Thursday, November 18, 2021

ఒకప్పటి లాoఛనమే నేడు లంచం అయింది

 

ఒకప్పటి లాoఛనమే నేడు లంచం అయింది

 డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

మన భారతీయసమాజంలో సగటు మనిషిని తీవ్రంగా  బాధపెట్టే అoశాల్లో లంచo  ఒకటి.  ఇది ఎవరు  నిర్మూలిoచ లేని విధంగా వేళ్లూని పాతుకు పోయి ఉంది. దీన్ని నిర్మూలిoచాలంటే   దీనికి  కారణం మనo తెలుసుకోవాలి , తెలుసుకుందాం  . ఒకప్పటి లాoఛనమే నేడు లంచంగా మారి ఉoటుoదని  నేనకుంటున్నాను.

పూర్వం వివాహాల్లో అత్తగారి  లాంఛనాలు  , ఆడపడుచు లాంఛనాలు  అని  డబ్బో లేక విలు వైన  వస్తువో ఇచ్చేవారు. దీనికి కారణం ఆలోచిస్తే  అమ్మాయి మరో ఇంటికి అంటే అత్తా వారింటికి వెళ్ళేటప్పుడు అత్తగారికి ,  ఆడపడుచులకు ఆమె మీద ప్రేమ కలగటానికి  సొమ్ము రూపం లోనో, వస్తురూపంలోనో కొంత ముట్ట చెప్పే వారు.                                                                     

          ఇక కట్నం కూడ ఎలా  వచ్చి ఉంటుందో ఆలోచిద్దాం . సాధారణంగా  పెళ్లి, ఆడపిల్ల  ఇంటిలో జరుగుతుంది కాబట్టి అబ్బాయితల్లి దండ్రులు , వారి  పరివారం అమ్మాయి ఇంటికి రావాలి  కాబట్టి వారు రావడానికి పెద్ద మొత్తంలో ఖర్చు ఔతుంది కాబట్టి పెళ్లి కుమార్తె తండ్రి వారికి చేదోడు వాదోడుగా సంతోషంతో  కొంతసొమ్ము ముట్ట చెప్పేవాడు . అలాగే వరుడు తనకు యోగ్యమైన అమ్మాయిని వెదికి తీసుకు రమ్మని కొంత డబ్బు మిత్రుడికి ‘ మదర్థం కన్యాం వృణీధ్వం’ ( నాకోసం ఒక యోగ్యురాలైన అమ్మాయిని వెదికి తీసుకురా)  అని ఇచ్చేవాడు. ప్రస్తుతం ఈ తాంబూలం పెళ్లి చేయించే బ్రాహ్మణుడు నొక్కేస్తున్నాడు. . ఏది ఏమైనా మొత్తం మీద   ఇదంతా ఇష్టంతో చేసేదే ఇందులో బలవంతం ఏమీ లేదు. ఇది వేదకాలంనాటి నుంచీ ఉన్న సంప్రదాయo  అయ్యుండొచ్చు.

అందుకే “సంప్రదానసమయేsర్థ హారికా దారికా హృదయ దారికా పితు: ” ( సంప్రదానం అంటే పెళ్లి,  పెళ్లి సమయంలో డబ్బు హరించేది,  తండ్రికి దు:ఖం కలిగిo చేది ) అని కొన్ని మాటలు మనకు వినిపిస్తున్నాయి.

ఇక లంచగొండి తనం ఎలా వచ్చిందో ఆలోచిద్దాం . ఆంగ్లేయులు  మన దేశాన్ని పరిపాలిo చేటప్పుడు కార్యాలయాల్లో లంచాలుoడేవి  కావట . ఎవరైనా తమ పనులు త్వరగా జరగడంకోసం డబ్బు ఇవ్వ బోతే we are not twice paid ( మాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది , ఇదెందుకు)  అని మృదువుగా తిరస్కరిoచే వారట.  

    కాని స్వతంత్ర  భారతంలోనే ఈ లంచగొండి తనం . మనం లంచాల వలన తీవ్ర మైన ఇబ్బందికి గురి ఔతున్నాం . అందుకే నేనొక సారి అన్నాను.

తెల్లదొరలేగ నిప్పుడు

నల్ల దొరలె దేశమందు నయవంచకులై

కొల్లంగొట్టుచు ప్రజలను

తెల్ల దొరలె నయమటంచు తెలిపిరి మనకున్ -అన్నాను నేనొక చోట .

దీనికొక్కటే మార్గం . ఆధ్యాత్మిక చింతన . ముఖ్యంగా కబీరు దాసువంటి మహాత్ముల  మాటలు మనం ఎప్పుడు మనస్సులో పెట్టు కోవాలి.

 

“ దుర్బల కో న సతాయియే

జాకీ మోటా హాయ్

.......................    

 సా ర భస్మ హో జాయ్’’

దుర్బలుణ్ణి ఇబ్బంది పెట్టుకు . వాడు  బలం లేని వాడైనా వాడి  ఊపిరి చాల బలమైంది. మాటలు వేసే కొలిమిలో  ప్రాణం లేని కొలిమి తిత్తి నుండి వెలువడే గాలి ఇనుమును కరిగిస్తోoది. ఇక ప్రాణమున్న అభాగ్యుని ఉసురు నీ వంశాన్ని దహిస్తుoది జాగ్రత్త! అంటాడు.

లంచం లాంఛనం నుంచి వచ్చినా ఇష్టంతో ఇచ్చేది లాంఛనం, ఇష్టం లేకుండా బలవంతంగా ఇచ్చేది లంచం .     నేను లంచం తీసుకునే వారి కొన్ని కుటుంబాలు పరిశీలించాను.  సాధారణంగా ఆ ఇంటిలో సుఖశాo తులుoడవు. పిల్లలు సర్వనాశనం అయిన కుటుంబాలు చాల కనిపిస్తాయి. పెద్దలు చేసిన తప్పులు పిల్లలకు కొడుతుoదనే మాట నూటికి నూరు పాళ్ళు నిజమే అని పిస్తుంది.     

    పరుగును తానె ఆపుకుంటే అది ప్రవాహ మౌతుoదా

విత్తం కోసం చేసుకుంటే అది వివాహ మౌతుందా అంటారు డాక్టర్ సి . నారాయణ రెడ్డిగారు.

లంచగొండులను నిరసిద్దాం . దురాచారాలను నిర్మూలిద్దాం.

Tuesday, October 26, 2021

అన్నం

 

అన్నం

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

                                            అన్నం’ అనే పదం మనందరికీ తెలుసు కాని మనలో కొందరికి దీని  అర్థం పూర్తిగా తెలియక పోవచ్చు .  ఇపుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . ‘అద’ భక్షణే అనే ధాతువునుoచి  అన్నం అనేపదం తయారైoది.     అద్యతే అత్తీతి అన్నం . అంటే తినేది తినబడేది కాబట్టి అన్నం (the eater as well as the eaten) అయింది. ఇది చాల విచిత్రంగా ఉంది కదూ! . ఒకే అన్నం తినేది తినబడేది రెండు అవడమేమిటి?

ఈ సృష్టిలో ఒక దానికి మరికటి అన్నం అవుతాయి . ఎలుకను పిల్లి తిoటుంది . ఆ పిల్లిని కుక్క  తింటుంది . ఈ విధంగా పిల్లి తినేది తినబడేది రెండు అవుతోంది . తిమిoగిలం అనే పదం తీసుకుందాం . తిమీన్ ( చేపలను) గిలతి (తింటుంది)  ఇతి తిమిoగిల: . ఆ తిమిoగిలాన్ని తినే మరో పెద్ద జoతువుoటుంది . దాన్ని తిమిoగిలగిలo అంటారు. ఈ విధంతా చిన చేపను పెద్దచేప పెద్ద చేపను అంత కంటే పెద్ద చేప తింటాయి . ఇది సృష్టి ధర్మం.   అందుకే మన శాస్త్రాలు  “అన్నమన్నే ప్రతిష్ఠితమ్”       అని చెప్పాయి. ఒక అన్నం మరో అన్నంలో నెలకొల్పబడింది అని ఆ వాక్యం అర్థం . ఇక అoదరినీ  తినేసేవాడు పరమేశ్వరుడొక్కడే. అందుకే ఆయనను “ అత్తా”  అంటారు . బ్రహ్మ సూత్రాలలో పరమేశ్వరుని అత్తా అని సంబోధించడం మనం గమనిస్తాం . అత్తా చరాచర గ్రహణాత్ ( బ్రహ్మ సూత్రాలు) . ప్రళయ కాలంలో ఈ చరాచర జగత్తును తనలో లయం చేసుకుంటాడు.

ఇక  మనం అన్నం నుంచి పుట్టాము . అన్నాత్ పురుష: అని శాస్త్రం చెపుతోంది. మనం తినే అన్నం వీర్యంగా మారి స్త్రీలో ప్రవేశించి మనిషిగా జన్మ నిస్తోంది . ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన సనాతనధర్మం చెప్పింది. అన్నాన్ని నిందించడం , వ్యర్థం చెయ్యడం పాపమని స్పష్టం గా చెప్పింది. ఒక జంతువుకి మరో జంతువు అన్నం అవుతుందని శాస్త్రాలు చెప్పాయి . అంతేకాకుండా  ఇతరజంతువులకు మరో మార్గం లేదు. కాని   మనిషికి వివేకం ఉంది కాబట్టి ఈ మానవ మృగం సాధ్యమైనంత వరకు ఇతర  జంతువులకు హాని తలపెట్టకుండా శాకాహారంతోనే జీవిస్తే మంచిదని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. ఒక వేళ హింస తప్పని పరి స్థితుల్లో  సాధ్యమైనంత మానవతా దృష్టితో (as humanly as possible but not as cannily as  possible)  ప్రవర్తిస్తే పర్యావరణాన్ని సంరక్షించిన వాళ్ళమౌతాం .    

 

Saturday, October 2, 2021

महाजनो येन गत: स पन्था: --- Dr. Chilakamarthi DurgaprasadaRao

 

महाजनो येन गत: स पन्था:

The path is the one by which great souls travel

                                                                           Dr. Chilakamarthi DurgaprasadaRao

तर्को s प्रतिष्ठ: श्रुतयो विभिना: नैकोमुनिर्यस्य मतं प्रमाणं

धर्मस्य तत्त्वं निहितं गुहायां महाजनो येन गत: स पन्था:

 Logic is not conclusive. Vedas are not unanimous. There is not one sage whose view is the final authority. The true nature of dharma is hidden in a cave. The path is the one by which great souls travel (translated by Prof: - Jonnalagadda Prabhakara Sastry)

 తర్కో sప్రతిష్ఠ: శ్రుతయో విభిన్నా:

నైకో ముని: యస్య మతం ప్రమాణం

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం

మహాజనో యేన గత: స పంథా:

 

तर्क: =తర్కము,  अप्रतिष्ठ: = నిలకడ లేనిది

श्रुतय: =శ్రుతివాక్యాలు, विभिना: = విభిన్నాలు; यस्य= ఎవనియొక్క ; मतं = అభిప్రాయం प्रमाणं = ప్రమాణమో (అటువంటి) मुनि: = ముని  एको = ఒక్కరుకూడా ; = లేరు ; धर्मस्य= ధర్మం యొక్క ; तत्त्वं= స్వరూపం ; गुहायां= రహస్యమైన గుహలో; निहितं= దాగి ఉoది

  महाजन: = గొప్పవారు येन गत: = ఏ మార్గం అనుసరిoచి ప్రవర్తించాలో ;  = అదియే

पन्था: = అనుసరించవలసిన మార్గం .

 

యుక్తితో చేసే వాదన నిలకడ లేనిది . ఎoదుకంటే నేను నా తెలివితేటలతో ఒక మాట చెపితే నాకంటే తెలివైనవారు, ఆ తరువాత ఒక మాట , అంతకంటే తెలివైన వారు మరో మాట చెపుతారు. అందువల్ల తర్కానికి నిలకడలేదు.  ఇక శ్రుతులు ఒక విషయాన్ని పలు చోట్ల పలు రకాలుగా వర్ణించాయి .కొన్ని పరస్పరం అనుకూలంగా ఉంటాయి. కొన్ని విరుద్ధంగా ఉంటాయి. ఇక మహర్షుల అభిప్రాయాలు ఆ యా  దేశకాల పరిస్థితులకు అనుగుణంగా చెప్పబడటం వల్ల పరస్పర విరుద్ధంగా ఉండక పోయినా అలా అనిపిస్తాయి , కనిపిస్తాయి . ఎవరి అభిప్రాయం మనం అనుసరిoచి ప్రవర్తించాలో తెలియదు. ఇక ధర్మం యొక్క రహస్యం చాల గహనo . అది ఐదు ఆవరణలు గల గుహలో దాగి ఉంది. అన్నమయకోశం, లోపల ప్రాణమయకోశం ఉంది . దానిలోపల మనోమయకోశం ఉంది. దానిలోపల విజ్ఞానమయకోశం ఉంది, దానిలోపల ఆనందమయకోశం ఉంది. ఇవేవీ ఆత్మకావు. వీటికి ఆధారభూతమైనదే,  వీటి వెనుకనున్నదే ఆత్మ. ఇది తెలుసుకోవాలంటే మనిషి అంతర్ముఖుడు కావాలి. కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు: అమృతత్త్వ మిచ్ఛన్ “ అన్నాయి  ఉపనిషత్తులు . అవన్నీ  అసాధ్యాలు అనలేము గాని కష్ట సాధ్యాలని చెప్పగలం . అందువల్ల ఉత్తములయిన వివేకానందుడు , మహాత్మా గాంధీ వంటి  మహాపురుషులు ఏ మార్గంలో నడిచారో , ఇంకా కొంతమంది మహానుభావులు నేడు ఏ మార్గంలో   నడుస్తున్నారో అటువంటి ఒక మార్గాన్ని  ఎన్నుకొని,  అనుసరించి జీవితాన్ని నడుపుకోవడమే ఉత్తమమయిన మార్గం . ఇదే తరణోపాయము , తరుణోపాయము కూడ.   

 

శాస్త్రాల మనుగడ సందేహాస్పదమే - డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

శాస్త్రాల మనుగడ సందేహాస్పదమే

(పండితులు నాడు -నేడు)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

పూర్వకాలంలో మనదేశంలో పండితులు ప్రజా సదస్సుల్లోను రాజాస్థానాల్లోను పాల్గొని తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తో ఉండేవారు. ప్రజా సదస్సుల్లో  గెలిచినవారికి  వదాన్యశేఖరులు సన్మానం చెయ్యగా, రాజసభల్లో గెలిచిన వారిని రాజులు  సన్మానించి మణులు , మాన్యాలు అగ్రహారాలు బహూకరి౦చే వారు.  మొత్తం మీద పండితులు, వారు ఏ శాస్త్రం చదివినా ఆ శాస్త్రంలో మంచి ప్రతిభా పాటవాలను సంపాదించేవారు. ఇక కవుల సంగ తి చెప్పక్కర్లేదు . రాజే స్వయంగా సేవలు చేసే వాడు. అందుకే సుకవితా యద్యస్తి రాజ్యేన కిం ? అనే మాట ప్రచారం పొoదింది . మంచికవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు.   

ముఖ్యంగా తర్కవ్యాకరణశాస్త్రాల్లో పోటీలు జరుగుతు ఉండేవి. తర్క పండితులకు వ్యాకరణ శాస్త్రంలో పాండిత్యం లేక పోవడం వల్ల వాళ్ళు తప్పులు మాట్లాడుతూ ఉండే వారు.

ఒకసారి ఒక వ్యాకరణ పండితుడు “నైయాయికా: పశవ:” అన్నాడు. అంటే తర్కశాస్త్రం చదువుకున్న వాళ్ళు పశువులు అని అర్థం . అలా అనగానే తర్క పండితుడికి కోపం వచ్చింది . “వైయాకరణా: తృణవ:” అన్నాడు . అంటే వ్యాకరణశాస్త్రం చదువుకున్నవాళ్ళు గడ్డిపరకలు అంటే మేం మిమ్మల్ని నమిలేస్తాం అని అర్థం వచ్చేలాగ అన్నాడు . కానీ పొరబాటే౦టంటే తృణా: అనాలి కాని తర్క పండితునకు శబ్ద జ్ఞానం లేకపోవడం వల్ల

పశవ: మాదిరి గానే తృణవ: అన్నాడు. వాళ్ళు అతన్ని ఆక్షేపిస్తూ అత ఏవ యూయం పశవ: అన్నాడు ( అందుకే మీరు పశువులు)  . ఈ విధంగా తార్కికులకు వ్యాకరణపండితులకు మధ్య వాద వివాదాలు జరుగుతూ ఉండేవి.

ఇక ఆడవాళ్ళు కూడ మగవాడి జ్ఞానాన్ని పరిశీలించే  పెళ్లి చేసుకునే వారు. ఒక వ్యక్తి పెళ్లి చూపులకోసం ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాడు . ఇరు పక్షాల బంధువులు సమావేశం అయ్యారు. ఆ అమ్మాయి వరుణ్ణి కొన్ని ప్రశ్నలడుగుతానంది. సరే ! అడగమన్నాడు.

‘విహస్య’ అనే పదానికి విభక్తి చెప్పమంది. విహస్య అనేది అవ్యయం (indeclinable) దానికి లింగం , గాని వచనం గాని , విభక్తి గాని ఉండదు. ఆ పదానికి నవ్వి (having laughed) అని అర్థం . వాడికది  తెలియదు . వాడు రామ శబ్దం ఒక్కటే చదువుకున్నాడు రామస్య తెలుసు . అందుకని రామస్య లాంటిదే అనుకున్నాడు . షష్ఠీ విభక్తి అన్నాడు. ఇంకో chance ఇద్దామను కుంది. ‘విహాయ’ అని అడిగింది . అదీ అవ్యయమే . విడిచి పెట్టి (having left) అని దాని కర్థం. వాడు రామాయ లాగ ఉంది.  కాబట్టి  చతుర్థీ విభక్తి అన్నాడు. అదీ తప్పే . ఆమె ముచ్చటగా మూడో chance ఇద్దామను కుంది . ‘అహం’  ఏ విభక్తి అని అడిగింది. అది సర్వ నామం (pronoun) , అహం ప్రథమా విభక్తి , నేను అని దానికర్థం . వీడికది తెలిసేడవదు. వాడికొచ్చిoదల్లా రామ శబ్దం ఒక్కటే . ‘అహం’ అనే పదం ‘రామం’ లాగా ఉంది కాబట్టి ద్వితీయావిభక్తి అన్నాడు.  వాడి తెలివితక్కువతనానికి ఆమె తట్టుకోలేక పోయింది. వెంటనే బయటకు దయచేయ మంది. ఏమ్మా ! అబ్బాయి అందంగా లేడా అన్నారు వాళ్ళు అమాయకంగా . అబ్బాయి అందగాడే  కావచ్చు గాని  , బుద్ధి మాత్రం మందం అంది . అదేంటని వాళ్ళు అడిగారు.

యస్య షష్ఠీ ద్వితీయా స్యాత్ విహస్య చ విహాయ చ

‘అహం’ కథం ద్వితీయా స్యాత్ ద్వితీ యా స్యామహం కథం ?

అని శ్లోకంలో తన గోడునంతా ఏకరువు పెట్టింది.

ఎవడికి ‘విహస్య’ షష్ఠీ, ‘విహాయ’ చతుర్థి అవుతుందో, ‘అహం’   ద్వితీయ ఔతుందో అటువంటి వాడికి  నేను ద్వితీయ( భార్య)నెందు కౌతాను?  అంది.  పూర్వం ఆడవారు కూడ ఎంతో పాండిత్యం చూపించేవారు.           

ఆవిధంగా మనవారు తమ తమ శాస్త్రాలను కొన్ని వేల సంవత్సరాల పాటు రక్షిస్తూ వచ్చారు.  కాని నేడు శాస్త్రాల పట్ల ఆసక్తి క్రమక్రమంగా తగ్గుతోంది. 

  నేడు విద్యాలయాలలోను విశ్వవిద్యాలయాల్లోనూ

శాస్త్రాలకుండవలసినంత ప్రాధాన్యం లేదు. విద్యార్ధు లు డిగ్రీల కోసమే చదువు తున్నారు. డిగ్రీ ,తరువాత ఉద్యోగo వచ్చాక చదివిన శాస్త్రం మరిచి పోతున్నారు .  “అనభ్యాసే విషం శాస్త్రం” అన్నారు పెద్దలు  ఏ శాస్త్ర మైనా రోజూ  చదవక పోతే పరిచి పోతాం .

ఇప్పుడు శాస్త్రాలు శాస్త్రచర్చలు యువకుల్లో జరగడం లేదు.

యత్ర యత్ర శాబ్దికా: తత్ర తత్ర తార్కికా:

యత్ర యాత్ర తార్కికా: తత్ర తత్ర శాబ్దికా:     

యత్ర యత్ర చోభయం తత్ర తత్ర నోభయం

యత్ర యత్ర నోభయం తత్ర తత్ర చోభయం

దీని తాత్పర్య మేoటంటే  మీరు వ్యాకరణంలో పండితులైతే, మేము తర్క శాస్త్రంలో పండితులం . మీరు తర్కశాస్త్రంలో పండితులైతే మేము వ్యాకరణంలో పండితుల౦ .  ఒకవేళ మీకు రెండు తెలిస్తే మాకు రెండు తెలియదు. మీకు రెండు తెలియక పొతే మాకు రెండు తెలుసు. మీకు మాకు ఎటువంటి వాడ వివాదాలు  వద్దు.  హాయిగా కాలం గడిపెద్దాం. ఇదీ నేటి పరిస్థితి. ఎవరికి,  వారు చదువుకున్న   శాస్త్రం పై గౌరవం లేదు. అందరు అలా ఉన్నారని నేననడం లేదు , నూటికి తొంబై శాతం ఇలాగే ఉన్నారు. శాస్త్రాల మనుగడ సందేహాస్పదమే .                                                                           తస్మాత్ జాగ్రత జాగ్రత

Monday, September 13, 2021

Give up these three

                                                  Give up these three

Dr. Ch. Durgaprasadarao

लोभात् प्रमादाद्विस्रंभात्त्रिभिर्नाशोभवेन्नृणाम्

तस्माल्लोभं न कुर्वीत न प्रमादं न विश्वसेत्

(महाभारतम्)  

లోబాత్ప్రమాదాద్విస్రంభాత్త్రిభి: నాశో భవేత్ నృణాo

తస్మాల్లోభం న కుర్వీత న ప్రమాదం న విశ్వసేత్.  

 नृणाम् = మానవులకు      

लोभात्= దురాశవలన

 प्रमादात् = ఏమరుపాటువలన

विस्रंभात्= గ్రుడ్డిగా నమ్మడంవల్ల

 त्रिभि: = ఈ మూడుకారణాల వల్ల  

नाश: = నాశనము

भवेत् = సంభవించును

तस्मात्= అoదువల్ల लोभं = లోభం न कुर्वीत= చేయరాదు ( దురాశ పనికిరాదు)

 न प्रमादं= ఏమరుపాటు పనికిరాదు

न विश्वसेत्      = గ్రుడ్డిగా దేనిని నమ్మరాదు.

          మానవుడు దురాశ , ఏమరు పాటుతనం,oధవిశ్వాసం ఈ మూడిటి వలన సర్వనా నాశనం ఔతున్నాడు . కాబట్టి మానవ సమాజం  సుఖంగా ఉoడాలంటే మనిషి   దురాశను , ఏమరుపాటును,oధవిశ్వాసాన్ని   విడిచిపెట్టాలి.

Greed , carelessness, and blind faith- these three destroy everybody. So one should not be either greedy or careless or blindly faithful. By abandoning these three weaknesses (Greed etc.),  one can enjoy a happy life. ( English translation is made by Sri Appala Someswara Sarma garu)