, March 6, 2019

Spoken Sanskrit - Lesson-27


        సంభాషణ సంస్కృతం –27
(Spoken Sanskrit)
Lesson-27
Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.

Unit 1. सप्तमीविभक्ति: Locative case
        ( अधिकरणार्थे )

अधिकरण means  the base or substratum . The word which denotes base or substratum is called Adhikarana and it is in Locative case.  It is in Locative case because it speaks of the location of a particular thing.
ఇది ఏడవ విభక్తి . ఇది అధికరణ కారకమునందు వాడెదము. అధికరణం అంటే ఆధారం . ఈ ప్రపంచమంతా ఆధార ఆధేయ భావంతో కూడి యున్నది . ఒక వస్తువునకు మరొక వస్తువు ఆధారం . ఏ వస్తువునకు ఏది ఆధారమో అది సప్తమీ విభక్తిలో ఉంటుంది .ఈ ఆధారం  ఔపశ్లేషికం, వైషయికం, అభివ్యాపకం అని  మూడు విధాలుగా ఉంటుంది . ఔపశ్లేషికం అంటే సమీపసంబంధం కలది  . ఉదాహరణకు ఘటే జలం అస్తి కుండలో నీరు ఉన్నది అనే వాక్యంలో కుండ ప్రక్కనే నీరు , నీటి ప్రక్కనే కుండ . నీరు ఆధేయం కుండ ఆధారం . కుండకు సప్తమీ విభక్తి రాగా కుండలో నీరు ఉన్నది ఘటే జలం అస్తి అనే వాక్యం ఏర్పడింది .
రెండోది వైషయికం అంటే విషయసంబంధం గలది . ఉదాహరణకు  మోక్షే ఇచ్ఛా ఆస్తి మోక్షమందిచ్ఛ కలదు . అనే వాక్యంలో ఆ ఇచ్ఛ మోక్ష విషయకమైనది. అందువల్ల మోక్షపదానికి సప్తమీవిభక్తి వచ్చింది. మోక్షే ఇచ్ఛా అస్తి. అనే వాక్యం ఏర్పడింది. మూడోది అభివ్యాపకము . అంటే అంతటా నిండినది . సర్వస్మిన్ ఈ శ్వర: అస్తి అన్నిటియందు  ఈశ్వరుడు ఉన్నాడు  అనే వాక్యం ఏర్పడింది  ఇక్కడ అంతట అనే అర్థాన్ని సూచించే  సర్వస్మిన్ అనే పదం సప్తమీవిభక్తిలో ఉంది . సర్వస్మిన్ ఈ శ్వర: అస్తీ
 అనే వాక్యం ఏర్పడింది.
  
1. जलं घटे अस्ति
Water is in the pot
2. लेखनी कोशे अस्ति
Pen is in the pocket.
3. माता गृहे अस्ति
Mother is in the house.
4. पिता कार्यालये अस्ति
Father is in the office
5. सीतारामौ पर्णशालायां निवसत:
Rama and Sita are in a hut.
6. रामलक्ष्मणौ गुरुकुले स्त:
Rama and Lakshmana are in a Gurukula
7. कृष्णार्जुनौ कुरुक्षेत्रे तिष्ठत:
Krishna and Arjuna are in Kurukshetra .
8. बालका:  कळाशालायां सन्ति ||
Boys are in the college.
9. बालिका: ग्रन्थालये सन्ति ||
Girls are in the library.
10. पण्डिता: वेदिकायाम् उपविशन्ति ||
Scholars are on the dais  

नौका समुद्रे अस्ति
Ship is in the sea
मीन: जले अस्ति
Fish is in the water
सूर्य आकाशे अस्ति
The Sun is in the sky
वृक्षे पलानि सन्ति
Fruits are in the tree
सीतारामौ वने  स्त:
Sita and Rama are in exile
भीमार्जुनौ   रणे स्त:
Bheema and Arjuna are in the battle field

मुखे नेत्रे स्त:
पद्मे सौरभम् अस्ति 
ग्रन्था: पुस्तकालये सन्ति
बीजं फले अस्ति
कनीनिका नेत्रे अस्ति
The eye ball is in the eye

Unit II. आसक्त्यादीनां विषयत्वेन

  ఆసక్తి , ప్రీతి , అభిరుచి , స్నేహం, విధేయత , జుగుప్స , కోరిక , అనాదరం , నిరాసక్తి , అత్యాసక్తి , అనాసక్తి , కుతూహలం, మొదలైన పదాలు ఉపయోగి౦చినప్పుడు వాటికి సంబంధించిన విషయాలను సూచించే పదాలకు సప్తమీ విభక్తి చేరుతుంది .    

बालकस्य क्रीडायाम् आसक्ति: अस्ति   
బాలునకు ఆటలలో ఆసక్తి కలదు

पण्डितस्य विद्यायां प्रीति: अस्ति
పండితునకు విద్యపట్ల ఇష్టము కలదు

स्त्रीणां नाट्ये अभिरुचि : अस्ति
స్త్రీలకు నాట్యము పట్ల కోరిక ఉండును

कुचेलस्य कृष्णे स्नेह: अस्ति ||
కుచేలునకు కృష్ణుని యందు స్నేహం కలదు .

धार्मिकस्य अधर्मे जुगुप्सा अस्ति
ధర్మాత్మునకు అధర్మం పట్ల అసహ్యం కలుగును
मूर्खाणां कलहे इच्छा अस्ति ||
మూర్ఖులు కలహి౦చుట యందు కోరిక గలవారు .

आतिथेयस्य अतिथि सत्कारे विषेषादर:  अस्ति ||
గృహస్థునకు  అతిథి సత్కారమునందు విశేషమైన ఆదరము ఉండును
शिष्यस्य वेदपठने श्रद्धा अस्ति
శిష్యునకు వేదం చదువుటలో శ్రద్ధ కలదు .
पुत्रस्य पितरि नम्रता अस्ति
పుత్రునకు  తండ్రి యెడ విధేయత కలదు
बालकस्य कथाश्रवणे इच्छा अस्ति
  బాలునకు కథలు వినుటలో ఆసక్తి ఉండును .

సప్తమీ విభక్తి  ఏకవచన ,ద్వివచన ,బహువచనములలో ఈ క్రింది విధంగా ఉండును . 
అకారాంత పుంలింగం :
रामे रामयो:- रामेषु
बालके बालकयो:- बालकेषु
అకారాంత నపుంసక లింగం :
मित्रे मित्रयो:-मित्रेषु
पुस्तके पुस्तकयो:- पुस्तकेषु
ఇకారాంత పుంలింగం

हरौ हर्यो: - हरिषु
कवौ कव्यो : -  -कविषु
ఉకారాంత పుంలింగం
गुरौ गुर्वो: -- गुरुषु

ఆకారాంత స్త్రీలింగం :

रमायां रमयो: =रमासु
गुहायां गुहयो: -गुहासु

ఈ కారాంత స్తీలి౦గం

गौर्याम्- गौर्यो:-गौरीषु
नद्याम्-  नद्यो:   नदीषु - 

SANSKRIT SLOKA

बालस्तावत्क्रीडासक्त: तरुणस्तावत्तरूणीसक्त:
वृद्स्तावच्चिन्तासक्त: परमे ब्रह्मणि कोsपि न सक्त:  
( A sloka from Bhajagovindastotra of Sri Sankaracharya )

A child is always interested in plays or playing. A young man is interested in beautiful ladies. An old man is always engaged with grief or attached in thinking about something. But no body is interested in Parabrahma , The Ultimate Reality .

బాలుడు ఎల్లప్పుడూ  ఆటల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు . యువకుడు ఎల్లప్పుడూ అందమైన యువతులపట్ల ఆసక్తి కలిగి ఉంటాడు . వృద్ధుడు ఎల్లప్పుడూ చింతామగ్నుడై  ఉంటాడు .  కాని పరబ్రహ్మ యందు మనస్సు లగ్నము చేయు వారు ఎవరును లేరు .