Wednesday, September 19, 2018

శైవ గురు పీఠ సేవలందించిన శివశ్రీ మల్లంపల్లి మల్లికార్జునాచార్యులు


శైవ గురు పీఠ సేవలందించిన
శివశ్రీ మల్లంపల్లి మల్లికార్జునాచార్యులు

రచన :- మల్లంపల్లి రామప్రసాద్
Cell:-      9940574183

ఆ రోజుల్లో శైవ మతారాధకుల శైవగురుపీఠాల్లో మల్లంపల్లి వారిది ఒకటి. మల్లంపల్లిలో ఎందరో మహానుభావులు లోకకల్యాణం కొరుతూ శైవమత ప్రాప్తికి ఎనలేని కృషి చేసిరి.
వారిలో ప్రాతస్మరణీయులు మల్లంపల్లి మల్లికార్జునాచార్యులు ప్రసిద్ధులు.
భారతీదేవి వాగ్రూప భంగిగాను
శారదామాత దరహాస చంద్రికలన
వాణి శింజినీ కంకణ వ్రాత భంగి
పుట్టిరనగ మల్లమపల్లి పుత్రులవని
వేదవేదాంగ శాస్త్ర కావ్యేతి హాస
బహుపురాణనాటక నాట్య వైదికాది
మంత్ర తంత్ర నిష్ణాతులు మల్లమపల్లి
వంశజులు వాసి గాంచిరి  వసుధలోన

అటువంటి మల్లంపల్లి వారి వంశంలో ఎందరో మహాను భావులు , అఖండులు, ఉద్దండులు జన్మించిరి . పేరు ప్రతిష్ఠలు పొంది , ఎల్లరకు సహాయసహకారములందించి ధన్య జీవులైరి.
1850-1950 మధ్య కాలంలో ఇంకా ప్రాచీన సాహిత్య ధోరణులు వ్యాపించి ఉన్నాయి . ఆ కాలం సరస్వతీరూపులు , శతావధానులు తిరుపతివే౦కటకవులు కవితావాసనలు వెదజల్లిన కాలం .   వాసనలు ప్రతి సహృదయుణ్ణి తాకి కవితలు పులకింప చేశాయి. ఆ సమయంలో కవితలు సాగించిన వారిలో            మల్లంపల్లి మల్లికార్జునారాధ్యులు ఒకరు. వీరు దేశోద్ధారక, కృష్ణాజిల్లా ఎలకూరు గ్రామంలో 1875 సంవత్సరము విజయదశమినాడు  జన్మిం చారు .

ఈయన తల్లి దండ్రులు భ్రమరాంబ , వీరమల్లయారాధ్యులు . పుట్టిన పదోనెలలోనే తండ్రి , 18వ ఏటనే అన్న రామలింగ అయ్యవారు మరణి౦చడంతో  చదువుకోసం వీరు ఎన్నో ప్రాంతాలు తిరగవలసి వచ్చింది . విజయనగరంలో కొంతకాలం బ్రహ్మశ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి వద్ద , గుమ్మలూరి సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద విద్యాభ్యాసం చేశారు . తరువాత వక్కలంక వీరభద్రశాస్త్రిగారి వద్ద విద్యాభ్యాసం చేసి తర్కం అభ్యసించారు . ప్రకాశంజిల్లా చందవోలులో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద నైషధం చదివారు .వీరు సంస్కృతాంధ్రపండితులు . శివపూజా దురంధరులు . నిత్య సంధ్యావందనాసక్తులు. కావ్యజ్ఞులు. మంత్రశాస్త్రజ్ఞులు. శరభశాళవ, భేతాళపంచాక్షరి, మృత్యుంజయ గాయత్రీమహామంత్ర నిష్ణాతులు .. అంత్యేష్టి (అనగా చనిపోయిన వారికి చేసే కర్మకి అంత్యేష్టి అనిపేరు ) చిన్మయదీక్ష  లింగధారణలు చేయి౦చుటలో దిట్టలు .
ముఖాన విభూతి , నుదుట నల్లని బొట్టు , కంఠాన స్ఫటిక రుద్రాక్ష మాలలు , కర్ణములకు కుండలాలు , చేతులకు సింహతలాటాలు , చేతులకు పాదాలకు విభూతి రేఖలు , కాళ్ళకు గండపెండేరము కలిగియుండి బ్రహ్మతేజస్సు ఉట్టిపడే వీరిని ఒక్కసారి చూస్తేనే చాలు ఎవరూ మరిచిపోలేరు . వీరు భోగేశ్వరమాహాత్మ్యం, సత్యవత్యుపాఖ్యానం అనే రెండు శైవ ప్రబంధాలు; చోరేశ్వరము , తునిరాజసందర్శనము మొదలైనవి రచించారు .  వీరి సహధర్మచారిణి శ్రీమతి  కనకదుర్గాంబగారు కూడ  శైవమతధర్మాలనెరిగి, పతి అడుగు జాడలలో నడచిన ఉత్తమ ఇల్లాలు .
వీరు వ్రాసిన భోగేశ్వరమాహాత్మ్యం 1934 సం||లో బి.ఏ పట్టా పరీక్షకు, ఉభయభాషాప్రవీణ గ్రూపులకు పఠనీయాంశగ్రంథముగా బెట్టిరి . తిరుపతి వేంకట కవులంతటి వారే సంస్కృతభాషకు వీరి కవిత్వము వన్నె పెట్టుచున్నదని ప్రశంసించిరి . వీరు రచించిన భోగేశ్వరమాహాత్మ్యమునకు పీఠిక వ్రాసిరి . ఇంకా ఆ రోజుల్లో ఉద్దండులైన బ్రహ్మశ్రీ  శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు మొదలైన వారందరూ భోగేశ్వరమాహాత్మ్య గ్రంథపీఠికలో తమ తమ అభిప్రాయములను వ్రాసిరి .

వీరు విజయవాడ, రాజమండ్రి, తుని, అనకాపల్లి, విశాఖపట్టణం , రాజాం , విజయనగరం , శ్రీకాకుళం బరంపురం మొ|| ప్రదేశములలో సంచారం చేసి శైవమత ప్రబోధం , వేదాలసారము, సాంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు బోధిస్తూ ఎందరినో శిష్య ప్రశిష్యులుగా చేసుకొనిరి . తమకు 350 వంశాల వారు శిష్యులుగా  ఉన్నారని భోగేశ్వరమాహాత్మ్యంలో మల్లికార్జునారాధ్యులు  వెల్లడించిరి. వీరు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు  తమ తల్లిగారి పేరున స్థాపించిన శ్యామలా౦బాధర్మపాఠశాలలోను , బందరు హిందూహై స్కూలులోను  సంస్కృతాంధ్ర పండితులుగా పని చేశారు .
భోగేశ్వరమాహాత్మ్యంలో వీరి కవితా శైలికి ఉదాహరణ పద్యాలు .

ఉ|| తల్లికి నిర్జరీగణమతల్లికి భూవిజితాత్మభూ ధను
ర్వల్లికి బాల చంద్ర ధరు బాహుల పేరిటి మేటి శాఖలం
దల్లిన పుష్ప వల్లికి దయారమ గాంచిన పాల వెల్లికిన్
మెల్లన చేతులెత్తి ప్రణమిల్లెద నాశ్రిత కల్ప వల్లికిన్

శా|| శ్రీ రత్నాకరమేఖలామణిమయ గ్రీవాకలాపంబు ర
మ్యారామ ద్రువిహార చిత్తజ హయ వ్యాహార చౌర్య క్రియా
ధీరాధీర విలోకనా జన సముత్కీర్ణంబు సప్త స్థలా
గార ప్రాభవ మొప్పు నాపురము        భాగ్యస్థాన నామంబునన్

              సుమారుగా 80 ఏళ్ల  క్రిందట ఆనాటి ప్రముఖ కవి పండితుల చేత వీరు సన్మానాలు పొంది కవితా చక్రవర్తి కవి సార్వభౌమ అనే బిరుదులను పొంది, కాళ్ళకు గడపె౦ డేరములతో సత్కరి0పబడి విశాఖపట్నంలో ఏనుగుపై
ఊరేగి౦పబడిన మహానుభావుడాయన .

ఆంధ్రదేశంలో లబ్ధప్రతిష్ఠులైన సాంగవేదభాస్కర బ్రహ్మశ్రీ కుప్పా లక్ష్మణావధానులు గారు, వ్యాకరణస్థాపక బ్రహ్మశ్రీ  కుప్పా  ఆంజనేయశాస్త్రి గారు , బ్రహ్మశ్రీ మండలీక వేంకటశాస్త్రి మొదలైనవారు , రామాయణ, భారత, భాగవతాదులే కాక కావ్య ప్రబంధాలు మొదలైన వాటియందు వారికి ఉన్న సందేహాలను , విశేష అర్థాలను తెలుసుకొని వారి పాండిత్య ప్రతిభా విశేషాలను ప్రశంసించిన వారే. తిరుపతి వేంకట కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు , హరికథా పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు మల్లికార్జునారాధ్యుల మీద వ్రాసిన శ్లోకాలు , సంచారము చేసినప్పుడు ఆనాటి ప్రముఖుల మీద శ్రీ మల్లికార్జునారాధ్యులు వ్రాసిన  పద్యాలు ఇవన్ని కాలగర్భంలో కలిసిపోయినందుకు చింతిస్తున్నాను .
వీరి పుత్రులలో ప్రథమ పుత్రులు శివశ్రీ మల్లంపల్లి వీర మల్లేశ్వర శర్మ గారు. (మా నాన్న గారు ) ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులే కాక  బందరు అయ్యవార్లుగా  ప్రసిద్ధులైన వారు. 3వ వారైన వీరేశ్వరశర్మ గారు అభినవ-పెద్దన , అభినవ-పోతన వంటి బిరుదములు పొందినవారు. 4వ వారు కవిరత్న రామలింగశర్మ గారు , 5వ వారు శ్రీ శరభేశ్వరశర్మగారు.  వీరు తమ 11వ ఏట శ్రీ విశ్వనాథవారిచే బాలకవి కేసరి  అని , శ్రీ కాశీ కృష్ణమాచార్యులు గారిచేత పుంభావసరస్వతి అని బిరుదులు పొందినవారు .  
మహాయోగులకు , సిద్ధపురుషులకు  బ్రహ్మకపాలం పగిలి ప్రాణం పోయిన విధంగానే మల్లికార్జునారాధ్యులకు కూడ బ్రహ్మకపాలం పగిలి  బందరులోని మా స్వగృహం లో 1951 వ సం||లో జనవరి 30న శివసాయుజ్యం ( మరణించారు ) చెందారు .   .  
మల్లికార్జునారాధ్యులు నాకు తాతగారు  కావడం నా అదృష్టం , నా పూర్వజన్మసుకృతం . వారి గురించి నాలుగు ముక్కలు నా చేత వ్రాయించి , వారిని మరల వెలుగులోనికి తీసుకొని వచ్చిన , నాకు ఎంతో ఆప్తులు , శ్రేయోభిలాషులు , శ్రీ గోటేటి  రామారావుగారికి నమస్కారములు , కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎనిమిది పదుల వయస్సు దాటినా ఇంకా ప్రముఖాంధ్ర పురోభి వృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న శ్రీరామారావు గారిని, వారి కుటుంబంలోని అందరిని నెల్లూరుకి సుమారుగా 12 కి||మీ|| దూరంలో ఉన్న ఆ జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు సంపూర్ణ ఆయురారోగ్య భోగ భాగ్యాలనొసగి సదా  కాపాడవలసి౦దిగా మన సారా ప్రార్థిస్తున్నాను .
( రచయిత అనుమతితో  మరియు ప్రముఖాంధ్రపత్రిక యాజమాన్యం వారి సౌజన్యంతో )

Monday, September 3, 2018

SPOKEN SANSKRIT - Lesson-21


సంభాషణ సంస్కృతం 21
(Spoken Sanskrit)
Lesson-21

Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.

                      Unit -1 ‘कतिकियतो: भेद:
(The difference between (कति) how many and (कियत्) how much.
 కతి (ఎన్ని ) కియత్ (ఎంత ) ఈ రెంటికి మధ్య గల తేడా .

Note:-- సాధారణంగా మనం లెక్కపెట్ట గలిగే విడివిడి వస్తువులను గురించి  చెప్పేటప్పుడు  కతి అనాలి . అలా కాకుండా ఒక యూనిట్ లేక విడదీయలేని విధంగా ఉన్నవాటికి  కియత్ అనాలి .       
Normally we use the word (कति) for divisible or countable things and (कियत्) when a particular thing which is indivisible or in the form of a unit is described.
Example:
कति रुप्यकाणि ?= How many rupees? ఎన్ని రూపాయలు?
कियद्धनम्= How much money ? ఎంత ధనం?

Examples:
1. भवत: कोशे कति रुप्यकाणि सन्ति?
How many rupees are there in your pocket?
నీ జేబులో ఎన్ని రూపాయలున్నాయి ?

2. भवत: कोशे कियद्धनम् अस्ति?
How much of amount is there in your pocket?
నీ జేబులో ఎంత డబ్బు ఉంది ?

3. अस्य पुस्तकस्य मूल्यं कियत्?
How much does this book cost?
ఈ పుస్తకం వెల ఎంత ?

4. अस्य पुस्तकस्य मूल्यं कति रुप्यकाणि?
ఈ పుస్తకం వెల ఎన్ని రూపాయలు?
How many rupees does this book cost?

5. आकाशे कति नक्षत्राणि सन्ति?
How many stars are there in the sky?
ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ?

6. समुद्रे कियत् जलम् अस्ति?
How much of water is there in the ocean?
సముద్రంలో ఎంత నీరు ఉంది ?

Unit-2 यत्र--- तत्र యత్ర తత్ర
          ఎక్కడో------అక్కడ

In the place where; wherever, when, whereas
In what so ever place, there; here and there; everywhere  

1.यत्र राम: अस्ति तत्र आञ्जनेय: अस्ति
Where there is Rama there is Anjaneya.
ఎక్కడ రాముడు ఉండునో అక్కడ ఆంజనేయుడు  ఉండును

2. यत्र गुरु: अस्ति तत्र शिष्य: अस्ति
Where there is guru there is the pupil.
అధ్యాపకుడు ఎక్కడ ఉండునో విద్యార్థి  అక్కడ ఉండును.

3. यत्र गुड: अस्ति तत्र पिपीलिका: सन्ति
Where there is jag-gery there are ants.
ఎక్కడ బెల్లం ఉండునో చీమలు అక్కడ ఉండును .

Unit-3:  यावत् तावत्

As long as/ for which while/ while
During that time/ in the mean while

1.     यावत् पर्यन्तं विद्युत् नास्ति तावत्पर्यन्तं बालक: न पठति ||
   The boy does not read as long as there is no electricity.
        కరెంటు వచ్చే౦త వరకు పిల్లవాడు పుస్తకం చదవడు.

2. यावत्पर्यन्तम् अहं गृहं न गच्छामि तावत्पर्यन्तं   मम पत्नीपुत्रादय: भोजनं न    कुर्वन्ति (यत: मया गृहं गत्वा पाक: कर्तव्य: ) J JJ
As long as I don’t go home, my wife and children do not eat food (because I have to go and prepare food).
నేను ఇంటికి వెళ్లేం తవరకు నా భార్యాపిల్లలు భోజనం చెయ్యరు (ఎందుకంటే నేనే ఇంటికి వెళ్లి వంట చెయ్యాలి ).

3. यावत्पर्यन्तं मातृभाषाभ्यास: न भवति तावत्पर्यन्तं अन्यभाषा साध्या न भवति
As long as mother tongue is not mastered till that the mastery over other tongue is not possible.
అమ్మ భాష నేర్చుకు౦టే గాని అన్య భాష రాదు.
(Mother tongue రాని వాడికి other tongue రాదు)   

Unit -4   अस्माकम् ours

अस्माकं देश: भारतदेश : ||
India is our country
మన దేశం భారత దేశం

अस्माकं भाषा संस्कृतभाषा ||
మన భాష సంస్కృతభాష
Sanskrit is our language.

अस्माकं देशे बह्व्य: भाषा: सन्ति ||
మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి .
There are many languages in our country
Unit -5 क्रमवाचका: (cardinal numbers)
प्रथम: (First) మొదటి --     द्वितीय: (Second) రెండవ
तृतीय:  (Third) మూడవ --चतुर्थ: fourth =నాల్గవ
पञ्चम: fifth =ఐదవ -- षष्ठ: sixth ఆరవ
सप्तम: Seventh ఏడవ etc.,
These are in three genders:
 प्रथम: ---प्रथमा --- प्रथमम्
     प्रथम: पुरुष:  / प्रथमा महिला / -- प्रथमं काव्यम्|

1. संस्कृतकविषु वाल्मीकि : प्रथम:
సంస్కృత కవులలో వాల్మీకి మొదటివాడు 
Valmiki was the first among all Sanskrit poets.

2. विमानयानेन विदेशं गतवती प्रथमा महिला सीता
విమానంలో విదేశాలకు వెళ్లిన మొదటి మహిళ సీత
The first woman who left for abroad by air was Sita.

3.     रामायणं संस्कृते प्रथमं काव्यम्|
సంస్కృతభాషలో రామాయణం మొదటి కావ్యం .
The Ramayana was the first treatise in Sanskrit Language.

द्वितीय: / द्वितीया / द्वितीयम्
तृतीय: / तृतीया / तृतीयम्
चतुर्थ: / चतुर्था / चतुर्थम्
पञ्चम: / पञ्चमा / पञ्चमम् etc. Be ware of your bad habits
Sloka:

द्यूताद्धर्मसुत: पलादिह बको - मद्याद्यदोर्नन्दना:
शक्रो जारतया -मृगान्तकतया स ब्रह्मदत्तो नृप:
चोरत्वाच्च ययातिरन्यवनितासंगा द्दशास्यो महा
नेकैकव्ययसनार्जिता यत इमे सर्वैर्न को नश्यति  

జూదం వల్ల ధర్మరాజు , మాంసం మీద కోరిక వల్ల బకాసురుడు, మద్యపానం వలన యాదవులు , వ్యభిచారం వలన ఇంద్రుడు ,వేటవలన బ్రహ్మదత్తుడు అనే రాజు , చోరత్వము వలన యయాతి , పరస్త్రీ వ్యామోహం వలన రావణుడు మొదలైన వారు నశించారు . వీరందరూ ఒక్కొక్క వ్యసనం ఉండడం వలననే నష్ట పోయారు . ఇక అన్నీ ఉన్న మానవుని ఎవరు రక్షి౦చగలరు .

Dharmaraja was put to loss for playing dice, Bakasura for fond of meat, Indra for debauchery, Brahmadatta for hunting, Yayaati for robbery and Ravana for lust for Sita . All those who are very great were put to loss of one vice. But man has many vices how can he be protected.      


*************