అన్నం
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
‘ అన్నం’
అనే పదం మనందరికీ తెలుసు కాని మనలో కొందరికి దీని
అర్థం పూర్తిగా తెలియక పోవచ్చు .
ఇపుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . ‘అద’ భక్షణే అనే ధాతువునుoచి అన్నం అనేపదం తయారైoది. అద్యతే
అత్తీతి అన్నం . అంటే తినేది తినబడేది కాబట్టి అన్నం (the eater as well as the eaten) అయింది. ఇది చాల విచిత్రంగా ఉంది కదూ! . ఒకే అన్నం
తినేది తినబడేది రెండు అవడమేమిటి?
ఈ సృష్టిలో ఒక దానికి
మరికటి అన్నం అవుతాయి . ఎలుకను పిల్లి తిoటుంది . ఆ
పిల్లిని కుక్క తింటుంది . ఈ విధంగా
పిల్లి తినేది తినబడేది రెండు అవుతోంది . తిమిoగిలం అనే పదం
తీసుకుందాం . తిమీన్ ( చేపలను) గిలతి (తింటుంది) ఇతి తిమిoగిల: . ఆ తిమిoగిలాన్ని తినే మరో పెద్ద జoతువుoటుంది . దాన్ని తిమిoగిలగిలo అంటారు. ఈ విధంతా చిన చేపను పెద్దచేప పెద్ద చేపను అంత కంటే
పెద్ద చేప తింటాయి . ఇది సృష్టి ధర్మం. అందుకే
మన శాస్త్రాలు “అన్నమన్నే
ప్రతిష్ఠితమ్” అని చెప్పాయి. ఒక అన్నం మరో అన్నంలో నెలకొల్పబడింది
అని ఆ వాక్యం అర్థం . ఇక అoదరినీ తినేసేవాడు పరమేశ్వరుడొక్కడే. అందుకే ఆయనను “
అత్తా” అంటారు . బ్రహ్మ సూత్రాలలో
పరమేశ్వరుని అత్తా అని సంబోధించడం మనం గమనిస్తాం . అత్తా చరాచర గ్రహణాత్ (
బ్రహ్మ సూత్రాలు) . ప్రళయ కాలంలో ఈ చరాచర జగత్తును తనలో లయం చేసుకుంటాడు.
ఇక మనం అన్నం నుంచి పుట్టాము . అన్నాత్ పురుష:
అని శాస్త్రం చెపుతోంది. మనం తినే అన్నం వీర్యంగా మారి స్త్రీలో ప్రవేశించి
మనిషిగా జన్మ నిస్తోంది . ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన సనాతనధర్మం చెప్పింది.
అన్నాన్ని నిందించడం , వ్యర్థం చెయ్యడం పాపమని స్పష్టం గా చెప్పింది. ఒక జంతువుకి
మరో జంతువు అన్నం అవుతుందని శాస్త్రాలు చెప్పాయి . అంతేకాకుండా ఇతరజంతువులకు మరో మార్గం లేదు. కాని మనిషికి
వివేకం ఉంది కాబట్టి ఈ మానవ మృగం సాధ్యమైనంత వరకు ఇతర జంతువులకు హాని తలపెట్టకుండా శాకాహారంతోనే జీవిస్తే
మంచిదని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. ఒక వేళ హింస తప్పని పరి స్థితుల్లో సాధ్యమైనంత మానవతా దృష్టితో (as humanly as possible but not as cannily as possible) ప్రవర్తిస్తే
పర్యావరణాన్ని సంరక్షించిన వాళ్ళమౌతాం .
1 comment:
చాలా బాగా వివరించారు.
Post a Comment