Friday, January 1, 2021

The teacher-taught relation in Vedic times.

 

1st January 2021

The teacher-taught relation in Vedic times.

                                 Dr. Ch. DurgaprasadaRao

ॐ सह नाववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै

तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै

ॐ शान्ति: शान्ति : शान्ति:    

May He protect both of us. May He take care of us both. May we together grow strong. May our learning become effulgent.  May we not have dislike for each other. Peace. Peace. Peace. (Translated by Prof:- G. Parthasarathi, Andhra University ) 

This passage throws ample light on the relation that should exist between the teacher and the taught and their aspirations, during their study. May the modern teacher and student take lesson from this passage and guide their lives accordingly.

ఈ మంత్రం గురుశిష్యులు విద్యాభ్యాస సమయంలో చదివేది . గురుశిష్య సంబంధం ఇలా ఉంటే అది చాల ఆదర్శం గా ఉంటుంది .

ॐ सहनाववतु

(नौ + सह + अवतु ) ఆ పమేశ్వరుడు మన ఇద్దరినీ (కలిపి ) రక్షించు గాక  

सह नौ भुनक्तु = విద్యాఫలము ఇరువురం (కలిసి ) అనుభవించునట్లు చేయుగాక

सह वीर्यं करवावहै = మన ఇరువురం కలిసి పరిశ్రమిద్దాo.

तेजस्विनावधीतमस्तु

 नौ = మనకు

अधीतं= చదివిన విద్య

 तेजस्वी= ఫలవంతం( ప్రకాశవంతం )

 अस्तु  అగుగాక (మనం నేర్చుకున్న విద్య ప్రయోజన వంతమగు గాక ).

मा विद्विषावहै = మనం ఒకరినొకరు ద్వేషించు కొనకుండా ఉoదుముగాక  .

ॐ शान्ति: शान्ति : शान्ति:

మనకుగల ఆధిభౌతిక ,ఆది దైవిక , ఆధ్యాత్మిక దు:ఖాలు నశించుగాక. మనుష్య మృగాలవల్ల కలిగే దు:ఖం ఆధిభౌతికం , యక్ష,రాక్షస , గ్రహాల వల్ల కలిగే దు:ఖం ఆది దైవికం , ఇక ఆధ్యాత్మిక దు:ఖం శారీరకం మానసికం అని రెండు రకాలు. వాత, పిత్త, శ్లేష్మ ప్రకోపాల వల్ల కలిగే దు:ఖం శారీరక దు:ఖం . కామ క్రోధాదుల వల్ల కలిగే దు; ఖం మానసికం . ఈ మూడు రకములైన దు:ఖాలు నశించి సుఖము కలుగు గాక .

                                                 <><><><><>

No comments: