Tuesday, November 13, 2018

మహాత్ములకు ఆత్మబలమే అసలైన బలం ఆయుధాలు కావు


మహాత్ములకు ఆత్మబలమే అసలైన బలం ఆయుధాలు కావు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
3/106. ప్రేమనగర్, దయాల్బాగ్,
ఆగ్రా -5
08279469419.

తెలుగు చిత్రపరిశ్రమలో విజయాసంస్థ వారు  ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు . దానికి కారణాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే వారు తీసిన సినిమాలే . అవి ఆ నాటికి ఈ నాటికి ఏనాటికి చెక్కు చెదరని మొక్కవోని నిక్కమైన కళాఖండాలు .సంగీతానికి , సాహిత్యానికి ,సత్సా౦ ప్రదాయాలకు, అందమైన సందేశానికి సరసమైన వినోదానికి విజయావారి సినిమాలు ఉదాహరణలు . అసభ్యతకు ఏ మాత్రం తావులేని అచ్చమైన కుటుంబకథాచిత్రాలు వారివి . నిజంగా ఆ సంస్థ యాజమాన్యం , వారిదగ్గర పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు చాల అద్రుష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు .  వారి అకుంఠితదీక్షాదక్షతలు నేటి సినీపరిశ్రమకు ఆదర్శప్రాయం .     ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వారి బ్యానర్ పై ఉండే సూక్తి వారి గొప్పదనాన్ని సూచిస్తు౦ది. సినిమా మొదలు కాగానే మనకు  క్రియా సిద్ధి: సత్వే భవతి  మహతాం నోపకరణే  అనే సూక్తి కనిపిస్తుంది. ఒక సంస్థ గొప్పదనం వారు ఏర్పరచుకున్న motto పైన ఆధారపడి ఉంటుంది . మహాత్ములకు కార్యసిద్ధి వారి బలం మీదనే ఆధారపడి ఉంటుంది గాని సాధనాలపైన కాదు . ఈ సూక్తి వారి గొప్పదనానికి స్ఫూర్తి . దీన్ని పరిశీలించిన నాకు దీనికి సంబంధించిన   ఎన్నో విషయాలు తెలిశాయి. అవన్నీ ఈ వ్యాసంలో సంగ్రహంగా పొందుపరుస్తున్నాను .

మహాత్ములు ఏ కార్యాన్నైనా  స్వశక్తితో సాధిస్తారు గాని సాధనాలపై ఆధారపడరు . ఒకవేళ సాధనాలు స్వీకరించినా అవి నామ మాత్రంగానే ఉపయోగపడతాయిగాని కార్యసిద్ధిమాత్రం వారి బలం వల్లనే కలుగుతుంది . ఈ విషయాన్ని బలపరచడానికి మన పురాణాల్లో ఉదాహరణలు కోకొల్లలుగా లభిస్తున్నాయి . మనం కొన్నిటిని పరిశీలిద్దాం.   

ముందుగా మొదటి ఉదాహరణగా రాముణ్ణి తీసుకుందా౦ .  ఆయన జయి౦చ వలసింది లంకారాజ్యం.  అది సమీపంలో ఉందా అంటే లేదు , సముద్రమధ్యంలో ఉంది. సముద్రాన్ని దాటి వెళ్ళాలి . కాలి నడకతోనే గమ్యం చేరాలి . ఇక ప్రత్యర్థి సామాన్యుడు కాదు . ముల్లోకాలను జయించిన రావణుడు అతడు ఒక రాక్షసుడు . ఇక రాముని సహాయకులు యుద్ధంలో నిపుణులా అంటే కాదు , నిరాయుధులైన వానరులు . ఐనప్పటికీ రాముడు రావణుని జయించగలిగాడు . అందువల్ల మహాత్ములు తమ పరాక్రమం చేతనే  కార్యాన్ని సాధిస్తారు గాని సాధన సామగ్రి వలన కాదు .

1. విజేతవ్యా లంకా చరణ తరణీయో జలనిధి:
విపక్ష: పౌలస్త్య: రణభువి సహాయాశ్చ కపయ:
తథాప్యేకో రామ: సకలమవధీద్రాక్షాస కులం    
క్రియాసి ద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि:                 
विपक्ष: पौलस्त्य: रणभुवि सहायाश्च कपय:                           
   तथाप्येको राम: सकलमवधीद्रावणकुलम्
   क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |

ఇపుడు నిండైన రెండో  ఉదాహరణ తీసుకుందాం. ఆయనెవరోకాదు,  సూర్యుడు . ఆయన రథానికి ఒకే చక్రం . ఏడు గుర్రాలు అవి పాములచేత కట్టబడినవి . ఇక్కడ ఏడు గుర్రాలంటే సూర్యకిరణం లోని ఏడు రంగులని అర్థం .  అవి  Violet, Indigo, Brown, Green, Yellow, Orange and Red (VIBGYOR). ఇక  ఆమార్గం ఎటువంటి ఆలంబన లేనిది . పోనీ సారథి గొప్పవాడా అంటే కాదు . ఆయన సారథి అనూరుడు. దివ్యా౦గుడు, ఊరువులు కూడ లేని అవిటివాడు . ఐనప్పటికీ ఆ సూర్యుడు ప్రతిరోజూ ఆకాశం ఈ వైపునుంచి ఆ వైపు వరకు అలసటలేకుండా సంచారం చేస్తూ ప్రపంచానికి వెలుగు పంచుతున్నాడు . అందువల్ల మహాత్ముల కార్యసాధనకు  స్వశక్తియే ఆధారం గాని ఆయుధాలు , అనుచరులు కాదు .

2. రథస్యైకం చక్రం భుజగయమితా: సప్త తురగా:
నిరాలంబో మార్గ: చరణరహిత: సారథిరపి
రవిర్గచ్ఛత్యంతం ప్రతిదిన మపారస్య నభస:      
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

रथस्यैकं चक्रं भुजगयमिता: सप्ततुरगा:             
 निरालम्बो मार्ग:  चरणरहित: सारथिरपि                   
 रविर्गच्छत्यन्तं   प्रतिदिनमपारस्य नभस                                
क्रियासिद्धि : सत्त्वे भवति महतां नोपकरणे |

ముచ్చటగా మూడో  ఉదాహరణ  చూద్దాం .        ఆయన ఎవరో కాదు  మన్మథుడు. మన్మథునకు పువ్వే విల్లు . తుమ్మెదలే అల్లె త్రాడు . ఇక చపలచిత్తలైన స్త్రీల చంచలమైన చూపులే బాణాలు . ఇక సహాయ సహకారాలేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేనట్లే . ఎందుకంటే చైతన్యం లేని చంద్రుడే సహాయకుడు . ఐనప్పటికీ మన్మథుడు తన స్వశక్తితో ఈ మూడు లోకాలను  సంమోహపరుస్తున్నాడు . త్రిభువన విజేతగా నిలిచాడు . కాబట్టి మహాత్ములకు స్వశక్తియే కార్యసిద్ధికి కారణం ఔతుంది గాని ఆయుధాలు, బలగం ఏమాత్రం కావు .
3. ధను: పౌష్పం  మౌర్వీ మధుకరమయీ  చంచలదృశాం
దృశాం కోణో బాణ: సుహృదపి జడాత్మా హిమకర: 
తథా ప్యేకోsనంగ: త్రిభువనమపి వ్యాకులయతి
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

धनु: पौष्पं  मौर्वी मधुकर मयी चञ्चलदृशां                
 दृशां कोणो बाण: सुहृदपि जडात्मा हिमकर:                              
तथाप्येकोsनङ्ग: त्रिभुवमपि व्याकुलयति
क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |
నాణ్యమైన నాలుగో ఉదాహరణ చూద్దాం . ఆయన ఎవరో కాదు  మన్మథుడే. మన్మథుడు స్వయంగా శరీరం లేనివాడు .ఇక  ప్రత్యర్థి సామాన్యుడు కాడు . ముల్లోకాలకు ప్రభువైన ఈశ్వరుడు.   ఇక మన్మథుని  సహాయకుడైన వసంతుడు ప్రాణంలేని ఒక జడ పదార్థం . మంచి ఆయుధాలేమైన ఉన్నాయా అనుకుంటే అవి పువ్వులు . అందులోనూ ఐదు పువ్వులే.  అవి అరవిందం , అశోకం , మామిడి , నవమల్లిక , నీలోత్పలం . అవన్నీ చాల మృదువైనవి ముట్టుకుంటే విరిగిపోయేవే . ఇక ఆయన సైన్యం అబలాజనం . ఐనప్పటికీ మన్మథుడు ముల్లోకాలను జయిస్తున్నాడు . కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి వారి స్వశక్తి వల్లనే కలుగుతుంది గాని సాధనాలతో పనిలేదు .
4. విపక్ష: శ్రీకంఠ: జడతనురమాత్య: శశి ధర:
వసంతో సామంత: కుసుమమిషవ: సైన్యమబలా:
తథాపి త్రైలోక్యం జయతి మదనో దేహరహిత:
క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

विपक्ष: श्रीकण्ठ: जडतनुरमात्य: शशिधर:                  
 वसन्तो सामन्त: कुसुममिषव: सैन्यमबला:                                  
  तथापि त्रैलोक्यं जयति मदनो देह रहित:                                                क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |    
ఇపుడు అందమైన ఐదవ  ఉదాహరణ పరిశీలిద్దాం . ఈయన అగస్త్యుడు .ఆయన  మట్టికుండలో పుట్టాడు . ఆయన ఇరుగు పొరుగు పరివారం అంతా మృగాలే . భూర్జ పత్రాలె బట్టలు . నివాసం అడవి. కంద, మూల ఫలాలే ఆహారం.  బక్క చిక్కిన  శరీర౦ . ఇన్ని లోపాలున్నప్పటికి ఆయన స్వశక్తితో సముద్రాన్ని పూర్తిగా త్రాగివేసి తమకు అపకారం చేసి సముద్రంలో దాక్కుంటున్న  కాలకేయులను బయటపెట్టి వారిని నిర్మూలనకు ఎంతో సహకారం చేశాడు . కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి వారి స్వశక్తి వలననే కలుగుతుంది గాని వేరొకరి సహాయం వలన కాదు. కాలకేయులనే కొంతమంది రాక్షసులు మునులకు ఎంతో అసౌకర్యం కలిగించేవారు . వారిని హింసించి తరువాత సముద్రంలో దాక్కునేవారు . ఎంతకాలమైనా సముద్రంలో దాక్కునే నైపుణ్యం వారికుంది . ఇక వారి జాడ ఎవరికీ తెలిసేది కాదు . వారి బాధలు పడలేక మునులందరూ దేవతలను ప్రార్థించగా వారందరూ విష్ణువును చేరి ఆ కాలకేయులను మట్టుబెట్టే మార్గాన్ని సూచించమని వేడుకున్నారు . అపుడు విష్ణువు దేవతలతో మీరు అగస్త్యుని ప్రార్థి౦చండి  ఆయన సముద్రాన్ని త్రాగివేయ గల ఏకైక సమర్థుడు అని చెప్పగా దేవతలు అతని చేరి జరిగిన సంగతి వివరించగా అగస్త్యుడు తనశక్తినంతా కూడ గట్టుకుని సముద్రాన్ని త్రాగివేయగా అప్పుడు దేవతలు కాలకేయులజాడ కనుగొని వారిని తరిమి తరిమి చంపారు .
5. ఘటో జన్మస్థానం మృగపరిజన: భూర్జవసన:
వనే వాస: కందాశనపి చ దుస్థం  వపురిదం
తథాప్యేకోsగస్త్య: సకలమపిబద్వారిధి జలం
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే
     
घटो जन्मस्थानं मृगपरिजन: भूर्जवसन:           
वने वास: कन्दाशनमपि च दु:स्थं वपुरिदं                       
 तथाप्येकोsगस्त्य: सकलमपिबद्वारिधिजलम्                                   
 क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |
కాబట్టి మానవుడు ఈ పై విషయాలను స్ఫూర్తిగా తీసుకుని ఇతరులపై ఆధారపడకుండ స్వశక్తితో ఆత్మవిశ్వాసంతో కార్యసాధనకు పూనుకోవాలి. ఆత్మవిశ్వా సం గలవాడు సాధించలేనిదంటు ఏది ఉండదు .
                                               *****

Friday, November 9, 2018

Spoken Sanskrit Lesson-23


సంభాషణ సంస్కృతం 23
(Spoken Sanskrit)
Lesson-23
Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.

तृतीया विभक्ति: (Instrumental case)

ఇంతకు ముందు  మనం ప్రథమా, ద్వితీయా విభక్తులు   ఏ సందర్భంలో ప్రయోగించాలో తెలుసుకున్నాం . ఇప్పుడు తృతీయా విభక్తి ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాం .  మనం కొన్ని కొన్ని పనులు చేయడానికి కొన్ని కొన్ని సాధనాలు ఉపయోగ పడతాయి . ఉదాహరణకు తినడానికి చేయి కనడానికి  కన్ను , వినడానికి చెవి , అనడానికి నోరు మొ|| సాధనాలుగా పనిచేస్తాయి ..ఇక్కడ ఆయా పనులు చేయడానికి ఏవి సాధనాలుగా ఉపయోగిస్తున్నాయో అవన్నీ తృతీయా విభక్తితో చెప్పాలి. साधकतमं करणम्  అని నిర్వచనం . ఒకపని జరగడంలో ఏది ముఖ్యమైన పాత్ర వహిస్తుందో అది కరణం (సాధనం ) అవుతుంది. తృతీయావిభక్తిని ఆంగ్లంలో instrumental case . అంటారు instrument అంటే సాధనం. ఇదే కాకుండా ఇంకా ఏ ఏ సందర్భాల్లో  తృతీయావిభక్తి వస్తుందో కూడ తెలుసుకుందాం .

I.                    साधनार्थे तृतीया :

Example:-
1.      सा मुखेन वदति
ఆమె నోటితో మాట్లాడుచున్నది
She is speaking with her mouth.

2.     : श्रोत्रेण शृणोति
అతడు చెవితో వినుచున్నాడు
He is listening with his ear  

3. बालक: हस्तेन लिखति
బాలుడు చేతితో వ్రాయుచున్నాడు  
 He is writing with his hand.

4.     बालिका पादाभ्यां चलति
బాలిక ( రెండు) కాళ్ళతో నడచుచున్నది
 The girl is walking with her (two) legs

5.     अहं हस्तेन चित्रं लिखामि
I am drawing a picture with my hand.
నేను చేతితో బొమ్మ గీయుచున్నాను .  

6.     अहं हस्तेन स्पृशामि
I am touching with my hand,
నేను చేతితో ముట్టుకుంటున్నాను.

7.     अहं लेखिन्या लिखामि ||
I am writing with pen
నేను పెన్నుతో వ్రాయుచున్నాను.

8.     बालक: दन्तकूर्चेन दन्तधावनं करोति |
         బాలుడు బ్రెష్ తో పళ్ళు తోముకుంటున్నాడు
         Boy is cleaning his teeth with brush.

9. अहं चमसेन पायसं खादामि
   నేను చంచాతో పాయసం తింటున్నాను
    I am eating Payasam with a spoon.

10 .  बालिका कन्दुकेन क्रीडति
బాలిక బంతితో ఆడుచున్నది
A girl is playing with ball
  
ఈ పైన చెప్పిన అన్ని పనులయందు కొన్నికొన్ని సాధనాలుగా చెప్పబడ్డాయి . అవన్నీ తృతీయా విభక్తులు పొందాయి .

Note: మహాభారతంలో ఎవరు ఏ ఆయుధంతో యుద్ధం చేశారో వివరిస్తూ కొన్ని వాక్యాలు వ్రాయండి.

II. तृतीया विभक्ति: (सह योगे)

సహ అనే పదం వాడినప్పుడు ఆ పదం దేనితో వాడుతున్నామో ఆ పదానికి తృతీయా విభక్తి  వస్తుంది

1.     सीता रामेण सह वनं गतवती
           సీత రామునితో కూడ అరణ్యమునకు వెళ్లినది.
Sita went to forest with Rama.

 2. कृष्ण:  अक्रूरेण सह द्वारकां गतवान्
కృష్ణుడు అక్రూరునితో కలసి ద్వారక వెళ్ళెను
Krishna left for Dwaraka along with Akrura.

3. बालका:  अध्यापकेन सह ग्रन्थालयं गतवन्त:    
బాలురు అధ్యాపకునితో కలసి గ్రంథాలయమునకు వెళ్లీరి.
Boys went to library along with the teacher.

Note:-   మీ స్కూలులో ఎవరు ఎవరితో కలిసి చదువుతారో వివరిస్తూ కొన్ని వాక్యాలు తయారు చెయ్యండి .

III.               विना योगे
వినా (without) అనే పదం ఉపయోగించినప్పుడు కూడ తృతీయా విభక్తి వచ్చును .

1.     रामेण विना सीता जीवति

             రాముడు లేనిచో సీత బ్రతుక లేదు.
           Sita can not live with out Rama.

2. दीपेन विना कान्ति: भवति

దీపము లేనిచో కాంతి లేదు
There is no lighting with out lamp  


3. जलेन विना जीवनं नास्ति
నీరు లేనిచో బ్రతుకు  లేదు
 There is no life without water.

4. शीलेन विना जीवनं व्यर्थं भवति .
శీలం లేనిచో జీవితం వ్యర్థం
Life is meaning less with out character.  

Note: ఈ ప్రపంచంలో ఏది లేకపోతె ఏది ఉండదో ఊహిస్తూ కొన్ని వాక్యాలు తయారు చెయ్యండి .

IV.              अलम् ( చాలు ) (Enough) అనే పదం ఉపయోగించినప్పుడు తృతీయా విభక్తి వచ్చును.

Example: - 1. अलं विवादेन = వాదన చాలు =Enogh of your arguement
                  2. अलं वचनेन =మాటలు చాలు = Enogh of your talking
                  3. अलं कोपेन = కోపం చాలు (కట్టిపెట్టు )= Enough of your anger

Note:- అలం అనే పదం ఉపయోగించి మరికొన్ని  వాక్యాలు రచి౦చ౦డి.

V. भाववाचकयोगे
మనం ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు అనేక భావాలు ప్రకటిస్తాం . ఆ భావవాచక పదాలన్ని తృతీయా విభక్తిలో ఉంటాయి .
Examples:-

1. बालिका आनन्देन नृत्यति
బాలిక ఆనందంతో నాట్యం చేయుచున్నది.
The girl is dancing with joy.

2. आतिथेय: आदरेण अतिथिम् आह्वयति
గృహస్థుడుఅతిథిని ఆదరంగా ఆహ్వానించుచున్నాడు
The host is inviting the guest with respect.

3. निर्धन: कष्टेन जीवनं यापयति
        నిర్ధనుడు కష్టంతో జీవిస్తున్నాడు .
The poor man is spending his life with a great difficulty.

Note :- సంతోషం , దు:ఖం , దైన్యం , కోపం మొదలైన భావవాచక పదాల్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చెయ్యండి.

Note:- ఇంకా ఎన్నో సందర్భాల్లో తృతీయా విభక్తి వస్తుంది . అవన్నే ముందు ముందు తెలుసుకుందాం .

A sloka for recitation:

श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन
दानेन पाणि: न तु कङ्कणेन
विभाति काय: करुणापराणां
परोपकारेण न चन्दनेन  {भर्तृहरि:}

ఈ లోకంలో మహాత్ములకు సద్గుణములే సహజమైన అలంకారములు . వారి చెవులు శాస్త్రములను వినడం వల్లనే ప్రకాశిస్తాయిగాని , కుండలాల వలన కాదు ; దానం చెయ్యడం వల్లనే చేయి ప్రకాశిస్తుంది గాని కంకణములు పెట్టుకోవడం వల్ల కాదు ; అలాగే పరోపకారం చెయ్యడం వల్లనే శరీరం ప్రకాశిస్తుంది గాని మంచిగంధం పుసుకోవడం వలన కాదు.
  
For those who are magnanimous, the ear shines with the listening of good words of all sastras but not by wearing earring; the hand shines with charity but not by wearing bracelet and body shines with doing good to others but not by smearing sandal paste to the body.