సంభాషణ సంస్కృతం –30
(Spoken Sanskrit)
Lesson-30
Dr. Ch.
Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh,
AGRA.
Unit 1
कर्मणि प्रयोग:
(passive voice)
సంస్కృతభాషలో వాక్యం మూడు విధాలుగా ఉంటుంది
कर्तरि प्रयोग: (Active voice) उपाध्याय: पाठं पाठयति Teacher is teaching a lesson
कर्मणि प्रयोग:(Passive voice) उपाध्यायेन पाठ: पाठ्यते A lesson
is taught by a teacher
भावे प्रयोग: (Impersonate construction) उपाध्यायस्य पाठनम् The teacher’s teaching
అని కర్తృ, కర్మ, భావ ప్రాధాన్య వివక్షను బట్టి మూడు విధాలు.
సంస్కృతభాషలో passive voice వాడడం
చాల గొప్పగా భావిస్తారు .ఉదాహరణకి अहं गच्छामि (నేను వెళ్ళుచున్నాను)
అనడానికి బదులు मया गम्यते (నా చేత వెళ్ళబడుచున్నది) అనడం
చాలగొప్పగా భావిస్తాం . అలాగే अहं वच्मि (నేను చెబుతున్నాను ) అనడానికి బదులు मया उच्यते (నా చేత చెప్పబడుచున్నది ) అనడం చాల గొప్పగా భావిస్తాం . సరే! ఆ సంగతి అలా
ఉంచుదాం .
Note: కర్తరి ప్రయోగం (Active Voice) లో కర్త ప్రథమా విభక్తిలోను
కర్మ ద్వితీయా విభక్తిలోను ఉంటాయి. కర్తృ, వాచక క్రియా పదం కర్తకు అనుకూలంగా
ఉంటుంది .
కర్మణి:(Passive voice)ప్రయోగంలో కర్మపదం ప్రథమావిభక్తిలోను కర్తృపదం తృతీయావిభక్తిలోను
ఉంటాయి కర్మ వాచక క్రియాపదం కర్మపదాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంది.
క్రియాపదం కర్తను సూచిస్తే /కర్తను అనుసరించి ప్రవర్తిస్తే
అది కర్తరి ప్రయోగం .
కర్మను సూచించినా కర్మను బట్టి ప్రవర్తించినా
అది కర్మణి ప్రయోగం .
ఉదాహరణకు
बालक: पाठं पठति
बालक: पाठौ पठति
बालक: पाठान् पठति అనే మూడు
వాక్యాలున్నాయి .
వీటిలో చదివేవాడు బాలకుడు ఒక్కడే . అందుకే पठति అని ఏకవచన క్రియాపదం మనం ఉపయోగించాము . ఇక్కడ చదివిన పాఠాలు ఒకటి ,రెండు , మూడు
ఎన్నైనా కావచ్చు. క్రియాపడానికి వాటితో పనిలేదు . చదివేవాళ్ళు ఎంతమంది అనే
చూస్తుంది దాన్నిబట్టి ప్రవర్తిస్తుంది .
ఇక్కడ చదివేవ్యక్తి ఒక్కడే కాబట్టి पठति అనే ఏకవచన క్రియా పదమే ఉంటుంది . ఒకవేళ ఇద్దరు చదువుతోంటే ...
बालकौ पाठं पठत:
बालकौ पाठौ पठत:
बालकौ पाठान् पठत: అని ఉంటుంది
అలాకాకుండా చదివేవాళ్ళు
ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే క్రియాపదం బహువచనంలో ఉంటుంది .
बालका: पाठं पठन्ति
बालका: पाठं पठन्ति
बालका: पाठं पठन्ति
దీన్ని బట్టి మనం గ్రహించవలసిన దేమంటే కర్తరి ప్రయోగంలో
క్రియా పదం కర్తను అనుసరించి మాత్రమె ఉంటుంది .
ఇక కర్మణి ప్రయోగం
Passive voice లో క్రియాపదం కర్మను అనుసరించి మాత్రమె ఉంటుంది . కర్తతో దానికి పనిలేదు .
అదెలాగో చూద్దాం .
पाठ: बालकेन पठ्यते
पाठ: बालकाभ्यां पठ्यते
पाठ: बालकै: पठ्यते
అనే వాక్యాలు పరిశీలిద్దాం . ఇక్కడ చదువుతున్న పాఠ౦ ఒక్కటే. అందుకే ఏకవచనక్రియాపద౦ వచ్చింది .
పాఠాలు చదివిన వాళ్ళు ఎంతమందైనా కావచ్చు .
అలాగే పాఠాలు రెండు అనుకొండి
पाठौ बालकेन पठ्येते
पाठौ बालकाभ्यां पठ्येते
पाठौ बालकै: पठ्येते
ఒకవేళ పాఠాలు ఎక్కువ అనుకొండి . అప్పుడు
पाठा: बालकेन पठ्यन्ते
पाठा:
बालकाभ्यां पठ्यन्ते
पाठा: बालकै: पठ्यन्ते
ఇంకా కొంచెం సులభంగా తెలుసు కుందాం
కర్త తండ్రి , క్రియ కూతురు , కర్మ అల్లుడు అనుకుందాం .
Father Husband Daughter
(subject) (object) (verb)
अध्यापक: पाठं
पठति
अध्यापकौ पाठं
पठत:
अध्यापका: पाठं
पठन्ति
Active voice (కర్తరి ప్రయోగం) లో క్రియాపదం తండ్రి
చాటునున్న పెళ్లి కాని ఆడపిల్ల . తండ్రి మాటే వింటుంది . తండ్రి ననుసరించి మాత్రమె ఉంటుంది . అలాగే క్రియ
(verb) subject (కర్త) ను అనుసరించే ఉంటుంది .
ఇక passive voice లో క్రియాపదం పెళ్ళైన ఆడపిల్ల లాంటిది భర్తననుసరించి నడుచుకు౦టు౦ది, భర్త మాటే వింటుంది . కాబట్టి
క్రియ కర్మను(verb) (object) అనుసరించి ఉంటుంది . అదెలాగో
చూడండి
Passive Voice
Husband Father Daughter
object Subject Verb
पाठ: अध्यापकेन पठ्यते
पाठौ अध्यापकेन पठ्येते
पाठा: अध्यापकेन पठ्यन्ते
కొన్ని వాక్యాలు
पठति ---पठ्यते
बालक: पुस्तकं पठति బాలుడు పుస్తకం చదువుతున్నాడు ----
बालकेन पुस्तकं पठ्यते బాలకునిచే పుస్తకం చదువబడుచున్నది
पठन्ति ---पठ्यन्ते
लिखति – लिख्यते
बालिका परीक्षां लिखति Boy is writing an examination
बालिकया परीक्षा लिख्यते An examination is written by the boy
लिखन्ति - लिख्यन्ते
पिबति --- पीयते
शिशु: दुग्धं पिबति The child is drinking milk.
दुग्ध: शिशुना पीयते The milk is drunk by the child
पिबन्ति ---पीयन्ते
ददाति ---दीयते
महाराज: विप्राय
गां ददाति The king is giving a
cow to a Brahmin
महाराजेन विप्राय गौ: दीयते A cow is being given to a Brahmin by the king
ददति----दीयन्ते
बाल: मोदकं खादति A boy is eating a laddu
मोदक: बालेन खाद्यते A laddu is eaten by a boy
खादति –खाद्यते
खादन्ति –खाद्यन्ते
क्रीडति --क्रीड्यते
स: पत्रिकां पठति He is reading a news paper
तेन पत्रिका पठ्यते A news paper is being read by him
अर्चका : पूजां कुर्वन्ति priests are performing puja
पूजा अर्चकै: क्रियते puja is being performed by the
worshippers
ब्राह्मणा: स्तोत्राणि
पठन्तिBrahmins are reciting
stotras
स्तोत्राणि ब्राह्मणै: पठ्यन्ते stotras are recited by Brahmins
भक्ता : सेवां कुर्वन्ति The devotees are doing service
भक्तै: सेवा
क्रियते Service is done by the
devotees
sanskrit sloka:
तातं तत्ताततातं कथय हरकुलेSलंकृते सम्प्रदाने
तच्छ्रुत्वा चन्द्रमोळि:
नतमुखकमल: जातलज्जो बभूव
ब्रह्मा Sवादीत्त्तदानीं शृणुत हरकुलं वेदकंठोग्रकंठौ
श्रीकण्ठान्नीलकण्ठ: प्रहसितवदन: पातु
नश्चन्द्रचूड:
తాతం తత్తాతతాతం కథయ హరకులే S లంకృతే సంప్రదానే
తచ్ఛ్రుత్వా చంద్రమౌళి: నతముఖకమల: జాతలజ్జో బభూవ
బ్రహ్మాSవాదీత్తదానీం
శృణుత హరకులం వేదకంఠోగ్ర కంఠౌ
శ్రీకంఠాన్నీలకంఠ: ప్రహసితవదన: పాతు న: చంద్రచూడ:
శివపార్వతుల వివాహం జరుగుతోంది. శుభముహూర్తానికి ముందు పెండ్లికుమార్తె వైపు
ఏడుతరాలు పెండ్లికుమారునివైపు ఏడుతరాలు కీర్తిస్తూ ఏకరువు పెట్టడం సాంప్రదాయం . కనీసం మూడుతరాలవారినైనా అంటే తండ్రి, తాత, ముత్తాతలనైన కీర్తించడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ఇక శివపార్వతుల వివాహమంటే సామాన్యమైన
విషయమేమీకాదు . అపూర్వం అసదృశం. శివ పార్వతుల పెళ్లి కుదర్చడానికి వచ్చిన సప్తర్షులలో ఒకరైన అంగిరసుడు
హిమవంతునితో ' ఓ హిమవంతుడా! పర్వతరాజువైన నీవు కన్యాదాతవు. నీ కుమార్తె పార్వతి వధువు. ముల్లోకాలకు ప్రభువైన ఈశ్వరుడు వరుడు. సప్తర్షులమైన మేము పెండ్లి పెద్దలం. నీ ఔన్నత్యానికి ఇంతకంటే ఏం కావాలయ్యా అంటాడు. పెళ్లికి వచ్చిన బంధువులు మిత్రులు సాక్షాత్తు
ఇంద్రాది దేవతలు. పెండ్లి చేయిస్తున్న బ్రహ్మ ఎవరో కాదు స్వయంగా
చతుర్ముఖ బ్రహ్మయే. అంతా బాగానే ఉంది . పెళ్లి జరుగుతోంది. పార్వతి వైపు నున్న పురోహితుడు శివునితో నీ
తండ్రి ఎవరు ? తాత ఎవరు ? ముత్తాత ఎవరో చెప్పు నాయనా ! వాళ్లందరి పేర్లు ఏకరువు పెట్టాలి కదా! అని ఆడిగాడు. కాని శివుడు ఏమని చెబుతాడు . ఆయన పుట్టుక లేనివాడు . ఆదిమధ్యాంతరహితుడు. అసలు తండ్రి ఉంటే గదా తాత పేరు తెలియడానికి. తాత ఉంటే గదా ముత్తాత పేరు తెలియడానికి. అందుకని ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. సిగ్గుతో తలొంచుకోక తప్పలేదు . పరాత్పరుడై ఉండి కూడ పెదవి విప్పలేక మౌనంగా ఉండిపోయాడు. శివుని ముఖ కవళికలు గమనించిన బ్రహ్మ వెంటనే
అందుకున్నాడు. “ అందఱు వినండి . ఆయనది హర కులం. ముందుగా వేదకంఠుడు మఱియు ఉగ్రకంఠుడు. ఆపై శ్రీకంఠుడు. ఆ తరువాత నీలకంఠుడు. ఇది ఆయన వంశవృక్షం" అని చెప్పగానే అందఱు ఆశ్చర్యచకితులయ్యారు. అందఱిలో తన గౌరవం కాపాడిన బ్రహ్మ వంక చూస్తూ
చిఱునవ్వు చిందించిన చంద్రశేఖరుడు మనందఱిని రక్షించుగాక. ఈ విధంగా అన్నీ ఆయనే. వేదాలు ఆయన
కంఠ౦ ను౦చే ఉద్భవించాయి . అందువల్ల ఆయన వేదకంఠుడు. ********