Thursday, January 28, 2021

 

THE WAY OF POPULARISING SANSKRIT INTO MASSES

By Dr. Chilakamarthi DurgaprasadaRao 

Sanskrit which is considered to be a treasure house of Indian knowledge, wisdom and culture was once brushed aside due to many socio-political reasons. And it is our bounden duty to revive the language to regain its past glory. There are many evidences to prove that Sanskrit was once the lingua franca of our motherland and the reasons for its disappearance from the common man are also obvious.

In this modern and scientific age the majority of people think that the study of Sanskrit is of no use as it does not yield any monitory benefits. Even the scholars of Sanskrit are not providing Sanskrit education to their children. So the future of Sanskrit has become a big question.

In olden days people used to study the Ramayana, the Mahabharata and some other books of holy literature for acquiring Dharma and, being influenced by them common people also used to follow in their foot-steps either by listening to them and by studying them themselves. so a majority of people in the society whether educated or uneducated kept themselves in touch with the language and literature.

But now Sanskrit is only in the Schools, Colleges and some Universities. The number of students is decreasing year by year. A majority of students who are studying Sanskrit do not pay adequate interest and enthusiasm. The interest they evince towards learning Sanskrit in comparison with the other languages and subjects is insignificant.

The courses offered very recent by University Grants commission and other private institutions in the form of VADAT SAMSKRITAM, DASADINESHU SAMSKRITAM for taking Sanskrit to the common man leave much to be desired. In respect of Sanskrit magazines also much progress is no witnessed yet. Similar is the case with the radio and T.V. programmes.

The awards announced by the Government, autonomous institutions and private organisations are confined to scholars and the common man is not benefited by them. In this context here are some tips to improve the position of Sanskrit.

• At the very outset the wrong notion that Sanskrit is a language for a particular sect should be discarded.
• Those who claim themselves to be scholars of Sanskrit should encourage their children also for Sanskrit learning though not for livelihood at least for the sake of knowledge to keep the rich language and tradition alive.
• Every Sanskrit scholar is expected to contribute at least Rs. 100/- per month from his earnings for other readers also.
• The price of Sanskrit books should be kept within the reach of the common reader.
• The vedic scholars should continue their branch of learning uninterruptedly as otherwise the tradition will not be handed over to future generations.
• Professionals who study the Vedas, Astrology and Ayurveda for their livelihood should continue to read their books to keep themselves in touch with the literature of that particular branch.
• If two or more persons who know Sanskrit happen to meet together their conversation should be in Sanskrit only.
• The interaction between Sanskrit and science is quite essential in the present day circumstances. So every student should try to interact with the students of science to unearth the scientific knowledge of our ancestors. Then only the necessity of Sanskrit learning is felt by others.
• Steps should be taken to teach Sanskrit through the medium of Sanskrit and they should be implemented scrupulously.
• Sanskrit magazines should publish scientific articles also to enable the student of Sanskrit to be equipped with scientific knowledge.
• Articles in Sanskrit magazines should be written in such a manner as to be intelligible even to the common man.
• More magazines for children should be designed.
• In our society there are a number of philanthropists, priests, religious organizations who wish to contribute their mite for the benefit of mankind. We should bring them under one roof and plead with them to be of use for the propagation of Sanskrit.
• Scholars instead of concentrating upon one sastra should concentrate on the preservation of language.
• Sanskrit should be given place in the three language formula. One’s own mother tongue, Sanskrit and English for local, national and international purposes.
• Mottos which can be understood easily even by the common man should be kept everywhere to inspire the common man.
• Celebrities like film stars, sportspersons and other such men who matter should be requested to popularize Sanskrit Slogans.
• In religious places every mantra should be kept translated in their respective regional languages for the proper understanding of that particular mantra. Then only the common man will relish the beauty of Sanskrit language.
• More incentives are to be given for those who study Sanskrit as the main subject.
• Talks should be arranged in every possible forum on our epics the Ramayana and Mahabharata to inculcate interest in the people.
• In this age of Kali strength lies in unity and scholars and lovers of Sanskrit should try to influence the masses to fight in favour of Sanskrit.

The four steps of education Adhiti, Bodha, Acharana and Prachara, i.e., learning, teaching, practising and propagation should simultaneously be taken up. Then only we can achieve our goal.

LET SANSKRIT BE VICTORIOUS
LET INDIA BE VICTORIOUS

Posted by Durga Prasada Rao Chilakamarthi at 11:38 PM

Tuesday, January 12, 2021

 In Sanskrit the grand son's daughter is called naptri नप्त्री .

पुत्र: -- son

पुत्रस्य  पुत्र: :पौत्र:--grandson

पौत्रस्य पुत्र: नप्ता  grand son's son

पौत्रस्य पुत्री is नप्त्री napthree =Daughter of the grand son

व्यासं वसिष्ट नप्तारं शक्ते: पौत्रमकल्मषं 

पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्

वसिष्ट:-.शक्ति: -पराशर:  ---व्यास: -शुक: 

This is the lineage

salute the sage Vyasa , the great grand son of Vasista, grand son of shakti, son of parasara and the father of Suka.  


Wednesday, January 6, 2021

అభినందనమందార మాల

 

అభినందనమందార మాల

శ్రీ అనిపెద్ది జగన్నాథ శాస్త్రి గారు రచించిన

“ భావతరంగాలు”

ఒక విహంగ వీక్షణ సమీక్ష

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ , పి.ఓ.యల్,

ఎం.ఏ ( సంస్కృతం ) ఎం .ఏ ( తెలుగు) ఎం . ఏ (తత్త్వశాస్త్రం )

 పిహెచ్.డి (సంస్కృతం )

3/106, ప్రేమ్ నగర్ , దయాల్ బాగ్ , ఆగ్రా -282౦౦5

dr.cdprao@gmail.com

 

ఉదయం తు శతాదిత్యా: ఉదయం త్వి౦దవశ్శతం

న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:

అన్నారు పెద్దలు.  వందమంది  సూర్యులు ఉదయి౦చు గాక . అలాగే వందమంది చంద్రులు ఉదయి౦చుగాక. మానవునిలో దాగిన అజ్ఞానమనే చీకటి కవి వాక్కువలన మాత్రమే తొలగిపోతుంది.

కవి వాక్కుకి అంతశక్తి ఉంది . ఎందుకంటే అది ప్రతిమనిషినీ ఆలోచింపచేస్తుంది . అందుకే  Byron అనే ఆంగ్లకవి ఇలా అంటారు. 

But words are things and a small drop of ink

Falling, like dew upon a thought, produces

That which makes thousands, perhaps millions think.

(Don Juan, canto III, st.88.

అటువంటి ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని కూర్చడంలో నేర్పరి మా మిత్రుడు జగన్నాథశాస్త్రి . కాసేపు  మా ఇరువురి గతంలోకీ వెళుతున్నా .

మేం  శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఓరియంటల్ కళాశాల(పాలకొల్లు)లో చదువుకున్నాం . మాది college కే రెండో బ్యాచ్. అధ్యాపకులందరు మమ్మల్ని చాల ఇష్టపడుతూ ఉండేవారు . ప్రేమగా చూస్తూ ఉండేవారు . కాలేజీ అంతా ఒక కుటుంబంలా ఉండేది .   కళాశాల ఏర్పడక పూర్వం మాకు దేవస్థానంగదుల్లో క్లాసులు జరుగుతుండేవి. భాషాప్రవీణ (ఎంట్రన్స్) లో మాకు శ్రీ మండలీక వేంకటరావుగారు అన్ని పాఠాలు చెప్పేవారు . ఆయన ఆనాడు పిల్లలకు ప్రైవేట్లు చెబితే చాల డబ్బు వచ్చేది . కాని ఆయన అవన్నీ వదులుకుని మాకు పాఠాలు చెప్పేవారు . వారి ఋణ౦ మేం ఎన్ని జన్మలెత్తినా తీర్చు కోలేనిది . ఇక కళాశాలగా  వెలిశాక  శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం( principal)గారు మాకు కాదంబరి, అభిజ్ఞానశాకుంతలం, శ్రీనాథుని కావ్యాలు   చెప్పేవారు. శ్రీ వేదుల సుందరరామశాస్త్రి గారు ( వీరు విశ్వవిఖ్యాతవ్యాకరణ శాస్త్రవేత్త శ్రీ తాతా రాయడు శాస్త్రిగారి యను౦గుశిష్యులలో ఒకరు, భాష్యాంతవైయాకరణి) మాకు సిద్ధాంతకౌముది బోధించేవారు. శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు తెనుగువ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . శ్రీ సోమంచి సత్యనారాయణ గారు మృచ్ఛకటికం మొదలైన నాటకాలు , డాక్టర్ . శ్రీపాద కృష్ణమూర్తి గారు ప్రాచీన , ఆధునిక సాహిత్యాలు, శ్రీ వీరుభొట్ల కుటుంబ సత్యనారాయణ గారు శివార్పణం వంటి ఆధునికపద్యగ్రంథాలు బోధించేవారు. ఇక అప్పటినుంచే జగన్నాథశాస్త్రి భావకవిత్వాన్ని , అభ్యుదకవిత్వాన్ని బాగా చదివి వంటపట్టించుకున్న వ్యక్తి. ఆ  రోజుల్లోనే  ఎప్పుడు శ్రీశ్రీ గారి కవితల్ని వల్లె వేస్తూ ఉండేవారు. జగన్నాథశాస్త్రి రెండో బెంచ్ లో కూర్చుని భావకవిత్వం , అభ్యుదకవిత్వం చదువుతూ తన్మయత్వంతో  తలొంచుకుని కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వర శర్మ  గారికి కనిపించేవాడు కాదు.  అప్పుడాయన “జగన్నాథ స్వామిన్ ! నయనపతగామీ భవతు మే”  ( ఓ జగన్నాథస్వామీ ! నా కంటికి కని పించవయ్యా! ) అంటూ ఉండేవారు.   పాలకొల్లు ఎంతో మంది వదాన్యశేఖరులకు పుట్టినిల్లు .

శ్రీ యుతులు రేపాకవారు  , అత్యం వారు  , అద్దేపల్లి వారు వందలాది విద్యార్థులకు, తదితరులకు ఉచిత భోజనవసతి చేకూర్చేవారు . మేం అక్కడ భోజనం చేస్తూ  కాలేజీలో చదువుకునే వాళ్ళం  . అధ్యాపకులందరు మమ్మల్ని సుతనిర్విశేషంగా ప్రేమించేవారు . వారి దాతృత్వంలోను , అధ్యాపకుల నేతృత్వంలోను కొంత విద్య నేర్చుకున్నాం .  అదంతా రామలిమ్గేశ్వరుని దయ. అందుకే

ఆరామంబులకెల్ల మిన్నయగు క్షీరారామమందుండి ని

న్నారాధించుట(జేసి మాకు హిత విద్యాబుద్ధులబ్బెన్ నిజం

బౌరా ! నీ మహిమల్ నుతి౦చుట శక్యంబౌనె మాబోంట్లకున్

క్షీరారామపురీ విహార రసికా! శ్రీ రామలి౦గేశ్వరా!

అని అనుకుంటూ ఉంటా .   

ఇక విద్యార్ధులమైన మేం అందరు కలిసే ఉన్నా జగన్నాథశాస్త్రి, మల్లాది సాంబశివరావు , నేను చాల సన్నిహితంగా మెలిగే వాళ్ళం . వాళ్లిద్దరిలోను ఒక్కొక్క ప్రత్యేకత ఉండేది . శ్రీ శ్రీ గారిమీద కోపంతో ఎవరైనా  మహాప్రస్థానం , ఖడ్గసృష్టి   మొదలైన గ్రంథాలను ఎవరికీ కనిపి౦చకుండా దాచేస్తే జగన్నాథశాస్త్రి యథాతథంగా అప్పగి౦చగల ధీమంతుడు . ఇక సాంబశివరావు ఏ పద్యానికైనా విశేషార్థం చెప్పగలిగే ప్రజ్ఞాపాటవాలు గలవాడు.  అతను నేడు  ఈ లోక౦ విడిచి మాకు పుట్టెడు  శోకం మిగిల్చాడు .  ఇక జగన్నాథశాస్త్రికి  నాటి ను౦చీ  భావకవిత్వం, అభ్యుదయకవిత్వం పట్ల గల ఆసక్తి దినదినాభివృద్ధి చెంది కావ్యరచనకు దోహదం చేసింది.

     ఇక ‘భావతరంగాలు’ జగన్నాథశాస్త్రి గారి ద్వితీయపుత్రిక . ఇందులో సుమారు డెబ్బది యారు కవితాఖండికలున్నాయి . అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క  ప్రత్యేకతను సంతరి౦చుకున్నవే. అవన్నీ ప్రకృతివర్ణనలు , తాత్త్వికచింతన , మానవసంబంధాలు , విద్య  అనే నాలుగు భాగాలుగా విభజి౦చొచ్చు . ఇది ఆధునికకవిత్వమే ఐనా రచయిత వినాయక , శంకరుల ప్రార్థనలతో ప్రాచీన సాంప్రదాయాన్ని పాటించడం ఒక విశేషం . ఇక గ్రంథం విషయానికొస్తే  ఆశ’ అనే ఖండికలో   ఆశ మనిషిని బందీగా చేస్తుందని శ్రమ, సంతృప్తి జీవితానికి నిండుదనం చేకూరుస్తాయనే జీవితపరమార్థాన్ని  వివరించారు .  దివ్యత్వం’ అనే కవితలో ఆత్మ, శరీరాలను మథించడం వల్ల జన్మ, మృత్యు, జరాతాపాల్లేని  అమృతత్వం సిద్ధిస్తుందని చెప్పడం ఆయన ఆధ్యాత్మికభావాల  పరిపక్వతకు ఒక ఉదాహరణ. ‘శిశిరకాంత’ భావనా శక్తికి అద్దం పట్టేదిలా ఉంది . ‘ఆమె’ ఖ౦డికలోని ఊహాసు౦దరి కవిత్వానికి దోహదం చేసి౦దనిపిస్తుంది. ‘మక్షిక’ అనే కవితలో జీవితాన్ని శ్లేష్మ౦లో ఈగలా పోల్చడం చాల బాగుంది . ‘సాహిత్యం’  అనే కవితలో సాహిత్యం వసుధైకకుటుంబభావనకు దోహదంచేస్తుందని, మానవతావిలువలు , మంచిచెడులు తెలిపి  అంతులేని సంతృప్తిని కలిగిస్తుందని ,  సాహిత్యంతో తదేకమై , మమైకమైతే  సమగ్రప్రపంచాన్ని చూసిన చిత్తంబున మనగల్గుతామని చెప్పడం ప్రత్యక్షర సత్యం . ఇక ‘విశ్వవిద్యాలయం’ కవిత ద్వారా పుట్టినదగ్గర నుంచి మరణించే వరకు  మనిషికి విశ్రాంతి లేదని చదువు , సహనం ఓర్పు సంతోషాన్ని కలిగిస్తాయని వివరించారు .‘స్నేహం’ అనే ఖండికలో

ముడివడిన మనస్సు ఘన సంఘటిత తమస్సు

విశ్వమున కొక యశస్సు విడివడిన మనస్సు

లవణ యుత పయస్సు , కలహమున కొక హవిస్సు’ అని స్నేహం యొక్క పారమ్యాన్ని విశ్లేషించారు . ‘ఓంకారం’ ‘సన్ననిరేఖ’ ‘ భగవాన్’ మొదలైన ఖండికలు ఆధ్యాత్మిక చింతనకు ఉదాహరణ.

‘జీవితం’ అనే ఖండికలో జీవిత సత్యాలను వివరించారు . కష్టాలలో కృంగక సుఖాలలో పొంగక సమభావంతో ఉండాలని ఉద్బోధించారు . జీవితం అటు ప్రమాదకరమని, ఇటు ప్రమోదకరమని చెపుతూ అంటీఅంటని విధంగా గెంటుకురావాలని చెప్పడం పండిన అనుభవానికి నిండైన ఉదాహరణ.  

‘నాటకం’ అనే కవిత ద్వారా ‘బ్రతుకులో నటించడం కన్నా హేయముంటు౦ది ఈ లోకంలో’ అంటారు .

‘చిన్నోడ’ ఖండిక ద్వారా  భారతదేశ గతవైభవాన్ని ఎలుగెత్తి చాటేరు.

‘గ్రంథాలయం’  ఖండికలో “చీకట్లోంచి వెలుగుకు రమ్మనేది గ్రంథం ; విషయపరిజ్ఞానాన్ని పెంచేది గ్రంథం; జ్ఞానతృష్ణను తీర్చే చలివేంద్రం గ్రంథం;

కావ్యమాలికలన్నీ సరస్వతీదేవి కంఠాభరణాలే; లోకకల్యాణానికి దేవాలయాలు  -- అని చె ప్పడం ఎంతో మనోజ్ఞంగా ఉంది .

‘నాలుక’ లో        నాలుకను వర్ణిస్తూ:

‘పలుకులరాణి నృత్యకళావేదిక నాలుక ;

నాలుక జాపితే ఆరోగ్యం తెలుస్తుంది ,

నాలుక జారితే అనర్థాలు కలుగుతాయి’ అంటారు .            బాపు గారి బొమ్మను వర్ణిస్తూ ‘ గుండె లోతుల్లోని భావాన్ని చూపుల్లో చూపే బాపు బొమ్మ , చిరునవ్వుల కొమ్మ ‘ అంటారు .       అలాగే                  

‘సంఘాన్ని వెదకి చూసి సౌమ్యాన్ని నేర్చుకో’

‘ సర్వత్రా దైవాన్ని చూడు ‘  తెలుగే ఊపిరి తెలుగు భాష మఱువకు,  ‘ మేల్కొన్నహృదయం మేలిమి బంగారములే ‘   ‘ప్రతిభారతీయుడు విశ్వ కల్యాణానికి పచ్చ తోరణమే’ మొదలైన మాటలు రసభావాలకు మూటలు , సమాజప్రగతికి బాటలు. స్థాలీపులాకన్యాయంగా కొన్ని ఖండికలు మాత్రమే విశ్లేషించడం జరిగింది . ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా వ్యాసవిస్తరభయంవల్ల ఇంతటితో విరమిస్తున్నా . 

ఈ కవితాసంపుటి భావితరాన్ని అందులోనూ యువతరాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తుందని విశ్వసిస్తూ , జగన్నాథశాస్త్రిగారి కలం నుండి మరెన్నో కావ్య ఖండికలు వెలువడాలని మనసారా ఆకాంక్షిస్తూ....                                                            దుర్గాప్రసాద రావు . 

 

    

  

Friday, January 1, 2021

The teacher-taught relation in Vedic times.

 

1st January 2021

The teacher-taught relation in Vedic times.

                                 Dr. Ch. DurgaprasadaRao

ॐ सह नाववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै

तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै

ॐ शान्ति: शान्ति : शान्ति:    

May He protect both of us. May He take care of us both. May we together grow strong. May our learning become effulgent.  May we not have dislike for each other. Peace. Peace. Peace. (Translated by Prof:- G. Parthasarathi, Andhra University ) 

This passage throws ample light on the relation that should exist between the teacher and the taught and their aspirations, during their study. May the modern teacher and student take lesson from this passage and guide their lives accordingly.

ఈ మంత్రం గురుశిష్యులు విద్యాభ్యాస సమయంలో చదివేది . గురుశిష్య సంబంధం ఇలా ఉంటే అది చాల ఆదర్శం గా ఉంటుంది .

ॐ सहनाववतु

(नौ + सह + अवतु ) ఆ పమేశ్వరుడు మన ఇద్దరినీ (కలిపి ) రక్షించు గాక  

सह नौ भुनक्तु = విద్యాఫలము ఇరువురం (కలిసి ) అనుభవించునట్లు చేయుగాక

सह वीर्यं करवावहै = మన ఇరువురం కలిసి పరిశ్రమిద్దాo.

तेजस्विनावधीतमस्तु

 नौ = మనకు

अधीतं= చదివిన విద్య

 तेजस्वी= ఫలవంతం( ప్రకాశవంతం )

 अस्तु  అగుగాక (మనం నేర్చుకున్న విద్య ప్రయోజన వంతమగు గాక ).

मा विद्विषावहै = మనం ఒకరినొకరు ద్వేషించు కొనకుండా ఉoదుముగాక  .

ॐ शान्ति: शान्ति : शान्ति:

మనకుగల ఆధిభౌతిక ,ఆది దైవిక , ఆధ్యాత్మిక దు:ఖాలు నశించుగాక. మనుష్య మృగాలవల్ల కలిగే దు:ఖం ఆధిభౌతికం , యక్ష,రాక్షస , గ్రహాల వల్ల కలిగే దు:ఖం ఆది దైవికం , ఇక ఆధ్యాత్మిక దు:ఖం శారీరకం మానసికం అని రెండు రకాలు. వాత, పిత్త, శ్లేష్మ ప్రకోపాల వల్ల కలిగే దు:ఖం శారీరక దు:ఖం . కామ క్రోధాదుల వల్ల కలిగే దు; ఖం మానసికం . ఈ మూడు రకములైన దు:ఖాలు నశించి సుఖము కలుగు గాక .

                                                 <><><><><>