Saturday, October 2, 2021

महाजनो येन गत: स पन्था: --- Dr. Chilakamarthi DurgaprasadaRao

 

महाजनो येन गत: स पन्था:

The path is the one by which great souls travel

                                                                           Dr. Chilakamarthi DurgaprasadaRao

तर्को s प्रतिष्ठ: श्रुतयो विभिना: नैकोमुनिर्यस्य मतं प्रमाणं

धर्मस्य तत्त्वं निहितं गुहायां महाजनो येन गत: स पन्था:

 Logic is not conclusive. Vedas are not unanimous. There is not one sage whose view is the final authority. The true nature of dharma is hidden in a cave. The path is the one by which great souls travel (translated by Prof: - Jonnalagadda Prabhakara Sastry)

 తర్కో sప్రతిష్ఠ: శ్రుతయో విభిన్నా:

నైకో ముని: యస్య మతం ప్రమాణం

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం

మహాజనో యేన గత: స పంథా:

 

तर्क: =తర్కము,  अप्रतिष्ठ: = నిలకడ లేనిది

श्रुतय: =శ్రుతివాక్యాలు, विभिना: = విభిన్నాలు; यस्य= ఎవనియొక్క ; मतं = అభిప్రాయం प्रमाणं = ప్రమాణమో (అటువంటి) मुनि: = ముని  एको = ఒక్కరుకూడా ; = లేరు ; धर्मस्य= ధర్మం యొక్క ; तत्त्वं= స్వరూపం ; गुहायां= రహస్యమైన గుహలో; निहितं= దాగి ఉoది

  महाजन: = గొప్పవారు येन गत: = ఏ మార్గం అనుసరిoచి ప్రవర్తించాలో ;  = అదియే

पन्था: = అనుసరించవలసిన మార్గం .

 

యుక్తితో చేసే వాదన నిలకడ లేనిది . ఎoదుకంటే నేను నా తెలివితేటలతో ఒక మాట చెపితే నాకంటే తెలివైనవారు, ఆ తరువాత ఒక మాట , అంతకంటే తెలివైన వారు మరో మాట చెపుతారు. అందువల్ల తర్కానికి నిలకడలేదు.  ఇక శ్రుతులు ఒక విషయాన్ని పలు చోట్ల పలు రకాలుగా వర్ణించాయి .కొన్ని పరస్పరం అనుకూలంగా ఉంటాయి. కొన్ని విరుద్ధంగా ఉంటాయి. ఇక మహర్షుల అభిప్రాయాలు ఆ యా  దేశకాల పరిస్థితులకు అనుగుణంగా చెప్పబడటం వల్ల పరస్పర విరుద్ధంగా ఉండక పోయినా అలా అనిపిస్తాయి , కనిపిస్తాయి . ఎవరి అభిప్రాయం మనం అనుసరిoచి ప్రవర్తించాలో తెలియదు. ఇక ధర్మం యొక్క రహస్యం చాల గహనo . అది ఐదు ఆవరణలు గల గుహలో దాగి ఉంది. అన్నమయకోశం, లోపల ప్రాణమయకోశం ఉంది . దానిలోపల మనోమయకోశం ఉంది. దానిలోపల విజ్ఞానమయకోశం ఉంది, దానిలోపల ఆనందమయకోశం ఉంది. ఇవేవీ ఆత్మకావు. వీటికి ఆధారభూతమైనదే,  వీటి వెనుకనున్నదే ఆత్మ. ఇది తెలుసుకోవాలంటే మనిషి అంతర్ముఖుడు కావాలి. కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు: అమృతత్త్వ మిచ్ఛన్ “ అన్నాయి  ఉపనిషత్తులు . అవన్నీ  అసాధ్యాలు అనలేము గాని కష్ట సాధ్యాలని చెప్పగలం . అందువల్ల ఉత్తములయిన వివేకానందుడు , మహాత్మా గాంధీ వంటి  మహాపురుషులు ఏ మార్గంలో నడిచారో , ఇంకా కొంతమంది మహానుభావులు నేడు ఏ మార్గంలో   నడుస్తున్నారో అటువంటి ఒక మార్గాన్ని  ఎన్నుకొని,  అనుసరించి జీవితాన్ని నడుపుకోవడమే ఉత్తమమయిన మార్గం . ఇదే తరణోపాయము , తరుణోపాయము కూడ.   

 

2 comments:

కంది శంకరయ్య said...

ఇంత మంచి బ్లాగును చూడడం సంతోషంగా ఉన్నది. ఈ బ్లాగును నాకు జి. ప్రభాకర శాస్త్రి గారు పరిచయం చేసారు. వారికి నా ధన్యవాదాలు.

Durga Prasada Rao Chilakamarthi said...

ధన్యవాదాలు సార్. మేఎ వాత్త్సప్ప్ నెంబరు పంపితే మరికొన్ని ఆసక్తికరమైనవి పంపుతాను.